సాక్షి: ఉన్నావ్ రేప్ బాధితురాలు ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైన కేసులో ట్రక్ డ్రైవరు ఆశిష్ కుమార్ పాల్, క్లీనర్ మోహన్‌లకు కోర్టు మూడు రోజుల పోలీస్ కస్టడీని విధించింది. ట్రక్ యజమానిని కూడా పోలీసులు ప్రశ్నిస్తున్నారు. అయితే శనివారం ఉదయం ఈ కేసులో కీలక విషయం తెలిసింది. ప్రమాదం జరిగినప్పుడు వాహనం నెంబర్ కనబడకుండా గ్రీస్ పూసారని తెలిసింది. ప్రమాదం జరిగిన రోజు ఉదయం గం. 05.20లకు ఘటనా స‍్థలం నుంచి 20 కిలోమీటర్ల దూరంలోని టోల్‌ప్లాజా వద్ద ఉన్న సీసీ కెమెరాలో ట్రక్కు నంబర్ ప్లేట్‌పై ఎలాంటి మచ్చలు, మరకలు గానీ లేని విషయం బయటపడింది. దీంతో ఈ ప్రమాదం కావాలనే చేశారనే వాదనకు బలం చేకూరినట్టైంది. ఈ విషయం వాహన యజమానిని ప్రశ్నించగా, ఈఎమ్‌ఐలు కట్టకుండా తప్పించుకోవడానికి తరచూ అలా చేస్తుంటామని చెప్పడం గమనార్హం. ఈ కేసులో 45 రోజుల్లో విచారణ పూర్తి చేసి నివేదిక సమర్పించాలని సుప్రీం కోర్టు సీబీఐని ఆదేశించిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment