
ఐజ్వాల్: సాధారణంగా భార్య మీద కోపం వస్తే విడాకులు ఇవ్వడం చూశాం గానీ ఓ వ్యక్తి ఏకంగా మానవ బాంబుగా మారి తన భార్యని హతమార్చాడు. ఈ ఘటనలో మిజోరాంలోని లుంగ్‌లేయి జిల్లాలో చోటుచేసుకుంది. వివరాలు ప్రకారం.. లుంగ్‌లేయి జిల్లాకు చెందిన రోహ్ మింగ్‌లైనా(62), ట్లాంగ్థియాన్‌ఘ్లిమి(61) దంపతులు. ట్లాంగ్థియాన్‌ఘ్లిమి ఆ ప్రాంతలోనే కూరగాయలు అమ్ముకుంటూ జీవనం సాగిస్తూ ఉండేది.
ఈ జంట ఒక సంవత్సరం క్రితం మనస్పర్థలు రావడంతో అప్పటి నుంచి విడిగా ఉంటున్నారని సమాచారం. అయితే మంగళవారం మధ్యాహ్నం భార్య వద్దకు వచ్చిన అతను ప్రేమ వలకబోస్తూ మాట్లాడాడు. తను జ్వరంతో బాధపడుతున్నట్లు నటిస్తూ, మైకం వచ్చినట్లు అకస్మాత్తుగా తన భార్యను కౌగిలించుకున్నాడు, ఆ తర్వాత పెద్ద పేలుడు సంభవించింది. దీంతో వారిద్దరిని వెంటనే లుంగ్లీ జిల్లా ఆసుపత్రికి తరలించగా, అప్పటికే చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు. అయితే, పేలుడులో మృతురాలి కుమార్తె కొంచెం దూరంగా ఉండడంతో ఆమె గాయపడలేదు. ఈ ఘటనపై లంగ్లీ జిల్లా పోలీసు ఉన్నతాధికారి మాట్లాడుతూ.. పేలుడులో జెలటిన్ ఉపయోగించినట్లు అనుమానిస్తున్నట్లు తెలిపారు.
చదవండి: ఐఐటీ విద్యార్థి టెక్నాలజీ ఉపయోగించి.. 50 మంది విద్యార్థులు, టీచర్లను..
Comments
Please login to add a commentAdd a comment