ప్రతీకాత్మక చిత్రం
న్యూఢిల్లీ: త్రిపుర ప్రభుత్వం ఆశ్చర్యకర నిర్ణయం తీసుకుంది. వివిధ శాఖల్లో ఖాళీల ఆధారంగా టీచర్లను ప్యూన్లు, గార్డులు, అంగన్‌వాడి సూపర్‌వైజర్లుగా నియమించడానికి సుప్రీం కోర్టులో పిటిషన్ వేసింది. నియామకమైన వారికి ఎలాంటి సర్వీస్ గానీ, చట్టబద్ద హక్కు ఉండదని పేర్కొంది. ఈ నియామకాలపై సుప్రీం కోర్టు తీర్పును రిజర్వ్‌లో ఉంచింది. వివరాల్లోకి వెళ్తే.. ప్రభుత్వం రివైజ్డ్ ఎంప్లాయ్‌మెంట్ పాలసీ ప్రకారం 2003 సంవత్సరంలో 1,033 మంది పీజీటీ టీచర్లు, 4,666 మంది టీజీటీ టీచర్లను కేవలం ఇంటర్వ్యూ ఆధారంగా నియమించింది. ఈ నియామకాన్ని తప్పు పడుతు టీచర్ల నియామకాన్ని హైకోర్టు కొట్టివేసింది.
అయితే నియామకాలపై కొందరు పిటిషనర్లు సుప్రీం కోర్టుకు వెళ్లగా హైకోర్టు తీర్పును సుప్రీం కోర్టు సమర్థిస్తు డిసెంబర్ 31,2017లోపు టీచర్ల నియామకాలపై కొత్త విధానాన్ని రూపొందించి నియామకాలు చేపట్టాలని తీర్పు వెల్లడించింది. సుప్రీం ఆదేశాలకు అనుగుణంగా నూతన విద్యావిధానాన్ని రూపొందించింది. ఈ క్రమంలో టీచర్ల కొరత నేపథ్యంలో పత్రిక ప్రకటన, పరీక్ష ఆధారంగా టీచర్ల నియామకాన్ని చేపట్టింది.
మరోవైపు తాత్కాలిక టీచర్ల నియామకాలకు నవంబర్ 1, 2018 నుంచి మార్చి 31, 2020 వరకు సుప్రీం కోర్టు అనుమతి ఇచ్చింది. అర్హతల బట్టి ప్రభుత్వం టీచర్లను నియమించకుండా విద్యార్థి కౌన్సెలర్లు, హాస్టల్ వార్డెన్లుగా నియమించింది. అర్హతలను సడలిస్తూ నియామకాలను చేపట్టడంపై సుప్రీం కోర్టు ప్రభుత్వానికి నోటీసు పంపింది.
Comments
Please login to add a commentAdd a comment