చెన్నై : బీజేపీ విడుదల చేసిన మేనిఫెస్టో పేదల కోసం కాదని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విమర్శించారు. సోమవారం తమిళనాడులోని నీలగిరి పార్లమెంటరీ స్థానం నుంచి పోటీ చేస్తున్న డీఎంకే అభ్యర్ధి ఎ.రాజాకు మద్దతుగా రాహుల్ గాంధీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.
అనంతరం నీలగిరి నుంచి కేరళ వాయనాడ్‌కు వెళ్లే ముందు తాలూర్‌లో కాలేజీ విద్యార్థులతో సంభాషించారు. ఈ సందసర్భంగా బీజేపీ విడుదల చేసిన మేనిఫెస్టోలో పేదలకి లబ్ధి చేకూర్చే అంశాలు ఏమైనా ఉన్నాయా? అని ప్రశ్నించారు.
కానీ వీళ్లు 2036లో ఒలింపిక్స్ క్రీడలకు ఆతిథ్యం ఇచ్చేందుకు భారత్ సిద్ధంగా ఉందని వ్యాఖ్యలు చేస్తున్నారని దుయ్యబట్టారు. కేంద్రం ఎజెండా ఒకటే వన్ నేషన్ వన్ ఎలక్షన్ అని అన్నారు.
పేదల కోసం బీజేపీ అనుసరిస్తున్న విధానాలు ఏమిటో? అని ప్రశ్నించిన రాహుల్ గాంధీ ..కాంగ్రెస్ మేనిఫెస్టోలో యువత, మహిళలు సహా అన్ని వర్గాల ప్రజలకు సంబంధించిన విధానాలు ఉన్నాయి. కానీ బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోలో 2036లో ఒలింపిక్స్ నిర్వహించాలని చెబుతోంది. కాంగ్రెస్, బీజేపీల మధ్య తేడా ఇదే అని వ్యాఖ్యానించారు.
కాగా, బీజేపీ సంకల్ప్ పత్ర పేరుతో మేనిఫెస్టోని విడుదల చేసింది. రాజ్‌నాథ్ సింగ్ నేతృత్వంలోని 27 మంది సభ్యుల బృందం 14 అంశాలతో మేనిఫెస్టోని రూపొందించింది.
#WATCH | BJP 'Sankalp Patra'/manifesto release: Prime Minister Narendra Modi says, "...The benefits under PM-Kisan Samman Nidhi will continue for the 10 crore farmers of the country even in the time to come. With the vision of 'Sahkarita Se Samriddhi', the BJP will introduce… pic.twitter.com/svSpv0qhod
— ANI (@ANI) April 14, 2024
Comments
Please login to add a commentAdd a comment