
సాక్షి, దొడ్డబళ్లాపురం: భార్యను హతమార్చి శవాన్ని ఖాళీ వాటర్ ట్యాంకులో దాచిన ఘటన హుళియాళలో చోటుచేసుకుంది. శాంతకుమారి (38) భర్త చేతిలో హతమైన మహిళ. తెరెగాంవ గ్రామానికి చెందిన తుకారాం మడివాళ నిందితుడు. తుకారాం పక్కింటి మహిళతో మాట్లాడిన విషయానికి సంబంధించి భార్యభర్తల మధ్య ఘర్షణ జరిగింది. తీవ్ర ఆగ్రహంతో తుకారాం భార్య గొంతు నులిమి హత్య చేసాడు.
శవాన్ని వాటర్ ట్యాంకులో దాచాడు. అనంతరం ఖానాపురకు చెందిన రిజ్వాన్‌కుంబారి అనే వ్యక్తికి చెందిన టాటాఏస్ వాహనాన్ని అద్దెకు తీసుకుని అటవీ ప్రాంతంలో మృతదేహాన్ని పారవేయాలని ప్రయత్నిస్తుండగా హుళియాళ, రామనగర పోలీసులు జాయింట్ ఆపరేషన్ చేసి నిందితుడిని అరెస్టు చేసారు.