Raibareli
-
‘వయనాడ్’కు రాహుల్ రాజీనామా..?
సాక్షి,ఢిల్లీ: రాహుల్‌గాంధీ తాను గెలిచిన రెండు ఎంపీ సీట్లలో ఏ సీటును వదులుకుంటారనేదానిపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో రాహుల్‌గాంధీ కేరళలోని వయనాడ్, ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలీ సీట్ల నుంచి భారీ మెజార్టీతో గెలిచిన విషయం తెలిసిందే. దీంతో ఈ రెండు సీట్లలో ఒకదానిని ఆయన వదులుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఏ సీటు వదులుకుంటారనేది సోమవారం(జూన్16) సాయంత్రం జరిగే కాంగ్రెస్ పార్టీ కీలక సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు. ఈ నెల 24 న ఎంపీల ప్రమాణ స్వీకారం నేపథ్యంలో రాహుల్ ఏ సీటు వదులుకోవాలనేదానిపై పార్టీ నిర్ణయించనుంది. కాగా, రాహుల్ వ్యూహాత్మకంగా కేరళలోని వయనాడ్ సీటునే వదులుకోవచ్చని తెలుస్తోంది. -
రాయ్‌బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
తిరువనంతపురం: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ రాయ్‌బరేలీ నుంచి నామినేషన్ వేయడంపై వయనాడ్ ప్రజలు ఆసక్తికర కామెంట్స్ చేస్తున్నారు. ‘తప్పేముంది రాహుల్ ఇండియా కూటమిలో అగ్రనేత’ అని ఒకరు అనగా రాయ్‌బరేలీలో గెలిస్తే వయనాడ్ సీటును రాహుల్ వదిలేస్తారని మరొకరన్నారు. అయితే రాహుల్ వయనాడ్‌ను వదిలేయడం తమకు అంత మంచిది కాదని చెప్పాురు. రెండు నియోజకవర్గాల నుంచి పోటీ చేయాలని రాహుల్‌గాంధీ తీసుకున్న నిర్ణయం ఇండియా కూటమికి మేలు చేస్తుందని ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్(ఐయూఎంఎల్)నేత కున్హలికుట్టి అన్నారు. ప్రధాని మోదీ కూడా గతంలో రెండు సీట్లలో పోటీ చేశారని కుట్టి గుర్తు చేశారు. -
‘‘అమేథీ నుంచి పోటీలో రాహుల్ బంట్రోతు’’
లక్నో: అమేథీ నుంచి పోటీకి రాహుల్‌గాంధీ తన బంట్రోతును పంపించాడని బీజేపీ నేత దినేష్ ప్రతాప్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాహుల్‌గాంధీ అమేథీ సీటును నిజంగా గెలవాలనుకుంటే అక్కడి నుంచి పోటీకి తన బంట్రోతును ఎందుకు పంపిస్తారని సింగ్ ప్రశ్నించారు. దినేష్‌సింగ్ రాయ్‌బరేలిలో రాహుల్‌తో తలపడుతున్నారు. ఈ ఎన్నికల్లో రాయ్‌బరేలి, అమేథీ సీట్లలో కాంగ్రెస్ ఓడిపోవడం ఖాయమని సింగ్ స్పష్టం చేశారు. అమేథీ నుంచి రాహుల్ పారిపోయాడని ఎద్దేవా చేశారు. అమేథీ, రాయ్‌బరేలీలో గాంధీ కుటుంబ సభ్యులు ఎప్పుడు పర్యటించినా వారి చుట్టూ పోలీసులు తాళ్లు పట్టుకుని నిల్చొని ఉంటారన్నారు. దూరం నుంచి చేతులు ఊపి వెళ్లిపోవడమే గాంధీ కుటుంబానికి తెలుసన్నారు. కానీ స్మృతి ఇరానీని అమేథీ ప్రజలు తమ కుటుంబ సభ్యురాలిగా చూస్తున్నారన్నారు. కాగా, రాయ్‌బరేలి నుంచి రాహుల్‌గాంధీ, అమేథీ నుంచి కేఎల్ శర్మ కాంగ్రెస్ నుంచి లోక్‌సభ ఎన్నికల్లో బరిలోకి దిగారు. వీరిరువురు తమ నామినేషన్లను ఇప్పటికే దాఖలు చేశారు. -
‘ముందు రాయ్‌బరేలీ నుంచి గెలవండి’
లోక్‌సభ ఎన్నికల్లో ఎట్టకేలకు కాంగ్రెస్ కంచుకోట స్థానాలైన రాయ్‌బరేలీ, అమేథీ పార్లమెంట్ సెగ్మెంట్లలో ఆ పార్టీ తమ అభ్యర్థులు ప్రకటించింది. రాయ్‌బరేలీలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, అమేథీలో కిషోర్ లాల్ శర్మను బరిలోకి దించింది. రాహుల్ గాంధీ తాను మూడు సార్లు గెలిచిన అమెథీని వదిలి రాయ్‌బరేలీ బరిలో దిగటంపై బీజేపీ విమర్శలు చేస్తోంది. బీజేపీ నేతలే కాకుండా చెస్ దిగ్గజం గ్యారీ కాస్పరోవ్ సైతం రాహుల్‌గాంధీపై విమర్శలు చేశాడు. ‘గ్యారీ కాస్పరోవ్, విశ్వనాథ్ ఆనంద్ వంటి చెస్ ఆటగాళ్లు.. త్వరగా రిటైర్ అవటం మంచిదైంది. వారు.. ఒక చెస్ మెథావిని ఎదుర్కొవల్సిన అవసరం లేదు’ అని ఓ నెటిజన్ పెట్టిన పోస్ట్‌కు.. ‘అగ్రస్థానం కోసం సవాల్ చేసే ముందు ముందు రాయ్‌బరేలీ నుంచి గెలివాలి’ అని రాహుల్ గాంధీని ఉద్దేశించి గ్యారీ కాస్పరోవ్ సెటైర్ వేశారు.Traditional dictates that you should first win from Raebareli before challenging for the top! 😂— Garry Kasparov (@Kasparov63) May 3, 2024మరోవైపు.. నటుడు రన్వీర్ షోరే స్పందిస్తూ.. ఈ పరిణామాన్ని మీరు ఎలా ఎదుర్కొంటారని రాహుల్ గాంధీకి సంబంధించిన ఓ వీడియోతో గ్యారీ కాస్పరోవ్‌ను ట్యాగ్ చేశారు. ‘భారత రాజకీయాల్లో నా చిన్న జోక్ ప్రభావితం చేయదని ఆశిస్తున్నా. అయితే నాకు నచ్చిన చెస్ ఆటలో మాత్రం రాజకీయ నాయకుడు (రాహల్ గాంధీ) ఆడటం చూడకుండా ఉండలేను!’ అని గ్యారీ కాస్పరోవ్ అన్నారు.Nice one, @Kasparov63, but can you handle this move? https://t.co/xrWFf3zLK9 pic.twitter.com/quuw4JGB43— Ranvir Shorey (@RanvirShorey) May 3, 2024రాహుల్ గాంధీ రాయ్‌బరేలీలో పోటీ చేయటంపై కాంగ్రెస్ పార్టీ నేత జైరాం రమేష్ వివరణ ఇచ్చారు. ‘రాహుల్ గాంధీ రాయ్‌బరేలీ నుంచి పోటీ చేయటంపై చాలా మందికి పలు అభిప్రాయాలు ఉంటాయి. అయితే అందరూ.. రాహుల్ గాంధీకి రాజకియాలతో పాటు చెస్ ఆట మీద చాలా పట్టుందని మర్చిపోవద్దు’ అని ఆయన ఎక్స్ వేదికగా తెలిపారు. దీంతో ఆయన ట్వీట్‌పై బీజేపీ నేతలు, నెటిజన్లు విమర్శలు చేస్తున్నారు. ఈ క్రమంలో చెస్ దిగ్గజం గ్యారీ కాస్పరోవ్ రాహుల్ గాంధీ విమర్శలు చేశారు.Many people have many opinions on the news of @RahulGandhi contesting elections from Rae Bareli.Remember, he is an experienced player of politics and chess. The party leadership takes its decisions after much discussion, and as part of a larger strategy. This single decision…— Jairam Ramesh (@Jairam_Ramesh) May 3, 2024చెస్ దిగ్గజం గ్యారీ కాస్పరోవ్‌ను రష్యా ఉగ్రవాదుల జాబితాలో చేర్చిన విషయం తెలిసిందే. పుతిన్ ప్రభుత్వంపై ఆయన బహిరంగంగా విమర్శలు గుప్పించడమే దీనికి ప్రధాన కారణం. ప్రభుత్వ విధానాలను కాస్పరోవ్ వ్యతిరేకించడం వల్లే అధికారులు ఆయన్ను ఉగ్రవాదులు, తీవ్రవాదులు జాబితాలోకి చేర్చారు. చెస్‌లో పలుమార్లు వరల్డ్ ఛాంపియన్‌గా నిలిచిన 60 ఏళ్ల గ్యారీ కాస్పరోవ్ చాలా కాలంగా పుతిన్ ప్రభుత్వంపై బహిరంగంగానే విమర్శలు చేస్తూ వస్తున్నారు. -
‘భాగ్ రాహుల్ భాగ్’.. రాహుల్ గాంధీపై బీజేపీ సెటైర్లు
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఉత్తర్ ప్రదేశ్ రాయబరేలీ నుంచి పోటీ చేయడంపై బీజేపీ నేతలు సెటైర్లు వేస్తున్నారు. దక్షిణాదిలో ఓటమి భయంతో రాహుల్ గాంధీ వాయనాడ్‌తో పాటు ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలీ లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారంటూ ఎద్దేవా చేస్తున్నారు.బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి దుష్యంత్ కుమార్ గౌతమ్ మాట్లాడుతూ.. భాగ్ రాహుల్ భాగ్, రాహుల్ భాగ్ ఇదే ట్రెండ్ అవుతోంది. రాహుల్ గాంధీ మీరు ప్రధాని మోదీని చూసి బయపడొద్దని చమత్కరించారు. రాహుల్ గాంధీ చిన్న పిల్లాడు అతడిని ప్రోత్సహించాలి. కానీ ప్రజలు అతనిని తిరస్కరించారని అన్నారు. ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల్లో రాయ్‌బరేలీ నుంచి కూడా పోటీ చేయాలనే రాహుల్ నిర్ణయం వయనాడ్ ప్రజలకు రాహుల్ గాంధీ ద్రోహం చేశారని బీజేపీ నేత ఆరోపించారు. వాయనాడ్ ఓటమి భయంతో అమేథీకి బదులు రాయ్‌బరేలీ (ఎన్నికల్లో పోటీ చేసేందుకు) వచ్చారని దుష్యంత్ కుమార్ గౌతమ్ పేర్కొన్నారు.కాగా, గత రెండు దశాబ్దాలుగా తన తల్లి సోనియా గాంధీ లోక్‌సభకు ప్రాతినిధ్యం వహిస్తున్న రాయ్‌బరేలీ నియోజకవర్గం నుంచి రాహుల్ గాంధీ శుక్రవారం నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. -
భార్య, పిల్లలను చంపి డాక్టర్ సూసైడ్..కారణమిదే!
రాయిబరేలి: చికిత్స చేసి ప్రాణాలు కాపాడాల్సిన డాక్టర్ ఏకంగా ముగ్గురి ప్రాణాలు తీశాడు.ఆ తర్వాత ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు.డాక్టర్ చంపింది ఎవరినో కాదు. అతని భార్య, ఇద్దరు పిల్లలనే.ఈ దారుణ సంఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని రాయిబరేలిలోని లాల్గంజ్లో జరిగింది. ‘డాక్టర్ అరుణ్‌సింగ్ లాల్గంజ్లోని మోడ్రన్ రైల్ కోచ్ ఫ్యాక్టరీ ఆస్పత్రిలో కంటి డాక్టర్‌గా పనిచేస్తున్నారు. ఆయన కుటుంబం గత ఆదివారం నుంచి ఎవరికీ టచ్‌లో లేనట్లు పోలీసులు చెప్పారు. ‘అరుణ్‌సింగ్ డిప్రెషన్‌తో బాధపడుతున్నారు. అతను ఆత్మహత్య చేసుకున్న చోట డిప్రెషన్ తగ్గించడానికి వాడే చాలా ఇంజెక్షన్లు లభించాయి. డాక్టర్ తొలుత తన పిల్లలకు నొప్పి తెలియకుండా మత్తు మందు ఇచ్చారు. తర్వాత వారి తలపై బలంగా బాది చంపారు. అనంతరం ఆయన ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. పిల్లల్లో కూతురు వయసు 14 సంవత్సరాలు కాగా కొడుకు వయసు 5 ఏళ్లు. వారందరి మృతదేహాలు పోస్టుమార్టం కోసం పంపించాం’అని రాయిబరేలి ఎస్పీ అలోక్ ప్రియదర్శి చెప్పారు. ఇదీచదవండి..సచిన్ పైలట్‌పై గెహ్లాట్ ‘స్పై’..? బీజేపీ నేత కీలక వ్యాఖ్యలు -
స్కూల్ బస్సులో దూరిన భారీ కొండ చిలువ.. షాకింగ్ వీడియో
ఈ మధ్యకాలంలో పాములు ఒక్కడి పడితే అక్కడ ప్రత్యక్షమవుతున్నాయి. ఇళ్లు, షూలు, బైక్‌లు.. ఇలా కనిపించిన ప్రతిచోటా దూరిపోతున్నాయి. అనుకొని ప్రదేశాల్లో పాములు కనిపించడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. తాజాగా అలాంటి ఓ ఘటనే ఉత్తర ప్రదేశ్‌లో వెలుగు చూసింది. రాయ్‌బరేలిలోని ఓ పాఠశాల బస్సులో భారీ కొండచిలువ ప్రత్యక్షమైంది. పాఠశాలకు సెలవు కావడంతో బస్సును డ్రైవర్ తన గ్రామానికి తీసుకెళ్లి ఇంటి దగ్గర పార్క్ చేశాడు. ఆ బస్సు పక్క నుంచి మేకల మంద వెళ్తుంటే బస్సులో నుంచి వింత శబ్దాలు రావడంతో గ్రామస్తులు గమనించారు. బస్సులో ఏదో ఉందనే అనుమానంతో పరిశీలించి చూడగా.. భారీ కొండచిలువ బస్సులో తిష్ట వేసింది. ఇంజిన్ భాగం వద్ద ఓ సీట్ కింద పెద్ద కొండచిలువ దాక్కుంది. చదవండి: వైరల్: 30 ఏళ్లు వచ్చే దాకా తొందరపడొద్దు.. టీనేజర్‌కు జో బైడెన్ సలహా సమాచారం అందుకున్న సిటీ సీఓ వందనా సింగ్, సిటీ మెజిస్ట్రేట్ పల్లవి మిశ్రా అక్కడికి చేరుకున్నారు. సంఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు గంటపాటు శ్రమించి కొండచిలువను పట్టుకున్నారు. పట్టుకున్న కొండచిలువ బరువు 80 కేజీలు, పదకొండున్నర అడుగుల పొడవు ఉన్నట్లు అధికారులు తెలిపారు. అనంతరం దానిని అడవిలో విడిచిపెట్టారు. Uttar Pradesh: रायबरेली में स्कूल की बस के इंजन में विशालकाय अजगर फंसा था। कड़ी मशक़्क़त के बाद वन विभाग की टीम ने निकाला बाहर। अजगर को रस्सी के सहारे बाहर निकाला गया। इस अजगर का वजन करीब 80 किलो और उसकी लंबाई साढ़े 11 फीट है। अजगर को सुरक्षित जंगल में छोड़ दिया गया है। #Python pic.twitter.com/TAoq9aq8CP — Tanseem Haider तनसीम हैदर Aajtak (@TanseemHaider) October 16, 2022 అటవీ అధికారులు బస్సులో నుంచి కొండచిలువను తీస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియోలో ఒక అధికారి స్కూలు బస్సు దిగువ నుంచి కొండచిలువను లాగడం ఈ వీడియోలో కనిపిస్తుంది. అదృష్టవశాత్తూ ఆదివారం కావడంతో పాఠశాల మూసివేయడంతో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. -
గాంధీల అడ్డాలో కాంగ్రెస్‌కు కష్టమే!
ఉత్తరప్రదేశ్ ఎన్నికల మహా సంగ్రామంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసి, గాంధీ కుటుంబం దశాబ్దాలుగా గెలుస్తూ వస్తున్న రాయ్‌బరేలీ లోక్‌సభ స్థానాల పరిధిలోని అసెంబ్లీ సీట్లలో బీజేపీ, కాంగ్రెస్ విజయావకాశాలపై సర్వత్రా ఆసక్తికర చర్చ జరుగుతోంది. రాయ్‌బరేలీలో నాలుగో విడతలో భాగంగా ఫిబ్రవరి 23న పోలింగ్ పూర్తవగా వారణాసిలో ఆరు, ఏడు విడతల్లో మార్చి 3, 7 తేదీల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ రెండుచోట్లా భిన్న రాజకీయ పరిస్థితులు కనిపిస్తున్నాయి. మోదీ ప్రాతినిధ్యంలో గత ఎనిమిదేళ్లలో వారణాసి అనూహ్యమైన అభివృద్ధి సాధిస్తే అంతకుముందు పదేళ్ల యూపీఏ హయాంలో రాయబరేలిలో సాధించిన అభివృద్ధి శూన్యమనే అభిప్రా యం స్థానికుల్లో బాగా ఉంది. అభివృద్ధి నినాదం తోనే వారణాసిలో మళ్లీ పట్టు నిలుపుకునేందుకు బీజేపీ గట్టిగా ప్రయత్నిస్తోంది. ప్రధాని మరో రెండు విడతలు ఇక్కడ ప్రచారం చేయనున్నారు. కాంగ్రెస్‌కు కష్టకాలం గత బుధవారం పోలింగ్ ముగిసిన రాయ్‌బరేలీలో ప్రస్తుతమున్న రెండు అసెంబ్లీ సీట్లను కూడా కాంగ్రెస్ కోల్పోవచ్చంటున్నారు. ‘‘గాంధీ కుటుంబంపై మాకిప్పటికీ ప్రేమాభిమానాలున్నాయి. కానీ ఆ కుటుంబం రాయ్‌బరేలీ ప్రజలకు చేసిందేమీ లేదు. 2004 నుంచి పదేళ్లు అధికారంలో ఉండి కూడా మాకు కనీస సదుపాయాలు కల్పించలేకపోయారు’ అని కిషన్ సింగ్ అనే స్థానికుడు ఆవేదన వ్యక్తం చేశాడు. ఇక్కడి ఐదు అసెంబ్లీ సీట్లలో కాంగ్రెస్ ఈసారి ఒక్కటైనా గెలిచే పరిస్థితి లేదని రాయబరేలీ బస్టాండ్ సమీపంలో 50 ఏళ్లుగా టీ దుకాణం నడుపుస్తున్న మొహియుద్దీన్ అన్నాడు. ఇదంతా కాంగ్రెస్ స్వయంకృతమేనని అభిప్రాయపడ్డాడు. ‘ఇందిరాగాంధీ పోటీ చేసిన నాటి నుంచి మొన్నటి 2017 అసెంబ్లీ ఎన్నికల దాకా కాంగ్రెస్‌కే ఓటేస్తూ వచ్చా. ఈసారి మాత్రం విధిలేక వేరే పార్టీకి వేశా’’ అని చెప్పాడు. 70 ఏళ్లుగా పార్టీనే గెలిపిస్తూ వచ్చిన ఇక్కడి 5 అసెంబ్లీ స్థానాల్లోనూ ఈసారి కాంగ్రెస్ గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది. యువ గాంధీలు తమను నిర్లక్ష్యం చేస్తున్నారనే అభిప్రాయం స్థానికంగా కనిపిస్తోంది. ‘కేవలం ఓట్లు వేసే యంత్రాలుగా ఆ కుటుంబం మమ్మల్ని చూసింది. ఇక మేము మా పంథా మార్చుకోక తప్పలేదు’ అని కిరాణ వ్యాపారి రాంగోపాల్ గుప్తా చెప్పారు. పోటీ నామమాత్రమే రాయ్‌బరేలీ లోక్‌సభ స్థానం పరిధిలోని రాయ్‌బరేలీ సదర్, బచ్రావన్, హర్చంద్పూర్, సరేనీ, ఉంచహర్ స్థానాల్లో ఆ పార్టీ అభ్యర్థులు నామమాత్రంగానే పోటీలో ఉన్నారు. యూపీ ఎన్నికల ప్రచార బాధ్యతలను పూర్తిగా నెత్తికెత్తుకున్న ప్రియాంక గాంధీ గత వారం పోలింగ్‌కు ముందు ఇక్కడ విస్తృతంగా ప్రచారం చేశారు. అయినా పెద్దగా లాభించలేదని పోలింగ్ అనంతర పరిస్థితులు స్పష్టం చేస్తున్నాయి. ఇకపై తాను ఇక్కడి నుంచి పోటీ చేసేదీ లేనిదీ భవిష్యత్తు నిర్ణయిస్తుందన్న కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ వ్యాఖ్యలు పరిస్థితిని మరింత ప్రతికూలంగా మార్చాయి. రాయ్‌బరేలీ ప్రజలతో తమ అనుబంధం కొనసాగుతుందన్న భరోసా కల్పించలేకపోయారన్న భావన వ్యక్తమైంది. ఇక్కడ బీజేపీ నుంచి అమిత్‌షా, ఎస్పీ నుంచి అఖిలేశ్ యాదవ్ తదితరులు ప్రచారానికి రాగా రాహుల్‌గాంధీ మాత్రం కన్నెత్తి కూడా చూడలేదు. ‘ఇందిర హయాంలో రాయ్‌బరేలీ వాసులు ఢిల్లీ వెళ్లినా బాగా చూసుకునేవారు. సోనియా వచ్చాక పరిస్థితులు మారాయి. రాహుల్, ప్రియాంకల తరం వచ్చేసరికి మమ్మల్ని పట్టించుకునే వారే లేకుండా పోయారు’ అని రఘునాథ్ మిశ్రా అనే స్థానిక వ్యాపారి అన్నాడు. రాయ్‌బరేలీ సదర్ పార్టీ అభ్యర్థి సిట్టింగ్ ఎమ్మెల్యే ఆదితీసింగ్పై స్థానిక కేడర్‌లో తీవ్ర వ్యతిరేకత ఉంది. కాశీ.. మోదీ సహవాసి ఈశాన్య యూపీ పరిధిలోని వారణాసి లోక్‌సభ స్థానంలో 8 అసెంబ్లీ సీట్లున్నాయి. ఆరింట బీజేపీ, రెండింట్లో మిత్రపక్షాలు పోటీ చేస్తున్నాయి. వీటిల్లో మళ్లీ బీజేపీ గెలుపు ఖాయమంటున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ మార్చి 2 నుంచి 5 దాకా ఇక్కడ ప్రచారం చేయనున్నారు. వారణాసి పరిధిలో ఆయన ప్రచారం ఈశాన్య యూపీలోని 111 అసెంబ్లీ స్థానాలపై ప్రభావం చూపుతుందని అంచనా. రాయ్‌బరేలి (యూపీ) నుంచి ‘సాక్షి’ ప్రతినిధులు కంచర్ల యాదగిరిరెడ్డి, దొడ్డ శ్రీనివాసరెడ్డి -
ఖాళీగా ఇంట్లో కూర్చోలేను బిడ్డా!
లక్నో: కాళ్లు, చేతులు అన్ని సరిగా ఉండి.. ఒంట్లో సత్తువ ఉన్నా.. పని చేయాలంటే బద్దకిస్తారు కొందరు. పని నుంచి తప్పించుకోవడానికి సాకులు వెతుకుతుంటారు. అలాంటి వారు ఒక్కసారి ఈ వార్త చదివి.. వీడియో చూస్తే.. తప్పకుండా సిగ్గుపడతారు. ఏందుకంటే ఇక్కడ మనం చెప్పుకోబోయే వృద్ధుడు 98వ ఏట కూడా చేతనైన పని చేసుకుంటూ.. కుటుంబానికి ఆసరా అవుతున్నాడు. ఈ వయసులో ఇంత కష్టం అవసరమా తాత అంటే... ఊరికే ఖాళీగా ఇంట్లో కూర్చోని ఉండలేను బిడ్డ అంటున్నాడు. తాత పనికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో తెగ వైరలయ్యింది. దాంతో జిల్లా మెజిస్ట్రేట్ ఆ తాతకు సన్మానం చేశారు. ఆ వివరాలు.. ఉత్తరప్రదేశ్ రాయ్‌బరేలికి చెందిన విజయ్ పాల్ సింగ్ వయసు 98 ఏళ్లు. సాధారణంగా ఇంత పెద్ద వయసులో ముసలి వారు ఇళ్లు కదల లేరు. కొందరిని అనారోగ్య సమస్యలు చుట్టుముడతాయి. మరో మనిషి తోడు లేనిదే.. వారి జీవితం గడవదు. అయితే అదృష్టం కొద్ది విజయ్ పాల్ సింగ్ ఈ వయసులో కూడా ఎంతో ఆరోగ్యంగా ఉన్నాడు. తన పనులన్ని తానే చేసుకోగలడు. అంతేకాక ఒంట్లో ఇంకా సత్తువ ఉండటంతో తనకు చేతనైన పని చేస్తున్నాడు. ఈ క్రమంలో తాత ప్రతిరోజు తన ఇంటి సమీపంలోని రోడు పక్కన ఓ తోపుడు బండి పెట్టుకుని.. దాని మీద ఉడికించిన శనగలు.. మొలకలు పెట్టుకుని అమ్ముతుంటాడు. తనది చాలా పెద్ద కుటుంబం అని.. ఇలా పని చేయడం తన ఇంట్లో వారికి ఇష్టం లేదని.. కానీ ఊరికే ఖాళీగా కూర్చోవడం తనకు నచ్చదని.. అందుకే ఈ పని చేస్తున్నాను అని తెలిపాడు విజయ్ పాల్ సింగ్. ఇందుకు సంబంధించిన వీడియోని అలోక్ పాండే అనే వ్యక్తి తన ట్విట్టర్లో షేర్ చేయడంతో ఇది తెగ వైరలయ్యింది. ఈ క్రమంలో రాయ్‌బరేలి జిల్లా మేజిస్ట్రేట్ వైభవ్ శ్రీవాస్తవ.. విజయ్ పాల్ సింగ్‌ని తన కార్యాలయానికి ఆహ్వానించి11,000 రూపాయల నగదును అందజేశారు. డబ్బుతో పాటు శాలువా కప్పి సన్మానం చేసి వాకింగ్ స్టిక్, సర్టిఫికేట్ అందజేశారు. అంతేకాక ప్రభుత్వ పథకం కింద వృద్ధుడికి ఇల్లు మంజూరు చేస్తామని తెలిపారు. ఈ సందర్భంగా శ్రీవాస్తవ మీడియాతో మాట్లాడుతూ.. ‘‘విజయ్ పాల్ సింగ్‌కు సంబంధించిన వీడియో వైరల్ అయ్యింది. మా ముఖ్యమంత్రి కూడా దీనిని గమనించారు ... ఆయన ఎవరి బలవంతం మీదనో ఈ పని చేయడం లేదు. ఆయన మా అందరికి స్ఫూర్తి. అందుకే అతడికి రేషన్ కార్డు, మరుగుదొడ్డి నిర్మాణానికి నిధులు ఇచ్చాము. ఆయనకు ప్రభుత్వం తరఫున ఇంకా ఏమైనా కావాలంటే వాటిని కూడా సమకూరుస్తాం’’ అన్నారు. ఈ వీడియో చూసిన నెటిజనులు తాతపై ప్రశంసలు కురిపిస్తున్నారు. చదవండి: ఏమైందో ఏమో.. పాపం పండుటాకులు.. కన్నీళ్లు తెప్పిస్తున్న డెలివరీ డ్రైవర్ దీన గాథ -
వివాహంతో ఒక్కటి కానున్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు
సాక్షి, న్యూఢిల్లీ : డాక్టర్లు డాక్టర్లను, లాయర్లు లాయర్లను, కలెక్టర్లు కలెక్టర్లను, యాక్టర్లు యాక్టర్లను వివాహం చేసుకోవడం ఇప్పటివరకు చూశాం. కానీ ఎమ్మెల్యే మరో ఎమ్మెల్యేని వివాహం చేసుకోవడం బహుశా ఇదే మొదటిసారి కావచ్చు. అంతేకాకుండా వీరిద్దరూ ఒకేపార్టీ వారు కావడంతో పాటు, వేర్వేరు రాష్ట్రాలకు చెందిన వారు కావడం మరో విశేషం. వివరాల్లోకి వెళితే.... ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలి కాంగ్రెస్ ఎమ్మెల్యే అదితి సింగ్‌తో పంజాబ్‌లోని షహీద్ భగత్‌సింగ్ నగర్ ఎమ్మెల్యే అంగద్ సింగ్ షైని వివాహం నవంబర్ 21న ఢిల్లీలో జరుగనుంది. ఈ మేరకు అతిథులకు ఆహ్వానాలను ఇప్పటికే అందించారు. వీరిద్దరూ ప్రముఖ రాజకీయ కుటుంబాలకు చెందిన వారు కాగా, ఒకే ఏడాది ఎమ్మెల్యేలుగా ఎన్నికవడం యాదృచ్ఛికం. అదితి తండ్రి అఖిలేష్ కుమార్ సింగ్ ఐదుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికవగా, అంగద్ సింగ్ షైనీ తండ్రి దిల్బాగ్ సింగ్ నవాన్షహర్ అసెంబ్లీ స్థానం నుంచి రికార్డు స్థాయిలో ఆరు సార్లు ఎన్నికయ్యారు. ఇక పంజాబ్ అసెంబ్లీలో అంగద్ సింగ్ షైనీ మిగతా ఎమ్మెల్యేల కంటే వయసులో చిన్నవాడు. అలాగే అదితి సింగ్ ఉత్తరప్రదేశ్ అసెంబ్లీలో వయసులో చిన్న ఎమ్మెల్యే. అంగద్ కంటే అదితి వయసులో నాలుగేళ్లు పెద్ద. వీరి వివాహ రిసెప్షన్ నవంబర్ 23న నిర్వహించనున్నారు. కాగా, అదితి సింగ్ 90వేల మెజారిటీతో గెలుపొందడం గమనార్హం. -
కశ్మీర్ అంశంపై కాంగ్రెస్ ఎమ్మెల్యే హర్షం
లక్నో: జమ్మూకశ్మీర్ రాష్ట్రానికి ప్రత్యేక ప్రతిపత్తిని కల్పిస్తున్న రాజ్యాంగంలోని 370, 35–ఏ అధికరణాలను రద్దు చేస్తూ.. జమ్మూ కశ్మీర్‌కు రాష్ట్ర హోదాను కూడా తొలగిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై యావత్ దేశం హర్షం వ్యక్తం చేస్తోంది. దీనికి భిన్నంగా విపక్ష కాంగ్రెస్ ఈ చర్యను తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. బీజేపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పూర్తిగా రాజ్యాంగ విరుద్ధమంటూ ఆ పార్టీ పార్లమెంట్లో తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. అయితే కశ్మీర్‌పై కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తూ.. రాయ్‌బరేలీ కాంగ్రెస్ ఎమ్మెల్యే అధితి సింగ్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఈ మేరకు ట్విటర్ వేదికగా స్పందించిన ఆమె ‘దేశ సమైఖ్యతకు తామంతా కట్టుబడి ఉంటాం. జైహింద్’ అంటూ ట్వీట్ చేశారు. పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా అధితి పోస్ట్ చేయడం కాంగ్రెస్‌లో చర్చనీయాంశంగా మారింది. అధితి సింగ్ పోస్ట్‌పై కాంగ్రెస్ అధిష్టానం ఇప్పటి వరకు స్పందించలేదు. కాగా రాయ్‌బరేలీ లోక్‌సభ స్థానం నుంచి యూపీయే చైర్పర్సన్ ఎంపీగా గెలుపొందిన విషయం గమన్హారం. ఆమెతో పాటు యూపీ కాంగ్రెస్ సీనియర్ నేత జనార్థన్ ద్వివేది కూడా కేంద్ర నిర్ణయాన్ని స్వాగతించారు. వీరితో పాటు మరికొంత మంది హస్తం నేతలు కూడా ఆర్టికల్ 370 రద్దును సమర్థిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370 రద్దుపై తమ పార్టీ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ రాజ్యసభలో కాంగ్రెస్ విప్ భువనేశ్వర్ కలిత రాజీనామా చేసిన విషయం తెలిసిందే. తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసినట్టు ట్విటర్ ద్వారా వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీకి కూడా ఆయన రాజీనామా చేశారు. ఆర్టికల్ 370పై కాంగ్రెస్ పార్టీ నిర్ణయం ఆత్మహత్యాసదృశ్యంగా ఉందని ఆయన ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. దేశమంతా కశ్మీర్ అంశంపై చర్చిస్తుంటే కాంగ్రెస్ అధిష్టానం పెద్దలు రాహుల్ గాంధీ, సోనియా, ప్రియాంక గాంధీ ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. -
ఉన్నావ్ రోడ్డు ప్రమాదం కేసులో పురోగతి
సాక్షి: ఉన్నావ్ రేప్ బాధితురాలు ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైన కేసులో ట్రక్ డ్రైవరు ఆశిష్ కుమార్ పాల్, క్లీనర్ మోహన్‌లకు కోర్టు మూడు రోజుల పోలీస్ కస్టడీని విధించింది. ట్రక్ యజమానిని కూడా పోలీసులు ప్రశ్నిస్తున్నారు. అయితే శనివారం ఉదయం ఈ కేసులో కీలక విషయం తెలిసింది. ప్రమాదం జరిగినప్పుడు వాహనం నెంబర్ కనబడకుండా గ్రీస్ పూసారని తెలిసింది. ప్రమాదం జరిగిన రోజు ఉదయం గం. 05.20లకు ఘటనా స్థలం నుంచి 20 కిలోమీటర్ల దూరంలోని టోల్‌ప్లాజా వద్ద ఉన్న సీసీ కెమెరాలో ట్రక్కు నంబర్ ప్లేట్‌పై ఎలాంటి మచ్చలు, మరకలు గానీ లేని విషయం బయటపడింది. దీంతో ఈ ప్రమాదం కావాలనే చేశారనే వాదనకు బలం చేకూరినట్టైంది. ఈ విషయం వాహన యజమానిని ప్రశ్నించగా, ఈఎమ్ఐలు కట్టకుండా తప్పించుకోవడానికి తరచూ అలా చేస్తుంటామని చెప్పడం గమనార్హం. ఈ కేసులో 45 రోజుల్లో విచారణ పూర్తి చేసి నివేదిక సమర్పించాలని సుప్రీం కోర్టు సీబీఐని ఆదేశించిన విషయం తెలిసిందే. -
రాయ్‌బరేలీ ప్రమాదంలో 25 మందిపై కేసు
ఉన్నావ్ రేప్ బాధితురాలు ప్రయాణీస్తున్న వాహనం ప్రమాదానికి గురై ఇద్దరు చనిపోగా, బాధితురాలు, ఆమె లాయరు తీవ్ర గాయాల పాలయిన సంగతి తెలిసిందే. ఆ ఘటనపై వివిధ వర్గాల నుంచి వచ్చిన ఒత్తిడితో ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం సిబిఐ విచారణకు ఆదేశించింది. ఈ నేపథ్యంలో సిబిఐ దాదాపు 25 మందిని నిందితులుగా పేర్కొంటూ కేసును దర్యాప్తు చేస్తోంది. ఇందులో గతంలో అత్యాచారానికి పాల్పడిన ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ సెంగార్,అతని సోదరునితో పాటు అతని లాయరు, అతనికి సన్నిహితంగా ఉన్న జర్నలిస్టులతో పాటు అరుణ్ సింగ్ అనే వ్యక్తిని చేర్చింది. ఈ అరుణ్ కుమార్ అనే వ్యక్తి ఆ రాష్ట్ర క్యాబినెట్ మినిస్టర్ అయిన రణ్వేంద్ర సింగ్‌కు అల్లుడు కావడం గమనార్హం. రణ్వేంద్ర సింగ్ ఫతేపూర్ అసెంబ్లీ స్థానం నుంచి ఎన్నికయ్యారు. అలాగే ప్రమాదానికి కారణమైన వాహనం ఫతేపూర్‌లోనే రిజిస్టర్ అవ్వడం, వాహన డ్రయివరు కూడా ఫతేపూర్‌కు చెందిన వాడు కావడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఈ విషయంపై మినిస్టర్ రణ్వేంద్ర సింగ్‌ను ప్రశ్నించగా.. అరుణ్ సింగ్ నా బంధువన్నది నిజమే. ఈ విషయం అందరికీ తెలుసు. అయినా ఈ ప్రమాదం కావాలని చేసినట్టు కనపడటం లేదు. ఏదేమైనా సిబిఐ విచారణలో అన్ని విషయాలు తెలుస్తాయని వ్యాఖ్యానించారు. కాగా, బుధవారం సిబిఐకి చెందిన 12 మంది అధికారుల బృందం ఘటన జరిగిన ప్రదేశాన్ని పరిశీలించింది. -
పార్టీ నేతలపై మండిపడ్డ ప్రియాంకా గాంధీ
సాక్షి, రాయ్‌బరేలీ: లోక్‌సభ ఎన్నికల్లో పార్టీని ముంచింది మీరే అంటూ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ పార్టీ నేతలపై మండిపడ్డారు. ఆమె గురువారం రాయ్‌బరేలీలో పార్టీ నేతలతో మాట్లాడారు. ఎన్నికల్లో పార్టీ కోసం శ్రమించని వారి పేర్లను కనుక్కుంటామన్నారు. ఎవరెవరు పార్టీ కోసం చిత్తశుద్ధితో పని చేశారో వారి హృదయాలకే తెలుసన్నారు. మరోవైపు బీజేపీ నేతలు అమిత్ షా, స్మృతి ఇరానీలు లోక్‌సభకు ఎన్నిక కావడంతో ఖాళీ అయిన రెండు రాజ్యసభ స్థానాలకు విడివిడిగా కాకుండా ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి సింఘ్వీ డిమాండ్ చేశారు. విడివిడిగా ఎన్నికలు నిర్వహించాలనుకోవడం రాజ్యాంగాన్ని అపహాస్యం చేయడమేనని అన్నారు. -
ఓటర్లకు సోనియా కృతజ్ఞతలు
రాయ్‌బరేలీ: యూపీఏ చైర్పర్సన్ సోనియాగాంధీ రాయ్‌బరేలీ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. బుధవారం కుమార్తె, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రాతో కలిసి ఆమె రాయ్‌బరేలీ వెళ్లారు. ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో మరోసారి తనను ఎన్నుకున్న ప్రజలకు సోనియా గాంధీ ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా పార్టీ నేతలు, కార్యకర్తలతో సమావేశమై వివిధ అంశాలపై చర్చించారు. రానున్న ఉత్తరప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోవద్దని కార్యకర్తలు సోనియాను కోరినట్లు కాంగ్రెస్ నేత సంజయ్ సిన్హ్ తెలిపారు. ఇటీవలి ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత సొంత నియోజకవర్గంలో సోనియా పర్యటించడం ఇదే ప్రథమం. -
రాయ్‌బరేలీ ప్రజలకు కృతజ్ఞతలు
రాయ్‌బరేలీ: సార్వత్రిక ఎన్నికల్లో విజయాన్నీ అందించిన రాయ్‌బరేలీ నియోజకవర్గ ప్రజలకు కృతజ్ఞతలు తెలపడానికి యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలీకి విచ్చేశారు. సోనియా గాంధీ సార్వత్రిక ఎన్నికల తర్వాత మొదటిసారి రాయ్‌బరేలీకి రావడం ప్రాధాన్యత సంతరించుకుంది. బుధవారం మధ్యాహ్నం ఫర్సాత్ గంజ్ విమానాశ్రయానికి చేరుకున్న సోనియా, ప్రియాంక అక్కడి నుంచి భుయేము అతిథి గృహానికి వెళ్లారని రాయ్‌బరేలీ జిల్లా కాంగ్రెస్ అధికార ప్రతినిధి లాల్‌కృష్ణ ప్రతాప్ తెలిపారు. అన్ని జిల్లాల కాంగ్రెస్ పార్టీ నాయకులతో ప్రియాంక గాంధీ సమీక్ష నిర్వహించనున్నారని చెప్పారు. ఆహ్వానించిన 2,500 మంది పార్టీ కార్యకర్తలతో సాయంత్రం జరిగే కృతజ్ఞత సమావేశంలో సోనియా, ప్రియాంక పాల్గొంటారని వెల్లడించారు. ఇటివల జరిగిన 17వ సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్‌కు కంచుకోటలా ఉన్న రాయ్‌బరేలీలో సోనియా గాంధీ మరోసారి విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో బీజేపీ ఎంపీ అభ్యర్థి దినేశ్ ప్రతాప్ సింగ్‌పై సోనియా 1, 67,178 మెజార్టీతో గెలుపొందారు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో కూడా సోనియా ఇదే నియోజకవర్గంలో 3,52,713 మెజార్టీతో బీజేపీ అభ్యర్థి అజయ్ అగర్వాల్‌పై విజయం సాధించారు. -
ప్రేమించడమే నిజమైన జాతీయవాదం
అమేథీ/రాయ్‌బరేలీ: దేశాన్ని, దేశ ప్రజలను ప్రేమించడమే నిజమైన జాతీయవాదమని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, తూర్పు యూపీ ఇన్చార్జ్ ప్రియాంకా గాంధీ తెలిపారు. కానీ దేశంపై గౌరవం, దేశ ప్రజలపై ప్రేమ బీజేపీలో తనకు ఏమాత్రం కన్పించడం లేదన్నారు. దేశం ఎదుర్కొంటున్న నిరుద్యోగం, అవినీతి, పేదరికం వంటి నిజమైన సమస్యలపై ప్రధాని మోదీ నోరు మెదపడం లేదని ప్రియాంక విమర్శించారు. ప్రజల గొంతుకను, అభిప్రాయాలను అణచివేస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. ఉత్తర ప్రదేశ్‌లోని రాయ్‌బరేలీ(సోనియా గాంధీ), అమేథీ (రాహల్ గాంధీ) లోక్‌సభ నియోజకవర్గాల్లో గురువారం ఎన్నికల ప్రచారం సందర్భంగా ప్రియాంక పీటీఐకి ఇంటర్వ్యూ ఇచ్చారు. జాతీయవాదానికి కొత్త నిర్వచనం.. ‘దేశాన్ని, దేశ ప్రజలను ప్రేమించడమే నిజమైన దేశభక్తి అని నేను నమ్ముతా. కానీ బీజేపీ నేతలు చేస్తున్న పనుల్లో ఇది నాకెక్కడా కన్పించడం లేదు. జాతీయవాదం అంటే ప్రజలు, దేశం ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడం. నిజమైన దేశభక్తి అంటే ప్రజల బాధలను సావధానంగా వినడం. అంతేతప్ప దేశంలోని వ్యవస్థలను, రాజ్యాంగబద్ధమైన సంస్థలను, ప్రజాస్వామ్యాన్ని బలహీనపర్చడం కాదు. మోదీ కావొచ్చు, మరే నేతయినా కావచ్చు.. ప్రజాగ్రహాన్ని పట్టించుకోకపోతే పర్యవసానాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది’ అని వ్యాఖ్యానించారు. ఏటా 12 వేల మంది రైతుల ఆత్మహత్య.. ‘ప్రజాస్వామ్యం కోసం, ప్రజాస్వామ్య విలువల కోసం, ప్రజలంతా ప్రేమించే భారత్‌ను కాపాడుకునేందుకు ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తోంది. మోదీ ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా రూ.10,000–రూ.20,000 అప్పు తీర్చలేక ఏటా 12 వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఇప్పుడు ఎన్నికలు వచ్చాయి కాబట్టి వారి బ్యాంకు ఖాతాలకు రూ.2 వేలు పంపి మోసం చేయొచ్చని మోదీ భావిస్తున్నారు. ఇది నిజంగా రైతులను అవమానించడమే’ అని ప్రియాంక స్పష్టం చేశారు. నేను ఎవ్వరికీ భయపడను.. ‘నేను ఎవ్వరికీ భయపడను. పార్టీ ఆదేశాల మేరకే వారణాసి నుంచి నేను పోటీ చేయలేదు. యూపీలో పార్టీ పటిష్టత కోసమే ప్రచారం చేస్తున్నా. నా కుటుంబ సభ్యులను బీజేపీ నేతలు ఎన్నికల ప్రచారంలో లక్ష్యంగా చేసుకుంటున్నారు. అది వారి రాజకీయంలో భాగమే. స్కూలు టీచర్ లేక ప్రతిపక్ష నేత ఎవరైనా సరే వాళ్లకు వ్యతిరేకంగా మాట్లాడితే లక్ష్యంగా చేసుకుంటారు’ అని అన్నారు. పాములతో ప్రియాంక ఆటలు ప్రియాంక ప్రచారంలో భాగంగా కుచరియా గ్రామంలో పాములోళ్లతో ముచ్చటించారు. ఈ సందర్భంగా ఆమె ఒక పామును చేతిలోకి తీసుకుని ఆడించారు. ఈ సందర్భంగా ప్రజలు జాగ్రత్త అని హెచ్చరించినప్పటికీ ‘ఏం పర్లేదు’ అని జవాబిచ్చారు. అక్కడి పాములోళ్లతో ముచ్చటించి వారి సమస్యలు తెలుసుకున్నారు. తన తల్లి సోనియాగాంధీ హయాంలో రాయ్‌బరేలీలో జరిగిన అభివృద్ధిని ప్రజలకు వివరిస్తూ, 15 ఏళ్లుగా సోనియాగాంధీ ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశారని చెప్పారు. రాయ్‌బరేలీలో సోనియా బీజేపీ అభ్యర్థి దినేశ్ప్రతాప్సింగ్తో పోటీ పడుతున్నారు. -
రాయ్‌బరేలిలో సోనియా నామినేషన్
లక్నో : యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ లోక్‌సభ ఎన్నికలకు రాయ్‌బరేలి నుంచి గురువారం నామినేషన్ దాఖలు చేశారు. కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ, పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ, రాబర్ట్ వాద్రాలు వెంట రాగా రిటర్నింగ్ అధికారికి ఆమె తన నామినేషన్ పత్రాలు సమర్పించారు. అంతకుముందు సోనియా రాయ్‌బరేలిలో భారీ రోడ్‌షో నిర్వహించారు. ఇక నామినేషన్ దాఖలు చేసే ముందు ప్రత్యేక పూజలు నిర్వహించారు. మరోవైపు కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాందీతో తలపడుతున్న కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ అమేధిలో నామినేషన్ దాఖలు చేశారు. అమేధిలో యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్ సహా సీనియర్ బీజేపీ నేతలతో కలిసి ఆమె రోడ్‌షో నిర్వహించారు. -
సుప్రీంకోర్టుపైనే నిందలు వేస్తున్నారు!
రాయ్‌బరేలీ / ప్రయాగ్‌రాజ్: ఫ్రాన్స్ నుంచి రఫేల్ యుద్ధవిమానాల కొనుగోలు ఒప్పందంపై సుప్రీంకోర్టు నుంచి క్లీన్‌చీట్ లభించిన వేళ ప్రధాని నరేంద్ర మోదీ విపక్ష కాంగ్రెస్‌పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కేంద్రం తప్పుడు వివరాలు సమర్పించినందున రఫేల్ కేసును మళ్లీ విచారించాలని కాంగ్రెస్ నేతలు కోరడాన్ని తప్పుపట్టారు. కాంగ్రెస్ పార్టీ సుప్రీంకోర్టును అబద్ధాలకోరుగా చిత్రీకరించేందుకు యత్నిస్తోందని విమర్శించారు. దేశ భద్రతాబలగాలు పటిష్టం కావడం ఇష్టంలేని శక్తులతో ఆ పార్టీ జతకడుతోందని ఆరోపించారు. ‘కొందరు వ్యక్తులు కేవలం అబద్ధాలనే నమ్ముతారు.. దాన్నే ఇతరులకు వ్యాప్తి చేస్తారు’ అంటూ రామచరితమానస్‌ను ఉటంకించారు. ఉత్తరప్రదేశ్ పర్యటనలో భాగంగా ఆదివారం సోనియాగాంధీ నియోజకవర్గం రాయ్‌బరేలీలో రూ.1,100 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు ప్రధాని శంకుస్థాపన చేశారు. అనంతరం రాయ్‌బరేలీతో పాటు ప్రయాగ్ రాజ్(అలహాబాద్)లో నిర్వహించిన బహిరంగ సభల్లో కాంగ్రెస్ పార్టీపై నిప్పులు చెరిగారు. ఖత్రోచీ, మిషెల్ మామయ్యలు లేరు.. ‘సుప్రీంకోర్టును అబద్ధాల కోరుగా చిత్రీకరించేందుకు కాంగ్రెస్ యత్నిస్తోంది. వీళ్ల దృష్టిలో రక్షణశాఖ, రక్షణమంత్రి, ఐఏఎఫ్ అధికారులు, ఫ్రాన్స్ ప్రభుత్వం.. ఇలా అందరూ అబద్ధాలు చెప్పేవారే. తాజాగా వీళ్లకు సుప్రీంకోర్టు అబద్ధాలు చెబుతున్నట్లు కనిపిస్తోంది. ఓవైపు భారత భద్రతాబలగాలను పటిష్టం చేసేందుకు ప్రభుత్వం శతవిధాలా ప్రయత్నిస్తుంటే, మరోవైపు మాత్రం కొన్ని శక్తులు దేశాన్ని ఎలాగైనా బలహీనపర్చేందుకు కంకణం కట్టుకున్నాయి. కొందరు నేతల వ్యాఖ్యలకు పాకిస్తాన్ నుంచి ప్రశంసలు లభించడం వెనుక అర్థం ఏమిటి?’ అని మోదీ ప్రశ్నించారు. బోఫోర్స్, అగస్టా కుంభకోణాలను ప్రస్తావిస్తూ..‘కాంగ్రెస్ నేతలు అదేపనిగా ఎందుకు అబద్ధాలు చెబుతున్నారో తెలుసుకోవాలనుకుంటున్నా. బీజేపీ ప్రభుత్వ హయాంలో చేసుకున్న ఒప్పందాల్లో ఖత్రోచీ(బోఫోర్స్ మధ్యవర్తి), మిషెల్(అగస్టా మధ్యవర్తి) వంటి మామయ్యలు లేరనా? ఆ మిషెల్ మామయ్యను కూడా భారత్‌కు పట్టుకొచ్చాం’ అని అన్నారు. సుప్రీంకోర్టు జడ్జీలనే బెదిరించారు.. ‘ఈ దేశాన్ని సుదీర్ఘకాలం పాటు పాలించిన ఓ పార్టీ(కాంగ్రెస్) తాము చట్టం, న్యాయానికి అతీతులమనీ, దేశం, ప్రజల కంటే గొప్పవాళ్లమని భావిస్తోంది. తమ ఆదేశాలకు అనుగుణంగా నడుచుకోని ప్రతీ రాజ్యాంగ సంస్థలను, వ్యవస్థలను వాళ్లు నాశనం చేశా రు. ఇందులోభాగంగా భారత న్యాయవ్యవస్థను సైతం బలహీనపర్చేందుకు ప్రయత్నా లు జరిగాయి’ అని మోదీ విమర్శించారు. రైతుల సమస్యలు పట్టించుకోలేదు.. ‘జవాన్లు, రైతుల్లో ఎవ్వరినీ కాంగ్రెస్ పట్టించుకోలేదు. కర్ణాటకలో అధికారంలోకి వచ్చిన వెంటనే రైతు రుణాలను మాఫీ చేస్తామని ప్రకటించింది. ఆరునెలైనా రుణమాఫీ కాలేదు. అంతేకాకుండా రైతులకు అరెస్ట్ వారెంట్లు జారీచేస్తున్నారు’ అని తెలిపారు. -
సోనియా కోటలో కాంగ్రెస్‌పై మోదీ ఫైర్
లక్నో : అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయాల అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ నియోజకవర్గం రాయ్‌బరేలిలో ఆదివారం తొలి ర్యాలీని ఉద్దేశించి ప్రసంగించారు. రాఫేల్ వివాదం, అగస్టా స్కామ్ సహా పలు అంశాలపై కాంగ్రెస్‌ను లక్ష్యంగా చేసుకుని విమర్శల దాడికి దిగారు. కాంగ్రెస్ సైనిక పాటవాన్ని బలహీనపరిచే చర్యలకు పాల్పడుతుందని ఆరోపించారు. రాయ్‌బరేలి ప్రాంతానికి ఆ పార్టీ చేసిందేమీలేదని దుయ్యబట్టారు. సర్జికల్ స్ర్టైక్స్ పై అనుమానాలు వ్యక్తం చేసిన పార్టీ మన సైన్యాన్ని విశ్వసించకుండా ప్రత్యర్థి చెబుతున్న ధరలను నమ్ముతున్నాయని రాఫెల్ ఒప్పందాన్ని ప్రస్తావిస్తూ కాంగ్రెస్ పార్టీపై విరుచుకుపడ్డారు. అగస్టా స్కామ్‌లో నిందితుడు క్రిస్టియన్ మైఖేల్‌ను రక్షించేందుకు కాంగ్రెస్ తమ న్యాయవాదులతో పోరాడుతోందని ఎద్దేవా చేశారు. రాయ్‌బరేలిలో మోడరన్ కోచ్ ఫ్యాక్టరీ నిర్మించే క్రమంలో 5000 మంది ఉద్యోగులను నియమించాలని నిర్ణయించగా కేవలం అందులో సగానికి మాత్రమే కాంగ్రెస్ హయాంలో నియామకాలు జరిగాయన్నారు. 2014లో ఫ్యాక్టరీలో కొత్తగా ఎవరినీ రిక్రూట్ చేసుకోలేదన్నారు. మోదీ తన పర్యటనలో భాగంగా మోడరన్ కోచ్ ఫ్యాక్టరీని సందర్శించారు. ఫ్యాక్టరీలో తయారైన 900వ కోచ్‌కు పచ్చజెండా ఊపి ప్రారంభించారు. -
పట్టాలు తప్పిన ఫరక్కా ఎక్స్‌ప్రెస్
లక్నో: ఉత్తరప్రదేశ్‌లో ఫరక్కా ఎక్స్‌ప్రెస్ ఘోర ప్రమాదానికి గురైంది. ప్రాథమిక సమాచారం ప్రకారం ఈ ప్రమాదంలో 6 బోగీలు పట్టాలు తప్పాయి. ఆరుగురు ప్రయాణికులు చనిపోగా, దాదాపు 35 మందికి పైగా తీవ్రంగా గాయపడినట్టు తెలుస్తోంది. ఈ ఎక్స్‌ప్రెస్ అలహాబాద్‌కు వెడుతుండగా రాయబరేలి, హరచాంద్‌పూర్ రైల్వే స్టేషన్ నుంచి 50 కిలోమీటర్ల దూరంలో బుధవారం ఉదయం ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదానికి కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశముంది. ఈ ప్రమాదంపై స్పందించిన ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, కేంద్ర రైల్వేమంత్రి పియూష్ గోయల్ సహాయక చర్యలను చేపట్టాల్సిందిగా సంబంధిత అధికారులను ఆదేశించారు. వారణాసి, లక్నో నుంచి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ప్రమాదస్థలానికి తరలివెళ్లాయి. రైల్వే బోర్డు ఛైర్మన్ అశ్విన్ లోహానీ సహాయ, రక్షక చర్యల్ని పర్యవేక్షిస్తున్నారు. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రులకు తరలిస్తున్నారు. అత్యవసర సమాచారం నిమిత్తం హెల్ప్‌లైన్ నంబర్లు అధికారులు ప్రకటించారు. ఎమర్జెన్సీ హెల్ప్‌లైన్ నంబర్లు: దీన్ దయాళ్ ఉపాధ్యాయ జంక్షన్-బిఎస్ఎన్ఎల్-05412-254145, రైల్వే -027-73677 పాట్నా స్టేషన్ నం: బిఎస్ఎన్ఎల్-0612-2202290, 0612-2202291, 0612-220229, రైల్వే ఫోన్ నంబర్- 025-8328 ఎక్స్‌గ్రేషియా : ఈ ప్రమాదంలో చనిపోయినవారికి 2లక్షల రూపాయలు, తీవ్రంగా గాయపడినవారికి 50వేల రూపాయల ఎక్స్‌గ్రేషియాను సీఎం ప్రకటించారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
సోనియా కంచుకోటలోకి నెక్స్ట్ వెళ్లేదెవరు?
సాక్షి, న్యూఢిల్లీ : రాజకీయాలకు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ స్వస్తి పలుకుతున్నారని వచ్చిన వార్తలు పెద్ద చర్చనే లేవనెత్తాయి. శనివారం రాహుల్ గాంధీ కాంగ్రెస్ పగ్గాలు చేపట్టనున్న నేపథ్యంలో శుక్రవారం ఉదయం పార్లమెంటు నుంచి బయటకు వస్తున్న సోనియాను అక్కడే ఉన్న మీడియా ప్రతినిధులు కొందరు రాహుల్ బాధ్యతలు తీసుకుంటున్న నేపథ్యంలో మీరు ఏం చేస్తారు అని ప్రశ్నించారు. అందుకు ఆమె ఇక మిగిలింది రాజకీయాల నుంచి తప్పుకోవడమేగా అని ఓ సూచాయగా చెప్పేశారు. దీంతో ఒక్కసారిగా దీనిపై భారీ స్థాయిలో చర్చలు మొదలుపెట్టారు. అయితే, ఆ వెంటనే కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి రణదీప్ సూర్జేవాల్ ట్విటర్లో ఈ చర్చలకు పుల్‌స్టాప్ పెట్టారు. సోనియా రాజకీయాల్లో నుంచి తప్పుకోవడం లేదని కేవలం అధ్యక్ష బాధ్యతల నుంచే వైదొలుగుతున్నారని అన్నారు. ‘సోనియా గాంధీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష బాధ్యతలనుంచి మాత్రమే రిటైర్ అవుతున్నారు. రాజకీయాలనుంచి కాదని’’ ఆయన ట్వీట్ చేశారు. సోనియా గాంధీ మేధస్సు, ఆశీస్సులు పార్టీకి ఎప్పటకీ అవసరమని చెప్పారు. అయితే, సోనియా భవిష్యత్ కార్యాచరణపై ఓ స్పష్టత ఇప్పటికే రాకపోయినా నిజానికి సోనియా రాజకీయాల నుంచి తప్పుకుంటే ఆమె ప్రస్తుతం కొనసాగుతున్న రాయ్‌బరేలీ స్థానం ఎవరి చేతుల్లోకి వెళుతుంది అన్నదే ప్రధాన ప్రశ్నగా చర్చ నడుస్తోంది. మొట్ట మొదటిసారి రాయ్‌బరేలీలో నాటి కాంగ్రెస్ పార్టీ నేత మాజీ ప్రధాని ఇందిరాగాంధీ పోటీ చేసి నాటి భారతీయ లోక్ దల్ పార్టీకి చెందిన రాజ్ నారాయణ్ చేతిలో 1977లో ఓడిపోయారు. అప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ అక్కడి నుంచి లోక్‌సభకు పోటీ చేస్తూనే ఉంది. 1996, 1998లో మాత్రం బీజేపీ రాయ్‌బరేలీలో విజయం సాధించింది. తొలిసారి 1999 కెప్టెన్ సతీష్ శర్మను బరిలోకి దించి విజయాన్ని సొంతం చేసుకున్న కాంగ్రెస్ పార్టీ ఆ తర్వాత ఆ స్థానాన్ని తమకు కంచుకోటగా మార్చుకుంది. 2004లో తొలిసారి సోనియాగాంధీ రాయ్‌బరేలీ బరిలోకి దిగి భారీ విజయం సొంతం చేసుకున్నారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతి లోక్‌సభ ఎన్నికల్లో ఆమెనే పై చేయి సాధించి రాయ్ బరేలీ అంటే కాంగ్రెస్‌కు కంచుకోట అనేట్లుగా మార్చారు. 2014లో కూడా సోనియా విజయం సాధించి ప్రస్తుతం ఎంపీగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇక అమేథి గురించి కూడా ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అక్కడ కూడా జనతా పార్టీకి ఒకసారి, బీజేపీకి ఒకసారి చేజార్చుకున్నప్పటికీ మిగితా అన్ని ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీనే విజయం సొంతం చేసుకుంది. ఈ రెండు నియోజక వర్గాలు సోనియా కుటుంబానివే అనే ముద్ర వేసుకున్నాయి. ఇప్పుడు సోనియా రాజకీయాల నుంచి తప్పుకుంటే రాయ్‌బరేలీలో బరిలోకి దిగేదెవరు అని ప్రశ్న ఉదయిస్తోంది. సోనియా కుటుంబంలోని వారే దిగితే రాహుల్ అమేథి నుంచి ఉన్నారు కాబట్టి ప్రియాంకను బరిలోకి దింపుతారా? రాజకీయాలకు అంటిముట్టనట్లు ఉంటున్న ఆమె సోనియా స్థానాన్ని భర్తీ చేస్తారా? ఒక వేళ ఆమె ప్రియాంక భర్త రాబర్ట్ వాద్రాను దింపుతారా అనుకుంటే ఇప్పటికే పలు ఆరోపణలు మోస్తున్న వాద్రాను ప్రజలు అంగీకరిస్తారా లేదా? ఈ మాత్రం విషయం కూడా కాంగ్రెస్‌కు తెలియకుండా ఉంటుందా? అంటూ ఇతర ప్రశ్నలు తలెత్తుతున్నాయి. లేదంటే సాంప్రదాయాన్ని పక్కకు పెట్టి పార్టీలోని సీనియర్ నేతలు, విశ్వాసం కలిగిన నేతను రాయ్‌బరేలీలో బరిలోకి దింపుతారా అనే మరో ప్రశ్న కూడా వస్తోంది. మొత్తానికి రాయబరేలీలో సోనియా తర్వాత ఎవరు అనే ప్రశ్న మాత్రం పలు విధాలుగా చక్కర్లు కొడుతుందనడంలో సందేహం లేదు. -
గంగపై ఒట్టేసి నిజం చెప్పండి మోదీ
రాయబరేలి: తీవ్రమైన విద్యుత్ కొరతతో ఉత్తరప్రదేశ్ రాష్ట్రం అంధకారంలో ఉంటుందంటూ ప్రధాని నరేంద్రమోదీ చేసిన విమర్శనలను ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ తిప్పికొట్టారు. తమ ప్రభుత్వం 24 గంటలు వారణాసికి విద్యుత్ అందిస్తుందని తెలిపారు. రాయబరేలిలో ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న అఖిలేష్ యాదవ్, ఇది సమాజ్ వాద్ పార్టీ, కచ్చితంగా 24 గంటలు విద్యుత్ సరఫరా చేస్తుంది అంటూ మోదీ విమర్శలను ఖండించారు. ''ప్రధానమంత్రి నరేంద్రమోదీ నిజాలు మాట్లాడాలి. వాస్తవాన్ని అంగీకరించాలి, ఇది ఎస్పీ గవర్నమెంట్, మర్చిపోకుండా మీ నియోజకవర్గానికి 24 గంటలు విద్యుత్ సరఫరా చేస్తున్నాం'' అని అఖిలేష్ యాదవ్ పేర్కొన్నారు. '' మీరు గంగను తల్లిగా ఆరాధిస్తారు. ఎస్పీ ప్రభుత్వం 24 గంటలు వారణాసికి విద్యుత్ సరఫరా చేస్తుందో లేదో మీరు ఎంతో భక్తిగా ఆరాధించే గంగపై ఒట్టువేసి నిజం చెప్పండి'' అని సవాల్ విసిరారు. ఎన్నికల క్యాంపెయిన్ సందర్భంగా ఉత్తరప్రదేశ్ విద్యుత్ కొరతను ఎదుర్కొంటుందని ప్రధాని నరేంద్రమోదీ ఎస్పీ ప్రభుత్వాన్ని విమర్శించిన సంగతి తెలిసిందే. కొన్ని ప్రాంతాలకు విద్యుత్ సరఫరా చేసే విషయంలో అఖిలేష్ ప్రభుత్వం పక్షపాత ధోరణిలో వ్యవహరిస్తుందని మోదీ పేర్కొన్నారు.