peon
-
ప్యూన్ పక్కా ప్లాన్.. రూ.10 కోట్ల మోసం
భోపాల్: మధ్యప్రదేశ్‌లో ఘరానా మోసం చోటుచేసుకుంది. ప్రభుత్వ విత్తన ధ్రువీకరణ కార్యాలయంలో ప్యూన్‌గా పనిచేసే వ్యక్తి, బ్యాంకు అధికారులు ఇతరులతో కలిసి నకిలీ పత్రాలతో రూ.10 కోట్లను తన బ్యాంకు ఖాతాలో జమ చేయించుకున్నాడు. ఈ మొత్తంతో భూమి కొనుగోలు చేసి ప్రభుత్వ పథకాలను ఉపయోగించుకుని సగానికి సగం సబ్సిడీ కొట్టేయాలని పథకం పన్నాడు. అనుకోకుండా పోలీసులకు దొరికిపోవడంతో ఈ బాగోతం బట్టబయలైంది. మధ్యప్రదేశ్ విత్తన ధ్రువీకరణ విభాగంలో ప్యూన్‌గా పనిచేసే బ్రిజేంద్ర దాస్ నామ్‌దేవ్ ఈ మొత్తం వ్యవహారంలో కీలకంగా ఉన్నాడు. ఇతడు నాలుగు నెలల క్రితం అక్కౌంటింగ్ అసిస్టెంట్‌గా పనిచేసే దీపక్ పాంటీ సాయంతో విత్తన ద్రువీకరణ విభాగానికి సంబంధించిన ఫోర్జరీ పత్రాలు, సీళ్లను తయారు చేశాడు. వీటిలో నామ్‌దేవ్ తనను డ్రాయింగ్ అండ్ డిస్బర్సింగ్ అధికారిగా, విత్తన ధ్రువీకరణ విభాగం హెడ్‌గా పేర్కొన్నాడు. బ్యాంక్ మేనేజర్ నోయెల్ సింగ్‌తో కుమ్మక్కై నామ్‌దేవ్ ఎకౌంట్లో రూ.10 కోట్లు డిపాజిట్ చేయించారు. ఆ మొత్తాన్ని 50 వేర్వేరు బ్యాంకు ఖాతాల్లో జమ చేశారు. ఇవన్నీ నకిలీ పత్రాలతో తెరిచినవే. ఈ ఖాతాదారుల్లో శైలేంద్ర ప్రధాన్, అతడి పరిచయస్తులైన మరికొందరు ఉన్నారు. వీరంతా జమ అయిన డబ్బును విత్ డ్రా చేసుకుని, తమకివ్వాల్సిన కమిషన్ పోను మిగతాది నామ్‌దేవ్ ముఠాకు ఇచ్చేశారు. నామ్‌దేవ్ ముఠా సభ్యులు ఈ డబ్బుతో రూ.6.40 కోట్లు, రూ.1.25 కోట్లు పెట్టి రెండు చోట్ల ప్లాట్లు కొన్నారు. జాతీయ పశుసంవర్థక శాఖ పథకాన్ని వాడుకుని ఈ భూముల్లో వేర్వేరు ప్రాజెక్టులను ప్రారంభించాలనేది ఈ ముఠా పథకం. ప్రభుత్వ పథకంలో రూ.5 కోట్ల రుణం తీసుకుంటే అందులో సగం వరకు సబ్సిడీ పొందొచ్చు. ఇలా రూ.10 కోట్ల పెట్టుబడితో 50 శాతం సబ్సిడీ పొందాలనేది వీరి ప్లాన్. అయితే, నామ్‌దేవ్ తీరుపై అనుమానం వచ్చిన విత్తన ధ్రువీకరణ అధికారి సుఖ్‌దేవ్ ప్రసాద్ సెపె్టంబర్ 14వ తేదీన పోలీసులకు ఫిర్యాదు చేశారు. అధికారులు దీనిపై దర్యాప్తునకు సిట్ ఏర్పాటు చేశారు.తెలిసిన నామ్‌దేవ్, నోయెల్ సింగ్‌లు తమ ఫోన్లను స్విచ్చాఫ్ చేసుకుని, కుటుంబాలతో సహా పరారయ్యారు. అయితే, పోలీసులుదీపక్ పాంటీ, ధనంజయ్ గిరి, శైలేంద్ర ప్రథమ్లను అరెస్ట్ చేశారు. అరెస్ట్ నుంచి తప్పించుకునేందుకు నామ్‌దేవ్ ఇతరుల ఫోన్లతో వేర్వేరు చోట్ల నుంచి ఫోన్లు చేసేవాడు. పత్రికలు, మీడియా ద్వారా పోలీసుల చర్యలను ఎప్పటికప్పుడు ఫాలో అయ్యేవాడు. చివరికి రెవాలో ఉండగా సిట్ సభ్యులకు నామ్‌దేవ్ దొరికిపోయాడు. రూ.10 కోట్లు పంపిన 50 బ్యాంకు ఖాతాలను స్తంభింపజేశారు. -
‘‘అమేథీ నుంచి పోటీలో రాహుల్ బంట్రోతు’’
లక్నో: అమేథీ నుంచి పోటీకి రాహుల్‌గాంధీ తన బంట్రోతును పంపించాడని బీజేపీ నేత దినేష్ ప్రతాప్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాహుల్‌గాంధీ అమేథీ సీటును నిజంగా గెలవాలనుకుంటే అక్కడి నుంచి పోటీకి తన బంట్రోతును ఎందుకు పంపిస్తారని సింగ్ ప్రశ్నించారు. దినేష్‌సింగ్ రాయ్‌బరేలిలో రాహుల్‌తో తలపడుతున్నారు. ఈ ఎన్నికల్లో రాయ్‌బరేలి, అమేథీ సీట్లలో కాంగ్రెస్ ఓడిపోవడం ఖాయమని సింగ్ స్పష్టం చేశారు. అమేథీ నుంచి రాహుల్ పారిపోయాడని ఎద్దేవా చేశారు. అమేథీ, రాయ్‌బరేలీలో గాంధీ కుటుంబ సభ్యులు ఎప్పుడు పర్యటించినా వారి చుట్టూ పోలీసులు తాళ్లు పట్టుకుని నిల్చొని ఉంటారన్నారు. దూరం నుంచి చేతులు ఊపి వెళ్లిపోవడమే గాంధీ కుటుంబానికి తెలుసన్నారు. కానీ స్మృతి ఇరానీని అమేథీ ప్రజలు తమ కుటుంబ సభ్యురాలిగా చూస్తున్నారన్నారు. కాగా, రాయ్‌బరేలి నుంచి రాహుల్‌గాంధీ, అమేథీ నుంచి కేఎల్ శర్మ కాంగ్రెస్ నుంచి లోక్‌సభ ఎన్నికల్లో బరిలోకి దిగారు. వీరిరువురు తమ నామినేషన్లను ఇప్పటికే దాఖలు చేశారు. -
మొన్నటి వరకు బంట్రోతు.. ఇప్పుడేమో ఆచార్య
వేర్ దేర్ ఈజ్ ఏ విల్.. దేర్ ఈజ్ ఏ వే.. అని ఊరికనే అనలేదు. ఏదైనా సాధించాలనే సంకల్పం బలంగా ఉంటే.. అందుకు ఏదో ఒక మార్గం కచ్చితంగా ఉంటుంది. బహుశా కమల్ కిషోర్ మండల్ సార్‌లాంటి వాళ్లను ఉద్దేశించే అది పుట్టుకొచ్చిందేమో. మొన్నటి వరకు ఏ యూనివర్సిటీలో.. ఏ విభాగంలో బంట్రోతుగా పని చేశారో.. అదే యూనివర్సిటీలో.. పైగా అదే డిపార్ట్మెంట్లో ఆయనిప్పుడు అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా డ్యూటీకెక్కారు మరి!.. కమల్ సార్ ప్రయాణం గురించి తెలుసుకుంటే.. అందులో ఏ ఒక్కటీ ఆయనకు అనుకూలంగా అనిపించదు. పేదరికం, సరైన వసతులు కూడా లేని ఇల్లు, తల్లి అనారోగ్యం కోసం ఖర్చు.. ఇంటి నిండా పుట్టెడు కష్టాలే. అయినా సరే విజయం సాధించాలనే పట్టుదలతో అద్భుతమైన సంకల్ప శక్తిని ప్రదర్శించారు. అందుకేనేమో ఇరుకుగల్లీలో రంగులు వెలిసిపోయిన ఆయన రెండు గదుల ఇంటికి అభినందల కోసం ఇప్పుడు జనం క్యూ కడుతున్నారు. కమల్ కిశోర్ మండల్(42) .. ఉండేది బీహార్ భగల్పూర్ ముండీచాక్ ప్రాంతం. చాలా పేద కుటుంబం ఆయనది. కమల్ తండ్రి గోపాల్ రోడ్డు పక్కన టీ అమ్ముతుంటారు(ఇప్పటికీ). డిగ్రీ వరకు ఎలాగోలా స్కాలర్షిప్ మీద నెట్టుకొచ్చారు కమల్. అయితే ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా డిగ్రీతోనే 23 ఏళ్లకు చదువు ఆపేశారు. చదివింది పొలిటికల్ సైన్స్ అయినా.. కుటుంబ పోషణ కోసం 2003లో ముంగర్‌లో ఉండే ఆర్డీ అండ్ డీజే కాలేజీ నైట్ వాచ్‌మెన్‌గా చేరాడు. అదృష్టంకొద్దీ నెల తర్వాత డిప్యుటేషన్ మీద తిల్కా మాంజీ భగల్పూర్ యూనివర్సిటీ(TMBU)కి ప్యూన్‌గా వెళ్లాడు. అక్కడ పీజీలోని అంబేద్కర్ థాట్ అండ్ సోషల్ వర్క్ డిపార్ట్మెంట్కు ప్యూన్‌గా పని చేశాడు. అది ఆయన జీవితాన్ని పెను మలుపు తిప్పింది. స్టాఫ్‌కు చాయ్‌లు, టిఫిన్లు, పేపర్లు అందించిన కమల్‌కి.. అక్కడికి వచ్చే విద్యార్థులు, అధ్యాపకులను చూసిన కిశోర్‌కు మళ్లీ చదువుకోవాలనే కోరిక కలిగింది. దీంతో సంబంధిత విభాగానికి ఆయన అర్జీ పెట్టుకున్నారు. వెంటనే అనుమతి దొరికింది. ఉదయం కాలేజీ.. మధ్యాహ్నాం నుంచి బంట్రోతు పని.. రాత్రిళ్లు చదువు.. ఇలా ఏళ్లకు ఏళ్లు గడిచిపోయింది. మొత్తానికి ఎంఏ(అంబేద్కర్ థాట్ అండ్ సోషల్ వర్క్)ను 2009లో పూర్తి చేశారు. ఆ వెంటనే పీజీ కోసం డిపార్ట్మెంట్లో అనుమతి కోరగా.. మూడేళ్ల తర్వాత అది లభించింది. ఆపై 2013లో పీహెచ్డీ కోసం దరఖాస్తు చేసుకుని.. 2017లో థీసిస్ సమర్పించారు. 2019లో పీహెచ్డీ పట్టా దక్కింది కమల్‌కి. అంతేకాదు.. అదే ఊపుతో లెక్చరర్‌షిప్‌కు సంబంధించిన నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్(NET) పూర్తి చేసి.. నొటిఫికేషన్ల కోసం ఎదురు చూశారు. అయితే లక్ష్య సాధనకు ఆయనకు ఎంతో సమయం పట్టలేదు. 2020లో బీహార్ స్టేట్ యూనివర్సిటీ సర్వీస్ కమిషన్(BSUSC) టీఎంబీయూకి సంబంధించిన నాలుగు అసిస్టెంట్ పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చింది. 12 మంది ఇంటర్వ్యూకి హాజరయ్యారు. అందులో కమల్ కిషోర్ మండల్ కూడా ఒకరు. మే 19, 2022న ఫలితాలు వెలువడగా.. అందులో అర్హత సాధించి.. ఏ యూనివర్సిటీలో అయితే బంట్రోతుగా పని చేశారో.. ఆ యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా అర్హత సాధించారు. అక్టోబర్ 12వ తేదీన ఆయన అసిస్టెంట్ ప్రొఫెసర్ విధుల్లో చేరారు. పేదరికం, కుటుంబ సమస్యలు నా చదువుకు ఆటంకంగా మారలేదు. ఉదయం కాలేజీకి వెళ్లి.. మధ్యాహ్నం డ్యూటీ చేసేవాడిని. రాత్రి పూట చదువుకునేవాడిని. సహకరించిన ప్రొఫెసర్లు, ఉన్నతాధికారులకు ఈ విజయాన్ని అంకితం ఇస్తున్నా:: కమల్ కిశోర్ మండల్ పరిస్థితులు అనుకూలించలేదని, పేదరికం వల్లే తాము చదువు దూరమయ్యామని, మంచి ఉద్యోగం సాధించలేకపోయామని కొందరు చెబుతుంటారు. కానీ, చదువుకోవాలనే కోరిక మనసులో బలంగా ఉంటే పేదరికం ఆటంకం కాదనే నిరూపించాడు కమల్. ప్రతికూల పరిస్థితులను అధిగమించి లక్ష్యాన్ని చేరుకుని విజయం సాధించిన కిశోర్ మండల్ సమాజానికి ఓ ప్రేరణ.. చదువుకోవాలనే అతడి సంకల్పానికి సెల్యూట్ చేస్తున్నా:: నెట్ కోసం కిశోర్‌కు ఉచిత శిక్షణ ఇచ్చిన ప్రొఫెసర్ సంజయ్ కుమార్ జైస్వాల్ -
ఆ రాష్ట్రంలో ప్యూన్లుగా టీచర్లు..!
న్యూఢిల్లీ: త్రిపుర ప్రభుత్వం ఆశ్చర్యకర నిర్ణయం తీసుకుంది. వివిధ శాఖల్లో ఖాళీల ఆధారంగా టీచర్లను ప్యూన్లు, గార్డులు, అంగన్వాడి సూపర్వైజర్లుగా నియమించడానికి సుప్రీం కోర్టులో పిటిషన్ వేసింది. నియామకమైన వారికి ఎలాంటి సర్వీస్ గానీ, చట్టబద్ద హక్కు ఉండదని పేర్కొంది. ఈ నియామకాలపై సుప్రీం కోర్టు తీర్పును రిజర్వ్‌లో ఉంచింది. వివరాల్లోకి వెళ్తే.. ప్రభుత్వం రివైజ్డ్ ఎంప్లాయ్మెంట్ పాలసీ ప్రకారం 2003 సంవత్సరంలో 1,033 మంది పీజీటీ టీచర్లు, 4,666 మంది టీజీటీ టీచర్లను కేవలం ఇంటర్వ్యూ ఆధారంగా నియమించింది. ఈ నియామకాన్ని తప్పు పడుతు టీచర్ల నియామకాన్ని హైకోర్టు కొట్టివేసింది. అయితే నియామకాలపై కొందరు పిటిషనర్లు సుప్రీం కోర్టుకు వెళ్లగా హైకోర్టు తీర్పును సుప్రీం కోర్టు సమర్థిస్తు డిసెంబర్ 31,2017లోపు టీచర్ల నియామకాలపై కొత్త విధానాన్ని రూపొందించి నియామకాలు చేపట్టాలని తీర్పు వెల్లడించింది. సుప్రీం ఆదేశాలకు అనుగుణంగా నూతన విద్యావిధానాన్ని రూపొందించింది. ఈ క్రమంలో టీచర్ల కొరత నేపథ్యంలో పత్రిక ప్రకటన, పరీక్ష ఆధారంగా టీచర్ల నియామకాన్ని చేపట్టింది. మరోవైపు తాత్కాలిక టీచర్ల నియామకాలకు నవంబర్ 1, 2018 నుంచి మార్చి 31, 2020 వరకు సుప్రీం కోర్టు అనుమతి ఇచ్చింది. అర్హతల బట్టి ప్రభుత్వం టీచర్లను నియమించకుండా విద్యార్థి కౌన్సెలర్లు, హాస్టల్ వార్డెన్లుగా నియమించింది. అర్హతలను సడలిస్తూ నియామకాలను చేపట్టడంపై సుప్రీం కోర్టు ప్రభుత్వానికి నోటీసు పంపింది. -
బాస్ వేధిస్తోందని...
ఆగ్రా: బాస్ వేధిస్తుందన్న కారణంతో ఓ ఉద్యోగి చేసిన పని అతన్ని చిక్కుల్లో పడేసింది. విధుల నుంచి సస్పెండ్ కావటంతోపాటు విచారణను ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. వివరాల్లోకి వెళ్తే... అలీఘడ్ జిల్లా కోర్టులో వికాస్ గుప్తా అనే వ్యక్తి ఓ మహిళా సివిల్ జడ్జి దగ్గర ప్యూన్‌గా పనిచేస్తున్నాడు. అయితే గత కొంత కాలంగా అతని వ్యవహారశైలిలో మార్పును గమనించిన ఆమె.. తన ఛాంబర్లో సీసీటీవీ ఫుటేజీని ఉంచారు. ఓరోజు ఆమె నీళ్లు అడగ్గా, గ్లాసులో ఉమ్మేసి మరీ ఆమెకు నీటిని అందించాడు. అదంతా సీసీటీవీలో రికార్డయ్యింది. ఫుటేజీని చూసిన ఆమె ఈ విషయంపై సీనియర్ అధికారులకు ఫిర్యాదు చేశారు. గతవారం ఈ ఘటన చోటు చేసుకోగా, ప్రస్తుతం ఆ వీడియో వైరల్ అయ్యింది. ఈ ఘటనపై ఎంప్లాయిస్ యూనియన్ నేత ఉమా శంకర్ యాదవ్ స్పందించారు. ‘గుప్తా చేసింది ముమ్మాటికీ తప్పే. అయితే గత రెండు నెలలుగా అతనిపై వేధింపులు ఎక్కువయ్యాని తెలిసింది. అప్పటి నుంచి అతని మానసిక స్థితి సరిగ్గా లేదని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. బహుశా అందుకే ఇలా చేసి ఉంటాడేమో’ అని యాదవ్ మీడియాకు తెలిపారు. ఈ ఘటనపై జిల్లా సెషన్స్ న్యాయమూర్తి పీకే సింగ్ ఓ సీనియర్ అధికారితో విచారణకు ఆదేశించారు. నెల రోజుల్లో నివేదిక సమర్పించాలని జడ్జి ఆ అధికారిని ఆదేశించారు. -
గ్లాసులో ఉమ్మేసి మరీ..
-
ప్యూన్ ఆస్తులు రూ. 3 కోట్లు!
గ్వాలియర్: మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో ఓ చిరుద్యోగి వద్ద ఊహకందని రీతిలో ఆదాయానికి మించి భారీ ఆస్తులు బయటపడ్డాయి. కోపరేటివ్ బ్యాంక్‌లో ప్యూన్‌గా పనిచేస్తున్న కుల్దీప్ యాదవ్ అనే వ్యక్తికి చెందిన మూడిళ్లలో మంగళవారం లోకాయుక్త పోలీసులు దాడులు చేసి రూ. 3 కోట్లకు పైగా ఆస్తులు కనుగొన్నారు. వీటిలో ఒక డూప్లెక్ బంగ్లా సహా ఆరు పెద్ద ఇళ్లు, రెండు లగ్జరీ కార్లు, రూ. 3 లక్షల విలువైన నగలు, ఇళ్ల స్థలాలు, తదితరాలు ఉన్నాయి. యాదవ్‌కు బ్యాంక్ లాకర్, డిపాజిట్లు ఉన్నాయని మంగళవారం కూడా దాడులు జరుపుతామని పోలీసులు చెప్పారు. లెక్కింపు తర్వాత ఆయన ఆస్తుల విలువ రూ. 7 కోట్లకు చేరే అవకాశముందన్నారు. సర్వీసులో ఒక్క ప్రమోషన్ కూడా పొందని యాదవ్ అవినీతికి పాల్పడకుంటే అసలు ఆదాయానికి 200 రెట్లు గడించడం సాధ్యం కాదని అన్నారు. ప్రస్తుతం నెలకు రూ.20 వేల జీతం తీసుకుంటున్న యాదవ్ 30 ఏళ్ల సర్వీసు సంపాదన రూ. 16 లక్షలేనని, ఆయన వద్ద కోట్ల ఆస్తులు బయటపడ్డం విస్తుగొలుపుతోందని అన్నారు. -
సెల్ఫ్‌హెల్ప్ గ్రూపు మహిళపై ప్యూను అత్యాచారం
మహిళా స్వయం సహాయక సంఘంలోని ఓ మహిళపై ప్రభుత్వ క్వార్ట్రర్స్‌లో అత్యాచారం చేసినందుకు గాను బ్లాక్ కార్యాలయంలోని ఓ ప్యూనును పోలీసులు అరెస్టు చేశారు. ఈ సంఘటన ఒడిషాలోని జాజ్ పూర్ జిల్లా దనగడి ప్రాంతంలో జరిగింది. రమేష్ దలై అలియాస్ రాము అనే ఆ ప్యూన్ రెండు నెలల క్రితం ఈ అత్యాచారానికి పాల్పడటంతో పాటు.. ఆ సంఘటనను తన మొబైల్ ఫోన్లో వీడియో కూడా తీసి, దాని సాయంతో బాధితురాలిని బ్లాక్ మెయిల్ చేయడం మొదలుపెట్టాడు. ముందుగా ఆమెకు మత్తు మందు కలిపిన పానీయం తాగించి, ఆమె స్పృహ కోల్పోయిన తర్వాత ఆమెపై అత్యాచారం చేసినట్లు ఆరోపణలున్నాయి. పోలీసులు అతడిని అరెస్టు చేసి కోర్టులో ప్రవేశపెట్టారు. అయితే కోర్టు అతడి బెయిల్ దరఖాస్తును తిరస్కరించడంతో అతడిని జ్యుడీషియల్ కస్టడీకి పంపారు.