నిందితుడు సూరజ్, అతనికి సహాయం చేసిన వ్యక్తి
కొచ్చి: ఆస్తి కోసం భార్యను కడతేర్చిన ఓ భర్త కటకటాల పాలయ్యాడు. ఈ ఘటన కేరళలో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. సూరజ్ తన భార్య ఉతరా ఆస్తి కోసం ఆమెను హత్య చేయాలనుకున్నాడు. ఈ క్రమంలో ఎవరికీ తనపై అనుమానం రాకుండా పక్కా ప్లాన్ వేశాడు. అందులో భాగంగానే హత్య చేసినా సహజమైన మరణంగా ఉండేలా నాగుపామును ఎంచుకున్నాడు. మొదటి ప్రయత్నంలో విఫలం కావడంతో రెండో సారి మాత్రం భార్యని పథకం ప్రకారం హత మార్చాడు.
కాగా ఉతరా గతేడాది మే 7న ఉత్రా ఆంచల్‌లోని తన ఇంట్లో పాముకాటుతో మరణించింది. ఉతరా మరణించిన కొన్ని రోజుల తర్వాత ఆమె భర్త సూరజ్ తన ఆస్తి కోసం ప్రయత్నించాడు. దీంతో మహిళ తల్లిదండ్రులు, ఉతారా మరణంపై తమకు అనుమానం ఉందని పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణ చేపట్టిన పోలీసులకి అసలు విషయం తెలుసుకుని కంగుతిన్నారు. సూరజ్ తన భార్య అడ్డు తొలగించుకుని ఆమె డబ్బు, బంగారం తీసుకొని మరొకరిని వివాహం చేసుకోవాలనే ప్లాన్‌తోనే ఆమెను పాముకాటుతో హత్య చేసినట్లు తేలిందని పోలీసులు తెలపారు.
ఈ కేసు కొంచెం క్లిష్టంగా ఉండడంతో పక్కాగా అన్ని సాక్ష్యాధారాలతో కోర్టుకు సమర్పించారు. వీటిని పరిశీలించిన కోర్టు నిందితుడిని దోషిగా తేల్చింది. సందర్భానుసార సాక్ష్యాల ఆధారంగా నిందితుడిని దోషిగా నిర్ధారించిన అరుదైన కేసులలో ఇది ఒకటని ఆ రాష్ట్ర డీజీపీ అన్నారు. ఒక హత్య కేసును శాస్త్రీయంగా, వృత్తిపరంగానే కాకుండా శాస్త్రీయంగా కూడా ఎలా పరిశోధించాలో అనేదానికి ఇది ఒక ఉదాహరణగా ఆయన పేర్కొన్నారు.
చదవండి: వివాహిత స్నానం చేస్తుండగా వీడియో తీసి.. ఆపై లైంగికదాడి
Comments
Please login to add a commentAdd a comment