killed wife
-
భార్య, పిల్లలను చంపి డాక్టర్ సూసైడ్..కారణమిదే!
రాయిబరేలి: చికిత్స చేసి ప్రాణాలు కాపాడాల్సిన డాక్టర్ ఏకంగా ముగ్గురి ప్రాణాలు తీశాడు.ఆ తర్వాత ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు.డాక్టర్ చంపింది ఎవరినో కాదు. అతని భార్య, ఇద్దరు పిల్లలనే.ఈ దారుణ సంఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని రాయిబరేలిలోని లాల్గంజ్లో జరిగింది. ‘డాక్టర్ అరుణ్‌సింగ్ లాల్గంజ్లోని మోడ్రన్ రైల్ కోచ్ ఫ్యాక్టరీ ఆస్పత్రిలో కంటి డాక్టర్‌గా పనిచేస్తున్నారు. ఆయన కుటుంబం గత ఆదివారం నుంచి ఎవరికీ టచ్‌లో లేనట్లు పోలీసులు చెప్పారు. ‘అరుణ్‌సింగ్ డిప్రెషన్‌తో బాధపడుతున్నారు. అతను ఆత్మహత్య చేసుకున్న చోట డిప్రెషన్ తగ్గించడానికి వాడే చాలా ఇంజెక్షన్లు లభించాయి. డాక్టర్ తొలుత తన పిల్లలకు నొప్పి తెలియకుండా మత్తు మందు ఇచ్చారు. తర్వాత వారి తలపై బలంగా బాది చంపారు. అనంతరం ఆయన ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. పిల్లల్లో కూతురు వయసు 14 సంవత్సరాలు కాగా కొడుకు వయసు 5 ఏళ్లు. వారందరి మృతదేహాలు పోస్టుమార్టం కోసం పంపించాం’అని రాయిబరేలి ఎస్పీ అలోక్ ప్రియదర్శి చెప్పారు. ఇదీచదవండి..సచిన్ పైలట్‌పై గెహ్లాట్ ‘స్పై’..? బీజేపీ నేత కీలక వ్యాఖ్యలు -
భార్యను హతమార్చి.. వాటర్ ట్యాంకులో దాచి
సాక్షి, దొడ్డబళ్లాపురం: భార్యను హతమార్చి శవాన్ని ఖాళీ వాటర్ ట్యాంకులో దాచిన ఘటన హుళియాళలో చోటుచేసుకుంది. శాంతకుమారి (38) భర్త చేతిలో హతమైన మహిళ. తెరెగాంవ గ్రామానికి చెందిన తుకారాం మడివాళ నిందితుడు. తుకారాం పక్కింటి మహిళతో మాట్లాడిన విషయానికి సంబంధించి భార్యభర్తల మధ్య ఘర్షణ జరిగింది. తీవ్ర ఆగ్రహంతో తుకారాం భార్య గొంతు నులిమి హత్య చేసాడు. శవాన్ని వాటర్ ట్యాంకులో దాచాడు. అనంతరం ఖానాపురకు చెందిన రిజ్వాన్‌కుంబారి అనే వ్యక్తికి చెందిన టాటాఏస్ వాహనాన్ని అద్దెకు తీసుకుని అటవీ ప్రాంతంలో మృతదేహాన్ని పారవేయాలని ప్రయత్నిస్తుండగా హుళియాళ, రామనగర పోలీసులు జాయింట్ ఆపరేషన్ చేసి నిందితుడిని అరెస్టు చేసారు. (చదవండి: భార్యపై చేయి చేసుకున్నానని.. ఆవేదనతో భర్త..) -
పాము కాటుతో మహిళ హత్య.. ట్విస్ట్‌లతో పోలీసుల మైండ్ బ్లాక్!
కొచ్చి: ఆస్తి కోసం భార్యను కడతేర్చిన ఓ భర్త కటకటాల పాలయ్యాడు. ఈ ఘటన కేరళలో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. సూరజ్ తన భార్య ఉతరా ఆస్తి కోసం ఆమెను హత్య చేయాలనుకున్నాడు. ఈ క్రమంలో ఎవరికీ తనపై అనుమానం రాకుండా పక్కా ప్లాన్ వేశాడు. అందులో భాగంగానే హత్య చేసినా సహజమైన మరణంగా ఉండేలా నాగుపామును ఎంచుకున్నాడు. మొదటి ప్రయత్నంలో విఫలం కావడంతో రెండో సారి మాత్రం భార్యని పథకం ప్రకారం హత మార్చాడు. కాగా ఉతరా గతేడాది మే 7న ఉత్రా ఆంచల్‌లోని తన ఇంట్లో పాముకాటుతో మరణించింది. ఉతరా మరణించిన కొన్ని రోజుల తర్వాత ఆమె భర్త సూరజ్ తన ఆస్తి కోసం ప్రయత్నించాడు. దీంతో మహిళ తల్లిదండ్రులు, ఉతారా మరణంపై తమకు అనుమానం ఉందని పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణ చేపట్టిన పోలీసులకి అసలు విషయం తెలుసుకుని కంగుతిన్నారు. సూరజ్ తన భార్య అడ్డు తొలగించుకుని ఆమె డబ్బు, బంగారం తీసుకొని మరొకరిని వివాహం చేసుకోవాలనే ప్లాన్‌తోనే ఆమెను పాముకాటుతో హత్య చేసినట్లు తేలిందని పోలీసులు తెలపారు. ఈ కేసు కొంచెం క్లిష్టంగా ఉండడంతో పక్కాగా అన్ని సాక్ష్యాధారాలతో కోర్టుకు సమర్పించారు. వీటిని పరిశీలించిన కోర్టు నిందితుడిని దోషిగా తేల్చింది. సందర్భానుసార సాక్ష్యాల ఆధారంగా నిందితుడిని దోషిగా నిర్ధారించిన అరుదైన కేసులలో ఇది ఒకటని ఆ రాష్ట్ర డీజీపీ అన్నారు. ఒక హత్య కేసును శాస్త్రీయంగా, వృత్తిపరంగానే కాకుండా శాస్త్రీయంగా కూడా ఎలా పరిశోధించాలో అనేదానికి ఇది ఒక ఉదాహరణగా ఆయన పేర్కొన్నారు. చదవండి: వివాహిత స్నానం చేస్తుండగా వీడియో తీసి.. ఆపై లైంగికదాడి -
భార్య మీద కోపంతో మానవ బాంబుగా మారి కౌగిలించుకున్నాడు..
ఐజ్వాల్: సాధారణంగా భార్య మీద కోపం వస్తే విడాకులు ఇవ్వడం చూశాం గానీ ఓ వ్యక్తి ఏకంగా మానవ బాంబుగా మారి తన భార్యని హతమార్చాడు. ఈ ఘటనలో మిజోరాంలోని లుంగ్లేయి జిల్లాలో చోటుచేసుకుంది. వివరాలు ప్రకారం.. లుంగ్లేయి జిల్లాకు చెందిన రోహ్ మింగ్‌లైనా(62), ట్లాంగ్థియాన్‌ఘ్లిమి(61) దంపతులు. ట్లాంగ్థియాన్‌ఘ్లిమి ఆ ప్రాంతలోనే కూరగాయలు అమ్ముకుంటూ జీవనం సాగిస్తూ ఉండేది. ఈ జంట ఒక సంవత్సరం క్రితం మనస్పర్థలు రావడంతో అప్పటి నుంచి విడిగా ఉంటున్నారని సమాచారం. అయితే మంగళవారం మధ్యాహ్నం భార్య వద్దకు వచ్చిన అతను ప్రేమ వలకబోస్తూ మాట్లాడాడు. తను జ్వరంతో బాధపడుతున్నట్లు నటిస్తూ, మైకం వచ్చినట్లు అకస్మాత్తుగా తన భార్యను కౌగిలించుకున్నాడు, ఆ తర్వాత పెద్ద పేలుడు సంభవించింది. దీంతో వారిద్దరిని వెంటనే లుంగ్లీ జిల్లా ఆసుపత్రికి తరలించగా, అప్పటికే చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు. అయితే, పేలుడులో మృతురాలి కుమార్తె కొంచెం దూరంగా ఉండడంతో ఆమె గాయపడలేదు. ఈ ఘటనపై లంగ్లీ జిల్లా పోలీసు ఉన్నతాధికారి మాట్లాడుతూ.. పేలుడులో జెలటిన్ ఉపయోగించినట్లు అనుమానిస్తున్నట్లు తెలిపారు. చదవండి: ఐఐటీ విద్యార్థి టెక్నాలజీ ఉపయోగించి.. 50 మంది విద్యార్థులు, టీచర్లను.. -
హైదరాబాదీ అల్లుడి చేతిలో తల్లీ కూతుళ్ల హతం
సాక్షి, రాయచూరు : కర్ణాటకలోని రాయచూరులో దారుణం చోటు చేసుకుంది. అల్లుడి చేతిలో తల్లీ కూతుళ్లు హత్యకు గురయ్యారు. మంగళవారం అర్ధరాత్రి తాలూకాలోని యరమరాస్‌లో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. వివరాలు.. యరమరాస్ ఇంజినీరింగ్ కళాశాల వద్ద నివాసం ఉంటున్న పారిశుధ్య కార్మికురాలు సంతోష్ (45)కి వైష్ణవి(25), ఆరతి(16) కూతుళ్లు. ఆరు నెలల క్రితం హైదరాబాద్‌కు చెందిన సాయి అనే యువకుడితో పెద్దకూతురు వైష్ణవికి వివాహం జరిపించారు. సాయి హైదరాబాద్‌లో వడ్డీ వ్యాపారి. పెళ్లయినప్పటి నుంచి భార్యను చిత్రహింసలకు గురి చేసేవాడు. దీంతో ఇటీవల వైష్ణవి పుట్టింటికి వచ్చింది. మంగళవారం రాత్రి సాయి అత్తవారింటికి వచ్చాడు. తనతో హైదరాబాద్‌కు రావాలని భార్యను ఒత్తిడి చేయడంతో ఆమె ససేమిరా అంది. చదవండి: అంతర్రాష్ట్ర క్రికెట్ బెట్టింగ్ రాకెట్ బ్లాస్ట్: రూ.2.21 కోట్ల విలువైన సొత్తు స్వాధీనం ఈ క్రమంలో ఉన్మాదిగా మారిన సాయి భార్యను, అడ్డు వచ్చిన అత్త సంతోషిని, మరదలు ఆరతిని కత్తితో పొడిచి పరారయ్యాడు. తీవ్ర గాయాలతో బాధితులు కొద్దిసేపటికే ప్రాణాలు విడిచారు. అర్ధరాత్రి సమయం కావడంతో అందరూ నిద్రలో ఉన్నందున ఘటన గురించి ఎవరికీ తెలియలేదు. బుధవారం ఉదయం సంతోషి బంధువులు పనిమీద ఇంటికి రాగా రక్తపు మడుగులో ముగ్గురి మృతదేహాలు కనిపించాయి. అక్కడికి చేరుకుని పోలీసులు విచారణ చేపట్టారు. ఎస్పీ శ్రీహరి బాబు ఘటన స్థలాన్ని పరిశీలించారు. రాయచూరు రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి హంతకుడి కోసం గాలింపు చేపట్టారు. అతడి కోసం హైదరాబాద్‌కు పోలీసు బృందాలు వచ్చాయి. చదవండి: మనసిచ్చిన మేనబావ.. మనువాడుతానని మరదలుకు చెప్పి -
భార్య సోదరితో అక్రమ సంబంధం.. అందుకే ఆమెను..
లక్నో: ఉత్తరప్రదేశ్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. గర్భవతియైన మహిళను భర్త దుండగులతో చంపించిన ఘటన ఘజియాబాద్‌లో చోటుచేసుకుంది. ఈ క్రమంలో మృతురాలి భర్తను పోలీసులు బుధవారం అరెస్టు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. పోలీసులు వివరాల ప్రకారం... నిందితుడికి తన భార్య సోదరితో కొంత కాలంగా వివాహేతర సంబంధం ఉందని, దీంతో అడ్డుగా ఉన్న తన భార్యను అడ్డు తొలగించుకోవడానికి నిందితుడు పథకం రచించినట్లు పోలీసులు తెలిపారు. కాగా ఈ ఘటన జనవరి 12న జరిగినట్లు పోలీసులు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో నిందితుడిని విచారించగా.. ‘నా భార్య సొదరితో నాకు వివాహేతర సంబంధం ఉంది. అందుకే నా భార్యను చంపించాలనుకున్నాను. ఇందుకోసం తనకు విషం ఇచ్చి హత్య చేయమని దుండగులకు సుపారి కూడా ఇచ్చాను’ అని చెప్పాడు. కాగా ఆ దుండగులు తన భార్యకు విషం ఇవ్వడంలో రెండుసార్లు విఫలమయ్యారని నిందితుడు పోలీసులకు చెప్పాడు. ఆ తరువాత దొంగతనం నెపంతో తమ ఇంటికి వెళ్లి.. భార్య గొంతు కోసి చంపారని నిందితుడు చెప్పాడు. అదేవిధంగా తన పిల్లలను చూసుకోవడానికి తన భార్య సొదరిని తనతోనే ఉంచాలని నిందితుడు పోలీసులను కోరాడు. కేసు విచారణలో భాగంగా నిందితుడి ఇంటి సీసీ కెమెరాలను పరిశీలించగా.. తన భార్యను చంపడానికి నిందితుడు ముగ్గురు వ్యక్తులను నియమించినట్లు తేలిందని పోలీసులు వెల్లడించారు. -
భార్యపై పెట్రోలు పోసి నిప్పంటించిన భర్త
సాక్షి, కోవెలకుంట్ల(కర్నూలు): పదిహేనేళ్ల క్రితం తనతో ఏడడుగులు నడిచి అన్నింటిలోనూ తోడుగా నిలిచిన భార్యపై అతను అనుమానం పెంచుకున్నాడు. ఎంతలా అంటే చివరికి ఆమెను పెట్రోలు పోసి హత్య చేసేంతలా. ఆదివారం కోవెలకుంట్ల పోలీస్ సర్కిల్ కార్యాలయంలో ఆళ్లగడ్డ డీఎస్పీ పోతురాజు హత్యకేసు వివరాలను వెల్లడించారు. దొర్నిపాడు మండలం చాకరాజువేముల గ్రామానికి చెందిన కొండన్న కుమారుడు నరసింహులు అనే వ్యక్తికి అదే మండలం క్రిష్టిపాడు గ్రామానికి చెందిన పరిమళతో 15ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వీరి దాంపత్య జీవితానికి గుర్తుగా కుమారుడు, కుమార్తె జన్మించారు. మూడేళ్ల క్రితం కుమార్తె క్యాన్సర్‌తో బాధపడుతూ మృత్యువాత పడింది. ఇదిలా ఉండగా భర్త గత కొన్ని రోజుల నుంచి భార్యపై అనుమానం పెంచుకోవడంతో అప్పటి నుంచి వారి మధ్య మనస్పర్థలు చోటు చేసుకున్నాయి. ఈ క్రమంలో గత నెల 23న ఇద్దరి మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ క్రమంలో నరసింహులు తండ్రి కొండన్న కోడలిని చంపేస్తే పీడ విరగడవుతుందని కుమారుడికి చెప్పడంతో పవర్ స్ప్రెయర్‌ను స్టార్ట్ చేసేందుకు తెచ్చుకున్న పెట్రోల్‌ను భార్యపై చల్లి నిప్పంటించాడు. మంటల్లో కాలిపోతున్న పరిమళను గమనించిన చుట్టుపక్కల వారు మంటలు ఆర్పి చికిత్స నిమిత్తం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చావు బతుకుల్లో ఉన్న పరిమళ వాగ్మూలం మేరకు భర్త, మామపై దొర్నిపాడు పోలీస్‌స్టేషన్ హత్యయత్నం కేసు నమోదైంది. ఇరవై నాలుగు రోజులపాటు మృత్యువుతో పోరాడి కోలుకోలేక శనివారం మృతి చెందింది. దీంతో హత్యాయత్నం కేసును హత్య కేసుగా నమోదు చేసిన పోలీసులు గ్రామ శివారులో హతురాలి భర్త, మామలను అరెస్టు చేసి కోవెలకుంట్ల కోర్టులో హాజరు పరుచగా మేజిస్ట్రేట్ రిమాండ్‌కు ఆదేశించారని డీఎస్పీ వివరించారు. కార్యక్రమంలో కోవెలకుంట్ల సీఐ సుబ్బరాయుడు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. -
వివాహిత దారుణహత్య
సాక్షి, అనంతపురం(శెట్టూరు) : యాటకల్లులో దారుణం జరిగింది. భర్త చేతిలో భార్య హత్యకు గురైంది. అనుమానం పెనుభూతం కావడంతో భర్త ఈ దారుణానికి ఒడిగట్టాడు. పోలీసులు, ఫిర్యాదుదారులు తెలిపిన వివరాల మేరకు... యాటకల్లుకు చెందిన చంద్ర, మల్లమ్మ (37) 16 ఏళ్ల క్రితం ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు కుమారులు సంతానం. పెద్ద కుమారుడు కళ్యాణదుర్గం ప్రభుత్వ కళాశాలలో ఇంటర్ చదువుతున్నాడు. చిన్న కుమారుడు సూరి స్థానిక జెడ్పీ హైస్కూల్లో 8వ తరగతి చదువుతున్నాడు. కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న దంపతుల మధ్య కొంత కాలంగా విభేదాలు పొడసూపాయి. అనుమానంతో అంతమొందించాడు! భార్య ప్రవర్తనపై అనుమానం పెంచుకున్న భర్త తరచూ ఆమెను వేధించేవాడు. అనుమానం కారణంగా గ్రామంలో ఉన్న తల్లిదండ్రుల ఇంటి వద్దకు కూడా భార్యను పంపేవాడు కాదు. ఆదివారం ఉదయం బట్టలు ఉతకడానికి మల్లమ్మ సిద్ధమవగా వెనుకనుంచి వచ్చిన భర్త గొడ్డలితో దాడి చేశాడు. తలకు తీవ్రగాయమై మల్లమ్మ అక్కడికక్కడే కుప్పకూలిపోయింది. బంధువులు, చుట్టుపక్కల వారు అక్కడికి వచ్చే లోపే ఆమె ప్రాణాలు విడిచింది. అనుమానంతోనే తన కుమార్తెను చంపేశాడని మల్లమ్మ తల్లిదండ్రులు రామన్న, గంగమ్మలు ఆరోపించారు. సంఘటన స్థలాన్ని కళ్యాణదుర్గం రూరల్ సీఐ శివశంకర్ నాయక్, ఎస్ఐ శివలు పరిశీలించారు. హతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. హత్యకు గురైన మల్లమ్మ (ఇన్సెట్) మల్లమ్మ (ఫైల్) -
హత్య చేసి.. గుట్టుచప్పుడు కాకుండా అత్తారింటికి
సాక్షి, నాయుడుపేట టౌన్(నెల్లూరు): అదనపు కట్నం కోసం కట్టుకున్నోడే కాలయముడయ్యాడు. భార్యను చిత్రహింసలతో హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించిన వైనంపై హతురాలి కుటుంబ సభ్యులు పోలీసలుకు ఫిర్యాదు చేశారు. ఈ దారుణ ఘటన పట్టణంలోని పిచ్చిరెడ్డితోపు వీధిలో ఆదివారం మధ్యాహ్నం జరిగింది. అయితే మహిళ మృతదేహాన్ని గుట్టు చప్పుడు కాకుండా తమిళనాడులోని భర్త స్వగ్రామానికి తరలించారు. మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో మహిళ మృతదేహాన్ని తిరిగి నాయుడుపేట ప్రభుత్వ వైద్యశాలకు తరలించి, పోలీసులు హత్య కేసుగా నమోదు చేశారు. మృతురాలి తల్లిదండ్రులు దువ్వూరు రఘరామిరెడ్డి, మహేశ్వరి కథనం మేరకు.. చిత్తూరు జిల్లా కార్వేటినగరం మండలం అన్నూరు గ్రామానికి చెందిన రఘరామిరెడ్డి కుమార్తె గోమతి (27)ని నాలుగేళ్ల క్రితం తమిళనాడు రాష్ట్రం తిరువళ్లూరు జిల్లా, పొన్నేరి తాలుకా అరవవాకం గ్రామానికి చెందిన సన్నారెడ్డి ధీరజ్రెడ్డితో వివాహమైంది. పెళ్లి సమయంలో కట్న కానుల కింద రూ.8 లక్షలు నగదు, 50 సవర్లకు పైగా బంగారు నగలు ఇచ్చారు. వీరికి ఏడాది వయస్సు కలిగిన కుమారుడు ఉన్నాడు. ధీరజ్ మేనకూరులోని ఓ పరిశ్రమలో పనిచేస్తూ నాయుడుపేటలోని పిచ్చిరెడ్డితోపు వీధిలో నివాసం ఉంటున్నారు. అయితే వివాహం జరిగిన కొద్ది నెలలకే భర్త పుట్టింటి నుంచి మరికొంత నగదు తీసుకుని రావాలని గోమతితో తరచూ గొడవ పడేవాడు. ఈ విషయమై పలుమార్లు గోమతి తల్లిదండ్రులకు చెప్పుకుని కుమిలిపోయింది. అయితే ఆమెకు నచ్చజెప్పి సర్దుకుని కాపురం చేసుకోవాలని తల్లిదండ్రులు సముదాయించేవారు. ఈ క్రమంలో ఆదివారం భార్యాభర్తల మధ్య చిన్నపాటి విషయమై గొడవ జరిగి తార స్థాయికి చేరుకుంది. కొద్ది సేపటి తర్వాత ఇద్దరి మధ్య గొడవ జరిగి కోపంతో గోమతి ఇంట్లో ఉన్న ఓ రూములోకి వెళ్లి తలుపు వేసుకుని ఫ్యాన్‌కు చీరతో ఆత్యహత్య చేసుకున్నట్లుగా చిత్రీకరించి ఆమెను కిందకు దించి స్థానికులు సహాయంతో పట్టణంలోని ప్రైవేట్ వైద్యశాలకు తరలించారు. అప్పటికే మృతి చెందినట్లుగా అందరిని నమ్మించాడు. తామంతా నాయుడుపేటకు వచ్చే సరికి గోమతి మృతదేహాన్ని గుట్టు చప్పుడు కాకుండా తమిళనాడులోని ధీరజ్ స్వగ్రామానికి తరలించాడు. తల్లిదండ్రులు అక్కడికి వెళ్లి పరిశీలించగా గోమతి శరీరంపై గాయాలు ఉండడం, ఆమె దుస్తులు చిరిగి ఉండడంతో అనుమానం వచ్చి నాయుడుపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆదివారం అర్ధరాత్రి సమయంలో గోమతి మృతదేహాన్ని నాయుడుపేట ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. మృతురాలి తండ్రి రఘరామిరెడ్డి తన కుమార్తెను అల్లుడే కిరాతకంగా హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నాడని సోమవారం స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. గోమతి మృతదేహాన్ని తహసీల్దార్ శ్రీనివాసులు ఆధ్వర్యంలో పంచనామా జరిపి వైద్యులతో పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. సోమవారం సాయంత్రం గోమతి మృతదేహాన్ని తమిళనాడులోని ఆమె అత్తారింటికి తరలించించారు. భర్త, కుమారుడితో ఉన్న మృతురాలు గోమతి (ఫైల్) తల్లడిల్లిన కుటుంబ సభ్యులు ఎంతో అల్లారు ముద్దుగా చూసుకుని బీటెక్ వరకు చదివించిన తమ కుమార్తెను అల్లుడే కడతేర్చాడంటూ మృతురాలి తల్లి మహేశ్వరితో పాటు కుటుంబ సభ్యులు, బంధువులు తల్లడిల్లిపోయారు. ఆదివారం ఉదయం కూడా గోమతి తల్లిదండ్రులతో ఫోన్లో మాట్లాడిందని మధ్యాహ్నం సమయంలోనే తన కుమార్తెను పథకం ప్రకారం హత్య చేశాడంటూ కన్నీరు మున్నీరయ్యారు. పలుమార్లు మా ముందే తన పగæ తీర్చుకుంటానని కుమార్తెతో వివాదాలకు దిగేవాడని తమకు కడుపు కోత మిగిల్చాడాని బావురుమన్నారు. గోమతి మెడకు వైరు బిగించి ఉన్నట్లు వాతలు ఉన్నాయని, భర్త కసాయిగా మారి ఈ దారుణానికి ఒడిగట్టాడని ఆరోపించారు. హత్యగా కేసు నమోదు : గూడూరు డీఎస్పీ శ్రీహర్ష పట్టణంలోని పిచ్చిరెడ్డితోపు వీధిలో నివాసముంటున్న గోమతి హత్యకు గురైనట్లుగా మృతురాలి తండ్రి దువ్వూరు రఘరామిరెడ్డి ఇచ్చిన ఫిర్యాదుపై సోమవారం కేసు నమోదు చేశామని గూడూరు డీఎస్పీ భూమన భవాని శ్రీహర్ష తెలిపారు. స్థానిక పోలీస్‌స్టేషన్‌లో విలేకరులతో బాధితుల ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేస్తున్నారు. ముందుగా డీఎస్పీ స్థానిక సీఐ వేణుగోపాల్‌రెడ్డి, ఎస్సై డీ వెంటేశ్వరరావుతో కలిసి పిచ్చిరెడ్డితోపులో ఘటన జరిగిన ఇంటిని పరిశీలించారు. ఓ గదిలో ఫ్యాన్ రెక్కకు ఉరేసుకున్నట్లు తగిలించి ఉన్న చీరతో పాటు అక్కడి పరిసరాలను డీఎస్పీ పరిశీలించారు. ఇంటిలో పలుచోట్ల రక్తపు మరకలు, ప్లాసిక్ట్ తాడు వంటివి అక్కడే పడేసి ఉండడాన్ని గుర్తించారు. మృతురాలి శరీరంపై ఎక్కడైనా గాయాలను పోలీసులు క్షుణంగా పరిశీలించారు. పోస్టుమార్టం నివేదికతో పాటు పోలీసుల విచారణలో అసలు విషయాలు నిగ్గు తేలుస్తామని పోలీసులు స్పష్టం చేశారు. -
భార్య,ఇద్దరు పిల్లలను చంపిన భర్త
-
కట్టుకున్నోడే కడతేర్చాడు
చిన్నకోడూరు(సిద్దిపేట): జీవితాంతం కలిసి ఉంటాడనుకున్న భర్తే కాలయముడయ్యాడు. కట్నం కోసం కట్టుకున్న భార్య గొంతు నులిమి హత్య చేశాడు. ఈ సంఘటన సిద్దిపేట జిల్లాలోని చిన్నకోడూరు మండల పరిధిలోని విఠలాపూర్‌లో బుధవారం కలకలం రేపింది. పోలీసులు, గ్రామస్తుల తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన గంగసాని శ్రీనివాస్‌రెడ్డికి మంగమ్మతో 20 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమారులు. కాగా శ్రీనివాస్‌రెడ్డి ఉపాధి కోసం దుబాయ్ వెళ్లాడు. ఈ నేపథ్యంలో మంగమ్మను కట్నం కోసం అత్తింటి వారు వేధింపులకు గురి చేయడంతో మనస్థాపం చెందిన మంగమ్మ 10 ఏళ్ల క్రితం పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. ఆ తర్వాత శ్రీనివాస్‌రెడ్డి కర్ణాటక రాష్ట్రంలోని రాయచూర్‌లో కూలీ పనులు చేసుకుంటూ అక్కడే ఉన్నాడు. ఈ క్రమంలో రాయచూర్‌కు చెందిన ఇందిర అనే మహిళతో పరిచయం ఏర్పడి పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్నాడు. తిరిగి శ్రీనివాస్ రెడ్డి స్వగ్రామమైన విఠలాపూర్‌కు వచ్చి ఇక్కడ కూలీ పనులు చేసుకుంటూ నివసిస్తున్నాడు. వీరికి లోకేష్(06) కుమారుడు ఉన్నాడు. కొద్ది నెలలుగా మరిది, అత్త, ఆడపడుచులు ఇందిరను కట్నం కోసం వేధింపులకు గురి చేశారు. ఈ విషయాన్ని ఇందిర తన సోదరుడికి సమాచారం అందించింది. అయినప్పటికీ వారి వేధింపులు అలాగే కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో మంగళవారం రాత్రి భార్య, భర్తల మధ్య గొడవ జరిగింది. బుధవారం తెల్లవారు జామున శ్రీనివాస్‌రెడ్డి భార్య ఇందిరను గొంతు నులిమి హత్య చేశాడు. కాగా తానే ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డట్లు చిత్రీకరించాడు. విషయం తెలుసుకున్న సిద్దిపేట అడిషనల్ డీసీపీ నర్సింహారెడ్డి, రూరల్ సీఐ వెంకట్రామయ్య, ఎస్ఐ అశోక్ సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సిద్దిపేట ఆస్పత్రికి తరలించే క్రమంలో మృతురాలి బంధువులు శ్రీనివాస్‌రెడ్డి, అత్త భూదవ్వ, ఆడపడుచు రేణుక, మరది కనకారెడ్డిలే హత్య చేశారని ఆరోపించారు. వారిని శిక్షించే వరకు ఇక్కడ నుంచి మృతదేహాన్ని తరలించొద్దని బీష్మించారు. దీంతో మృతురాలి భర్త శ్రీనివాస్‌రెడ్డి, అత్త భూదవ్వలను అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. మృతురాలి సోదరుడు గట్టు వీరేశ్‌రెడ్డి ఫిర్యాదు మేరకు భర్త, అత్తింటి వారిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ అశోక్ తెలిపారు. ముందస్తుగా గ్రామంలో ఎలాంటి గొడవలు జరగకుండా పోలీసు బలగాలను మోహరించారు. -
అనుమానంతో హతమార్చాడు
సాక్షి, జ్యోతినగర్(రామగుండం): మూడు ముళ్లు..ఏడడుగులు వేసి కడదాకా తోడుంటానని అగ్నిసాక్షిగా పెళ్లాడిన ఓ భర్త..అనుమానంతో కట్టుకున్న భార్యను ఇనుపరాడ్‌తో కొట్టి దారుణంగా హత్య చేశాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..ఎన్టీపీసీ పోలీస్‌స్టేషన్ పరిధిలోని న్యూ పీకే రామయ్యకాలనీలో లావుడ్య రాములు ఆటో నడుపుకుంటూ భార్య రమాదేవి(30), కూతురు అనూషతో కలిసి జీవిస్తున్నాడు. కొద్దిరోజులుగా ఆమెను అనుమానిస్తూ శారీరకంగా హింసకు గురి చేస్తున్నట్లు బంధువులు ఆరోపిస్తున్నారు. ఈక్రమంలో ఆదివారం రాత్రి మద్యం తాగి ఇంటికి వచ్చిన రాములు భార్యతో గొడవపడి ఇంట్లో ఉన్న ఇనుపరాడ్‌తో తలపై కొట్టి గాయపరిచాడు. ఇంట్లో నుంచి కేకలు వినపడటంతో పక్కనున్నవారు వచ్చి చూడగా గాయపడి ఉంది. దీంతో రాములు అక్క గాయపడిన రమాదేవి తలకు గుడ్డ ముక్కను అదిమిపట్టి గోదావరిఖనిలోని ఓ ప్రయివేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు. మెరుగైన చికిత్స కోసం కరీంనగర్‌కు తీసుకెళ్తుండగా మార్గమధ్యలో మృతిచెందింది. మృతురాలి సోదరుడు దేదావత్ లక్ష్మణ్ ఫిర్యాదు మేరకు ఎన్టీపీసీ ఎస్సై శంకరయ్య కేసు నమోదు చేశారు. సంఘటనా స్థలాన్ని రామగుండం సీఐ స్వామి, ఎస్సై సందర్శించి విచారణ చేపట్టారు. -
భార్య, కూతురుకు నిప్పంటించిన భర్త
చేవెళ్ల: భార్యాభర్తలు గొడవపడ్డారు.. ఆవేశానికి గురైన భర్త భార్య, ఏడాదిన్నర కూతురుపై కిరోసిన్ పోసి నిప్పంటించాడు. తీవ్రంగా గాయపడిన తల్లీకూతురును స్థానికులు ఉస్మానియా ఆస్పత్రికి తరలించగా ఆదివారం మృతిచెందారు. సోమవారం భర్త రాజును పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. సీఐ గురవయ్యగౌడ్ కేసు వివరాలు వెల్లడించారు. చేవెళ్ల మండల కేంంద్రంలోని అంగడిబజార్ కాలనీకి చెందిన ఎరుకల రాజు బాల్యం నుంచే చోరీలకు అలవాటుపడ్డాడు. ఈక్రమంలో పలుమార్లు జైలుకు సైతం వెళ్లొచ్చాడు. పోలీసులు కౌన్సెలింగ్ ఇవ్వడంతో అతడు మారాడు. అనంతరం అదే కాలనీలో ఉండే దాసరి కాశమ్మ కుమార్తె రోజా(25)ను ప్రేమించి 5 ఏళ్ల క్రిత్రం వివాహం చేసుకున్నాడు. దంపతులకు పిల్లలు శ్రావణ్(4), ఏడాదిన్నర వయస్సు ఉన్న కుమార్తె కీర్తన ఉన్నారు. పెళ్లి తర్వాత రాజు కూలీ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. అయితే, కుటుంబం విషయంలో తరచూ దంపతులు గొడవపడేవారు. ఈక్రమంలో ఈనెల 14న రాత్రి ఇంట్లో రాజు, రోజా ఘర్షణపడ్డారు. ఎప్పుడూ గొడవపడుతున్నావని, తాను కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకొని చనిపోతానని చెప్పింది. అప్పటికే ఆవేశంలో ఉన్న భర్త రాజు ‘నీవు చనిపోతేనే నాకు మనఃశాంతి దొరుకుతుంది’ అని కిరోసిన్ తీసుకొని భార్య రోజా, పక్కనే ఉన్న కూతురు కీర్తనపై పోసి నిప్పంటించాడు. మంటల బాధ తాళలేక తల్లీకూతురు కేకలు వేయడంతో ఇరుగుపొరుగు వచ్చి మంటలు ఆర్పి వెంటనే ఆస్పత్రికి తరలించారు. అయితే, అక్కడే ఉన్న రాజు తన భార్య రోజా వంట చేస్తుండగా ప్రమాదవశాత్తు మంటలు అంటుకున్నాయని నమ్మించే ప్రయత్నం చేశాడు. అనంతరం తల్లీకూతురి పరిస్థితి విషమంగా మారడంతో మెరుగైన చికిత్స కోసం వారిని నగరంలోని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో రోజా, ఆమె కూతురు కీర్తన ఆదివారం మృతిచెందారు. అనంతరం పోలీసులు రాజును అదుపులోకి తీసుకొని విచారణ చేయగా.. ఆవేశంలో తన భార్యాకూతురిపై కిరోసిన్ పోసి నిప్పంటించినట్లు అంగీకరించాడు. ఈమేరకు అతడి సీఐ గురువయ్యగౌడ్ ఆధ్వర్యంలో సోమవారం రిమాండుకు తరలించారు. తల్లి మృతిచెందడం, తండ్రి జైలుకు వెళ్లడంతో నాలుగేళ్ల బాలుడు శ్రావణ్ అనాథగా మారాడు. -
బార్యని కాత్తితో నరికిన భర్త
-
పాక్ కాల్పుల్లో ఆర్మీ అధికారుల మృత్యువాత
శ్రీనగర్: కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడుస్తూ సరిహద్దుల్లో పాక్ కవ్వింపు చర్యలకు పాల్పడింది. సరిహద్దుకు అవతలి వైపు నుంచి పాక్ జరిపిన కాల్పుల్లో ఇద్దరు భారత్ సైనికాధికారులు మృతి చెందారు. కుప్వారా జిల్లాలోని నియంత్రణ రేఖ వెంబడి(ఎల్వోసీ) శుక్రవారం పాక్ బలగాలు జరిపిన కాల్పుల్లో జూనియర్ కమిషన్డ్ అధికారులు(జేసీవోలు) ఇద్దరు నేలకొరిగారని సైన్యం తెలిపింది. పాక్ దుశ్చర్యను భారత్ బలగాలు సమర్ధంగా తిప్పికొట్టాయని పేర్కొంది. -
గర్ల్ ఫ్రెండ్ కోసం భార్య హత్య: ఒరాకిల్ ఉద్యోగి అరెస్ట్
బెంగళూరు: అతికిరాతకంగా భార్యను హత్య చేసి 15 సంవత్సరాలుగా తప్పించుకు తిరుగుతున్న ఓ ప్రబుద్ధుడికి పోలీసులు చెక్ పెట్టారు. పేరు మార్చుకుని ప్రముఖ ఐటీ కంపెనీ ఒరాకిల్‌లో ఉద్యోగం వెలగబెడుతూ, సంవత్సరానికి రూ. 22 లక్షల జీతంతో దర్జాగా బతుకుతున్న తరుణ్ కుమార్ జినారాజ్, అలియాస్ ప్రవీణ్ (42) చివరకు కటకటాల వెనక్కి వెళ్లాడు. వివరాల్లోకి వెళ్లితే.. అహ్మదాబాద్ వాసి తరుణ్‌కు, బ్యాంకు ఉద్యోగి సాజ్నితో నవంబరు 15, 2002న వివాహం జరిగింది. కానీ పెళ్లయిన నాలుగు నెలలకే (2003 ఫిబ్రవరి,14) ఆమెను చున్నీతో గొంతు బిగించి హత్య చేశాడు. పైగా చోరీకి వచ్చిన దొంగలు ఆమెను హత్య చేసారని అత్తమామలు సహా అందర్నీ నమ్మించాడు. అయితే ఎన్నాళ్లనుంచో ఇతగాడికోసం గాలిస్తున్న పోలీసులు ఇటీవల తరుణ్ తల్లి అన్నమ్మని విచారించారు. ఆమె తరచూ బెంగళూరుకు వెళ్లి రావడంపై ఆరా తీశారు. ఈ సందర్భంగా ఆమె ఫోన్‌కాల్స్‌పై నిఘా పెట్టారు. ఇక్కడే బాబు పోలీసులకు చిక్కాడు. బెంగళూరు ఒరాకిల్ కార్యాలయంలోని ల్యాండ్‌లైన్ ద్వారా అన్నమ్మకు వచ్చిన ఫోన్ కాల్స్ పోలీసులు కూపీ లాగగా విషయం వెలుగులోకి వచ్చింది. అయితే విచారణ అధికారి కిరణ్ చౌదరికి ఒరాకిల్ ఆఫీసులో తరుణ్ ఆచూకీ అంత ఆషామాషీగా దొరకలేదు. చివరకు పాత ఫోటోల ద్వారా గుర్తించి, నాటకీయంగా డైరెక్టుగా తరుణ్ (ప్రవీణ్) క్యాబిన్ దగ్గరి కెళ్లి.."హలో తరుణ్, నీ కథ ముగిసింది ...లెట్స్ గో" అనడంతో ప్రవీణ్ అవాక్కయ్యాడు. మొదట్లో తిరస్కరించినా చివరికి నేరాన్ని అంగీకరించక తప్పలేదు. అంతేకాదు తన భార్య(నిషా)కు ఫోన్ చేసి తన అసలు స్వరూపాన్ని కూడా వివరించాడట. ఎలా తప్పించుకున్నాడు? మధ్యప్రదేశ్‌లోని మండౌరుకు చెందిన తన పాతస్నేహితుడి సర్టిఫికెట్లను దొంగిలించి ప్రవీణ్ భాట్లీగా అవతరించాడు. ఎవరూ గుర్తు పట్టలేనంతగా పూర్తిగా మారిపోయాడు. నకిలీ సరిఫికెట్లతో ముందు కొంతకాలం పుణేలో కాల్ సెంటర్లో పనిచేశాడు. అక్కడే 2009లో నిషాను పెళ్లి చేసుకున్నాడు. అనంతరం బెంగళూరు ఓరాకిల్ సంస్థలో ఎగ్జిక్యూటివ్‌గా ఉద్యోగంలో చేరాడు. నైట్ షిఫ్ట్‌లు మాత్రమే చేస్తూ తన గుట్టు ఎవరికీ తెలియకుండా గోప్యతను పాటించాడు. తల్లిదండ్రులు, తమ్ముడు కారు యాక్సిడెంట్లో చనిపోయాడని చెప్పి నమ్మించి మరీ నిషా పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. సాజ్ని తల్లితండ్రులు కృష్ణన్, రమణి కేరళలోని త్రిసూర్‌కు చెందినవారు. ఆ తరువాత వారు అహ్మదాబాద్‌లో సెటిల్ అయ్యారు. అక్కడే పుట్టి పెరిగిన సాజ్ని బ్యాంకులో పని చేస్తున్నారు. వీరి పరిచయం నాటికి అహ్మదాబాద్‌లోని ఒక ప్రైవేట్ పాఠశాలలో వాలీబాల్ కోచ్ గా పని చేసేవాడు తరుణ్. అప్పటికే సాజ్ని పనిచేస్తున్న బ్యాంకు పనిమీద ఒకటి రెండు సార్లు సాజ్ని ఇంటికి వచ్చాడు తరుణ్. ఈ క్రమంలో పెద్దల అంగీకారంతోనే సాజ్నిని పెళ్లి చేసుకున్నాడు. తరుణ్ అరెస్ట్‌పై కృష్ణన్, తరుణ్ సంతోషం వ్యక్తం చేశారు. తమ బిడ్డ చనిపోయిన తరువాత తమ జీవితం శూన్యంగా మారిపోయిందనీ, ఈ రోజు కోసమే ఎదురు చూస్తూ బతికామని చెప్పారు. మొదట్లో మర్యాద ప్రవర్తనతో సాజ్ని భర్త, ఆ తరువాత పోలీస్ దర్యాప్తులో పోలీసులు తమను తప్పుదారి పట్టించారని ఆవేదన వ్యక్తం చేశారు. తరుణ్ గొప్ప నటుడు అనీ, అతని ప్రవర్తన తమకు ఎపుడూ అనుమానాస్పదంగా కనిపించలేదని, తమని చూడగానే లేచి నిలబడుతూ చాలా నెమ్మదిగా, సంస్కారవంతంగా ఉండేవాడని తెలిపారు. అప్పటికే మరో మహిళతో సంబంధమున్న సంగతి కూడా తమకు తెలియదన్నారు. కానీ పెళ్లి తరువాత అనుకున్నంత అతను మంచివాడు కాదంటూ తన కూతురు బాధపడిందనీ, తన డబ్బంతా తరుణ్ బలవంతంగా లాగేసుకుంటున్నాడని వాపోయిందని కూడా గుర్తు చేసుకున్నారు. పకడ్బందీగా హత్య దొంగతనం జరిగినట్టుగా ఇల్లంతా చిందర వందర చేశాడు. బీరువాలోని వస్తువులన్నీ లాగి పడేశాడు. సాజ్ని మెడలోని బంగారం గొలుసును రెండు ముక్కలు చేశాడు. విమాన టికెట్లను, కొంత సొమ్మును కూడా కింద పడేశాడు. (మరునాడు ఆమె ట్రైనింగ్ కోసం బయలుదేరాల్సి ఉంది). ఆమె చున్నీతోనే ఉరిబిగించి చంపేసినట్టుగా సీన్ క్రియేట్ చేశాడు. గాయాలు, షాకుకు గురయ్యాననే పేరుతో సమీపంలోని ఆసుపత్రి ఐసీయూలో చేరాడు. అనుమానం ఎక్కడ మొదలైంది మరునాడు పోస్ట్‌మార్టం అనంతరం ఇంటికి తీసుకొచ్చిన సాజ్ని మృతదేహాన్ని చూసి ఆసుపత్రి నుంచి వచ్చిన తరుణ్ బోరున విలపిస్తూ మరోసారి తన నటనా చాతుర్యాన్ని ప్రదర్శించాడు. కానీ సాజ్నీ మెడలోని చున్నీని వాసన చూసిన స్నిఫర్ డాగ్స్ మాత్రం అతగాడి వాసన పసిగట్టాయి. గట్టిగా అరవడం మొదలు పెట్టాయి. దీంతో అప్పటివరకూ సంస్కారవంతమైన అల్లుడిగా భావించిన కృష్ణన్ , రమణలకు అనుమానం మొదలైంది. తమ కూతురు చెప్పిన సంగతులు గుర్తొచ్చాయి. అంతేకాదు..ఇక్కడ బోరున ఏడ్చి కారెక్కిన తరువాత నవ్వుతున్నాడంటూ అక్కడున్నవారు గొణుక్కోవడం కూడా సాజ్ని తల్లి చెవిన పడింది. దీంతో వారు తరుణ్‌పై కేసు నమోదు చేశారు. కానీ అప్పటినుంచి తరుణ్ పోలీసులకు దొరకకుండా పరారీలో ఉన్నాడు. 15సంవత్సరాల తరువాత కేసును ఎలా ఛేదించారు నిజానికి ఈ హత్య కేసు పదిహేను సంవత్సరాల తరువాత ఛేదించడమే విశేషం. ఇందుకు సాజ్ని తల్లి దండ్రులు పెద్దపోరాటమే చేశారు. తరుణ అరెస్ట్ అనంతరం మాట్లాడుతూ రాజకీయాల్లో చేరకు ముందు నుంచే ప్రస్తుత ప్రధానమంత్రి నరేంద్రమోదీ బాగా తెలుసుననీ, ఆయన తరచుగా తమ ఇంటికి కూడా వచ్చేవారని రమణి చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలోనే సాజ్ని హత్య జరిగాక దాదాపు ఆరేళ్ల తరువాత తమకు అత్యంత సన్నిహితుడి ద్వారా మోదీని పలుమార్లు కలిసి, తమకు న్యాయం చేయాల్సిందిగా అభ్యర్థించామని కృష్ణన్, రమణి దంపతులు వివరించారు. దీంతో జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఎకె శర్మ , డీసీపి హిమాంశు శుక్లా ఆధ్వర్యంలో 6 సంవత్సరాల సుదీర్ఘ విచారణ ప్రారంభమైంది. ఆ తరువాత డీసీపీ దీపన్ భద్రాన్ ఆధ్వర్యంలోని బృందం చాకచక్యంగా తరుణ్ ఆట కట్టించింది. తరుణ్ తల్లికి వచ్చిన దాదాపు లక్ష ఫోన్ కాల్స్‌ను పరిశీలించామని అహ్మదాబాద్ క్రైమ్ బ్రాంచ్ ప్రత్యేక పోలీసు కమిషనర్ జేకే భట్ చెప్పారు. వాలెంటైన్స్ డే గిఫ్ట్‌గా ఫిబ్రవరి 14న హత్య గర్ల్ఫెండ్కు వాలెంటైన్స్ డే గిఫ్ట్‌గా భార్య హత్య చేసినట్టుగా పోలీసులు విచారణలో తేలింది. భార్యను హత్య చేసిన అనంతరం గర్ల్‌ఫ్రెండ్‌కు ఫోన్ చేశాడు తరుణ్. కానీ హంతకులతో తనకు స్నేహం అక్కరలేదని ఖరాకండిగా తేల్చి చెప్పిందట ఆమె. -
కిరాతకం
ఆమెను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. కొన్నాళ్ల పాటు వారి వివాహ బంధం సజావుగా సాగింది. ఆ తర్వాత భార్య ప్రవర్తనపై అతనికి అనుమానం మొదలైంది. అదికాస్తా పెనుభూతంలా మారింది. కసితో రగిలిపోయాడు. కట్టుకున్న భార్య అనే కనికరం లేకుండా.. అభం శుభం తెలియని పిల్లలనే కనీస జ్ఞానం కూడా కరువై అతి దారుణంగా హతమార్చాడు. బి.కోడూరు: అనుమానం పెనుభూతమై భార్యా పిల్లలను హత్య చేసిన ఘటన బి.కోడూరు మండలం పాయలకుంట్ల గ్రామంలో సంచలనం రేపింది. బద్వేలు మండలం చెర్లోబోయన పల్లెకు చెందిన కాశిని రమణారెడ్డి నాలుగేళ్ల క్రితం పెనగలూరు మండలం సాతుపల్లెకు చెందిన లక్ష్మిప్రియను (24) కులాంతర వివాహం చేసుకున్నాడు. మండలంలోని పాయలకుంట్లలో నివసిస్తూ బేల్దారి పని చేసుకుంటూ జీవనం సాగించేవాడు. వీరికి సాయి శ్రీహిత (4), చింటు(2) సంతానం ఉన్నారు. రెండేళ్ల పాటు సజావుగా సాగిన వీరి కాపురంలో అనుమానం అనే విష బీజం మొలకెత్తింది. దీంతో రమణారెడ్డి నిత్యం మద్యం సేవిస్తూ భార్యను చిత్ర హింసలకు గురిచేస్తుండేవాడు. అయితే కులాంతర వివాహం చేసుకుందనే కారణంగా తల్లిదండ్రులు కూడా లక్ష్మిప్రియను ఆదరించలేదు. దీంతో ఆమె తన బాధను ఎవ్వరికీ చెప్పుకునే అవకాశం లేక బాధపడుతూనే ఉండేది. ఈ క్రమంలో గత మూడు రోజుల నుంచి లక్ష్మిప్రియను వివాహేతర సంబంధం పెట్టుకున్నావని వేధిస్తూ తీవ్రంగా కొడుతుండేవాడని స్థానికుల ద్వారా తెలిసింది. ఇదే సమయంలో లక్ష్మిప్రియను హతమారుస్తానని కూడా బెదిరించినట్లు తెలిసింది. ఈ నేపధ్యంలో ఆదివారం రాత్రి కూడా ఇరువురి మద్య గొడవ జరిగిన అనంతరం ఇంటిలోనే నిద్రించారు. ఆ తర్వాత సోమవారం తెల్లవారుజామున నిద్రపోతున్న భార్య లక్ష్మిప్రియను, ఇద్దరు పిల్లలను గొడ్డలితో అతి కిరాతకంగా చంపి పక్క ఇంట్లో నివసిస్తున్న తల్లిదండ్రులకు విషయం తెలిపి పరారయ్యాడు. మైదుకూరు డీఎస్పీ బీఆర్ శ్రీనివాసులు, పోరుమామిళ్ల సీఐ పద్మనాభన్, బి.కోడూరు ఎస్ఐ మద్దిలేటి సంఘటన స్థలాన్ని పరిశీలించారు. అలాగే హత్యకు ఉపయోగించిన గొడ్డలిని స్వాధీనం చేసుకున్నారు. వీఆర్ఓ అమర్నాథరెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. పోలీసుల అదుపులో నిందితుడు? భార్యా పిల్లలను అతి కిరాతకంగా హత్యచేసిన రమణారెడ్డి కోసం బి.కోడూరు పోలీసులు మూడు బృందాలుగా ఏర్పడి ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. ఎట్టకేలకు బద్వేలు నాలుగురోడ్ల కూడలి సమీపంలో నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. -
ఇల్లాలి దారుణహత్య
మద్యానికి బానిసై కుటుంబాన్ని నిర్లక్ష్యం చేశాడు. కూలి పనికి వెళ్లి ముగ్గురు పిల్లలను పోషించుకుంటున్న ఇల్లాలికి చిత్రహింసలతో నరకం చూపించాడు. చివరకు విచక్షణారహితంగా దాడి చేసి మట్టుబెట్టాడు. పిల్లలను అనాథల్ని చేశాడు. ఈ సంఘటన గుంతకల్లు మండలం గుండాల గ్రామంలో శుక్రవారం జరిగింది. గుంతకల్లు రూరల్ : గుండాల గ్రామానికి చెందిన మంగమ్మ, రామాంజనేయులు దంపతుల కుమారుడు రాజుకు, పామిడి మండలం కొండాపురం గ్రామానికి చెందిన చిన్న మునెప్ప, సుంకమ్మ దంపతుల కూతురు నాగమునెమ్మ అలియాస్ చిట్టెమ్మ(28)కు పదేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కూతుళ్లు రామాంజినమ్మ(6), షర్మిల (4), ఒక కుమారుడు వీరాంజనేయులు (2) ఉన్నారు. వివాహం తరువాత భార్యతో కలిసి వేరుకాపురం పెట్టిన రాజు తన తండ్రి నుంచి ఆస్తిగా వచ్చిన గొర్రెలను తాగుడు కోసం అమ్మేశాడు. భర్త తాగుడుకు బానిసగా మారి కుటుంబాన్ని నిర్లక్ష్యం చేసినా తట్టుకున్న నాగమునెమ్మ కూలి పనులు చేసుకుంటూనే తన ముగ్గురు పిల్లలను కంటికి రెప్పలా కాపాడుకుంటూ వచ్చింది. రాజు తన భార్య సంపాదనలో దాచుకున్న డబ్బుతోపాటు, ఇంట్లోని వస్తువులను అమ్ముకుని రోజూ మద్యం తాగి వచ్చేవాడు. నిత్యం భార్యను చిత్రహింసలకు గురిచేస్తూ వేధించేవాడు. భర్త ప్రవర్తనతో పూర్తిగా విసిగిపోయిన నాగమునెమ్మ 15 రోజుల క్రితం పుట్టింటికి వెళ్లిపోయింది. ఇకపై బుద్ధిగా ఉంటానంటూ రాజు నమ్మబలికి మూడు రోజుల క్రితం ఆమెను తిరిగి గుండాలకు తీసుకువచ్చాడు. రెండు రోజులుగా మద్యం మత్తులోనే తూగుతున్న రాజు గురువారం రాత్రి తన భార్య నాగమునెమ్మపై విచక్షణా రహితంగా దాడిచేసి చంపాడు. మృతిపై పొంతనలేని సమాచారం భర్త దాడిలో తీవ్రంగా గాయపడి మృతిచెందిన నాగమునెమ్మను గుట్టుచప్పుడు కాకుండా ఖననం చేసేందుకు అన్ని ఏర్పాట్లు సిద్ధంచేసుకున్న రాజు శుక్రవారం ఉదయం 10 గంటల సమయంలో ఆమె పుట్టింటి వారికి సమాచారం అందించాడు. అదికూడా తనకు ఆరోగ్యం బాగోలేకపోవడంతో ఆటోలో ఆస్పత్రికి తీసుకెళుతుండగా కిందపడి మృతిచెందిందని ఒకసారి, మిద్దెపైకి ఎక్కుతూ కాలుజారి కిందపడటం వల్ల మృతిచెందిందని మరోసారి పొంతనలేని సమాధానాలతో వారిని మభ్యపెట్టే ప్రయత్నం చేశాడు. దీంతో హడావిడిగా గుండాలకు చేరుకున్న బంధువులు మృతురాలి శరీరంపై ఉన్న గాయాలను చూసి.. భర్తే కొట్టిచంపాడన్న ఆగ్రహంతో అతడిపై మూకుమ్మడిగా దాడిచేశారు. దీంతో రాజు అక్కడినుండి పరారయ్యాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని గుంతకల్లు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అమ్మా.. అమ్మా... భర్త ఎన్ని చిత్రహింసలు పెట్టినా ఓర్చుకుంటూ కన్నబిడ్డలను కంటికి రెప్పలా కాపాడుకుంటూ వచ్చిన ఆ తల్లి చనిపోవడంతో.. ‘అమ్మా... అమ్మా...’ అంటూ రెండేళ్ల బాలుడు విలపించిన తీరు అందరినీ కలచివేసింది. తల్లి కనిపించకపోవడంతో అక్క చంక నుండి దిగకుండా, ఇతరుల దగ్గరకు వెళ్లకుండా గుక్కపట్టి ఏడ్చాడు. ఏడేళ్ల వయసులోనే కన్నతల్లిలాగా బాలుడిని బుజ్జగిస్తున్న అక్కను చూసి కన్నీటి పర్యంతమయ్యారు. -
రెప్పలు లేని కను‘పాపలు’
తండ్రి చేతిలో తల్లి హతం ఆత్మహత్య చేసుకున్న తండ్రి పోలీసులు విచారణలో వెలుగులోకి వచ్చిన ఘటన తన కడుపు మాడ్చుకుని..పిల్లల కడుపు నింపే తల్లి..పిల్లల కాలిలో ముల్లు గుచ్చుకుంటే తన గుండెల్లో గునపం దిగినంత బాధ పడే తండ్రి ఆ చిన్నారులకు లేకుండా పోయారు. అమ్మకొంగు పట్టుకుని మారాం చేస్తూ..నాన్న భుజాలెక్కి అటాడుకునే వయసులో దురదృష్టవంతులైన పసిపిల్లలకు ఆ సరదాలు తీరే పరిస్థితి లేకుండా పోయింది. బతిమాలి బుజ్జగించి అన్నం తినిపించే అమ్మ..ఎన్ని కష్టాలైనా పడి అడిగినవన్నీ కొనిచ్చే తండ్రి ఆ చిన్నారులకు శాశ్వతంగా దూరమయ్యారు. ఆడపిల్లలుగా పుట్టడమే మా పాపమా? ఈ లోకంలోకి మమ్మల్ని తీసుకువచ్చి కంటికి రెప్పలా..మా బాగోగులు చూడాల్సిన మీరు..మమ్మల్ని ఒంటరిగా వదిలి దూరతీరాలకు పోయారా? అని ప్రశ్నించే వయసు ఆ పిల్లలకు లేదు. తల్లిదండ్రులు కనిపించక..తమను ఎవరు సాకుతారో తెలియక ఆ చిన్నారి పాపలు బిక్కమొహాలతో చూస్తుంటే విషయం తెలుసుకున్న చూపరుల హృదయాలు చెమ్మగిల్లుతున్నాయి. సాక్షి ప్రతినిధి, విజయనగరం: తమను నిత్యం అందంగా ముస్తాబు చేసి గోరుముద్దలు తినిపించే అమ్మను నాన్నే కిరాతకంగా హత్య చేశాడని..పశ్చాత్తాపంతో తానూ ఆత్మహత్య చేసుకున్నాడని తెలియని ఆ పసిపాపలు తల్లి దండ్రులు ఎటు వెళ్లారో..?ఎప్పటికి వస్తారో తెలియక నిత్యం ఎదురు చూస్తున్నారు. హత్య, ఆత్మహత్యలతో తల్లిదండ్రులు దూరమైతే అభం శుభం ఎరుగని చిన్నారుల జీవితాలు ఏం కావాలి? తమను సాకేవారెవరూ లేక..తెలిసీ తెలియని వయసులో మౌనంగా రోదిస్తున్న ఈ చిన్నారుల భవితవ్యం సమాధానం లేని ప్రశ్నగా మిగిలి పోవాల్సిందేనా? తల్లిని హత్య చేసిన తండ్రి వేపాడ మండలం చినగుడిపాల గ్రామానికి చెందిన గజ్జి కృష్ణతో లక్కవరపుకోట మండలం ఖాసాపేట గ్రామానికి చెందిన లక్ష్మికి ఆరేళ్ల క్రితం వివాహమయ్యింది. వీరికి ఇద్దరు ఆడపిల్లలు జన్మించారు. నిన్ను చేసుకోవడం వల్ల ఆడపిల్లలు జన్మించారని, మరొకర్ని పెళ్లిచేసుకుంటే మగపిల్లలు పుట్టి ఉండేవారని లక్ష్మితో భర్త కృష్ణ తరచూ గొడవ పడేవాడు. ఈ క్రమంలో భార్యభర్తల మధ్య గొడవలు తీవ్రమవడంతో కొన్నాళ్లు దూరంగా ఉన్నారు. ఆ తర్వాత పోలీసు స్టేషన్లో కౌన్సెలింగ్, పెద్దల జోక్యంతో కలిశారు. జూన్ 1వ తేదీనుంచి విజయనగరం పట్టణాన్ని ఆనుకుని ఉన్న బియ్యాలపేట పంచాయతీలోని ప్రసాద్‌నగర్‌లో ఎలుబండి రాజబాబు ఇంట్లో ఈ కుటుంబం అద్దెకు ఉంటోంది. ఎప్పటిలాగే, జూన్ 13వ తేదీ రాత్రి భార్యాభర్తలు భోజనాలు చేసి తొమ్మిది గంటల వరకు ఇంటి బయట కూర్చుని నిద్రించడానికి వెళ్లారు. అర్ధరాత్రి సమయంలో భార్య లక్ష్మిని కృష్ణ అతికిరాతకంగా హతమార్చి అక్కడి నుంచి పరారయ్యాడు. ఒడిశాలో సజీవ దహనమైన తండ్రి భర్త..భార్యను హతమార్చిన ఘటనపై విజయనగరం రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. పరారీలో ఉన్న కృష్ణ కోసం సెల్‌ఫోన్ కాల్‌డేటా ఆధారంగా అన్వేషణ మొదలు పెట్టారు. అయినా కృష్ణ ఆచూకీ దొరకలేదు. కానీ, జూన్ 20వ తేదీన మాత్రం విశాఖపట్నం జిల్లా ఆనందపురంలో ఉన్న తన బావకు కృష్ణ ఫోన్ చేశాడు. పోలీసులు దీన్ని పసిగట్టారు. కాల్‌డేటా ఆధారంగా ఎక్కడి నుంచి ఫోన్ వచ్చిందో తెలుసుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోఆ ఫోన్‌కాల్ ఒడిశా రాష్ట్రంలోని కొరాఫుట్ నుంచి వచ్చిందని తేలింది. దీంతో హెడ్ కానిస్టేబుల్ త్రినాథరావు, కానిస్టేబుల్ షఫీ ఒక బృందంగా ఏర్పడి, నిందితుడు కృష్ణ తమ్ము డ్ని పట్టుకుని జూన్ 24వ తేదీన కొరాఫుట్ వెళ్లారు. తొలి రోజు కొరాఫుట్ అంతా వెదికినా ఎక్కడా కన్పించలేదు. కానీ, మరుసటి రోజైన 25న కొరాఫుట్ పోలీసులకు ఒకచోట గుర్తు తెలియని మృతదేహం కన్పించింది. అప్పటికే ఒడిశా పోలీసులతో జిల్లా పోలీసు బృందం టచ్‌లో ఉండడంతో గుర్తు తెలియని మృతదేహం విషయమై సమాచారం అందింది. ఈ మేరకు జిల్లా పోలీసులు అక్కడికెళ్లి మృతదేహం జేబులో ఉన్న సెల్‌ఫోన్, వేసుకున్న దుస్తులు ఆధారంగా కృష్ణ మృతదేహమని ఆయన తమ్ముడితో కలిసి గుర్తించారు. అధికారికంగా ధ్రువీకరించేందుకు గాను బరంపురం తరలించిన మృతదేహం తొడ ఎముకలను డీఎన్ఏ పరీక్షకు సేకరించారు. వాటిని శుక్రవారం డీఎన్ఏ ల్యాబ్‌కు పంపించేందుకు విజయనగరం రూరల్ సీఐ రవికుమార్ ఏర్పాట్లు చేస్తున్నారు. మొత్తానికి వస్తాడనుకున్న తండ్రి కూడా సజీవదహనం కావడంతో ఆ పిల్లలు ఎటూ కాకుండా పోయారు. అనాథలైన పిల్లలు.. ఆ ఇద్దరు ఆడపిల్లలకు నాలుగేళ్ల లోపు వయస్సు వారే. ప్రస్తుతం వారి భవిష్యత్తేంటో తెలియని పరిస్థితి ఏర్పడింది. తల్లిదండ్రులిద్దరూ లేక రోడ్డున పడ్డారు. ప్రస్తుతానికైతే లక్కవరపుకోట మండలంలోని ఖాసాపేటలో ఉన్న అమ్మమ్మ సంరక్షణలో ఉన్నారు. వారెంతకాలం చూడగలరు..వారి భవిష్యత్తు ఏమిటనేది ప్రశ్నార్థకంగా మారింది. అనాథలైన పిల్లలను స్వచ్ఛందసంస్ధలు, సామాజిక దృక్పథం ఉన్న వ్యక్తులు ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని పలువురు కోరుతున్నారు.