మహిళా స్వయం సహాయక సంఘంలోని ఓ మహిళపై ప్రభుత్వ క్వార్ట్రర్స్లో అత్యాచారం చేసినందుకు గాను బ్లాక్ కార్యాలయంలోని ఓ ప్యూనును పోలీసులు అరెస్టు చేశారు. ఈ సంఘటన ఒడిషాలోని జాజ్ పూర్ జిల్లా దనగడి ప్రాంతంలో జరిగింది. రమేష్ దలై అలియాస్ రాము అనే ఆ ప్యూన్ రెండు నెలల క్రితం ఈ అత్యాచారానికి పాల్పడటంతో పాటు.. ఆ సంఘటనను తన మొబైల్ ఫోన్లో వీడియో కూడా తీసి, దాని సాయంతో బాధితురాలిని బ్లాక్ మెయిల్ చేయడం మొదలుపెట్టాడు.
ముందుగా ఆమెకు మత్తు మందు కలిపిన పానీయం తాగించి, ఆమె స్పృహ కోల్పోయిన తర్వాత ఆమెపై అత్యాచారం చేసినట్లు ఆరోపణలున్నాయి. పోలీసులు అతడిని అరెస్టు చేసి కోర్టులో ప్రవేశపెట్టారు. అయితే కోర్టు అతడి బెయిల్ దరఖాస్తును తిరస్కరించడంతో అతడిని జ్యుడీషియల్ కస్టడీకి పంపారు.
సెల్ఫ్హెల్ప్ గ్రూపు మహిళపై ప్యూను అత్యాచారం
Published Sat, Feb 22 2014 9:14 PM | Last Updated on Mon, Aug 20 2018 4:44 PM
Advertisement
Advertisement