‘‘అమేథీ నుంచి పోటీలో రాహుల్‌ బంట్రోతు’’ | Rahul Peon Contesting From Amethi Bjp Leader Sensational Comments | Sakshi
Sakshi News home page

అమేథీ నుంచి పోటీలో రాహుల్‌ బంట్రోతు.. బీజేపీ నేత సంచలన కామెంట్స్‌

Published Sat, May 4 2024 3:16 PM | Last Updated on Sat, May 4 2024 3:38 PM

Rahul Peon Contesting From Amethi Bjp Leader Sensational Comments

లక్నో: అమేథీ నుంచి పోటీకి రాహుల్‌గాంధీ తన బంట్రోతును పంపించాడని బీజేపీ నేత దినేష్‌ ప్రతాప్‌ సింగ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాహుల్‌గాంధీ అమేథీ సీటును నిజంగా గెలవాలనుకుంటే అక్కడి నుంచి పోటీకి తన బంట్రోతును ఎందుకు పంపిస్తారని సింగ్‌ ప్రశ్నించారు. 

దినేష్‌సింగ్‌ రాయ్‌బరేలిలో రాహుల్‌తో తలపడుతున్నారు.  ఈ ఎన్నికల్లో రాయ్‌బరేలి, అమేథీ సీట్లలో కాంగ్రెస్‌ ఓడిపోవడం ఖాయమని సింగ్‌ స్పష్టం చేశారు. అమేథీ నుంచి రాహుల్‌ పారిపోయాడని ఎద్దేవా చేశారు. అమేథీ, రాయ్‌బరేలీలో గాంధీ కుటుంబ సభ్యులు ఎప్పుడు పర్యటించినా వారి చుట్టూ పోలీసులు తాళ్లు పట్టుకుని నిల్చొని ఉంటారన్నారు. 

దూరం నుంచి చేతులు ఊపి వెళ్లిపోవడమే గాంధీ కుటుంబానికి తెలుసన్నారు. కానీ స్మృతి ఇరానీని అమేథీ ప్రజలు తమ కుటుంబ సభ్యురాలిగా చూస్తున్నారన్నారు. కాగా, రాయ్‌బరేలి నుంచి రాహుల్‌గాంధీ, అమేథీ నుంచి కేఎల్‌ శర్మ కాంగ్రెస్‌ నుంచి లోక్‌సభ ఎన్నికల్లో బరిలోకి దిగారు. వీరిరువురు తమ నామినేషన్లను ఇప్పటికే దాఖలు చేశారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement