‘భాగ్ రాహుల్ భాగ్’.. రాహుల్‌ గాంధీపై బీజేపీ సెటైర్లు | Bjp Takes Dig Rahul Gandhi Fielded From Rae Bareli | Sakshi
Sakshi News home page

భాగ్ రాహుల్ భాగ్.. రాయ్‌బరేలీ నుంచి పోటీ చేయడంపై బీజేపీ సెటైర్లు

Published Fri, May 3 2024 5:20 PM | Last Updated on Fri, May 3 2024 6:13 PM

Bjp Takes Dig Rahul Gandhi Fielded From Rae Bareli

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఉత్తర్‌ ప్రదేశ్‌ రాయబరేలీ నుంచి పోటీ చేయడంపై బీజేపీ నేతలు సెటైర్లు వేస్తున్నారు. దక్షిణాదిలో   ఓటమి భయంతో రాహుల్ గాంధీ వాయనాడ్‌తో పాటు ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలీ లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారంటూ ఎద్దేవా చేస్తున్నారు.

బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి దుష్యంత్ కుమార్ గౌతమ్ మాట్లాడుతూ.. భాగ్ రాహుల్ భాగ్, రాహుల్ భాగ్ ఇదే ట్రెండ్‌ అవుతోంది. రాహుల్‌ గాంధీ మీరు ప్రధాని మోదీని చూసి బయపడొద్దని చమత్కరించారు. రాహుల్‌ గాంధీ చిన్న పిల్లాడు అతడిని ప్రోత్సహించాలి. కానీ ప్రజలు అతనిని తిరస్కరించారని అన్నారు.  

ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల్లో రాయ్‌బరేలీ నుంచి కూడా పోటీ చేయాలనే రాహుల్‌ నిర్ణయం వయనాడ్ ప్రజలకు రాహుల్‌ గాంధీ ద్రోహం చేశారని బీజేపీ నేత ఆరోపించారు. వాయనాడ్‌ ఓటమి భయంతో అమేథీకి బదులు రాయ్‌బరేలీ (ఎన్నికల్లో పోటీ చేసేందుకు) వచ్చారని దుష్యంత్ కుమార్ గౌతమ్ పేర్కొన్నారు.

కాగా, గత రెండు దశాబ్దాలుగా తన తల్లి సోనియా గాంధీ లోక్‌సభకు ప్రాతినిధ్యం వహిస్తున్న రాయ్‌బరేలీ నియోజకవర్గం నుంచి రాహుల్ గాంధీ శుక్రవారం నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement