ఒడిశాను ‘పాన్’ (పాండియన్, అమిత్ షా, ప్రధాని నరేంద్ర మోదీ, నవీన్ పట్నాయక్) పరిస్తుందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో బీజేపీ, బిజూ జనతాదళ్ ఒకరినొకరు పెళ్లి చేసుకున్నాయి అని అన్నారు. ఒడిశాలోని కేంద్రపరా ప్రాంతంలో రాహుల్ గాంధీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘ఒడిశాలో బీజేపీ-బీజేడీలు పెళ్లి చేసుకున్నాయి. వారు అందరికీ పాన్ ఇచ్చారు. పీఎం మోదీ 22-25 మంది కోసం ప్రభుత్వాన్ని నడుపుతున్నారు. అదే పద్ధతిలో నవీన్ పట్నాయక్ కూడా కొంతమంది ఎంపిక చేసిన వ్యక్తులకే అధికారం దక్కుతుంది. ఈ వ్యక్తులు మీ సంపదను దోచుకున్నారు. రైతుల భూములు లాక్కున్నారని ఆరోపించారు.
మీరు (ప్రజలు) తగినంత పాన్ తిన్నారు. ఇప్పుడు ఒడిశాలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే సమయం ఆసన్నమైందని రాహుల్ గాంధీ జోస్యం చెప్పారు.
ఒడిశాలో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు ఒకేసారి నాలుగు దశల్లో జరగనున్నాయి. మే 13న మొదటి దశ, మే 20న రెండో దశ, మే 25న మూడో దశ, జూన్ 1న చివరి దశ. జూన్ 4న ఎన్నికల ఫలితాలు విడుదల కానున్నాయి.
2019 లోక్‌సభ ఎన్నికల్లో, బిజూ జనతాదళ్ (బీజేడీ)కి అత్యధిక స్థానాలు (12), ఆ తర్వాతి స్థానాల్లో బీజేపీ (8), కాంగ్రెస్‌కు ఒక్కటే సీటుతో సరిపెట్టుకుంది.
Comments
Please login to add a commentAdd a comment