ప్రతీకాత్మక చిత్రం
లక్నో: ఉత్తరప్రదేశ్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. గర్భవతియైన మహిళను భర్త దుండగులతో చంపించిన ఘటన ఘజియాబాద్‌లో చోటుచేసుకుంది. ఈ క్రమంలో మృతురాలి భర్తను పోలీసులు బుధవారం అరెస్టు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. పోలీసులు వివరాల ప్రకారం... నిందితుడికి తన భార్య సోదరితో కొంత కాలంగా వివాహేతర సంబంధం ఉందని, దీంతో అడ్డుగా ఉన్న తన భార్యను అడ్డు తొలగించుకోవడానికి నిందితుడు పథకం రచించినట్లు పోలీసులు తెలిపారు. కాగా ఈ ఘటన జనవరి 12న జరిగినట్లు పోలీసులు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో నిందితుడిని విచారించగా.. ‘నా భార్య సొదరితో నాకు వివాహేతర సంబంధం ఉంది. అందుకే నా భార్యను చంపించాలనుకున్నాను. ఇందుకోసం తనకు విషం ఇచ్చి హత్య చేయమని దుండగులకు సుపారి కూడా ఇచ్చాను’ అని చెప్పాడు.
కాగా ఆ దుండగులు తన భార్యకు విషం ఇవ్వడంలో రెండుసార్లు విఫలమయ్యారని నిందితుడు పోలీసులకు చెప్పాడు. ఆ తరువాత దొంగతనం నెపంతో తమ ఇంటికి వెళ్లి.. భార్య గొంతు కోసి చంపారని నిందితుడు చెప్పాడు. అదేవిధంగా తన పిల్లలను చూసుకోవడానికి తన భార్య సొదరిని తనతోనే ఉంచాలని నిందితుడు పోలీసులను కోరాడు. కేసు విచారణలో భాగంగా నిందితుడి ఇంటి సీసీ కెమెరాలను పరిశీలించగా.. తన భార్యను చంపడానికి నిందితుడు ముగ్గురు వ్యక్తులను నియమించినట్లు తేలిందని పోలీసులు వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment