పార్టీ నేతలపై మండిపడ్డ ప్రియాంకా గాంధీ | Priyanka Gandhi Takes On party workers in Raebareli | Sakshi
Sakshi News home page

పార్టీని ముంచింది మీరే: ప‍్రియాంకా గాంధీ

Published Fri, Jun 14 2019 8:39 AM | Last Updated on Fri, Jun 14 2019 9:10 AM

Priyanka Gandhi Takes On party workers in Raebareli - Sakshi

సాక్షి, రాయ్‌బరేలీ:  లోక్‌సభ ఎన్నికల్లో పార్టీని ముంచింది మీరే అంటూ కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ పార్టీ నేతలపై మండిపడ్డారు. ఆమె గురువారం రాయ్‌బరేలీలో పార్టీ నేతలతో మాట్లాడారు. ఎన్నికల్లో పార్టీ కోసం శ్రమించని వారి పేర్లను కనుక్కుంటామన్నారు. ఎవరెవరు పార్టీ కోసం చిత్తశుద్ధితో పని చేశారో వారి హృదయాలకే తెలుసన్నారు.  మరోవైపు బీజేపీ నేతలు అమిత్‌ షా, స్మృతి ఇరానీలు లోక్‌సభకు ఎన్నిక కావడంతో ఖాళీ అయిన రెండు రాజ్యసభ స్థానాలకు విడివిడిగా కాకుండా ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి సింఘ్వీ డిమాండ్‌ చేశారు. విడివిడిగా ఎన్నికలు నిర్వహించాలనుకోవడం రాజ్యాంగాన్ని అపహాస్యం చేయడమేనని అన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement