సోనియా కంచుకోటలోకి నెక్స్ట్‌ వెళ్లేదెవరు? | who will after sonia gandhi in Rae Bareli | Sakshi
Sakshi News home page

సోనియా కంచుకోటలోకి వచ్చేది ఎవరు?

Published Fri, Dec 15 2017 3:03 PM | Last Updated on Mon, Oct 22 2018 9:16 PM

who will after sonia gandhi in  Rae Bareli - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : రాజకీయాలకు కాంగ్రెస్‌ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ స్వస్తి పలుకుతున్నారని వచ్చిన వార్తలు పెద్ద చర్చనే లేవనెత్తాయి. శనివారం రాహుల్‌ గాంధీ కాంగ్రెస్‌ పగ్గాలు చేపట్టనున్న నేపథ్యంలో శుక్రవారం ఉదయం పార్లమెంటు నుంచి బయటకు వస్తున్న సోనియాను అక్కడే ఉన్న మీడియా ప్రతినిధులు కొందరు రాహుల్‌ బాధ్యతలు తీసుకుంటున్న నేపథ్యంలో మీరు ఏం చేస్తారు అని ప్రశ్నించారు. అందుకు ఆమె ఇక మిగిలింది రాజకీయాల నుంచి తప్పుకోవడమేగా అని ఓ సూచాయగా చెప్పేశారు. దీంతో ఒక్కసారిగా దీనిపై భారీ స్థాయిలో చర్చలు మొదలుపెట్టారు. అయితే, ఆ వెంటనే కాంగ్రెస్‌ పార్టీ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి రణదీప్‌ సూర్జేవాల్‌ ట్విటర్‌లో ఈ చర్చలకు పుల్‌స్టాప్‌ పెట్టారు. సోనియా రాజకీయాల్లో నుంచి తప్పుకోవడం లేదని కేవలం అధ్యక్ష బాధ్యతల నుంచే వైదొలుగుతున్నారని అన్నారు. ‘సోనియా గాం‍ధీ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్ష బాధ్యతలనుంచి మాత్రమే రిటైర్‌ అవుతున్నారు. రాజకీయాలనుంచి కాదని’’ ఆయన ట్వీట్‌ చేశారు. సోనియా గాంధీ మేధస్సు, ఆశీస్సులు పార్టీకి ఎప్పటకీ అవసరమని చెప్పారు.

అయితే, సోనియా భవిష్యత్‌ కార్యాచరణపై ఓ స్పష్టత ఇప్పటికే రాకపోయినా నిజానికి సోనియా రాజకీయాల నుంచి తప్పుకుంటే ఆమె ప్రస్తుతం కొనసాగుతున్న రాయ్‌బరేలీ స్థానం ఎవరి చేతుల్లోకి వెళుతుంది అన్నదే ప్రధాన ప్రశ్నగా చర్చ నడుస్తోంది. మొట్ట మొదటిసారి రాయ్‌బరేలీలో నాటి కాంగ్రెస్‌ పార్టీ నేత మాజీ ప్రధాని ఇందిరాగాంధీ పోటీ చేసి నాటి భారతీయ లోక్‌ దల్‌ పార్టీకి చెందిన రాజ్‌ నారాయణ్‌ చేతిలో 1977లో ఓడిపోయారు. అప్పటి నుంచి కాంగ్రెస్‌ పార్టీ అక్కడి నుంచి లోక్‌సభకు పోటీ చేస్తూనే ఉంది. 1996, 1998లో మాత్రం బీజేపీ రాయ్‌బరేలీలో విజయం సాధించింది. తొలిసారి 1999 కెప్టెన్‌ సతీష్‌ శర్మను బరిలోకి దించి విజయాన్ని సొంతం చేసుకున్న కాంగ్రెస్‌ పార్టీ ఆ తర్వాత ఆ స్థానాన్ని తమకు కంచుకోటగా మార్చుకుంది. 2004లో తొలిసారి సోనియాగాంధీ రాయ్‌బరేలీ బరిలోకి దిగి భారీ విజయం సొంతం చేసుకున్నారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతి లోక్‌సభ ఎన్నికల్లో ఆమెనే పై చేయి సాధించి రాయ్‌ బరేలీ అంటే కాంగ్రెస్‌కు కంచుకోట అనేట్లుగా మార్చారు. 2014లో కూడా సోనియా విజయం సాధించి ప్రస్తుతం ఎంపీగా కొనసాగుతున్న విషయం తెలిసిందే.

ఇక అమేథి గురించి కూడా ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అక్కడ కూడా జనతా పార్టీకి ఒకసారి, బీజేపీకి ఒకసారి చేజార్చుకున్నప్పటికీ మిగితా అన్ని ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీనే విజయం సొంతం చేసుకుంది. ఈ రెండు నియోజక వర్గాలు సోనియా కుటుంబానివే అనే ముద్ర వేసుకున్నాయి. ఇప్పుడు సోనియా రాజకీయాల నుంచి తప్పుకుంటే రాయ్‌బరేలీలో బరిలోకి దిగేదెవరు అని ప్రశ్న ఉదయిస్తోంది. సోనియా కుటుంబంలోని వారే దిగితే రాహుల్‌ అమేథి నుంచి ఉన్నారు కాబట్టి ప్రియాంకను బరిలోకి దింపుతారా? రాజకీయాలకు అంటిముట్టనట్లు ఉంటున్న ఆమె సోనియా స్థానాన్ని భర్తీ చేస్తారా? ఒక వేళ ఆమె ప్రియాంక భర్త రాబర్ట్‌ వాద్రాను దింపుతారా అనుకుంటే ఇప్పటికే పలు ఆరోపణలు మోస్తున్న వాద్రాను ప్రజలు అంగీకరిస్తారా లేదా? ఈ మాత్రం విషయం కూడా కాంగ్రెస్‌కు తెలియకుండా ఉంటుందా? అంటూ ఇతర ప్రశ్నలు తలెత్తుతున్నాయి. లేదంటే సాంప్రదాయాన్ని పక్కకు పెట్టి పార్టీలోని సీనియర్‌ నేతలు, విశ్వాసం కలిగిన నేతను రాయ్‌బరేలీలో బరిలోకి దింపుతారా అనే మరో ప్రశ్న కూడా వస్తోంది. మొత్తానికి రాయబరేలీలో సోనియా తర్వాత ఎవరు అనే ప్రశ్న మాత్రం పలు విధాలుగా చక్కర్లు కొడుతుందనడంలో సందేహం లేదు.
    

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement