
రాయిబరేలి: చికిత్స చేసి ప్రాణాలు కాపాడాల్సిన డాక్టర్ ఏకంగా ముగ్గురి ప్రాణాలు తీశాడు.ఆ తర్వాత ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు.డాక్టర్ చంపింది ఎవరినో కాదు. అతని భార్య, ఇద్దరు పిల్లలనే.ఈ దారుణ సంఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని రాయిబరేలిలోని లాల్‌గంజ్‌లో జరిగింది.
‘డాక్టర్ అరుణ్‌సింగ్ లాల్‌గంజ్‌లోని మోడ్రన్ రైల్ కోచ్ ఫ్యాక్టరీ ఆస్పత్రిలో కంటి డాక్టర్‌గా పనిచేస్తున్నారు. ఆయన కుటుంబం గత ఆదివారం నుంచి ఎవరికీ టచ్‌లో లేనట్లు పోలీసులు చెప్పారు. ‘అరుణ్‌సింగ్ డిప్రెషన్‌తో బాధపడుతున్నారు. అతను ఆత్మహత్య చేసుకున్న చోట డిప్రెషన్ తగ్గించడానికి వాడే చాలా ఇంజెక్షన్‌లు లభించాయి.
డాక్టర్ తొలుత తన పిల్లలకు నొప్పి తెలియకుండా మత్తు మందు ఇచ్చారు. తర్వాత వారి తలపై బలంగా బాది చంపారు. అనంతరం ఆయన ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. పిల్లల్లో కూతురు వయసు 14 సంవత్సరాలు కాగా కొడుకు వయసు 5 ఏళ్లు. వారందరి మృతదేహాలు పోస్టుమార్టం కోసం పంపించాం’అని రాయిబరేలి ఎస్పీ అలోక్ ప్రియదర్శి చెప్పారు.
ఇదీచదవండి..సచిన్ పైలట్‌పై గెహ్లాట్ ‘స్పై’..? బీజేపీ నేత కీలక వ్యాఖ్యలు