Unnao
-
ఉన్నావ్ కేసు.. నిందితుడికి రెండు వారాల మద్యంతర బెయిల్
లక్నో : ఉన్నావ్ అత్యాచార కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన 2017 ఉన్నావ్ అత్యాచార కేసులో ఢిల్లీ హైకోర్టు బీజేపీ ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ సెంగర్‌కు రెండు వారాల మెడికల్ మద్యంతర బెయిల్ మంజూరు చేసింది. -
‘ఉన్నావ్, హత్రాస్ ఘటనల్లో ఏం న్యాయం చేశారు?’
కోల్‌కతా: కోల్‌కతాలోని ఆర్జీ కర్ హాస్పిటల్లో జూనియర్ డాక్టర్ హత్యాచార ఘటనపై బెంగాల్లో ఇంకా నిరసనలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రభుత్వం మంగళవారం ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశం ఏర్పాటు చేసి.. అత్యాచార నిరోధక బిల్లును ఆమోదించింది. ఈ సందర్భంగా మహిళలపై హత్యాచార నేరాలు జరగకుండా ఉండేందుకు సామాజిక సంస్కరణలు అవసరమని సీఎం మమతా బెనర్జీ అభిప్రాయపడ్డారు. ఆర్జీకర్ హత్యాచార ఘటనపై బీజేపీ నేతలు చేస్తున్న ఆరోపణలను అసెంబ్లీ సాక్షిగా మమతా బెనర్జీ తీవ్రంగా ఖండించారు. మహిళలపై ఇటువంటి దారుణ ఘటనలు ఇతర రాష్ట్రాల్లో కూడా జరిగాయని, బీజేపీ పాలిత గుజరాత్, యూపీలో బాధితులకు న్యాయం ఏళ్లతరబడి కూడా అందడం లేదని ప్రస్తావించారామె. ఘటనలు జరిగి ఏళ్లు గడుస్తున్నాయి. ఇప్పటికీ బాధితుల కుటుంబాలకు న్యాయం జరగలేదు. 2020లో ఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్‌లో 20 ఏళ్ల దళిత మహిళపై అత్యాచారం, 2013లో బెంగాల్‌లోని నార్త్ 24 పరగణాల జిల్లాలో ఓ కాలేజీ విద్యార్థినిపై హత్యాచారం, గత వారం బీజేపీ పాలిత రాజస్థాన్‌లోని జైపూర్‌లో ప్రభుత్వ హాస్పిటల్ ఓ చిన్నారిపై జరిగిన అత్యాచారం జరిగాయి. ఆయా ఘటనల్లో ఏం న్యాయం చేశారో బీజేపీ వాళ్లు చెప్పగలరా? అని ప్రశ్నించారామె. అదేవిధంగా బెంగాల్‌లోని నార్త్ పరగణాలలో జరిగిన హత్యాచారం కేసులో శిక్ష విధించాలని తాము డిమాండ్ చేస్తున్నామని, కానీ ఆ కేసు ప్రస్తుతం సుప్రీంకోర్టులో ఉందని గుర్తు చేశారు. ఇదే కేసులో కలకత్తా హైకోర్టు ఒక నిందితుడిని నిర్దోషిగా ప్రకటించి, మరో ఇద్దరి మరణశిక్షను తగ్గించిన తర్వాత సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసినట్లు తెలిపారామె. ఉన్నావ్, హత్రాస్ దారుణ ఘటనల్లో బాధితురాలికి న్యాయం జరగలేదని మాత్రం ఎవరూ మాట్లాడరని బీజేపీ నేతలపై ఆమె మండిపడ్డారు.వాస్తవానికి.. మహిళలపై దారుణమైన నేరాలు, లైంగిక దాడులు బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్, గుజరాత్లో ఎక్కువగా జరుగుతున్నాయని అన్నారు. ఆ రాష్ట్రాలో జరిగిన ఘటనలకు న్యాయం జరగటం లేదని, పశ్చిమ బెంగాల్లో కోర్టు న్యాయం లభిస్తోందని తెలిపారు. మహిళల రక్షణ కోసం కఠినమైన చట్టాలను తీసుకురాని ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షాలు.. మహిళలపై దారుణాలు జరుగుతున్న బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారామె. మీరు(బీజేపీ) తమకు వ్యతిరేకంగా నినాదాలు చేసినట్లే తాను కూడా ప్రధానమంత్రికి, హోంమంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తే ఎలా ఉంటుందని ప్రశ్నించారు. దీదీ సర్కార్ తెచ్చిన కొత్త చట్టానికి ‘అపరాజిత’ అని పేరు పెట్టినట్లు తెలుస్తోంది.Kolkata: At the West Bengal Assembly, CM Mamata Banerjee says, "...I express my condolences to the girl who was raped, murdered and to her family. When the RG Kar incident took place on the night of 9th August, I was in Jhargram. On 10th August, the body was found, and on 12th… pic.twitter.com/TjTZS1gJnc— ANI (@ANI) September 3, 2024#WATCH | Kolkata: At the West Bengal Assembly, CM Mamata Banerjee says, "...I had written two letters to the Prime Minister, but I did not get any reply from him, rather I got a reply from the Minister of Women and Child Development, but I also replied to his reply and informed… pic.twitter.com/XKmSOWDj3B— ANI (@ANI) September 3, 2024 -
‘ఉన్నావ్’ బాధితురాలిపై నిందితుల దాడి, ఇంటికి నిప్పు..ఇద్దరికి తీవ్ర గాయాలు
ఉన్నావ్: యూపీలోని ఉన్నావ్ దళిత బాలిక అత్యాచార ఘటనలో నిందితులు మళ్లీ రెచ్చిపోయారు. మరికొందరితో కలిసి బాధితురాలిపై దాడికి తెగబడ్డారు. ఆమె ఉంటున్న గుడిసెకు నిప్పుపెట్టారు. ఈ ఘటనలో బాధితురాలి ఆరు నెలల కొడుకుతోపాటు, రెండు నెలల వయస్సున్న సోదరి తీవ్రంగా గాయపడ్డారు. సోమవారం సాయంత్రం ఈ ఘటన చోటుచేసుకుంది. ఉన్నావ్‌కు చెందిన 11 ఏళ్ల బాలికపై గత ఏడాది ఫిబ్రవరిలో ఇద్దరు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడ్డారు. ఆమె గర్భం దాల్చి, కుమారుడికి జన్మనిచ్చింది. ఈ కేసులో జైలుకు వెళ్లిన నిందితులు ఇటీవలే బెయిల్‌పై బయటకు వచ్చారు. కేసును వెనక్కి తీసుకునేందుకు బాధితురాలు నిరాకరించిందనే కోపంతోనే దారుణానికి ఒడిగట్టినట్లు భావిస్తున్నారు. అగ్ని ప్రమాదంలో గాయపడిన శిశువుల పరిస్థితి విషమంగా మారడంతో కాన్పూర్ తరలించినట్లు పోలీసులు చెప్పారు. తమ కుమార్తెను అంతం చేసేందుకే నిందితులు ఇంటికి నిప్పుపెట్టారంటూ బాధితురాలి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇలా ఉండగా, ఈ కేసులో నిందితులతో రాజీకి నిరాకరిస్తున్నాడనే కారణంతో గత నెలలో బాధితురాలి తాత, మామ కలిసి జరిపిన దాడిలో బాధితురాలి తండ్రి తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో ఉన్నాడు. -
కారును ఢీకొట్టి ఈడ్చుకెళ్లిన ట్రక్కు.. ఆరుగురు దుర్మరణం..
లక్నో: ఉత్తర్‌ప్రదేశ్ ఉన్నావ్ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. లక్నో-కాన్పూర్ హైవేపై ఓ కూడలి వద్ద కారును ట్రక్కు ఢీకొట్టింది. రోడ్డుపై ఉన్న మరో ముగ్గురిపైకి కూడా దూసుకెళ్లింది ఈ ఘటనలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. ట్రక్కును కారును ఢీకొట్టి కొంతదూరం ఈడ్చుకెళ్లిందని పోలీసులు తెలిపారు. ఆ తర్వాత కారు ఓ గుంతలో పడిందని పేర్కొన్నారు. మృతుల్లో ముగ్గురు ఓకే కుటుంబానికి చెందిన వారని వివరించారు. మరో ఇద్దరు తల్లికూతుళ్లు ఉన్నారని పేర్కొన్నారు. ఆదివారం రాత్రి 7 గంటల సమయంలో ఈ దుర్ఘటన జరిగింది. ఆరుగురు చనిపోవడంతో స్థానికుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ట్రక్కు డ్రైవర్‌ను అరెస్టు చేయాలని వైరు రోడ్డుపై బైఠాయించి నిరసన చేపట్టారు. రెండు గంటలపాటు రహదారిని దిగ్భందించారు. పోలీసులు వచ్చి హామీ ఇవ్వడంతో ఆందోళనలు విరమించారు. ట్రక్కు డ్రైవర్ పరారీలో ఉన్నాడని త్వరలోనే అరెస్టు చేస్తామని పోలీసులు చెప్పారు. చదవండి: చిరుత దాడి.. ఇంటికి వస్తున్న చిన్నారిని ఎత్తుకెళ్లి చంపేసిన వైనం -
Unnao Case: నిందితుడికి బెయిల్ ఇవ్వొద్దని..రాష్ట్రపతికి, ప్రధానికి లేఖ
ఉన్నావ్ కేసు నిందితుడు బీజేపీ మాజీ ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ సెంగార్‌కు మధ్యంతర బెయిల్ మంజురైన సంగతి తెలిసిందే. నాటి ఉన్నావ్ అత్యాచార ఘటనలో ప్రాణాలతో బయటపడిన ఒక మహిళ దీన్ని వ్యతిరేకిస్తూ ప్రధాని నరేంద్ర మోదీకి, రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకి, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌లకు లేఖ రాసింది. వాస్తవానికి నిందితుడు, మాజీ ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ సెంగార్ తన కుమార్తె పెళ్లి కోసం తనను విడుదల చేయాలంటూ హైకోర్టుని ఆశ్రయించారు. అయితే అతను విడుదలైతే తమ ప్రాణాలకు ముప్పు ఉందని, అలాగే ఈ కేసుకు సంబంధించిన సాక్ష్యులను సైతం ప్రభావితం చేస్తాడని బాధిత మహిళ లేఖలో ఫిర్యాదు చేసింది. అతను జైలు వెలుపల ఉంటే తమకు అత్యంత ప్రమాదమని ఆ మహిళ పేర్కొంది. ఇదంతా సెంగార్ కుటుంబం పన్నిన కుట్ర అని కుమార్తె వివాహం పేరుతో బెయిల్‌పై విడుదలయ్యేందుకు ఆడుతున్న నాటకమని లేఖలో ఆరోపించింది. ఇదిలా ఉండగా, కుమార్తె వివాహానికి హాజరయ్యేలా ఢిల్లీ హైకోర్టు జనవరి 27 నుంచి ఫిబ్రవరి 10 వరకు పెరోల్‌పై సెంగార్‌ను విడుదల చేయాలని ఆదేశించడం గమనార్హం. మధ్యంతర విడుదలకు సంబంధించిన దరఖాస్తు తనకు అందలేదని ఫిర్యాదుదారు తరఫు న్యాయవాది మెహమూద్ ప్రాచా సోమవారం తెలియజేయడంతో, కోర్టు సెంగార్ తరపు న్యాయవాదిని కాపీని అందించాలని కోరింది. తదుపరి విచారణను జనవరి 19కి వాయిదా వేసింది. వాస్తవానికి కుల్దీప్ సింగ్ సెంగార్‌కి ఉన్నావ్ 2017 అత్యాచార ఘటనలో దోషిగా తేలడంతో ట్రయల్ కోర్టు జీవత ఖైదు శిక్ష విధించింది. దీన్ని సెంగార్ సవాలు చేస్తూ దాఖలు చేసిన అప్పీలు హైకోర్టులో పెండింగ్‌లో ఉంది. అదీగాక బాధితురాలి తండ్రి కస్టడీలో మరణించిన కేసులో కూడా సెంగార్‌కు, అతని సోదరుడు అతుల్ సింగ్ సెంగార్తో పాటు మరో ఐదుగురికి కూడా కోర్టు 10 ఏళ్ల జైలు శిక్ష విధించింది. (చదవండి: కాంగ్రెస్ తొలి జాబితా .. ఉన్నవ్ అత్యాచార బాధితురాలి తల్లికి టికెట్) -
ఘోర కలి: కాలేజ్ స్టూడెంట్‌పై దారుణ హత్యాచారం
క్రైమ్: ఒంటరిగా ఇంట్లో ఉన్న ఓ కాలేజ్ స్టూడెంట్‌పై ఓ మానవమృగం దారుణానికి తెగపడింది. ఆ దారుణంతో ఘోరం జరిగిపోయింది. యువతి అక్కడికక్కడే కన్నుమూసింది. ఈ కేసులో తొలుత పక్కింట్లో ఉండే ఓ వృద్ధుడిపై అంతా అనుమానం వ్యక్తం చేశారు. అయితే.. ఆ ఘోరానికి పాల్పడింది వృద్ధుడు కాదని.. స్థానికంగా ఉండే మరో యువకుడని పోలీసులు నిర్ధారించారు. ఉత్తర ప్రదేశ్ ఉన్నావ్‌లో జరిగిన ఘోర హత్యాచార ఘటన.. స్థానికంగా అలజడి సృష్టించింది. ఇంట్లో వాళ్లంతా బయటకు వెళ్లిన సమయంలో ఆమెపై దారుణం జరిగింది. తిరిగొచ్చి చూసేసరికి యువతి రక్తపుస్రావంతో నగ్నంగా బెడ్‌పై స్పృహ లేకుండా పడి ఉంది. అది గమనించిన ఆమె సోదరి స్థానికుల సాయంతో ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే ఆమె కన్నుమూసిందని వైద్యులు ప్రకటించారు. యువతిపై అత్యాచారం జరిగిందని, ఆ ప్రయత్నంలోనే రక్తస్రావంతో ఆమె కన్నుమూసిందని వైద్యుల నివేదికలో తేలింది. ఈ క్రమంలో.. పొరుగింట్లో ఉండే ఓ వృద్ధుడిపై అంతా అనుమానం వ్యక్తం చేశారు. తరచూ యువతులను ఏడిపించి.. అసభ్యంగా కామెంట్లు చేసే ఆ పెద్దాయనే ఆ ఘాతుకానికి పాల్పడి ఉంటారని భావించారంతా. ఈ క్రమంలో పోలీసులు ఆయన్ని అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు కూడా. అయితే.. యువతి ఫోన్ డేటా ఆధారంగా రాజ్ గౌతమ్ అనే యువకుడిని సైతం పోలీసులు ప్రశ్నించగా.. నేరం ఒప్పుకున్నాడు. ఈ కేసులో ప్రేమ కోణం వెలుగు చూసింది. రాజ్ గౌతమ్ స్థానికంగా ఓ ప్రైవేట్ స్కూల్లో టీచర్. సివిల్స్‌కు ప్రిపేర్ అవుతున్నాడు కూడా. బాధితురాలితో రెండేళ్లుగా అతనికి పరిచయం ఉంది. ఆమె తన ఛాతీపై అతని పేరు పచ్చబొట్టు వేయించుకుంది. వీళ్ల ప్రేమ వ్యవహారం పెద్దలకు తెలియదు. అయితే.. గురువారం ఇంట్లో ఆమె ఒంటరిగా ఉందని తెలుసుకుని వెళ్లాడు. ఆపై ఆమెను శారీరకంగా కలిసేందుకు యత్నించాడు. కానీ, ఆమె ప్రతిఘటించింది. దీంతో బలవంతం చేశాడు. అయితే.. నేరానికి ముందు నిందితుడు గౌతమ్ ఎనర్జీ పిల్స్(అఫ్రొడిసియాక్ మాత్రలు) తీసుకోవడం.. దారుణానికి కారణమైంది. గింజుకున్న యువతి స్పృహ కోల్పోయినా.. వదలకుండా ఘాతుకానికి పాల్పడడంతో ఆమె అధిక రక్తస్రావం అయ్యి మరణించింది. ఘటన తర్వాత భయంతో అక్కడి నుంచి నిందితుడు పారిపోయినట్లు దర్యాప్తులో తేలింది. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. కోర్టులో ప్రవేశపెట్టి, రిమాండ్‌కు తరలించారు. బాధిత కుటుంబం నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తోంది. -
ఆమె లేకుంటే బతకలేనన్నాడు.. లవరే కదా అని ఆమె దగ్గరైంది.. తర్వాత..
నువ్వుంటే ఇష్టమంటూ ఆమెకు దగ్గరయ్యాడు. ఐ లవ్ యూ అని చెప్పి ప్రేమ పేరుతో ఆమెను వంచించాడు. శారీరకంగా ఆమెకు దగ్గరై.. గర్భవతిని చేశాడు. చివరకు పెళ్లి విషయం ఎత్తడంతో అతడి గురించి అసలు విషయం తెలిసి.. ఆమె షాకైంది. పేరు మార్చుకుని తనను మోసం చేశాడని గుర్తించి ఆవేదనకు లోనైంది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. యూపీలో ఉన్నావ్ చెందిన బాధితురాలికి.. మోనూ పేరుతో ఓ వ్యక్తి దగ్గరయ్యాడు. ఈ క్రమంలో ఆమె అంటే ఇష్టమన్నాడు. ఆమె లేకుంటే బ్రతకలేనంటూ నమ్మించాడు. చివరకు పెళ్లి చేసుకుంటానని ప్రామిస్ చేశాడు. ఇవన్నీ నమ్మిన బాధితురాలు ఓ తప్పు చేసింది. కాబోయే భర్తే కదా అని.. పలుమార్లు శారీరకంగా దగ్గరైంది. ఈ క్రమంలో గర్భం దాల్చింది. దీంతో కంగారుపడిన మోనూ.. ఆమెను మళ్లీ మోసం చేసి.. గర్భాన్ని తొలగించేశాడు. అనంతరం, పెళ్లి చేసుకోవాలని మోనూను కోరింది. కాగా, పెళ్లి చేసుకుంటానని మాయ మాటలు చెప్పి బాధితురాలి వద్ద నుంచి రూ.2 లక్షలు నొక్కేశాడు. ఇక లాభం లేదని బాధితురాలు.. పెళ్లి విషయమై నిలదీయడంతో కనిపించకుండా పోయాడు. దీంతో, బాధితురాలు పోలీసులను ఆశ్రయించగా.. అతడి పేరు మోనూ కాదని.. అసలు పేరు షెహ్నవాజ్ కబాడీ అని తెలియడంతో ఖంగుతింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. Unnao, Uttar Pradesh: Arti met Monu, they fell in love, had a physical relationship, she got pregnant then he terminated her pregnancy. He even took 2 lakh rupees from her promising marriage, now goes missing ever since his true name 'Shehnawaz Kabadi' came to light. See: pic.twitter.com/q1XemSyoTK — Subhi Vishwakarma (@subhi_karma) September 9, 2022 -
భార్యకు పాము కాటు.. కాటేసిన పామునూ ఆస్పత్రికి తీసుకెళ్లాడు
లక్నో: యస్.. భార్యను పాము కాటేసింది. నొప్పితో ఆమె విలవిలలాడుతోంది. స్థానికులంతా చేరి ఆమెను ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేస్తున్నారు. కానీ, ఆ భర్త మాత్రం భార్యను పట్టించుకోలేదు. నానా హంగామా చేసి ఆ పామును పట్టేసుకున్నాడు. పాము కాటుకి గురైన భార్యతో పాటు పామును కూడా ఆస్పత్రికి తీసుకుపోయాడు. అది చూసి డాక్టర్లు భయపడిపోయారు.. ఆ తర్వాత ఏమైందంటే.. చిత్రమైన ఈ ఘటన ఉత్తర ప్రదేశ్ ఉన్నావ్ అఫ్జల్ నగర్ ఏరియాలో జరిగింది. భార్యను పాము కాటేయడంతో జిల్లా ఆస్పత్రికి తీసుకెళ్లాడు భర్త రమేంద్ర యాదవ్. అయితే.. భార్యను కాటేసిన పామును సైతం ఓ బాటిల్లో బంధించి.. దానికి గాలి ఆడేలా ఆ బాటిల్‌కు చిన్నచిన్న రంధ్రాలు చేసి మరీ ఆస్పత్రికి తీసుకొచ్చాడు. ‘ఎందుకు తెచ్చావయ్యా!’ అని వైద్య సిబ్బంది అడిగితే.. ‘‘నీ భార్యను ఏ పాము కాటేసిందని అడిగితే.. ఏమని చెప్పేది. అందుకే.. ఆ పామునే తెచ్చా! అని సమాధానం ఇచ్చాడు రమేంద్ర. ఆ సమాధానం విని డాక్టర్లు తెగ నవ్వుకున్నారట. చికిత్స తర్వాత కోలుకున్న భార్యను ఇంటికి తీసుకెళ్లే క్రమంలోనే.. అడవిలో ఆ పామును వదిలేశానని రమేంద్ర మీడియాకు వెల్లడించాడు. -
పెళ్లి మధ్యలో సొమ్మసిల్లిన వరుడు.. వధువుకి షాక్
పెళ్లిళ్లు స్వర్గంలో నిర్ణయించబడతాయని అనడం ఏమోగానీ.. పచ్చని పెళ్లి పందిట్లోనే రద్దు అవుతున్నాయి. అయితే బలవంతంగా పెళ్లితో ఒక్కటై.. జీవితాంతం నరకం అనుభవించే బదులు.. ముందుగానే ఆపేయడం మేలని అనుకుంటున్నారు చాలామంది. అలాంటి ఘటనే ఇప్పుడు చెప్పుకోబోయేది. పెళ్లి వేడుకలో అమ్మాయి, అబ్బాయి తరఫు బంధువులు అందరూ ఎంతో సంతోషంగా పాల్గొంటున్నారు. కాసేపట్లో తన పెళ్లి అయిపోతుందని పెళ్లి కొడుకు సంబరపడిపోతున్నాడు. అయితే, అలసిపోయి పెళ్లి కొడుకు స్పృహ తప్పిపడిపోయాడు. దీంతో అతడిని లేపేందుకు పెళ్లికూతురు సోదరుడు ముఖంపై నీళ్లు చల్లి, తలపాగా తీయబోయాడు. అదే సమయంలో వరుడి విగ్గు ఊడిపోయింది. ఇంకేం.. పెళ్లి కూతురు సహా బంధువులు అంతా షాకయ్యారు. పెళ్లి కొడుకుకి బట్టతల ఉందని తమకు ముందుగా ఎందుకు చెప్పలేదని, ఇంత మోసం చేస్తారా? అంటూ నిలదీశారు. బట్టతల ఉన్న వ్యక్తిని పెళ్లి చేసుకోనని పెళ్లికూతురు స్పష్టం చేసింది. దీంతో ఇరు కుటుంబ సభ్యుల మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. ఈ విషయాన్ని తెలుసుకున్న పోలీసులు వెంటనే పెళ్లి వేడుక వద్దకు వచ్చారు. ఇరు కుటుంబాలను సముదాయించి, గొడవను ఆపారు. కానీ, పెళ్లిని మాత్రం జరపలేకపోయారు. చివరి నిమిషంలో పెళ్లి రద్దు కావడంతో వరుడు తీవ్ర నిరాశ చెందాడు. అంతా వెనక్కి తిరిగి వెళ్లిపోయారు. ఉత్తరప్రదేశ్ లోని ఉన్నావ్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. పెళ్లి కొడుకు కుటుంబ సభ్యులపై తమకు ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు. ముందుగా తెలిసినా తమ అమ్మాయి సిద్ధమై ఉండేదేమోనని, ఇలా మోసం చేసి చేయడంతో ఆమెకు సహించడం లేదని బంధువులు చెప్తున్నారు. చదవండి: తాళి కట్టే సమయానికి కుప్పకూలిన వధువు.. భలే ట్విస్ట్ -
యూపీ ఎన్నికలు.. ఉన్నవ్ అత్యాచార బాధితురాలి తల్లికి కాంగ్రెస్ టికెట్
లక్నో: అయిదు రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో జాతీయ రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ఎన్నికల్లో తమ సత్తా చాటేందుకు బీజేపీ, కాంగ్రెస్ సహా మిగతా పార్టీలన్నీ తీవ్ర కసరత్తు ప్రారంభించాయి. ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ, సమాజ్‌వాదీ పార్టీల మధ్య ప్రధాన పోటీ నెలకొన్న తరుణంలో తమ ఉనికి చాటుకునేందుకు కాంగ్రెస్ సరికొత్త వ్యూహాలను అనుసరిస్తోంది. ఈ క్రమంలో 125 మంది అభ్యర్థులతో కూడిన కాంగ్రెస్ తొలి జాబితాను గురువారం విడుదల చేసింది. ఇందులో ఉన్నవ్ అత్యాచార బాధితురాలి తల్లి ఆశా సింగ్‌కు టికెట్ ఇచ్చినట్టు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ పేర్కొన్నారు. 125 మందిలో 40 శాతం సీట్లను మహిళలకు రిజర్వ్ చేస్తున్నట్లు తెలిపారు. అదేవిధంగా 40 శాతం యువతకు అవకాశం కల్పిస్తున్నట్లు వెల్లడించారు. గౌరవ వేతనాల కోసం పోరాడిన ఆశా వర్కర్ పూనమ్ పాండే షాజహాన్‌పూర్ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగుతున్నట్లు ప్రియాంక చెప్పారు. మహిళలు, యువతకు కాంగ్రెస్ అత్యధిక ప్రాధాన్యత ఇచ్చిందని, తమ నిర్ణయంతో యూపీలో సరికొత్త రాజకీయాలకు తెరలేస్తుందని ఆమె అన్నారు. దీని ద్వారా రాష్ట్ర రాజకీయాల్లో కొత్త ఒరవడి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు. చదవండి: అయోధ్య నుంచి యోగి పోటీ! -
ఉన్నావ్ దారుణం: సంచలన విషయాలు వెల్లడి
లక్నో: ఉత్తరప్రదేశ్‌లో మహిళలపై దురాగతాలకు అంతు లేకుండా పోతుంది. తాజాగా కొద్ది రోజుల క్రితం ఉన్నావ్‌లో ముగ్గురు మైనర్, దళిత బాలికలపై విషప్రయోగం జరిగిన సంగతి తెలిసిందే. వీరిలో ఇద్దరు మరణించగా.. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. ప్రస్తుతం ఈ బాలిక కాన్పూర్ ఆస్ప్రతిలో చికిత్స పొందుతుది. ఈ దారుణానికి సంబంధించి ఉత్తరప్రదేశ్ పోలీసులు ప్రధాన నిందితుడు వినయ్ అలియాస్ లంబుని అదుపులోకి తీసుకున్నారు. తానే ముగ్గురు మైనర్ బాలికలకు విషం ఇచ్చినట్లు అంగీకరించాడు. ఈ సందర్భంగా పోలీసు అధికారి లక్ష్మి సింగ్ మాట్లాడుతూ.. ‘‘ఈ దారుణం వెనక ప్రధాన కారణం ప్రేమను అంగీకరించకపోవడం. నిందితుడు వినయ్, ఈ ముగ్గురు బాలికలకు లాక్డౌన్ కాలంలో పరిచయం ఏర్పడింది. వీరంతా పశువుల మేపడం కోసం పొలానికి వచ్చేవారు. అందరూ కలిసి భోజనం చేసేవారు.. కబుర్లు చెప్పుకునే వారు. ఈ క్రమంలో వినయ్ ముగ్గురు బాలికల్లో ఒకరిని ప్రేమించాడు. అనేకసార్లు ఆమెకు ప్రపోజ్ చేశాడు. కానీ సదరు బాలిక అంగీకరంచలేదు. కోపం పెంచుకున్న వినయ్ ఎలాగైనా బాలికను అంతం చేయాలనుకున్నాడు’’ అని తెలిపారు. పథకం ప్రకారమే హత్య ‘‘ఈ క్రమంలో వినయ్ తన స్నేహితులతో కలిసి సదరు బాలికను చంపేందుకు ప్రణాళిక రచించాడు. దానిలో భాగంగా తన ఇంటిలో ఉన్న పురుగుల మందును తీసుకెళ్లి నీళ్ల బాటిల్ కలిపాడు. ఆ తర్వాత తినుబండారాలు, పురుగుల మందు కలిపిన వాటర్ బాటిల్ తీసుకుని బాధిత మైనర్ బాలికల దగ్గరకు వెళ్లాడు’’ అని తెలిపారు. ‘‘రోజులానే నిందితుడు వినయ్, మిగతా బాలికలు అందరూ కలిసి భోజనం చేశారు. ఆ తర్వాత వినయ్ తన దగ్గర ఉన్న పురుగుల మందు కలిపిన వాటర్ బాటిల్లోని నీటిని తను ప్రేమించిన అమ్మాయి చేత తాగించాలని భావించాడు. కానీ దురదృష్టం కొద్ది ముగ్గురు అమ్మాయిలు ఆ నీటిని తాగారు. కాసేపటికే బాధితులంతా స్పృహ తప్పి పడిపోయారు. ఊహించని ఈ ఘటనకు భయపడిని వినయ్, అతడి స్నేహితులు అక్కడి నుంచి పరారయ్యారు అని తెలిపారు. పట్టించిన కాల్ డీటెయిల్ రికార్డు దారుణం గురించి తెలిసిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు మొదలు పెట్టారు. అక్కడ వారికి సిగరేట్ పీక, వాటర్ బాటిల్ కనిపించింది. ఆ తర్వాత మిగతా వారిని ప్రశ్నించగా.. వినయ్ పాత్ర బయటకు వచ్చింది. దాంతో పోలీసులు కాల్ డీటెయిల్ రికార్డ్(సీడీఆర్) టెక్నిక్ ద్వారా వినయ్ ఈ దారుణం జరిగినప్పుడు అక్కడే ఉన్నాడని గుర్తించారు. అతడిని అదుపులోకి తీసుకుని విచారించగా.. తాను చేసిన దారుణం గురించి వెల్లడించాడు. ఇక తమ పిల్లలను పొట్టన పెట్టుకున్న నిందితుడిని ఉరి తీయాల్సిందిగా బాధిత బాలికల కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. జరిగిన దారుణం పట్ల విపక్షాలు మండిపడుతున్నాయి. మహిళల భద్రత విషయంలో యూపీ ప్రభుత్వం దారుణంగా విఫలమయ్యింది అంటూ మండి పడుతున్నాయి. చదవండి: దారుణం: ఉలిక్కి పడిన ‘ఉన్నావ్’ వాళ్లను పెళ్లికి పిలవొద్దు.. పిలిచారనుకో.. -
దారుణం: ఉలిక్కి పడిన ‘ఉన్నావ్’
లక్నో: ఉత్తర ప్రదేశ్‌లో మహిళలు, అమ్మాయిలపై అఘాయిత్యాలకు అంతే లేకుండా పోతోంది. తాజాగా మరో ఇద్దరు మైనర్ బాలికలు అఘాయిత్యానికి బలైపోయారు. పశువులను మేపడానికి తీసుకెళ్లిన అమ్మాయిలు విగత జీవులుగా కనిపించడం కలకలం రేపింది. వివరాల్లోకి వెళ్తే.. ఉన్నావ్ గ్రామానికి చెందిన ముగ్గురు మైనర్ బాలికలు పశువులను మేపడానికి వెళ్లి అదృశ్యమయ్యారు. రాత్రి అయినా ఇంటికి రాకపోవడంతో ఆందోళనతో వెతుక్కుంటూ వెళ్లిన కుటుంబ సభ్యులకు తమ పిల్లలు చనిపోయి కనిపించారు. షాక్‌కు గురైన కుటుంబ సభ్యులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. అక్కడకి చేరుకున్న పోలీసులు చనిపోయిన ఇద్దరి శవాలను పోస్ట్‌మార్టం కోసం తరలించారు. ఒకరి పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం ఆసుపత్రికి తరలించారు. వారి మృతదేహాలు ఉన్న చోట నురుగు కనిపించిందని, విష ప్రయోగం జరిగి ఉండవచ్చని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. పోస్ట్‌మార్టం రిపోర్టు వచ్చాక మరిన్ని విషయాలు తెలుస్తాయని పోలీసు అధికారి ఆనంద్ కులకర్ణి తెలిపారు. తమకు ఎవరితోను శతృత్వం లేదని మృతురాలి సోదరుడు కన్నీటి పర్యంతమయ్యాడు. ఇప్పటికే ఈ కేసు దర్యాప్తుకు ఆరు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించినట్లు పోలీస్ అధికారి ఆనంద్ తెలిపారు. చదవండి: పోర్న్ చూస్తున్నారా?.. మెసేజ్ వస్తుంది! -
ఉన్నావ్ కేసు : కుల్దీప్ సెంగార్‌కు పదేళ్ల జైలు
సాక్షి, న్యూఢిల్లీ : ఉన్నావ్ లైంగిక దాడి ఘటనలో బాధితురాలి తండ్రి హత్య కేసులో ఢిల్లీ కోర్టు బీజేపీ బహిష్కృత ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ సెంగార్‌కు పదేళ్ల జైలు శిక్ష విధించింది. సెంగార్‌కు శిక్షను ఖరారు చేస్తూ శుక్రవారం తీర్పు వెలువరించింది. కాగా దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ఉన్నావ్ హత్యాచారం కేసులో సెంగార్‌కు ఢిల్లీ కోర్టు జీవిత ఖైదు విధించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో దోషిగా తేలిన కుల్దీప్ సెంగార్‌కు జీవిత ఖైదు విధించడంతో పాటు బాధితురాలికి రూ.25లక్షల పరిహారం ఇవ్వాలని కోర్టు గత ఏడాది డిసెంబర్లో ఆదేశించింది. ఇక ఉన్నావ్ హత్యాచారం కేసు పలు మలుపులు తిరిగింది. బాధితురాలి కుటుంబంపై ఎన్నోమార్లు హత్యాయత్నం జరిగింది. బాధితురాలి తండ్రి హత్యకు గురయ్యారు. 2017లో కేసు నమోదు కాగా కుల్దీప్ సెంగార్‌కు గత ఏడాది చివర్లో శిక్ష ఖరారైంది. హత్యాచార ఉదంతంలో అప్పటి బీజేపీ ఎమ్మెల్యే కుల్దీప్ సెంగార్‌పై కిడ్నాప్, సామూహిక లైంగిక దాడి ఆరోపణలు వచ్చాయి. బాధితురాలి ఫిర్యాదు మేరకు కుల్దీప్ సెంగార్, అతనికి సహకరించిన శశిసింగ్పై పోక్సోతో పాటు పలు సెక్షన్ల కింద పోలీసులు కేసులు నమోదు చేశారు. చదవండి : సెంగార్‌కు జీవిత ఖైదు -
12 ఏళ్ల బాలికపై అఘాయిత్యం.. గొంతు కోసి!
మహిళలపై మానవ మృగాల ఆగడాలు నానాటికీ మితిమీరిపోతున్నాయి. వయసుతో సంబంధం లేకుండా అఘాయిత్యానికి ఒడిగడుతున్నారు. లైంగిక దాడులకు పాల్పడటమే కాకుండా అవసరమైతే బాధితుల ప్రాణాలు తీయడానికి కూడా వెనకడటం లేదు. అత్యాచారాలు అధికంగా నమోదవుతున్న ఉత్తర ప్రదేశ్‌లో మరో దారుణం వెలుగు చూసింది. మంగళవారం గ్రామస్తులంతా హోలీ పండగ జరుపుకుంటున్నక్రమంలో గుర్తు తెలియని వ్యక్తి ఓ మైనర్ బాలికను అపహరించి అత్యాచారానికి పాల్పడి, హత్యాచారానికి పూనుకున్నాడు. ఈ ఘటన ఉన్నావో ప్రాతంలో చోటుచేసుకుంది. మూడో తరగతి చదువుతున్న బాలిక(12)ను స్థానిక యువకుడు పొలాల్లోకి తీసుకెళ్లాడు. అక్కడ ఆమెపై అత్యాచారానికి పాల్పడి, గొంతు కోసి చంపాడు. అనంతరం అక్కడి నుంచి పారిపోయాడు. (స్కూల్ నుంచి వచ్చిన పిల్లలకు తల్లి విగత జీవిగా..) కాగా కొంతమంది గ్రామస్తులు పొలం వైపు వెళ్లగా అక్కడ అపస్మారక స్థితిలో పడి ఉన్న బాలికను గమనించారు. వెంటనే బాధితురాలి కుటుంబసభ్యులకు, పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు బాలికను ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఆమె పరిస్థితి విషమంగా ఉండటంతో కాన్పూర్‌లోని హాలెట్ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ బాలిక తుది శ్వాస విడిచింది. దీంతో గ్రామ ప్రజలంతా ఆసుపత్రికి చేరి ఆందోళన చేపట్టారు. త్వరలోనే నిందితులను అరెస్టు చేస్తామని ఎస్పీ విక్రాంత్ వీర్ హామీ ఇవ్వడంతో ప్రజలు ఆందోళన విరమించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. (మొబైల్ కొనివ్వలేదని.. మనస్తాపంతో) ప్రియుడి కోసం శ్రీలంకనుంచి.. వీడియోలు లీక్.. బాలిక ఆత్మహత్య -
యావద్దేశానికీ... ఒక ‘దిశ’
ప్రపంచ వ్యాప్తంగా మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడిన పురుషులను చీల్చి చెండాడిన ‘మీటూ’ ఉద్యమం ఈ ఏడాది మహి ళలకు కొత్త శక్తినిచ్చింది. ఈ చైతన్యమే మహిళా ఉద్యమంలో 2019ని మైలురాయిగా నిలిపింది. అక్రమాలపై, అత్యాచారాలపై నిర్భ యంగా గళమెత్తేలా చేసింది. మరోవంక ఇన్ని జరిగినా మృగాళ్లు మాత్రం చెలరేగిపోతూనే వచ్చారు. యావద్దేశానికీ... ఒక ‘దిశ’ నవంబర్ 27, 2019న తెలంగాణలోని శంషాబాద్ టోల్‌ప్లాజా దగ్గర వెటర్నరీ వైద్యురాలిని నలుగురు యువకులు దారుణంగా అత్యాచారం చేసి, హత్య చేసిన ఘటన యావద్దేశాన్నీ అట్టుడికించింది. ఈ ఘాతుకానికి పాల్పడ్డ దుర్మార్గులను తక్షణం ఉరితీయాలంటూ ప్రాంతాలకతీతంగా యావ ద్దేశం ఒక్కటైంది. ఆ తరువాత ఈ దారుణానికి పాల్పడిన నలుగురు యువకులను పోలీసులు ఎదురు కాల్పుల్లో కాల్చి చంపడం వేగంగా జరిగిపోయింది. యువతుల్లో, మహిళల్లో చైతన్యాన్ని నింపే అనేక కార్యక్రమాలకు ఈ ఘటన దారితీసింది. ‘దిశ’పేరుతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కఠినమైన చట్టాన్ని కూడా తెచ్చింది. అత్యాచార బాధితురాలిని కాల్చేశారు ఉత్తరప్రదేశ్‌లోని ‘ఉన్నావ్’లో తనపై అత్యాచా రానికి పాల్పడిన వారిని శిక్షించాలంటూ కోర్టుకెళ్లిన ఓ మహిళ... వారి దౌర్జన్యానికి బలైపోయింది. ఐదుగురు నిందితుల్లో బెయిల్‌పై వచ్చిన ఇద్దరి తోపాటు మరో ముగ్గురు బాధితురాలిని సజీవ దహనం చేసే యత్నం చేశారు. అగ్ని కీలల్లో దగ్ధమ వుతూనే ఆసరా కోసం చుట్టుపక్కల జనాన్ని ప్రా«థేయపడిన బాధితురాలు... చివరకు పోలీసు లకు స్వయంగా ఫోన్ చేసి సాయం కోరడం అందర్నీ కలచి వేసింది. ఈ కేసులో నిందితుడు శుభం త్రివేదీ ఆమెను పెళ్ళి చేసుకుంటానని నమ్మించి, తన సోదరుడితో కలసి ఆమెపై 2018లో అత్యాచారానికి పాల్పడ్డాడు. బా«ధితు రాలు తన మరణ వాంగ్మూలంలో ఇదే చెప్పింది. చివరికామె ఆసుపత్రిలో కన్నుమూసింది. -
మంటలు రేపిన మాటలు..
రాజకీయాలంటేనే ఒకరిపై ఒకరు బురద జల్లుకోవడం... నోటికి ఏదొస్తే అది మాట్లాడటంగా మారిపోయింది. 2019 సంవత్సరం ఎన్నికల ఏడాది కూడా కావడంతో ఎందరో నేతలు నోరు జారారు. దిగజారుడుకు హద్దుల్లేవని నిరూపించారు. అలాంటి మాటలు కొన్ని చూస్తే... మేకిన్ ఇండియా కాదు రేపిన్ ఇండియా – రాహుల్ గాంధీ, కాంగ్రెస్ ముస్లింలీగ్ గ్రీన్ వైరస్ – యోగి ఆదిత్యనాథ్, యూపీ సీఎం గాడ్సే దేశభక్తుడు – ప్రజ్ఞాఠాకూర్, బీజేపీ ఎంపీ జయప్రద లోదుస్తులు ఖాకీ – ఆజంఖాన్, ఎస్పీ నాయకుడు తీరైన తీర్పులు దశాబ్దాలే కాదు... కొన్ని శతాబ్దాల సందిగ్ధానికి కూడా సర్వోన్నత న్యాయస్థానం తెరదించిన సంవత్సరమిది. శ్రీరాముడి జన్మభూమిగా భావించే అయో«ధ్య అంశం మొదలుకొని... రాజకీయ యవనికను కుదిపేసిన రాఫెల్ డీల్ వరకు ఎన్నెన్నో కీలకమైన తీర్పులు వెలువడ్డాయి. వీటిలో మత ప్రాధాన్యమైనవే కాదు!!. మహిళల హక్కులకు సంబంధించినవి... ఆఖరికి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కార్యాలయాన్ని కూడా సమాచార హక్కు చట్టం పరిధిలోకి తీసుకువచ్చే తీర్పులూ ఉన్నాయి. ఆ మేటి తీర్పులు సంక్షిప్తంగా... జన్మభూమి... రాముడిదే! దేశ చరిత్రలోనే సుదీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న అయోధ్యలోని రామ జన్మభూమి – బాబ్రీ మసీదు వివాదంపై భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్‌గొగోయ్ నేతృత్వంలోని ధర్మాసనం నవంబర్ 9న తుది తీర్పు వెలువరించింది. 2.77 ఎకరాల వివాదాస్పద భూమిలో హిందువులు రామ మందిరాన్ని నిర్మించుకోవడానికి అనుమతిం చింది. ముస్లింలకు మసీదు నిర్మాణానికి ఐదు ఎకరాల స్థలాన్ని వేరొకచోట కేటాయించాలని యూపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. మందిర నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం ట్రస్ట్‌ని ఏర్పాటు చేయాలని కూడా కోర్టు స్పష్టం చేసింది. శబరిమలకు మహిళలు... కేరళలోని శబరిమల అయ్యప్పస్వామి దేవాలయంలోకి మహిళల ప్రవేశంపై దాఖలైన రివ్యూ పిటిషన్లను ఏడుగురు సభ్యుల విస్త్రుత ధర్మాసనానికి బదిలీచేస్తూ 3:2 మెజారిటీతో సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. అయితే వయసు రీత్యా కొన్ని వర్గాలకు చెందిన మహిళల ప్రవేశంపై ఉన్న నిషేదాన్ని ఎత్తివేస్తూ 2018 సెప్టెంబర్ 28న ఇచ్చిన తీర్పుపై మాత్రం కోర్టు ఎలాంటి స్టే విధించలేదు. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్, జస్టిస్ నారిమన్, జస్టిస్ ఏఎం ఖన్విల్కర్, జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ ఇందూ మల్హోత్రాలతో కూడిన ధర్మాసనం నవంబర్ 14న ఈ తీర్పుని వెలువరించింది. న్యాయమా! నువ్వు ‘ఉన్నావ్’... ఢిల్లీలో నిర్భయ ఘటన అనంతరం ఉత్తర ప్రదేశ్‌లోని ఉన్నావ్‌లో మైనర్ బాలికపై ఘోర అత్యాచారం జరగటంతో దేశం నిర్ఘాంతపోయింది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తి అధికార బీజేపీ ఎమ్మెల్యే కావటంతో కేసు ఎన్నెన్నో మలుపులు తిరిగింది. పార్టీ అతన్ని బహిష్కరించింది. అయితేనేం!! నేరాన్ని కప్పిపుచ్చే యత్నాలు ఆగలేదు. బాధిత మహిళను కిడ్నాప్ చేయటం... ఆమె తండ్రి లాకప్ హత్య... బాధితురాలు సహా బంధువులను యాక్సిడెంట్ రూపంలో చంపే ప్రయత్నాలు... ఇలా ఎన్నో ఘటనలు చోటుచేసుకున్నాయి. రాజకీయ నాయకుడు నిందితుడైతే కేసు ఎన్ని మలుపులు తిరుగుతుందో అన్ని మలుపులూ తిరిగింది. దీంతో ఈ కేసుపై యావద్దేశం ఒక్కటయింది. చివరికి సర్వోన్నత న్యాయ స్థానం జోక్యం చేసుకుంది. 45 రోజుల్లో విచారణ పూర్తి చేసేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంది. ఫలితం... బీజేపీ బహిష్కృత ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ సెంగార్‌ను దోషిగా నిర్ధారిస్తూ ఢిల్లీ తీస్ హజారీ కోర్టు తీర్పునిచ్చింది. డిసెంబర్ 19న సెంగార్‌కు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. రాఫెల్... విచారణకు నో! రాఫెల్ ఫైటర్ జెట్లను కొనుగోలు చేయటానికి ఆ కంపెనీతో కేంద్ర ప్రభుత్వం చేసుకున్న ఒప్పందంపై విచారణ జరిపించాలని కోరుతూ దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు తిరస్కరించింది. ప్రభుత్వానికి క్లీన్ చిట్ ఇచ్చిన గత తీర్పులను పునఃపరిశీలించాలన్న డిమాండ్‌ని కోర్టు తోసిపుచ్చింది. న్యాయవాది ప్రశాంత్ భూషణ్, కేంద్ర మంత్రులు యశ్వంత్ సింగ్, అరుణ్ శౌరి దాఖలు చేసిన పిటిషన్లపై మే 10న కోర్టు విచారణ ముగించి తన ఉత్తర్వులను రిజర్వులో ఉంచింది. నవంబరు 14న తీర్పు వెలువరించింది. -
సెంగార్‌కు జీవిత ఖైదు
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించిన ఉన్నావ్ అత్యాచారం కేసులో బీజేపీ బహిష్కృత ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ సెంగార్‌కు ఢిల్లీ కోర్టు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. సెంగార్ తన తుది శ్వాస విడిచేవరకు జైలు జీవితం గడపాలని స్పష్టం చేసింది. ఢిల్లీ తీస్‌హజారీ కోర్టు జిల్లా న్యాయమూర్తి జస్టిస్ ధర్మేశ్ శర్మ శుక్రవారం తుది తీర్పు వెలువరించారు. నెల రోజుల్లోగా రూ.25 లక్షలు జరిమానా కూడా చెల్లించాలని సెంగార్‌ను ఆదేశించింది. జరిమానా చెల్లించకపోతే క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ప్రకారం యూపీ ప్రభుత్వమే ఆ మొత్తాన్ని కట్టాలని చెప్పారు. నష్ట పరిహారం కింద అదనంగా రూ.10 లక్షలు ఉన్నావ్ బాధితురాలి తల్లికి అందజేయాలని తీర్పులో పేర్కొన్నారు. నిందితుడిపై కాస్త కరుణ చూపాలన్న సెంగార్ తరఫు లాయర్ వాదనలను తోసిపుచ్చారు. ఎమ్మెల్యేగా ఉంటూ సెంగార్ ప్రజల విశ్వాసాలను దెబ్బ తీశారని, ఈ కేసు తీవ్రతను తగ్గించి చూడాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించారు. బాధితురాలికి, వారి కుటుంబ సభ్యుల ప్రాణాలకు హాని ఉందని, అందుకే వారి భద్రతపై ఎప్పటికప్పుడు సమీక్షించాలని సీబీఐని ఆదేశించారు. బాధితురాలు, ఆమె కుటుంబ సభ్యుల ప్రాణాలకు ఎలాంటి హాని కలగకుండా ఢిల్లీ మహిళా కమిషన్ పర్యవేక్షణలో ఏడాదిపాటు అద్దె ఇంట్లో ఉంచాలని న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. నెలకు రూ.15 వేల అద్దెను యూపీ సర్కారే భరించాలని స్పష్టం చేశారు. బాధితురాలి సాక్ష్యానికి మించింది లేదు: న్యాయమూర్తి సమాజంలో పలుకుబడి కలిగి, శక్తిమంతమైన ఒక వ్యక్తిపై బాధితురాలు చెప్పిన మాటలకు మించిన సాక్ష్యం మరేదీ ఉండదని న్యాయమూర్తి తీర్పు సందర్భంగా చెప్పారు. ఈ కేసులో సహ నిందితురాలు శశి సింగ్‌ను నిర్దోషిగా ప్రకటించారు. ఆమె కూడా సెంగార్ బాధితురాలేనని న్యాయమూర్తి స్పష్టం చేశారు. తీర్పు వెలువరించిన సమయంలో దోషి సెంగార్ కోర్టు హాలులోనే ఉన్నారు. న్యాయమూర్తి యావజ్జీవ కారాగార శిక్ష అనగానే ఆయన ఒక్కసారిగా భోరుమని విలపించారు. తన కుమార్తె, సోదరిని పట్టుకొని ఆయన కన్నీరు పెట్టుకున్నారు. మైనర్లపై అత్యాచార నేరానికి గాను పోక్సో చట్టం కింద మరణ శిక్ష విధించాలి కానీ, ఈ నేరం జరిగిన 2017లో ఆ చట్టానికి సవరణలు జరగలేదు. అందుకే సెంగార్‌కు కోర్టు జీవిత ఖైదు విధించింది. ఉరి శిక్ష విధించాల్సింది : బాధితురాలి సోదరి బీజేపీ బహిష్కృత ఎమ్మెల్యే కులదీప్ సెంగార్‌కు ఉరి శిక్ష విధించి ఉంటే బాగుండేదని బాధితురాలి సోదరి అన్నారు. అప్పుడే తమ జీవితాలు భద్రంగా ఉండేవని ఆమె పేర్కొన్నారు. ‘సెంగార్‌కు ఉరిశిక్ష విధిస్తే మాకు న్యాయం జరిగేది. అతను జైల్లో ఉన్నప్పటికీ అనుక్షణం భయపడ్డాం. సెంగార్ జైలు నుంచి బయటకు వస్తే మమ్మల్ని బతకనివ్వడు’ అని ఆందోళన వ్యక్తం చేశారు. నేరం జరిగిన సమాయానికి పోక్సో సవరణలు చేపట్టలేదు. దీంతో సెంగార్ మరణ శిక్ష నుంచి తప్పించుకున్నాడు. కిడ్నాప్, గ్యాంగ్‌రేప్, కస్టడీ డెత్.. ఉద్యోగం కోసం వెళ్లిన బాధితురాలిపై బీజేపీకి చెందిన ఎమ్మెల్యే సెంగార్ 2017 జూన్ 4వ తేదీన అత్యాచారానికి పాల్పడ్డాడు. సెంగార్ అనుచరులు ఆమెను కిడ్నాప్ చేసి గ్యాంగ్‌రేప్ చేశారు. ఫిర్యాదు చేసిన పోలీసులు పట్టించు కోలేదు. 2018 ఏప్రిల్‌లో బాధితురాలి తండ్రిపై దాడి జరిగింది. దీంతో బాధితురాలు ముఖ్యమంత్రి నివాసం ఎదుటే ఆత్మాహుతికి యత్నించింది. అనంతరం బాధితురాలి తండ్రి పోలీసు కస్టడీలోనే చనిపోయాడు. ప్రభుత్వం ఈ కేసును సీబీఐకి అప్పగించింది. సెంగార్‌ను సీబీఐ అరెస్ట్ చేíసినా బెదిరింపులు వస్తున్నాయంటూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి బాధితురాలు లేఖ రాసింది. ఆ తర్వాత ఆమె ప్రయాణిస్తున్న కారుని ఒక లారీ ఢీకొంది. దీంతో సుప్రీంకోర్టు ఇందుకు సంబంధించిన కేసులన్నిటి ఢిల్లీ కోర్టుకు మార్చాలని ఆదేశించింది. -
నేరానికి తగిన శిక్ష
అధికార మదంతో, తలపొగరుతో ఇష్టానుసారం చెలరేగే రాజకీయ నాయకుల వెన్నులో వణుకు పుట్టేలా ఉన్నావ్ అత్యాచార ఉదంతంలో బహిష్కృత బీజేపీ ఎమ్మెల్యే కులదీప్ సెంగార్‌కు ఢిల్లీ కోర్టు యావజ్జీవశిక్ష విధించింది. ఆయన తన శేష జీవితం మొత్తం జైల్లోనే గడపాలని, బాధితురాలికి రూ. 25 లక్షల జరిమానా చెల్లించాలని, మరో పది లక్షల రూపాయలు ఆమె తల్లికి ఇవ్వాలని శుక్రవారం తీర్పునిచ్చింది. ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావ్‌లో రెండేళ్లక్రితం జరిగిన ఈ అత్యాచార ఘటన దేశ వ్యాప్తంగా అలజడి రేపింది. చివరకు ఐక్యరాజ్యసమితి సైతం ఈ ఉదంతంపై ఆందోళన వ్యక్తం చేసి, నేరగాళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. ఉన్నావ్ బాధితురాలు పడిన వెతలు అన్నీ ఇన్నీ కాదు. ఆమెను అపహరించి పదిరోజులపాటు అత్యాచారం చేయడం మాత్రమే కాదు... అదేమని ప్రశ్నించిన పాపానికి ఆ ఇంటిల్లిపాదినీ సెంగార్, ఆయన అనుచరగణం భయభ్రాంతులకు గురిచేశారు. వారికి పనులు దొరక్కుండా చేశారు. ఆ కుటుంబంతో మాట్లాడా లంటే భయపడేలా ఊరు మొత్తాన్ని శాసించారు. అతగాడిపై కేసు పెట్టాలంటూ బాధితురాలు పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతుండగా ఎప్పటికప్పుడు ఆమె కుటుంబసభ్యులను బెదిరించడం, దౌర్జన్యం చేయడం వారికి నిత్యకృత్యంగా మారింది. తనను అపహరించారని, సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారని బాధితురాలు ఫిర్యాదు చేస్తే పోలీసులు మాత్రం అపహరించడం(ఐపీసీ సెక్షన్ 363), బలవంతంగా పెళ్లాడేందుకు ప్రయత్నించడం(ఐపీసీ 366) వంటి ఆరోపణలు మాత్రమే ఎఫ్ఐఆర్లో రాశారు. సెంగార్ సోదరుడు బాధితురాలి తండ్రిని తీవ్రంగా కొట్టి గాయపరిచినప్పుడు పోలీసులు ఆయన్ను ఆసుపత్రికి తరలించకుండా పోలీస్ లాకప్‌లో ఉంచారు. ఆలస్యంగా వైద్య చికిత్స అంద డంతో ఆయన రెండురోజులు నరకం అనుభవించి కన్నుమూశాడు. ఇక తానూ, తన కుటుంబం ఏకాకులమని, ఎవరి ఆసరా తమకు లభించే అవకాశం లేదని నిర్ధారణయ్యాక బాధితురాలు ముఖ్య మంత్రి యోగి ఆదిత్యనాథ్ నివాసగృహం సమీపంలో కిరోసిన్ పోసుకుని ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించింది. సెంగార్ సోదరుడు, మరికొందరు ఆమె తండ్రిపై దౌర్జన్యం చేయడం, నెత్తురు ముద్దలా మారిన ఆ వృద్ధుణ్ణి స్టేషన్లో కూర్చోబెట్టి పోలీసులు తాపీగా ప్రశ్నించడం వంటి దృశ్యాలు సామాజిక మాధ్యమాలకెక్కి అల్లరై జనం ఛీ కొట్టాకగానీ ఎమ్మెల్యే సోదరుణ్ణి అరెస్టు చేయలేదు. అటు తర్వాత ఈ కేసును రాష్ట్ర ప్రభుత్వం సీబీఐకి అప్పజెప్పింది. ఆ తర్వాతే కులదీప్ సెంగార్‌ను అరెస్టు చేశారు. ఈలోగా బాధితురాలి బాబాయ్‌పై తప్పుడు కేసులుపెట్టి జైలుకు పంపారు. ఉన్నావ్ ఉదంతం మన దేశంలో రాజ్యాంగమూ, చట్టమూ ఉన్నాయా అన్న సందేహాన్ని కలిగించింది. ఉన్నావ్ బాధితురాలు ఆ ఉదంతం జరిగేనాటికి మైనర్. 2012లో వచ్చిన పోక్సో చట్టం కఠినమైనది. మొన్న జూలైలో సవరణలు చేసి దాన్ని మరింత కఠినంగా మార్చి నేరగాళ్లకు ఉరిశిక్ష పడే నిబంధన తీసుకొచ్చారు. కానీ 2017లో ఆ చట్టం బాధితురాలికి ఏమాత్రం ఉపయోగపడలేదు. ఆ చట్టం ఉన్నా అది తమకు తెలియనట్టు, అసలు లేనట్టు పోలీసులు ప్రవర్తించారు. మన దగ్గరున్న సమస్య అదే. నేరగాళ్లు సాధారణ వ్యక్తులైతే ఒకలా, రాజకీయ పలుకుబడి గలవారైతే మరోలా వ్యవహరిస్తుండటం రివాజుగా మారింది. ఉన్నావ్‌లో అది పరాకాష్టకు చేరింది. మొన్న జూలైలో న్యాయస్థానంలో జరిగే విచారణలో పాల్గొనడానికి బాధితురాలి కుటుంబం కారులో వెళ్తుండగా ఒక ట్రక్కు దాన్ని ఢీకొట్టింది. ఇందులో ఆమె పిన్ని, మేనత్త మరణించారు. బాధితురాలు, న్యాయవాది గాయపడ్డారు. ఈ ఉదంతం తర్వాత బాధితురాలు నేరుగా అప్పటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయ మూర్తి రంజన్ గొగోయ్‌కి లేఖ రాశాక ఆయన జోక్యం చేసుకుని ఇందుకు సంబంధించిన కేసుల న్నిటినీ లక్నో న్యాయస్థానం నుంచి ఢిల్లీకి మార్చారు. రోజువారీ విచారించాలని, 45 రోజుల్లో పూర్తి చేయాలని నిర్దేశించారు. అటు తర్వాతే బీజేపీ సెంగార్‌ను పార్టీ నుంచి బహిష్కరించింది. నేరారోపణలొచ్చిన వ్యక్తి అధికార పక్ష నాయకుడైతే అధికార యంత్రాంగాన్ని కదిలించడం ఎంత కష్టమో, ఎంత ప్రాణాంతకమో ఉన్నావ్ బాధితురాలు, ఆమె కుటుంబం పడిన కష్టాలు గమనిస్తే బోధపడుతుంది. సెంగార్ ఆ రాష్ట్రంలోని ప్రధాన పార్టీలన్నిటిలోనూ పనిచేశాడు. ఎక్కడున్నా ఆయనపై ఆరోపణలు తరచు వస్తూనే ఉన్నాయి. బీజేపీలో చేరకముందు ఆయన బీఎస్పీ, సమాజ్ వాదీ పార్టీల్లో పనిచేశాడు. కానీ ఆయన ఓట్లు సాధించిపెట్టే బలమైన నాయకుడు గనుక ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఆయన అరాచకాలపై ఎవరూ నోరెత్తలేదు. దేశంలో, మరీ ముఖ్యంగా ఉత్తరా దిలో ఇలాంటివారే నాయకులుగా చలామణి అవుతున్నారు. ఉన్నావ్ బాధితురాలు రెండేళ్లపాటు ఒంటరి పోరు చేయాల్సి రావడం ఇందువల్లే. నేరం జరిగినప్పుడు వెంటవెంటనే వ్యవస్థలు కదలకపోయినా, ఆ నేరానికి తగిన శిక్ష పడకపోయినా సమాజంలో మరింతమంది నేరగాళ్లు పుట్టుకొస్తారు. ఏం చేసినా తమకేమీ కాదన్న ధైర్యంతో బరితెగిస్తారు. కనుక చట్టాలు కఠినంగా ఉండటం మాత్రమే సరిపోదు. అవి సత్వరం రంగంలోకి దిగాలి. అప్పుడే అందరిలోనూ చట్టాలంటే భయం ఏర్పడుతుంది. నిర్భయ ఉదంతం జరిగాక నియమించిన జస్టిస్ జేఎస్ వర్మ కమిటీ ఒక విలువైన మాట చెప్పింది. సమాజంలో నేరాలు అధికంగా అణగారిన వర్గాలు, మహిళలు, పిల్లలపైనే జరుగుతాయని, అందువల్ల వారి రక్షణకు ఉద్దేశించిన విభాగాలు ఎలా పనిచేస్తున్నాయో ఎప్పటి కప్పుడు తనిఖీలు నిర్వహిస్తుండాలని ఆ కమిటీ తెలిపింది. ఏ అధికారి అయినా, కింది స్థాయి సిబ్బంది అయినా అలసత్వం ప్రదర్శిస్తున్నట్టు తేలితే తక్షణం కఠిన చర్యలు తీసుకోవాలని సూచిం చింది. ఉన్నావ్ ఉదంతం దేశంలోని అన్ని ప్రభుత్వాలకూ గుణపాఠం కావాలి. చట్టాలు సమర్థ వంతంగా పనిచేసేలా, వ్యవస్థలు సత్వరం కదిలేలా తీర్చిదిద్దాలి. అప్పుడు మాత్రమే చట్టాలంటే భయభక్తులు ఏర్పడతాయి. -
ఉన్నావ్ కేసు: కుల్దీప్ సింగ్‌కు జీవితఖైదు
-
ఉన్నావ్ కేసు: కుల్దీప్ సింగ్‌కు జీవితఖైదు
సాక్షి, న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఉన్నావ్ అత్యాచార కేసులో ఢిల్లీ తీస్‌హజారీ కోర్టు శిక్షను ఖరారు చేసింది. ఈ కేసులో ఇప్పటికే దోషిగా తేలిన కుల్దీప్ సింగ్ సెంగార్‌కు న్యాయస్థానం జీవితఖైదు శిక్షను విధించింది. బాధిత కుటుంబానికి రూ. 25 లక్షల పరిహారం కూడా చెల్లించాలని కోర్టు ఆదేశించింది. ఈ మేరకు కేసును విచారించిన ధర్మాసనం శుక్రవారం సంచలన తీర్పును వెలువరించింది. తనను కిడ్నాప్ చేసి అత్యాచారం చేశారని కుల్దీప్ సింగ్ సెంగార్‌పై ఓ మైనర్ బాలిక పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. రెండేళ్ల క్రితం నమోదైన ఈ కేసుకు సంబంధించి రహస్య విచారణ చేపట్టారు. సీబీఐ వాదనలు పూర్తయిన తర్వాత ఘటనలో ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న కుల్దీప్సింగ్ సెంగార్‌ను ఈ నెల 16న దోషిగా తేల్చుతూ కోర్టు తీర్పును వెలువరించింది. అత్యాచారం (376) కింద ఆయనను దోషిగా కోర్టు నిర్థారించింది. బాలిక కిడ్నాప్.. అత్యాచారం.. బాధితురాలి తండ్రి లాకప్ మరణం.. ఆమె ప్రయాణిస్తున్న వాహనానికి ప్రమాదం.. వంటి మలుపులతో రెండేళ్లుగా నలుగుతున్న ఈ కేసులో ఎట్టకేలకు బాధితురాలికి న్యాయం జరిగింది. (సెంగార్‌కు ఉరే సరి) కాగా అభియోగాల నమోదుకు సుమారు పది రోజుల ముందు అత్యాచార బాధితురాలు ఓ కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడింది. ఈ ఏడాది జూలై 28న బాధితురాలు, ఆమె బంధువులు, న్యాయవాది ప్రయాణిస్తున్న కారును ఓ ట్రక్కు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బాధితురాలు గాయపడగా, ఆమె బంధువులిద్దరూ మరణించారు. న్యాయవాది కూడా తీవ్రంగా గాయపడ్డారు. ఇది సాధారణ ప్రమాదం కాదనీ, తనను అంతం చేసే ప్రయత్నంలో భాగంగానే జరిగిందని బాధితురాలు అప్పట్లో ఆరోపించింది. అప్పటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్‌కి బాధితురాలు ఈ పరిణామాలపై లేఖ రాసింది. దీంతో ఆయన స్పందించి ఇందుకు సంబంధించిన అన్ని కేసులను లక్నో నుంచి ఆగస్టు 1వ తేదీన ఢిల్లీకి బదిలీ చేశారు. రోజువారీ విచారణ జరిపి 45 రోజుల్లోగా పూర్తి చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. (‘ఉన్నావ్’ దోషి ఎమ్మెల్యేనే) సుప్రీంకోర్టు జోక్యంతో ఆగస్టు నుంచి రోజువారీ విచారణ చేపట్టింది. ఐపీసీ సెక్షన్ 120 బి (నేరపూరిత కుట్ర), 363 (కిడ్నాపింగ్), 366 (కిడ్నాప్, వివాహం చేసుకోవాలంటూ బలవంతం చేయడం), 376 (అత్యాచారం), పోక్సో చట్టంలోని ఇతర సెక్షన్ల కింద సెంగార్‌పై పోలీసులు కేసులు పెట్టారు. కాగా బీజేపీకి చెందిన కుల్దీప్ సింగ్ ఉన్నావ్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించాడు. ప్రస్తుతం ఆయన తీహార్ జైలులో ఉన్నాడు. -
సెంగార్‌కు ఉరే సరి
ఉన్నావ్/న్యూఢిల్లీ: ఉన్నావ్ అత్యాచారం కేసులో బీజేపీ బహిష్కృత ఎమ్మెల్యే కుల్దీప్ సెంగార్‌కు ఉరిశిక్ష విధించాలని బాధితురాలి తల్లి మంగళవారం డిమాండ్ చేశారు. మరో నిందితురాలు శశిసింగ్‌ను నిర్దోషిగా విడుదల చేయడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. రెండేళ్ల క్రితం యూపీలోని ఉన్నావ్‌లో ఓ మైనర్ బాలికను కిడ్నాప్ చేసి అత్యాచారం చేశారన్న కేసులో ఢిల్లీ కోర్టు సెంగార్‌ను సోమవారం దోషిగా నిర్ధారించిన విషయం తెలిసిందే. కోర్టు తీర్పుపై బాధితురాలి తల్లి మంగళవారం స్పందిస్తూ ‘‘శశిసింగ్‌ను ఎందుకు వదిలేశారు? ఉద్యోగమిస్తానని మాయమాటలు చెప్పి నా కూతురిని కుల్దీప్ సెంగార్ వద్దకు తీసుకెళ్లింది శశిసింగే’అని వాపోయారు. బాధితురాలి సమీప బంధువు ఇప్పటికీ జైల్లో ఉన్నారని, అతడు విడుదలయ్యేంత వరకూ తనకు న్యాయం దక్కనట్లేనని స్పష్టం చేశారు. దోషికి కఠినాతి కఠినమైన శిక్ష విధించాలని సీబీఐ వాదించగా ఈ అంశంపై తాను డిసెంబరు 20న తీర్పు వెలువరిస్తానని ఢిల్లీ జిల్లా న్యాయమూర్తి ధర్మేశ్ శర్మ ప్రకటించారు. (ఉన్నావ్’ దోషి ఎమ్మెల్యేనే) -
ఉన్నావ్ కేసులో ఎమ్మెల్యేనే దోషి
-
‘ఉన్నావ్’ దోషి ఎమ్మెల్యేనే
న్యూఢిల్లీ: నిర్భయ ఘటన తర్వాత అదే స్థాయిలో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఉన్నావ్ అత్యాచారం కేసులో కోర్టు తీర్పు వెలువరించింది. బాలిక కిడ్నాప్.. అత్యాచారం.. బా«ధితురాలి తండ్రి లాకప్ మరణం.. ఆమె ప్రయాణిస్తున్న వాహనానికి ప్రమాదం.. వంటి మలుపులతో రెండేళ్లుగా నలుగుతున్న ఈ కేసులో ఎట్టకేలకు బాధితురాలికి న్యాయం జరిగింది. సుప్రీంకోర్టు జోక్యంతో ఆగస్టు నుంచి రోజువారీ విచారణ చేపట్టిన తీస్‌హజారీ కోర్టు సోమవారం బీజేపీ బహిష్కృత ఎమ్మెల్యే కుల్దీప్సింగ్ సెంగార్‌ను దోషిగా తేల్చింది. ఈ కేసులో 19వ తేదీన శిక్ష ఖరారు చేయనున్నట్లు సోమవారం తెలిపింది. రెండేళ్లు.. అనూహ్య మలుపులు.. నిర్భయ ఘటనలో విచారణ జాప్యంపై వెల్లువెత్తిన ప్రజాగ్రహం ఒకవైపు, దిశ ఘటనతో దిగ్భ్రాంతికి గురైన సమాజం మరోవైపు ఉండగా ఉన్నావ్ ఘటనలో తాజా తీర్పు కొంత ఊరటనిచ్చింది. ఈ కేసులో సహ నిందితురాలు శశి సింగ్‌ను కోర్టు నిర్దోషిగా ప్రకటించింది. బాధిత బాలికను ఘటనా స్థలానికి తీసుకెళ్లింది శశి సింగే అయినప్పటికీ, అక్కడ అత్యాచారం జరుగుతుందన్న విషయం శశికి తెలియదని అభిప్రాయపడింది. సెంగార్ బాలికపై అత్యాచారానికి పాల్పడినట్టు సెల్‌ఫోన్ రికార్డు ఆధారంగా నిర్ధారించిన కోర్టు తీర్పును వెలువరించింది. బాధితురాలి ఆందోళన.. సోషల్ మీడియా.. 2017లో బాలికను కిడ్నాప్ చేసి, బీజేపీ బహిష్కృత ఎమ్మెల్యే సెంగార్ అత్యాచారానికి పాల్పడ్డాడు. దీనిపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. దీంతో ముఖ్యమంత్రి యోగి ఇంటి ఎదుట బాధితురాలు ఆందోళనకు దిగింది. ఆ తర్వాతే పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ తర్వాత బాధితురాలి తండ్రిపై ఎమ్మెల్యే సోదరుడు అతుల్ సెంగార్ దాడి చేశాడు. తీవ్రంగా గాయపడ్డ బాధితురాలి తండ్రిని పోలీసులు జైల్లో నిర్బంధించారు. రెండు రోజుల అనంతరం ఆయన కస్టడీలోనే మృతి చెందారు. తన తండ్రిపై ఎమ్మెల్యే సోదరుడు దాడి చేస్తున్న వీడియో క్లిప్పింగ్‌ని బాధితురాలు సోషల్ మీడియాలో పెట్టడంతో వైరల్ అయింది. ప్రజల్లో వ్యతిరేకత రావడంతో కేసును ప్రభుత్వం సీబీఐకి అప్పగించింది. ఆ తర్వాతే ప్రధాన నిందితుడు సెంగార్, మరో ఇద్దరిని అరెస్టు చేశారు. బీజేపీ నుంచి కుల్దీప్ సింగ్ బహిష్కరణ.. ఉత్తరప్రదేశ్‌లోని బంగేరుమావ్ నుంచి సెంగార్ నాలుగు పర్యాయాలు బీజేపీ తరఫున ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆరోపణల నేపథ్యంలో బీజేపీ ఆయన్ను ఆగస్టులో పార్టీ నుంచి బహిష్కరించింది. ఐపీసీ సెక్షన్ 120 బి (నేరపూరిత కుట్ర), 363 (కిడ్నాపింగ్), 366 (కిడ్నాప్, వివాహం చేసుకోవాలంటూ బలవంతం చేయడం), 376 (అత్యాచారం), పోక్సో చట్టంలోని ఇతర సెక్షన్ల కింద సెంగార్‌పై పోలీసులు కేసులు పెట్టారు. విచారణ ప్రక్రియ మొత్తాన్ని కెమెరాలో రికార్డు చేశారు. ఈ కేసులో ప్రధాన సాక్షులు బాధితురాలి తల్లి, మామ. కోర్టు తీర్పు అనంతరం బాధితురాలికి ప్రత్యేకంగాభద్రతను ఏర్పాటు చేశారు. బాధితురాలిని, ఆమె కుటుంబ సభ్యులను ప్రత్యేక వసతి గృహంలో ఉంచారు. కారు ప్రమాదంపై అనుమానాలు ఈ ఏడాది జూలై 28న బాధితురాలు, ఆమె బంధువులు, న్యాయవాది ప్రయాణిస్తున్న కారును ఓ ట్రక్కు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బాధితురాలు గాయపడగా, ఆమె బంధువులిద్దరూ మరణించారు. న్యాయవాది కూడా తీవ్రంగా గాయపడ్డారు. ఇది సాధారణ ప్రమాదం కాదనీ, తనను అంతం చేసే ప్రయత్నంలో భాగంగానే జరిగిందని బాధితురాలు అప్పట్లో ఆరోపించింది. లక్నో నుంచి ఢిల్లీ కోర్టుకు కేసు.. అప్పటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్‌కి బాధితురాలు ఈ పరిణామాలపై లేఖ రాసింది. దీంతో ఆయన స్పందించి ఇందుకు సంబంధించిన అన్ని కేసులను లక్నో నుంచి ఆగస్టు 1వ తేదీన ఢిల్లీకి బదిలీ చేశారు. రోజువారీ విచారణ జరిపి 45 రోజుల్లోగా పూర్తి చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. బాధితురాలి తండ్రిపై అక్రమ ఆయుధాల కేసు, ఆయన లాకప్ మరణం, బాధితురాలికి రోడ్డు ప్రమాదం, బాధితురాలిపై గ్యాంగ్ రేప్‌కి సంబంధించిన కేసుతో సహా మొత్తం నాలుగు కేసులపై విచారణ కొనసాగుతోంది. భోరుమన్న సెంగార్ ఈ కేసులో మధ్యాహ్నం మూడు గంటలకు కోర్టు తీర్పు వెలువడనుందని వెల్లడించగానే కోర్టు ఆవరణ ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారిపోయింది. కోర్టులోకి ఇరు పక్షాల న్యాయవాదులు మినహా ఎవ్వరినీ అనుమతించలేదు. సీబీఐని కొన్ని ప్రశ్నలడిగిన అనంతరం జిల్లా జడ్జి ధర్మేష్ శర్మ ఎమ్మెల్యే సెంగార్‌ను దోషిగా ప్రకటిస్తూ తీర్పునిచ్చారు. దీంతో సెంగార్, ఆయన కుమార్తెలు భోరున విలపించారు. సీబీఐకి కోర్టు అక్షింతలు ఈ ఘటనపై విచారణలో జాప్యానికి సీబీఐనే కారణమని కోర్టు పేర్కొంది. నిబంధనలకు విరుద్ధంగా పురుష అధికారులు వాంగ్మూలం తీసుకోవడం, విచారణ కోసం ఆమెను సీబీఐ కార్యాలయానికి పిలిపించు కోవడాన్ని తప్పుపట్టింది. -
ఉన్నావ్ కేసులో ఢిల్లీ కోర్టు తీర్పు
-
ఉన్నావ్ కేసులో ఢిల్లీ కోర్టు సంచలన తీర్పు
సాక్షి, న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఉన్నావ్ అత్యాచార కేసులో ఢిల్లీ తీస్‌హజారీ కోర్టు సంచలన తీర్పును వెలువరించింది. ఘటనలో ప్రధాన నిందితుడిగా ఉన్న బీజేపీ బహిష్కృత ఎమ్మెల్యే కుల్దీప్సింగ్ సెంగార్‌ను దోషిగా తేల్చింది. కేసుపై సుదీర్ఘంగా విచారించిన ధర్మాసనం సోమవారం తీర్పును వెలువరించింది. పోలీసులు నమోదు చేసిన సెక్షన్లపై కేసును విచారించిన ధర్మాసనం ఐపీసీ సెక్షన్ 376 (అత్యాచారం) కింద అతన్ని దోషిగా తేల్చింది. ఈ నెల 19న శిక్షను ఖరారు చేయనున్నట్లు న్యాయమూర్తి వెల్లడించారు. తనను కిడ్నాప్ చేసి అత్యాచారం చేశారని కుల్దీప్ సింగ్ సెంగార్‌పై ఓ మైనర్ బాలిక పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. రెండేళ్ల క్రితం నమోదైన ఈ కేసుకు సంబంధించి రహస్య విచారణ చేపట్టారు. సీబీఐ వాదనలు పూర్తయిన తర్వాత కోర్టు ఈ మేరకు తీర్పును వెలువరించింది. కాగా బీజేపీకి చెందిన కుల్దీప్ సింగ్ ఉన్నావ్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించాడు. ప్రస్తుతం ఆయన తీహార్ జైలులో ఉన్నాడు. ఈ ఏడాది ఆగస్టు 5వ తేదీ నుంచి న్యాయమూర్తి ధర్మేశ్ శర్మ ఈ కేసుపై రోజువారీ విచారణ చేపట్టిన విషయం తెలిసిందే. సుప్రీంకోర్టు చొరవతో ఈ కేసు లక్నో నుంచి ఢిల్లీ కోర్టుకు బదిలీ అయింది. 2017లో బీజేపీ ఎమ్మెల్యే కుల్దీప్ సెంగార్ ఓ బాలికను కిడ్నాప్ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఇందుకు సంబంధించి శశిసింగ్ అనే వ్యక్తిపై అభియోగాలు నమోదయ్యాయి కూడా. రెండేళ్ల తర్వాత ఈ ఏడాది ఆగస్టు 9న ఎమ్మెల్యేపై కూడా అభియోగాలు నమోదు కాగా బీజేపీ ఆయన్ను పార్టీ నుంచి బహిష్కరించింది. నేరపూరిత కుట్ర (120బీ), కిడ్నాప్ (363), పెళ్లికి బలవంత పెట్టడం (366), అత్యాచారం (376) తదితర అంశాలతోపాటు లైంగిక వేధింపుల నుంచి చిన్నారులకు రక్షణ కల్పించే చట్టం(పోక్సో) కింద ఆ ఇద్దరిపైనా కేసులు నమోదయ్యాయి. అభియోగాల నమోదుకు సుమారు పది రోజుల ముందు అత్యాచార బాధితురాలు ఓ కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడింది. ట్రాక్టర్ ఢీకొనడంతో బాధితురాలి సన్నిహిత బంధువులు ఈ ప్రమాదంలో మరణించారు. బాధితురాలి తండ్రిపై ఉత్తరప్రదేశ్‌లో ఓ హత్య కేసు, అక్రమంగా ఆయుధాలు కలిగి ఉన్నందుకు కేసు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు ఆగస్టు ఒకటిన ఈ కేసును ఢిల్లీ కోర్టుకు బదిలీ చేసింది. -
ఉన్నావ్ అత్యాచార కేసులో నేడు తీర్పు
-
‘ఉన్నావ్’ తీర్పు నేడే?
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఉన్నావ్ అత్యాచారం కేసులో ఢిల్లీ కోర్టు సోమవారం తీర్పు వెలువరించే అవకాశముంది. ఓ బాలికను కిడ్నాప్ చేసి అత్యాచారం చేశారని బీజేపీ బహిష్కృత ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ సెంగార్ ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. రెండేళ్ల క్రితం నమోదైన ఈ కేసుకు సంబంధించి రహస్య విచారణ సందర్భంగా ఢిల్లీ కోర్టు న్యాయమూర్తి ధర్మేశ్ శర్మ 16వ తేదీన తీర్పు ఇవ్వనున్నట్లు కథనాలు వెలువడ్డాయి. సీబీఐ వాదనలు పూర్తయిన తర్వాత తీర్పు ఇచ్చే అవకాశముందని భావిస్తున్నారు. ఈ ఏడాది ఆగస్టు 5వ తేదీ నుంచి న్యాయమూర్తి ధర్మేశ్ శర్మ ఈ కేసుపై రోజువారీ విచారణ చేపట్టిన విషయం తెలిసిందే. సుప్రీంకోర్టు చొరవతో ఈ కేసు లక్నో నుంచి ఢిల్లీ కోర్టుకు బదిలీ అయింది. 2017లో బీజేపీ ఎమ్మెల్యే కుల్దీప్ సెంగార్ ఓ బాలికను కిడ్నాప్ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఇందుకు సంబంధించి శశిసింగ్ అనే వ్యక్తిపై అభియోగాలు నమోదయ్యాయి కూడా. రెండేళ్ల తర్వాత ఈ ఏడాది ఆగస్టు 9న ఎమ్మెల్యేపై కూడా అభియోగాలు నమోదు కాగా బీజేపీ ఆయన్ను పార్టీ నుంచి బహిష్కరించింది. నేరపూరిత కుట్ర (120బీ), కిడ్నాప్ (363), పెళ్లికి బలవంత పెట్టడం (366), అత్యాచారం (376) తదితర అంశాలతోపాటు లైంగిక వేధింపుల నుంచి చిన్నారులకు రక్షణ కల్పించే చట్టం(పోక్సో) కింద ఆ ఇద్దరిపైనా కేసులు నమోదయ్యాయి. అభియోగాల నమోదుకు సుమారు పది రోజుల ముందు అత్యాచార బాధితురాలు ఓ కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడింది. ట్రాక్టర్ ఢీకొనడంతో బాధితురాలి సన్నిహిత బంధువులు ఈ ప్రమాదంలో మరణించారు. బాధితురాలి తండ్రిపై ఉత్తరప్రదేశ్‌లో ఓ హత్య కేసు, అక్రమంగా ఆయుధాలు కలిగి ఉన్నందుకు కేసు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు ఆగస్టు ఒకటిన ఈ కేసును ఢిల్లీ కోర్టుకు బదిలీ చేసింది. విచారణ మొత్తం 45 రోజుల్లో పూర్తి చేయాలని అప్పటి ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ ఆదేశాలు జారీ చేశారు. నిర్భయ దోషులను నేను ఉరి తీస్తా హోంమంత్రికి షూటర్ వర్తికా సింగ్ రక్తంతో లేఖ లక్నో: నిర్భయ కేసులో దోషులను ఉరి తీసేందుకు తనకు అనుమతి ఇవ్వాలని కోరుతూ షూటర్ వర్తికా సింగ్ తన రక్తంతో రాసిన లేఖను కేంద్ర ప్రభుత్వానికి పంపారు. ఆదివారం ఆమె మాట్లాడుతూ.. ‘నా చేతిలో ఉన్న లేఖ హోంమంత్రి అమిత్‌షాకు రాశా. నా రక్తంతో రాసిన ఈ లేఖను రిజిస్టర్డ్ పోస్టులో ఆయనకు పంపా. నిర్భయ దోషులను ఉరి తీసేందుకు అనుమతి ఇవ్వాలని కోరా. భారత్‌లో మహిళలను దేవతలుగా చూసే సంస్కృతి బలోపేతానికి ఈ అంశం దోహదపడుతుంది. ఈ సందేశం ప్రపంచం మొత్తానికి వెళ్లాలి. అలాగే మహిళ కూడా ఉరి తీయగలదన్న విషయాన్ని అత్యాచార దోషులు తెలుసుకోవాలి. ట్వీట్ కూడా చేశా’అని తెలిపారు. మహిళా సైనికులు, మహిళా నటులు, ఎంపీలు, సంస్థలు తనకు మద్దతు తెలపాలన్నారు. మరోవైపు నిర్భయ దోషులను తాము ఉరి తీస్తామంటూ తీహార్ జైలు అధికారులకు దేశంలోని పలు ప్రాంతాల నుంచి విజ్ఞప్తులు వస్తున్నాయి. నిర్భయ కేసు దోషి ఒకరు దాఖలు చేసిన రివ్యూ పిటిషన్‌పై సుప్రీంకోర్టు మంగళవారం విచారించనుంది. నేర నిరూపణ 32 శాతమే! అత్యాచార ఘటనల్లో క్షేత్రస్థాయిలో లోపిస్తున్న శాస్త్రీయ విచారణ చార్జిషీటు దాఖలులోనూ అలసత్వం.. న్యూఢిల్లీ: సరిగ్గా ఏడేళ్ల క్రితం దేశ రాజధాని ఢిల్లీ నడిబొడ్డున జరిగిన అత్యంత పాశవికమైన నిర్భయ ఘటన ఇప్పటికీ దేశ ప్రజల గుండెల్లో పచ్చి పుండులాగే ఉంది. దేశంలో ఎన్నో నిర్భయ లాంటి సంఘటనలు జరుగుతున్నా.. నిందితులపై నేర నిరూపణ మాత్రం జరగట్లేదు. నిర్భయ ఘటన తర్వాత మహిళలపై అత్యాచారాలకు సంబంధించి కఠినమైన చట్టాలు తీసుకొచ్చినా నిందితులకు మాత్రం శిక్షలు అమలు కావట్లేదు. దేశవ్యాప్తంగా ఇలాంటి ఘటనల్లో 32.2 శాతం మాత్రమే నేర నిరూపణ జరుగుతోందని నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో–2017 డేటా ప్రకారం తెలుస్తోంది. 2017లో దేశవ్యాప్తంగా మొత్తం 1,46,201 కేసుల్లో విచారణ చేపట్టగా, కేవలం 5,822 కేసుల్లోనే నేర నిరూపణ జరిగింది. అత్యాచార ఘటనలు పెరుగుతున్నా.. చార్జిషీటు దాఖలు రేటు మాత్రం తగ్గుతోంది. అంతేకాకుండా కోర్టు వరకు చాలా కేసులు వెళ్లకపోవడం మరింత ఆందోళన చెందాల్సిన విషయం. చార్జిషీటు దాఖలు రేటు 2013లో 95.4 శాతం ఉండగా, 2017 వచ్చేసరికి 86.6 శాతానికి తగ్గింది. ఒడిశా మాజీ డీజీపీ బీబీ మహంతీ.. ఓ విదేశీ పర్యాటకురాలిని అత్యాచారం చేసిన కేసులో డిఫెన్స్ లాయర్ శిల్పి జైన్ మాట్లాడుతూ.. క్షేత్రస్థాయిలో విచారణ చేపడుతున్న పోలీసు అధికారుల్లో నైపుణ్యత పెరగాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ‘చార్జి షీటు దాఖలు చేసే విషయంలో సబ్ఇన్స్పెక్టర్దే కీలక పాత్ర. అంటే ఆ చార్జిషీటు విషయం ఎంత శాస్త్రీయంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు’అని పేర్కొన్నారు. జిల్లా స్థాయిలో ఈ కేసులను చేపట్టే న్యాయవాదుల పరిస్థితి ఇలాగే ఉందని చెప్పారు. విచారణ సరిగ్గా జరపకపోవడం, కోర్టులో కేసులు నిలవకపోవడం వల్లే నేర నిరూపణ శాతం చాలా తక్కువగా ఉంటోందని ఆవేదన వ్యక్తం చేశారు. -
‘ఉన్నావ్’ కంటే దారుణంగా చంపుతా!
లక్నో: మహిళలపై లైంగిక దాడులకు పాల్పడటమే కాకుండా అవసరమైతే బాధితుల ప్రాణాలు తీయడానికి కూడా మానవ మృగాలు వెనుకాడట్లేదు. గత గురువారం ఉన్నావ్ బాధితురాలు కోర్టు విచారణకు హాజరవటానికి వెళుతుండగా మార్గం మధ్యలో కాపుకాసిన నిందితులు ఆమెను సజీవదహనం చేశారు. ఆ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. తాజాగా మరో అత్యాచార బాధితురాలిని కూడా చంపేస్తామంటూ ఆమె ఇంటిపై లేఖ అతికించడం కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉత్తరప్రదేశ్‌లోని భగపట్ ప్రాంతానికి చెందిన ఓ యువతి ఏడాది క్రితం అత్యాచారానికి గురైంది. దీనిపై జులైలో పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు బుధవారం అతడిని బెయిల్‌పై వదిలేశారు. ఈ కేసుకు సంబంధించిన విచారణ శుక్రవారం జరగనుంది. ఈ నేపథ్యంలో నిందితుడు బాధితురాలిపై బెదిరింపులకు పాల్పడ్డాడు. ‘నువ్వు కోర్టు విచారణకు హాజరయ్యావంటే ఉన్నావ్ కంటే దారుణంగా చంపుతా’ అని ఆమె ఇంటి ముందు వార్నింగ్ లెటర్ అతికించాడు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని బాధితురాలికి భద్రత ఏర్పాటు చేశారు. -
‘ఉన్నావ్’ రేప్ కేసు తీర్పు 16న
ఢిల్లీ: ఉత్తరప్రదేశ్‌లోని ‘ఉన్నావ్’లో మైనర్ బాలికపై బీజేపీ ఎమ్మెల్యే కుల్దీప్ సెంగారి అత్యాచారానికి పాల్పడ్డారన్న కేసులో తీర్పును ఢిల్లీ హైకోర్టు రిజర్వ్‌లో ఉంచింది. ఈ నెల 16న తీర్పు వెలువరిస్తామని హైకోర్టు జడ్జి జస్టిస్ ధర్మేశ్ శర్మ తెలిపారు. 2017లో మైనర్ బాలికను బీజేపీ ఎమ్మెల్యే కిడ్నాప్ చేసి గ్యాంగ్‌రేప్ చేశారని ఆరోపణలున్నాయి. ఈ కేసులో నిందితుడిపై పోక్సో సహా పలు సెక్షన్ల కింద కేసు నమోదైంది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఈ కేసు ఉత్తరప్రదేశ్ నుంచి ఢిల్లీ హైకోర్టుకు మారింది. గోప్యంగా జరిగిన విచారణలో ఈ నెల 2న నిందితుడు తన వాదనలు వినిపించగా, సోమవారం సీబీఐ తన వాదనలను కోర్టులో వినిపించింది. సెంగార్ నిందితుడిగా ఉన్న ఈ కేసులో బాధితురాలు ప్రయాణిస్తున్న కారును గత జూలై 28న ఓ ట్రక్కు ఢీకొట్టింది. అనంతరం ఆమెను ఢిల్లీ ఎయిమ్స్‌కు తరలించి చికిత్స అందించారు. ప్రస్తుతం ఆమె కుటుంబానికి ఢిల్లీ మహిళా కమిషన్ ఆశ్రయమిచ్చి ఢిల్లీలో ఉంచింది. సుప్రీం ఆదేశాలతో ఆ కుటుంబానికి సీఆర్పీఎఫ్ బలగాలతో రక్షణ కల్పించారు. -
నీకూ ‘ఉన్నావ్’ లాంటి గతే..
కాన్పూర్ : ఉత్తరప్రదేశ్‌లో మహిళలపై అత్యాచారాలు, బెదిరింపులు, హింసాత్మక ఘటనలకు అడ్డూ అదుపు లేకుండా పోతోంది. ఒకవైపు రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదిత్యనాధ్ మహిళలపై అఘాయితాల్యకు దాడుల కేసుల విచారణ నిమిత్తం పెద్దమొత్తంలో ఫాస్ట్‌ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేయనున్నామని ప్రకటించారు. మరోవైపు సామూహిక అత్యాచార బాధితురాలిని (మైనర్ బాలిక) నిందితుడు సజీవ దహనం చేసిన ఘటనను ఇంకా మర్చిపోక ముందే మరో దుండగుడు రెచ్చిపోయాడు. మరో మైనర్ బాలికపై వేధింపులకు తెగబడ్డాడు. అంతేకాదు కేసు పెడితే...ఉన్నావ్ ఘటన పునరావృతమవుతుందని, నీకూ అదే గతి పడుతుందని హెచ్చరించిన ఘటన వెలుగులోకి వచ్చింది. కాన్పూర్‌కు చెందిన బాధితురాలి ప్రకారం దీపక్ జాదౌన్ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. దీన్నిగట్టిగా ప్రతిఘటించడంతో..తన స్నేహితులతో కలిసి ఇంట్లోకి చొరబడిన మరీ మరింత గలాటా చేశాడు. దీంతో ఆమె గట్టిగా అరచి కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు గుమి గూడారు. దాంతో దీపక్ తదితరులు వెనక్కి తగ్గారు. ఈ ఘటనపై ఫిర్యాదు చేసేందుకు నౌబాస్టా పోలీస్ స్టేషన్‌కు వెళ్లారు బాధిక బాలిక కుటుంబ సభ్యులు. అప్పటికే అక్కడికి చేరుకున్న నిందితులు బాలికపై చంపేస్తామంటూ బెదిరింపులకు పాల్పడ్డారు. అతని ప్రవర్తనపై అభ్యంతరం వ్యక్తం చేయడంతో నిందితుడు తన కుటుంబ సభ్యుల కూడా దాడి చేశాడని బాధితురాలు తెలిపింది. పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదనీ, తన కుటుంబం భయంతో జీవిస్తోందని ఆరోపించింది. అయితే ఇద్దరూ పరస్పరం ఫిర్యాదు చేశారని పోలీసు సూపరింటెండెంట్ అపర్ణ గుప్తా తెలిపారు. అలాగే తనకు న్యాయం చేయాలని, నిందితులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ బాధిత బాలిక ఒక వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసినట్టు తెలిపారు. ఈ మొత్తం వ్యవహారంపై విషయంపై దర్యాప్తు జరుగుతోందని, కేసు నమోదు చేశామని తెలిపారు. -
ఉన్నావ్: యోగి ప్రభుత్వం సంచలన నిర్ణయం
లక్నో : ఉన్నావ్ అత్యాచారం, హత్య ఘటన అనంతరం ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో మొత్తం 218 ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయడానికి బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. మహిళలపై అత్యాచారం, చిన్నారులపై లైంగిక వేధింపులకు పాల్పడిన కేసులను త్వరితగతిన పరిష్కరించడానికి ఈ కోర్టులు ఏర్పాటు చేయనున్నారు. ఉన్నావ్ బాధితురాలు మరణానంతరం ప్రభుత్వంపై అనేక విమర్శలు వస్తున్న నేపథ్యంలో యోగి ప్రభుత్వం ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ఏర్పాటుకు ఆయోద ముద్ర వేసింది. ఈ క్రమంలో.. అత్యాచారం కేసులను విచారించడానికి 144 ఫాస్ట్ ట్రాక్ కోర్టులను, పిల్లలపై నేరాలకు సంబంధించిన కేసులను విచారించడానికి 74 కోర్టులను ఏర్పాటు చేయనున్నారు. -
ఉన్నావ్: పెళ్లిపై ఒప్పందానికి వచ్చిన తర్వాతే..
లక్నో : ఉన్నావ్ అత్యాచారం, హత్య కేసులో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటికే బాధితురాలు విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఏడుగురు పోలీసులను సస్పెండ్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. తాజాగా బాధితురాలిపై అత్యాచారం, పెట్రోల్ పోసి నిప్పంటిన నిందితుల్లో ప్రధాన నిందితుడిగా భావిస్తున్న శివం త్రివేది బాధితురాలిని పెళ్లి చేసుకుంటానని మాట ఇచ్చాడు. అంతేగాక ఇందుకు ఓ ఒప్పంద పత్రం కూడా రాసిచ్చాడు. ఇదంతా మహిళను అత్యాచారం చేయకముందే జరగడం గమనార్హం. బాధితురాలిని 2018 జనవరిలో వివాహం చేసుకుంటానని నిందితుడు ఒప్పందం కుదుర్చుకొని అనంతరం 2018 డిసెంబర్లో ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఒప్పంద పత్రంలో ‘‘హిందూ సంప్రదాయాల ప్రకారం 15 జనవరి 2018న మేము ఒక ఆలయంలో వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నాం. ఇప్పటికే ఇద్దరం భార్య, భర్తలాగా కలిసే జీవిస్తున్నాం. భవిష్యత్తులో మా బంధానికి ఎలాంటి అడ్డంకులు రాకుండా ఉండటానికే ఈ నిర్ణయం తీసుకున్నాం. అందుకే ఈ ఒప్పందంపై సంతకం చేస్తున్నాం’’ అని నిందితుడు శివం త్రివేది ఒప్పంద పత్రంలో సంతకం చేశాడు. ఇక గత ఏడాది డిసెంబర్లో మహిళను అత్యాచారం చేసిన ఇద్దరు నిందితుల్లో ఒకరైన శివం త్రివేదిని పోలీసులు అరెస్టు చేయగా ఇటీవలే బెయిల్‌పై బయటికి వచ్చిన నిందితుడు.. బాధితురాలిని కేసు ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశాడు. ఇందుకు యువతి ఒప్పుకోకపోవడంతో గురువారం ఉదయం బాధితురాలిపై దాడికి దిగి పెట్రోల్ పోసి నిప్పంటించి పరారయ్యారు. 90 శాతం కాలిన గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి ప్రాణాలు విడిచింది. ఈ ఘటన అనంతరం పోలీసులు అయిదుగురు నిందితులను అరెస్టు చేశారు. కాగా ఉన్నావ్ బాధితురాలి మృతిపై దేశ వ్యాప్తంగా ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. మహిళలపై అత్యాచార ఘటనలు జరగకుండా ప్రభుత్వం కనీసం చర్యలు తీసుకోవడం లేదని ప్రతిపక్షాలు, ప్రజలు విమర్శిస్తున్నారు. తన కూతురు చావుకు కారణమైన దోషులను ఉరి తీయాలంటూ బాధితురాలి తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. -
ఉన్నావ్ కేసు: ఏడుగురు పోలీసులపై వేటు
లక్నో : ఉన్నావ్ అత్యాచారం, హత్య కేసులో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఏడుగురు పోలీసులపై ఉత్తర ప్రదేశ్ సర్కార్ వేటు వేసింది. ఈ ఘటనలో నిర్తక్ష్యంగా వ్యవహరించిన ఉన్నావ్ పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ అజయ్ త్రిపాఠితోపాటు ఆరుగురు పోలీసులను సస్పెండ్ చేస్తూ ఎస్పీ విక్రాంత్ వీర్ ఉత్తర్వులు జారీ చేశారు. గురువారం ఉదయం కోర్టుకు హాజరయ్యేందుకు వెళ్తున్న బాధితురాలిని నిందితులు అడ్డుకుని దాడిచేసి ఆమెపై కిరోసిన్ పోసి నిప్పు పెట్టారు. 90 శాతం కాలిన గాయాలతో ఢిల్లీలోని సఫ్దర్‌జంగ్ ఆసుపత్రిలో చేరిన బాధితురాలు శుక్రవారం అర్ధరాత్రి తుది శ్వాస విడిచిన విషయం తెలిసిందే. ఈ కేసులో నిందితులకు త్వరగా శిక్ష పడేలా ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేస్తూ సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది. కాగా, బాధిత కుటుంబానికి రూ. 25 లక్షల నష్టపరిహారం ఇవ్వనున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. అలాగే మృతురాలి కుటుంబం డిమాండ్ మేరకు బాధితురాలి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వనున్నట్టు లక్నో డివిజనల్ కమిషనర్ ముఖేష్ మెష్రం ప్రభుత్వం తరపున హామీ ఇచ్చారు. చదవండి : ‘ఉన్నావ్’ బాధితురాలి అంత్యక్రియలు పూర్తి -
‘ఉన్నావ్’ బాధితురాలికి కన్నీటి వీడ్కోలు
ఉన్నావ్: ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావ్‌లో అత్యాచారం, హత్యకు గురైన బాధితురాలి (23) అంత్యక్రియలు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల నడుమ ఆదివారం ముగిశాయి. కుటుంబసభ్యులు, గ్రామస్తుల అశ్రునయనాల మధ్య యువతి స్వగ్రామంలోనే ఆమె తాత, నానమ్మ సమాధుల పక్కన అంత్యక్రియలు నిర్వహించారు. బాధితురాలిని కడసారి చూసేందుకు స్థానికులు భారీగా తరలివచ్చారు. యూపీ మంత్రులు స్వామి ప్రసాద్ మౌర్య, కమల్‌రాణి వరుణ్, సమాజ్‌వాదీ పార్టీ ఎమ్మెల్సీ సునీల్ సింగ్ సజన్ అంత్యక్రియలకు హాజరయ్యారు. బాధితురాలి కుటుంబానికి ఉన్నావ్ ఎంపీ అన్నూ టాండన్ రూ.5 లక్షల సాయం అందించారు. కాగా, ఈ కేసులో నిందితులను శిక్షిస్తామని సీఎం ఆదిత్యనాథ్ భరోసా ఇచ్చేదాకా అంత్యక్రియలు నిర్వహించేది లేదని పట్టుబట్టిన బాధిత కుటుంబం.. అధికారుల హామీతో వెనక్కుతగ్గింది. ఆ కుటుంబానికి భద్రత ఏర్పాటు చేస్తామని, ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇల్లు మంజూరు చేస్తామని లక్నో డివిజినల్ కమిషనర్ వెల్లడించారు. ఈ కేసులో ప్రత్యక్ష సాక్షిగా ఉన్న బాధితురాలి సోదరికి ప్రత్యేక భద్రత కల్పిస్తాన్నారు. రక్షణ కోసం ఆయుధాలు కావాలంటే ఇస్తామని చెప్పారు. రేప్ బాధితురాలి ఘటనలో నిర్లక్ష్యం వహించిన ఏడుగురు పోలీసులను యూపీ ప్రభుత్వం విధుల నుంచి సస్పెండ్ చేసింది. పోలీసు భద్రత మధ్య అంతిమ యాత్ర -
మానం తీశారు...ఎదిరిస్తే ప్రాణం కూడా!
ఈ ఘోరాన్ని వర్ణించడానికి అక్షరాలు సరిపోవేమో!!. అత్యాచారానికి గురైనా... చట్టం మీద నమ్మకం కోల్పోలేక న్యాయపోరాటానికి దిగిన ఓ అబల... అందుకు భారీ మూల్యమే చెల్లించింది. మొదట మానాన్ని... చివరకు మంటల్లో ప్రాణాన్ని కూడా కోల్పోయింది. ఏడాది కిందట 2018లో ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావ్‌లో అత్యాచారానికి గురైన ఓ అమ్మాయి ఈ గురువారం ముష్కరుల చేతుల్లో కాలిపోయింది. ఒళ్లంతా కాలి... చికిత్స పొందుతూ... 24 గంటలు తిరక్క ముందే కన్నుమూసింది. ఈ ఘటన మన న్యాయ వ్యవస్థలోని ఎన్నెన్నో లొసుగులను కళ్లకు కట్టింది. ఇలాంటి కేసుల్లోని నిందితులకు బెయిల్ వస్తే... ఎలాంటి దారుణాలకు తెగిస్తారో తెలియజెప్పే చర్చకూ తావిచ్చింది. లక్నొ: గురువారం తెల్లవారుఝామున ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావ్ అత్యాచార బాధితురాలిని ఐదుగురు వ్యక్తులు పెట్రోల్ పోసి తగలబెట్టారంటూ వచ్చిన వార్తలు యావద్భారతాన్నీ దిగ్భ్రాంతికి గురిచేశాయి. ఏడాది కిందట లైంగిక దాడి చేసిన వ్యక్తులు... ఎదురు తిరిగి న్యాయపోరాటం చేస్తోందన్న కక్షతో పెట్రోల్ పోసి తగలబెట్టడానికి తెగబడ్డారంటే మనం ఏ యుగంలో ఉన్నామన్న ప్రశ్నలు తలెత్తక మానవు. 2018 నాటి అత్యాచారానికి... భారీ ఆందోళనల అనంతరం మార్చిలో ఎఫ్ఐఆర్ నమోదు చేయగా... 10 రోజుల కిందటే ప్రధాన నిందితుడు సుభామ్ బెయిలుపై బయటకు వచ్చాడు. గురువారం తన కేసు విషయమై స్వగ్రామం నుంచి రాయ్‌బరేలీ వెళుతున్న బాధితురాలిని... కాపుకాసి ఆమె ఒంటిపై పెట్రోల్ పోసి నిప్పంటించారు కొందరు వ్యక్తులు. మంటల్లో చిక్కుకుని 112కి ఫోన్ చేసి రక్షించమంటూ ఆర్తనాదాలు చేశారామె. కాలిన గాయాలతో లక్నో ఆసుపత్రికి... అక్కడి నుంచి ఢిల్లీలోని సఫ్దర్‌జంగ్ ఆసుపత్రికి తరలించినా ఫలితం లేకపోయింది. శుక్రవారం రాత్రి కన్నుమూశారామె. తనపై పెట్రోలు పోసి నిప్పంటించిన వారిలో... అత్యాచార నిందితులు ఇద్దరు ఉన్నారని మరణశయ్యపై వాంగ్మూలం కూడా ఇచ్చారు. వారిని పోలీసులు అరెస్టు చేశారు. సంఘటనపై దర్యాప్తునకు ప్రత్యేక బృందాన్ని (సిట్) ప్రభుత్వం నియమించింది. మిన్నంటిన ఆందోళనలు... నిర్భయ తరువాత ఉన్నావ్ ఘటనపై ఆందోళనలతో దేశ రాజధాని ఢిల్లీ దద్దరిల్లింది. రాజకీయాలకతీతంగా మహిళలు, యువతులు, రాజకీయనాయకులు గొంతు విప్పారు. పార్లమెంటులోనూ, వెలుపలా ఉన్నావ్ ఘటనపై ఆందోళనలు వెల్లువెత్తాయి. ఈ ఘటన పార్లమెంటు ఉభయ సభలనూ కుదిపేసింది. ఉన్నావ్ బాధితురాలికి న్యాయం చేయడంలో ప్రభుత్వం విఫలమైందన్న ప్రతిపక్షాల ఆందోళనతో పార్లమెంటు అట్టుడికిపోయింది. సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఘటనకి బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ విధాన్ భవన్ వెలుపల ధర్నా చేశారు. ఓ యువతికి రక్షణ కల్పించలేని రోజుని బ్లాక్‌డేగా వర్ణించారు. ఘటనపై మాయావతి తీవ్రంగా స్పందించారు. సత్వర న్యాయం జరగాలని డిమాండ్ చేశారు. పాతిక లక్షల సాయం... ఉన్నావ్ అత్యాచార బాధితురాలి మృతికి నష్టపరిహారంగా ప్రభుత్వం పాతిక లక్షలు ప్రకటించింది. ప్రధానమంత్రి ఆవాజ్ యోజన కింద ఇల్లు ఇస్తామని కూడా పేర్కొంది. రాజకీయాలతో సంబంధం లేకుండా దోషులెవ్వరైనా కఠినంగా శిక్షిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. దీంతో పాటు మృతురాలి కుటుంబానికి న్యాయం జరిగేలా సత్వర చర్యలు తీసుకుంటామని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రకటించారు. తక్షణ పరిష్కారం కోసం కేసుని ఫాస్ట్ ట్రాక్ కోర్టుకి అప్పగించారు. ఆమె మరణం తీవ్ర విషాదకరమని ఆదిత్యనాథ్ వ్యాఖ్యానించారు. ‘దిశ’కి జరిగిన న్యాయం నా కూతురికీ కావాలి.. హైదరాబాద్‌లో ‘దిశ’ కేసులో నిందితులను ఎన్కౌంటర్లో చంపేసిన విధంగానే... తన కూతురిపై అత్యాచారం చేసి, సజీవ దహనం చేసిన వారినీ శిక్షించాలని ఉన్నావ్ మృతురాలి తండ్రి డిమాండ్ చేశారు. తనకి ఏ సాయమూ అక్కర్లేదనీ, తనకి ఏ ఆర్థిక తోడ్పాటూ అక్కర్లేదని అత ను స్పష్టం చేశాడు. రెండు నెలల్లో దర్యాప్తు పూర్తి చేయాలి... మైనర్లకు సంబంధించిన అత్యాచార కేసుల్లో రెండు నెలల్లో దర్యాప్తు పూర్తి చేయాలంటూ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకూ, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులకూ లేఖలు రాయాలని నిర్ణయించాం. దేశ వ్యాప్తంగా 1023 ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేస్తాం. ఇప్పటికే దేశ వ్యాప్తంగా 704 ఫాస్ట్ ట్రాక్ కోర్టుల్లో కేసులు విచారణలో ఉన్నాయి. – రవిశంకర్ ప్రసాద్, న్యాయశాఖ మంత్రి మరో ఆడబిడ్డ బలైంది ‘న్యాయం కోసం పోరాడే క్రమంలో దేశంలో మరో కూతురు బలైంది. హృదయం ద్రవించుకుపోయే ఘటన ఇది’ అని రాహుల్‌గాంధీ ట్వీట్ చేశారు. కాగా, ఉన్నావ్ ఉదంతం నేపథ్యంలో ప్రియాంకా గాంధీ బాధితురాలి కుటుంబాన్ని కలిసి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. బాధితురాలికి రక్షణ కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. కాగా రేపిస్ట్‌లకు ఉరిశిక్ష కన్నా పెద్ద శిక్ష లేదని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ వ్యాఖ్యానించారు. యోగి ఆదిత్యనాథ్ బాధ్యత వహించాలి... ఉన్నావ్ అత్యాచార బాధితురాలి మృతికి యూపీ ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్ బాధ్యత వహించాలి. అత్యాచార బాధితురాలు ఎఫ్ఐఆర్ నమోదు చేయమని కోరినప్పుడు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం, పోలీసులు ఏమయ్యారు? ఏం చేస్తున్నారు? అత్యాచార నిందితులు ధనికులు కనుకనే పోలీసులు కేసు నమోదు చేయలేదు. ఈ విషయాన్ని బాధితురాలి సోదరి నాతో తెలిపారు. – సీపీఎం సీనియర్ నాయకురాలు బృందాకారత్ -
ఉన్నావ్: వారిని కాల్చి చంపడమే సరైన శిక్ష
లక్నో : తమ సోదరి చావుకు కారణమైన అయిదుగురిని చంపడమే సరైన శిక్ష అని ఉన్నావ్ అత్యాచార బాధితురాలి సోదరుడు స్పష్టం చేశారు. నిందితులకు వేరే ఏ శిక్ష వేసిన ప్రయోజనం లేదని, చంపడం వల్లనే తమకు న్యాయం జరుగుతుందని ఆగ్రహం వ్యక్తంచేశారు. నిందితుల చేతిలో పెట్రోల్ దాడికి గురై ఢిల్లీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉన్నావ్ బాధితురాలు శుక్రవారం రాత్రి మరణించిన విషయం తెలిసిందే. ఈ విషయంపై బాదితురాలి సోదరుడు మాట్లాడుతూ.. తన సోదరి ఇక తమతో లేరని, ఆమె చావుకు కారణమైన అయిదుగురు నిందితులు (శివం త్రివేది, శుభం త్రివేది, హరి శంకర్ త్రివేది, రాంకిషోర్ త్రివేది, ఉమేశ్ బాజ్‌పాయ్)లను చంపేయాలని డిమాండ్ చేశారు. గురువారం ఉదయం కోర్టు విచారణ కోసం రైల్వే స్టేషన్‌కు వెళ్తున్న యువతిని నిందితులు అపహరించి పెట్రోల్ పోసి నిప్పటించి పరారయ్యారు. తమపై కేసు పెట్టిందన్న అక్కసుతోనే నిందితులు ఇంతటి దారుణానికి ఒడిగట్టారు. కాగా ఈ ఘటన అనంతరం అయిదుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. చదవండి: అత్యాచారాలకు రాజధానిగా భారత్: రాహుల్ మరోవైపు బాధితురాలి తండ్రి మాట్లాడుతూ.. నిందితులకు సరైన శిక్ష పడేలా చూడాలని ప్రభుత్వాన్ని కోరారు. తమ కుమార్తెను పెట్రోల్ పోసి తగలబెట్టిన ఐదుగురినీ పోలీసులు కాల్చి చంపినప్పుడే ప్రశాంతంగా ఉంటానని ఆవేదన వ్యక్తం చేశారు. తమ కుటుంబానికి నిందితుల నుంచి ప్రమాదం ఉందని, వారు అనేకసార్లు తమను బెదిరించారని చెప్పినా పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదని వాపోయారు. గ్రామంలో వారిని ఎదిరించే ధైర్యం ఎవరికి లేదని ఆయన తెలిపారు. ఇక ఉన్నావ్ బాధితురాలు మరణించడం దురదృష్టమని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ విచారం వ్యక్తం చేశారు. నిందితులందరిని అరెస్టు చేశామని, కేసును ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా విచారణ చేపట్టామని తెలిపారు. దోషులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఈ సంఘటనతో రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు, ఆందోళనలు వెలువెత్తుతున్నాయి. దోషులను ఎన్కౌంటర్ చేయడమే సరైన మార్గమని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్రంలోని మహిళకు భద్రత లేదు : మాయావతి -
ఉన్నావ్: యోగి సర్కారుపై మాయావతి ఫైర్
లక్నో : ఉన్నావ్ బాధితురాలు మరణంపై ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి బీఎస్పీ అధినేత మాయావతి స్పందించారు. రాష్ట్రంలోని మహిళలకు రక్షణ కల్పించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని బీజేపీ సర్కారుపై మండిపడ్డారు. గురువారం కోర్టు విచారణకు వెళ్తున్న ఉన్నావో బాధితురాలిని రైల్వేస్టేషన్ సమీపంలో నిందితులు అడ్డుకొని పెట్రోల్ పోసి నిప్పంటించిన విషయం తెలిసందే. 90 శాతం కాలిన గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాలు శుక్రవారం రాత్రి మరణించింది. ఈ నేపథ్యంలో బీజేపీ ప్రభుత్వంపై మాయావతి విరుచుకుపడ్డారు. బీజేపీ ప్రభుత్వంలో మహిళలు సురక్షితంగా లేరని వ్యాఖ్యానించారు. యూపీ గవర్నర్ ఆనందీ బెన్ పటేల్ కూడా ఒక మహిళేనని, మరో మహిళ బాధలను ఆమె అర్థం చేసుకోగలరని తెలిపారు. రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న దాడులపై ప్రత్యేక చర్యలు తీసుకోవాలని గవర్నర్‌ను కోరారు. మహిళల భద్రత విషయంలో ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని మాయావతి మండిపడ్డారు. గత కొన్ని సంవత్సరాలుగా మహిళలపై దాడులు జరగకుండా ఒక్కరోజు కూడా గడవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ ఉన్నావ్‌లో బాధితురాలు కుటుంబాన్ని కలిసి పరామర్శించారు. మరో వైపు సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ సైతం అసెంబ్లీ ఆవరణలో నిరసన చేపట్టారు. ఇక యువతికి నిప్పంటించిన కేసును ఫాస్ట్ ట్రాక్ కోర్టుతో విచారించనున్నట్లు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తెలిపారు. -
ఉన్నావ్ ఎఫెక్ట్: సొంత కుమార్తెపై పెట్రోల్ పోసి..
న్యూఢిల్లీ: ఉన్నావ్ అత్యాచార బాధితురాలిని సజీవంగా తగలబెట్టి చంపిన ఘటనలో బాధితురాలికి న్యాయం చేయాలని కోరుతూ ఒక మహిళ తన మైనర్ కుమార్తెపై పెట్రోల్ పోసి నిప్పంటించడానికి యత్నించిన ఘటన శనివారం దేశ రాజధానిలో చోటుచేసుకుంది. దీంతో రంగంలో దిగిన పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకొని బాలికను ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటనపై విచారణ చేపడతామన్నారు. వివరాల్లోకి వెళితే.. ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావ్‌లో లైంగిక దాడి బాధితురాలు కోర్టుకు వెళుతుండగా ఆమెకు నిప్పంటించడంతో.. బాధితురాలు ఢిల్లీలోని సఫ్దర్‌జంగ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచారు. పోస్ట్‌మార్టం అనంతరం మృతదేహాన్ని సఫ్దర్‌జంగ్ ఆస్పత్రి నుంచి ఉత్తరప్రదేశ్‌లోని ఆమె గ్రామానికి తీసుకెళ్లారు. ఉన్నావ్‌బాధితురాలి మృతదేహాన్ని సఫ్దర్‌జంగ్ ఆస్పత్రి నుంచి తరలించిన దాదాపు గంట తర్వాత ఈ సంఘటన జరిగింది. -
పోలీసులే ‘జడ్జీలు’ అయితే.....
సాక్షి, న్యూఢిల్లీ : ‘దిశ ఎన్కౌంటర్’ ఘటన నిజమైనదా, బూటకమా! అన్న అంశంలో ఎన్ని అనుమానాలు ఉన్నా పోలీసులు చేసిందీ సబబేనంటూ సర్వత్రా హర్షం వ్యక్తం అవుతున్న విషయం తెల్సిందే. అలా అని పోలీసులు కాకుండా న్యాయవ్యవస్థ నేరస్థులకు ఉరిశిక్ష విధించి ఉంటే బాగుండేదని జాతీయ మహిళా కమిషన్ చైర్మన్ రేఖా శర్మ వ్యాఖ్యానించడం, తమ పేరు మీద పోలీసులు తమ చేతుల్లోకి న్యాయాధికారాలు తీసుకోవడం సమంజసం కాదంటూ ఎన్‌కౌంటర్‌కు వ్యతిరేకంగా అఖిల భారత ప్రగతిశీల మహిళా సంఘం సుప్రీం కోర్టుకెళ్లడం పరిణామాలను పట్టించుకోకుండా ఉండలేం. ఎందుకంటే హర్యానాలోని గురుగావ్ పోలీసులు అక్కడి ‘ర్యాన్ ఇంటర్నేషనల్ స్కూల్’లో జరిగిన ఓ విద్యార్థి కేసులో తిమ్మిని బమ్మిని చేశారు. 2017, సెప్టెంబర్ 8వ తేదీన ఆ స్కూల్ బాత్రూమ్లో రెండో తరగతి చదువుతున్న విద్యార్థి హత్య జరగ్గా, స్కూల్ యాజమాన్యం ఒత్తిడి మేరకు గురుగావ్ పోలీసులు ఆ స్కూల్ బస్సు కండక్టర్ అశోక్ కుమార్‌పై కేసు పెట్టారు. తీవ్రంగా హింసించి నేరాన్ని ఒప్పించారు. వాంగ్మూలం కూడా తీసుకొన్నారు. బాత్ రూమ్‌లో పిల్లాడిపై లైంగిక దాడి చేయబోతే అరవడంతో జేబులో నుంచి చాకును తీసి మెడ నరం కోశానని, చనిపోయాడని కండక్టర్ వాంగ్మూలంలో పేర్కొన్నారు. ఆ చాకును తాను యూపీలోని ఆగ్రాలో కొనుగోలు చేసినట్లు కండక్టర్ చెప్పగా, తాము అతన్ని ఆగ్రా తీసుకెళ్లి ఆ విషయాన్ని ధ్రువీకరించుకున్నామని కూడా పోలీసులు దర్యాప్తు రిపోర్టులో రాసుకున్నారు. మైనర్ బాలుడిపై హత్యాచారం జరిపిన కామాంధుడైన కండక్టర్‌ను కాల్చి పారేయాలంటూ నాడు ప్రజలు ఆందోళన చేశారు. చాకును ఆగ్రాలో కొన్నానని చెప్పిన కండక్టర్‌ను చాకు కోసం ఆగ్రాకు ఎందుకు వెళ్లావని మీడియా ప్రశ్నించగా, బస్సు టూల్ బాక్స్‌లో ఉంటే తీసుకున్నానని కండక్టర్ మాట మార్చడం, టూల్ బాక్సులో చాకు ఎందుకు ఉందని డ్రైవర్‌ను ప్రశ్నించగా లేదని చెప్పడంతో అనుమానాలు మొదలయ్యాయి. మానవ హక్కుల సంఘాల డిమాండ్ మేరకు కేసును సీబీఐకి అప్పగించగా అసలు విషయం బయట పడింది. అదే పాఠశాలలో చదువుతున్న ఓ 16 ఏళ్ల యువకుడు ఆ బాలుడిని హత్య చేశాడని తేలింది. పాఠశాలకు సెలవు ఇస్తారని తానే ఆ బాలుడిని చంపానని ఆ యువకుడు నేరాన్ని ఒప్పుకున్నారు. ఆ కుమారుడి తండ్రికి డబ్బుతోపాటు రాజకీయ పలుకుబడి ఉండడంతో కేసు తప్పుదారి పట్టింది. ప్రజల డిమాండ్ మేరకు నాడే గురుగావ్ పోలీసులు ఆ కండక్టర్‌ను కాల్చివేసి ఉంటే ఏమయ్యేది? నిజం బయటకు వచ్చేదా? ‘ర్యాన్ ఇంటర్నేషనల్ స్కూల్’ కేసు ఒక ఉదాహరణ మాత్రమే. గతంలో పోలీసుల చేతుల్లో ఎన్నో కేసులు తారుమారయ్యాయి. ఉత్తర ప్రదేశ్‌లో నేరాలను, ఘోరాలను అరికట్టడం కోసం అక్కడి రాష్ట్ర ప్రభుత్వం పోలీసులకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చింది. ఫలితంగా ఎన్నో ఎన్కౌంటర్లు జరిగాయి. వాటిల్లో మరణించిన వారిలో అమాయకులు కూడా ఉన్నారు. అలాంటి పొరపాట్లు జరగకుండా ఉండేందుకే భారత రాజ్యాంగంలో పోలీసులు, న్యాయ వ్యవస్థ విధులు వేర్వేరుగా ఉన్నాయి. అందుకే ఎవరి విధులు వారే నిర్వహించాలని ప్రజాస్వామ్య వాదులు డిమాండ్ చేస్తున్నారు. -
సాహో తెలంగాణ పోలీస్!
దిశ అత్యాచారం, హత్య కేసులో నలుగురు నిందితుల్ని తెలంగాణ పోలీసులు ఎన్కౌంటర్ చేయడంపై దేశవ్యాప్తంగా సామాన్యుల్లో ఆనందోత్సాహాలు వ్యక్తం అవుతున్నాయి. సాహో తెలంగాణ పోలీస్ అంటూ జేజేలు పలుకుతున్నారు.. కానీ, రాజకీయ నాయకుల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎన్‌కౌంటర్‌పై ఎవరి స్పందన ఎలా ఉందంటే.. హైదరాబాద్ పోలీసుల్ని చూసి ఢిల్లీ పోలీసులు, ప్రభుత్వం, కోర్టులు ఎంతైనా నేర్చుకోవాలి. నిర్భయ దోషుల్ని వెంటనే ఉరి తీయాలి. క్రూరాతి క్రూరమైన నేరానికి పాల్పడిన వారికి అలాంటి శిక్షలే పడాలి. తెలంగాణ పోలీసులు సరైన పనే చేశారు. మేము ఏడేళ్లుగా న్యాయం కోసం ఎదురు చూస్తున్నాం. దిశ తల్లిదండ్రులకు ఆ ఎదురుచూపులు తప్పాయి. వారి కడుపుకోత మాకు అర్థమవుతుంది. కనీసం వారికైనా సత్వర న్యాయం జరిగింది. – నిర్భయ తల్లిదండ్రులు ఒక సాధారణ పౌరురాలిగా ఈ ఎన్‌కౌంటర్‌పై ఆనందం వ్యక్తం చేస్తున్నా. ప్రజలంతా ఏ తీర్పు కోరుకున్నారో అదే జరిగింది. అయితే అది చట్టపరంగా న్యాయస్థానంలో జరిగి ఉండాల్సింది. – రేఖా శర్మ, జాతీయ మహిళా కమిషన్ అధ్యక్షురాలు హైదరాబాద్ ఎన్కౌంటర్ రేపిస్టులకు గట్టి సందేశాన్ని పంపింది. ప్రజలు న్యాయం జరిగిందనే అంటున్నారు. కానీ దేశవ్యాప్తంగా న్యాయం కోసం ఎదురు చూస్తున్న వేలాది మంది నిర్భయల సంగతేంటి ? నేనైతే ఈ దేశం ఒక పద్ధతి ప్రకారం ముందుకు వెళ్లాలని అనుకుంటున్నాను. – స్వాతి మాలివాల్, ఢిల్లీ మహిళా కమిషన్ చీఫ్ హైదరాబాద్ ఎన్‌కౌంటర్‌ను ప్రజలందరూ హర్షిస్తున్నారు. మన దేశంలో క్రిమినల్ న్యాయవ్యవస్థపై ప్రజలకి నమ్మకం పోయింది. అది అత్యంత ప్రమాదకరమైన విషయం. – కేజ్రీవాల్, ఢిల్లీ ముఖ్యమంత్రి పోలీసులు ఆత్మరక్షణ కోసమే నిందితుల్ని ఎన్కౌంటర్ చేశారు. నిందితులు పోలీసులపై దాడికి ప్రయత్నించడం వల్లే పోలీసులకు వారిని చంపక తప్పలేదు. – యడియూరప్ప, కర్ణాటక ముఖ్యమంత్రి చట్టం తన పని తాను చేసుకుపోవాలి. కానీ ఎవరూ దానిని చేతుల్లోకి తీసుకోకూడదు. హైదరాబాద్, ఉన్నావ్ అత్యాచార ఘటనలు దేశానికే సిగ్గు చేటు. బాధితుల గురించి ఆలోచిస్తే నా గుండె రగిలిపోతుంది. రేపిస్టులను శిక్షించడానికి చట్టాలను మరింత పకడ్బందీగా నిర్మించాలి. –మమతా బెనర్జీ, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి అత్యాచార బాధితురాలికి సత్వర న్యాయం జరిగింది. ఏమీ చేయకుండా చేతులు ముడుచుకొని కూర్చోవడం కంటే ఆలస్యంగానైనా ఏదో ఒకటి చేయడం మంచిది. – జయా బచ్చన్, రాజ్యసభ ఎంపీ హైదరాబాద్ ఎన్కౌంటర్ దేశానికి ఎంతో ప్రమాదకరమైనది. చట్టాన్ని పోలీసులు తమ చేతుల్లోకి తీసుకోకూడదు. విచారణ పూర్తవకుండా పోలీసులే నిందితుల్ని కాల్చి పారేస్తే ఇంక ఈ చట్టాలు, న్యాయవ్యవస్థ ఎందుకు ? కోర్టులే వారికి ఉరిశిక్ష వేసి ఉండవలసింది. –మేనకా గాంధీ, బీజేపీ నేత హైదరాబాద్ పోలీసులు తీసుకున్న చర్యలు అభినందనీయం. వారిని చూసి యూపీలో పోలీసు యంత్రాంగం స్ఫూర్తి పొందాలి. ఉత్తరప్రదేశ్‌లో ప్రతీరోజూ ప్రతీ జిల్లాలో ఏదో ఒక అత్యాచారం కేసు వెలుగులోకి వస్తోంది. యుక్తవయసులో ఉన్న వారిని, వయసు మీద పడిన వారిని ఏ మహిళనీ వదలడం లేదు. ఈ రాష్ట్రంలో గూండారాజ్యం నడుస్తోంది. – మాయావతి, బీఎస్పీ అధినేత్రి మహిళల భద్రతపై ఆందోళనలకు పోలీసులు చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడం సమాధానం కాకూడదు. నిర్భయ చట్టాన్ని సరిగ్గా ఎందుకు అమలు చేయలేకపోతున్నారు?. – సీతారాం ఏచూరి, సీపీఎం నేత పోలీసుల చేతికి తుపాకులు ఇచ్చింది ఏదో ప్రదర్శన కోసం కాదు. నిందితులు పారిపోతుంటే వాడుకోవడానికి మాత్రమే. –మీనాక్షి లేఖి, బీజేపీ ఎంపీ పురుషుల నుంచి మహిళలు అధికారాన్ని లాక్కొని, తమకు ఎదురయ్యే ఘటనల నుంచి రక్షణ పొందాలి. మహిళలు పంచాయతీ, విధాన సభ ఎన్నికల్లో పోటీ చేయాలి. రాజకీయాల్లోకి వచ్చి అధికారాన్ని పొందడం ద్వారా ఇలాంటి పరిస్థితుల నుంచి రక్షించుకోవచ్చు. ‘ఉన్నావ్’ లాంటి ఘటనలు జరుగుతుంటే ప్రజలకు ప్రభుత్వంపై నమ్మకం ఎలా ఉంటుంది? – ప్రియాంక గాంధీ, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి -
లోక్‌సభలో ‘ఉన్నావ్’ రభస
సాక్షి, న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావ్‌లో అత్యాచార బాధితురాలిని సజీవంగా తగలపెట్టేందుకు ప్రయత్నించిన ఘటనపై శుక్రవారం లోక్‌సభ అట్టుడికింది. చర్చ సందర్భంగా పలువురు సభ్యులు హైదరాబాద్‌లో దిశ హత్యాచార నిందితుల ఎన్‌కౌంటర్‌ను కూడా ప్రస్తావించారు. కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ప్రసంగిస్తున్న సమయంలో ఇద్దరు కాంగ్రెస్ సభ్యులు.. ఆమెను బెదిరిస్తున్న తీరులో వ్యవహరించడంపై బీజేపీ సభ్యులు మండిపడ్డారు. జీరో అవర్‌లో ఉన్నావ్ ఘటనను లేవనెత్తిన కాంగ్రెస్ సభ్యుడు ఆధిర్ రంజన్ చౌధురి చేసిన ఒక వ్యాఖ్య బీజేపీ సభ్యులకు ఆగ్రహం తెప్పించింది. ‘ఒకవైపు రామ మందిర నిర్మాణ ఏర్పాట్లు జరుగుతుంటే.. మరోవైపు సీతమ్మలను తగలబెడ్తున్నారు’ అని చౌధురి వ్యాఖ్యానించారు. ఉత్తర పదేశ్ చట్టాలు అమలుకాని అధర్మ ప్రదేశ్‌గా మారిందన్నారు. దీనిపై హోం మంత్రి జవాబు చెప్పాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్, ఉన్నావ్ ఘటనలను పోలుస్తూ.. ‘నిందితులను హైదరాబాద్ పోలీసులు కాల్చిపారేశారు.. ఉత్తరప్రదేశ్ పోలీసులు వదిలేశారు’ అని వ్యాఖ్యానించారు. అనంతరం కేంద్రమంత్రి స్మృతి ఇరానీ మాట్లాడుతూ ఉన్నావ్ ఘటనకు మతం రంగు పులముతున్నారని, రాజకీయం చేస్తున్నారని విపక్షాలపై విమర్శలు గుప్పించారు. చదవండి: ఉన్నావ్ అత్యాచార బాధితురాలు మృతి కాంగ్రెస్ సభ్యుల అనుచిత ప్రవర్తన ఇరానీ ఆవేశంగా మాట్లాడుతుండగా.. కాంగ్రెస్ సభ్యులు టీఎన్ ప్రతాపన్, దీన్ కురియకొసె గట్టిగా అరుస్తూ, ఆగ్రహంగా ఇరానీ వైపు వెళ్లేందుకు ప్రయత్నించారు. ప్రతీపన్ బెదిరింపు ధోరణిలో షర్ట్ చేతులను పైకి లాక్కోవడం కనిపించింది. దీనిపై ఇరానీ, బీజేపీ సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. లంచ్ బ్రేక్ తరువాత ఆ ఇద్దరు కాంగ్రెస్ సభ్యులు సభలోకి రాలేదు. వెంటిలేటర్‌పై ఉన్నావ్ బాధితురాలు మృతి ఉన్నావ్ అత్యాచార బాధితురాలు ఆస్పత్రిలో మృత్యువుతో పోరాడుతూ గతరాత్రి మృతి చెందింది. ఢిల్లీలోని సఫ్దర్‌జంగ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాలికి వెంటిలేటర్‌పై చికిత్స అందించినా ఫలితం లేకపోయింది. 90 శాతం కాలిన గాయాలతో రాత్రి 11.40 గంటల సమయంలో బాధితురాలు చనిపోయిందని వైద్యులు వెల్లడించారు. గతేడాది డిసెంబర్లో మృతురాలిపై అత్యాచారం జరుగగా, విచారణ నేపథ్యంలో గురువారం కోర్టుకు వస్తున్న బాధితురాలిపై ఐదుగురు దుండగులు కిరోసిన్ పోసి నిప్పంటించారు. -
లైంగిక దాడి బాధితురాలు కోర్టుకు వెళుతుండగా..
లక్నో : లైంగిక దాడికి గురైన యువతి కేసు విచారణలో భాగంగా గురువారం కోర్టుకు వెళుతున్న క్రమంలో గ్రామ శివార్లలో ఆమెకు నిప్పంటించిన ఘటన ఉన్నావ్ జిల్లాలో చోటుచేసుకుంది. ఈ ఘటనలో యువతికి 60 నుంచి 70 శాతం కాలిన గాయాలయ్యాయని, తదుపరి చికిత్స కోసం లక్నో ఆస్పత్రికి తరలించామని పోలీసులు తెలిపారు.ఈ ఏడాది మార్చిలో తన గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులు తనపై లైంగిక దాడికి పాల్పడ్డారని 23 సంవత్సరాల బాధితురాలు ఫిర్యాదు చేశారు. ఇక మహిళకు నిప్పంటించిన ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిలో యువతిపై లైంగిక దాడికి పాల్పడిన ఓ నిందితుడు ఉన్నాడని పోలీసులు తెలిపారు. కేసులో ముగ్గురిని ఇప్పటికే అరెస్ట్ చేశామని , మరో ఇద్దరి కోసం గాలిస్తున్నామని ఉన్నావ్ సీనియర్ పోలీస్ అధికారి విక్రాంత్ విర్ తెలిపారు. ఉన్నావ్‌లో తనపై ఇద్దరు వ్యక్తులు లైంగిక దాడికి పాల్పడి ఆ దృశ్యాన్ని వీడియో తీశారని ఈ ఏడాది మార్చిలో పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో బాధితురాలు పేర్కొన్నారు. ఇద్దరు నిందితుల్లో ఒకరిని యూపీ పోలీసులు అరెస్ట్ చేయగా అతను బెయిల్‌పై విడుదలయ్యాడు. మరో నిందితుడిని ఇప్పటివరకూ అరెస్ట్ చేయకపోవడం గమనార్హం. నిందితుడి ఆస్తులను అటాచ్ చేసి ఆయనపై లుక్అవుట్ నోటీస్ జారీ చేశామని పోలీసులు చెబుతున్నారు. బాధితురాలిని కాపాడటమే ప్రస్తుతం తమ ముందున్న కర్తవ్యమని పోలీసులు పేర్కొన్నారు. ఈ కేసులో నలుగురు నిందితులను అరెస్ట్ చేశామని, ప్రధాన నిందితుడు శివం త్రివేదీ ఇంకా పరారీలో ఉన్నాడని పోలీసు ఉన్నతాధికారులు వెల్లడించారు. -
హెచ్‌పీ ఫ్లాంట్‌లో భారీ పేలుడు
-
హెచ్‌పీ ఫ్లాంట్‌లో భారీ పేలుడు
ఉన్నవో: హిందుస్థాన్ పెట్రోలియం ఫ్లాంట్‌లో గురువారం పెట్రోల్ ట్యాంకర్లలో అకస్మాత్తుగా పేలుడు సంభవించింది. ఉత్తరప్రదేశ్ ఉన్నవోలో ఈ సంఘటన చోటుచేసుకుంది. ఫ్లాంట్‌లోని వాల్వ్ లీక్ అవడంతో ఈ పేలుడు జరిగినట్లు తెలుస్తోంది. అకస్మాత్తుగా ట్యాంకర్ పేలడంతో ఫ్లాంట్‌లోకి సిబ్బంది ఉలిక్కిపడ్డారు. ఒక్కసారిగా వారంతా బయటకు పరుగులు తీయడంతో తొక్కిసలాట జరిగింది. వెంటనే వారందర్ని అక్కడ నుంచి సురక్షిత ప్రాంతానికి తరలించారు. మరోవైపు సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇక ముందు జాగ్రత్త చర్యగా లక్నో-కాన్పూరు మార్గమధ్యంలో నడిచే రైళ్లను నిలిపివేశారు. అలాగే ఫ్లాంట్ సమీపంలోని నాలుగైదు కిలోమీటర్ల పరిధిలో అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. అంతేకాకుండా ప్రమాద తీవ్రత నేపథ్యంలో చుట్టుపక్కలున్న గ్రామాల్లోని వారిని అక్కడ నుంచి తరలించారు. హెచ్‌పీ పెట్రోలియం యాజమాన్యం కూడా ఫ్లాంట్‌లోని లీకేజీని అదుపు చేసేందుకు ప్రయత్నిస్తోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
హమ్మయ్య.. ఆమె క్షేమంగా ఉంది
న్యూఢిల్లీ: రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఉన్నావ్ అత్యాచార బాధితురాలు కోలుకుంటోందని, ప్రాణాపాయం లేదని ఎయిమ్స్ వైద్యులు వెల్లడించారు. ఆమెను ఐసీయూ నుంచి సాధారణ వార్డుకు తరలించారు. ఉన్నావ్ అత్యాచార బాధితురాలు ప్రయాణిస్తున్న కారును ఓ ట్రక్కు జూలై 28న ఢీనడంతో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు బంధువులు మరణించగా, బాధితురాలు, ఆమె లాయర్ తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. బాధితురాలికి మెరుగైన వైద్యం అందించాలన్న సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు ఆమెను ఇటీవల లక్నో ఆసుపత్రి నుంచి న్యూఢిల్లీలోని ఎయిమ్స్‌కు తరలించారు. ఈ ప్రమాదంపై దర్యాప్తు చేపట్టిన సీబీఐ సోమవారం బాధితురాలి స్టేట్మెంట్ను రికార్డు చేసింది. ఆమె లాయర్ ఇంకా కోలుకోకపోవడంతో అతడి వాంగూల్మాన్ని సీబీఐ ఇంకా తీసుకోలేదు. ఈ కేసులో నివేదికను ఈనెల 6న సుప్రీంకోర్టుకు సీబీఐ సమర్పించనుంది. బాధితురాలిని, ఆమె లాయర్‌ను రోడ్డు ప్రమాదంలో అంతం చేసేందుకు కుట్ర పన్నారన్న ఆరోపణలపై యూపీ బీజేపీ ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ సెంగార్, ఆయన అనుచరులు 30 మందిపై సీబీఐ కేసు నమోదు చేసింది. అయితే బాధితురాలు కానీ, కుల్దీప్ సెంగార్ కానీ తనకు తెలియదని ఈ కేసులో పట్టుబడిన ట్రక్కు డ్రైవర్ సీబీఐకి ఇచ్చిన వాంగ్మూలంలో పేర్కొన్నాడు. దీనికి ముందు 2017లో రెండు వేర్వేరు సందర్భాల్లో కుల్దీప్ సెంగార్, ముగ్గురు వ్యక్తులు తనపై అత్యాచారం చేసినట్టు బాధితురాలు అప్పట్లో ఫిర్యాదు చేసింది. ఈ కేసులో గత ఏడాది ఏప్రిల్ నుంచి కుల్దీప్ సింగార్ జైలులో ఉన్నారు. అత్యాచార బాధితురాలి తండ్రిని గత ఏడాది ఏప్రిల్ 3న అరెస్టు చేయగా, ఏప్రిల్ 9న జ్యుడిషియల్ కస్టడీలో అనుమానాస్పద స్థితిలో మరణించాడు. (చదవండి: 'ఉన్నావ్' నువ్వు తోడుగా) -
'ఉన్నావ్' నువ్వు తోడుగా
‘ఉన్నావ్ బాధితురాలికి న్యాయం చేయండి’ అని నినదిస్తోంది మహిళాలోకం. ‘ఇలాంటి మృగాలు సమాజంలో బతకకూడదు’ అని కుల్దీప్ దిష్టిబొమ్మను తగులబెడుతోంది యువత. ‘న్యాయం జరిగే వరకు ఈ పోరాటం ఆగదు’ అంటున్నాయి బాధితురాలి ఉచ్వాసనిశ్వాసలు. ఇలాంటప్పుడే... సరిగ్గా ఇలాంటప్పుడే... దుష్టశిక్షణ... శిష్ట రక్షణ కోసం ఒకరు రావాలి. అలా వచ్చినవారే... సీబీఐ జాయింట్ డైరెక్టర్సంపత్ మీనా. సంపత్ మీనా లక్నోలో సీబీఐ జాయింట్ డైరెక్టర్. ఇప్పుడామె దేశాన్ని కుదిపేసిన ‘ఉన్నావ్’ కేసు దర్యాప్తు బాధ్యతలు చేపట్టారు. ఉన్నావ్ కేసు దర్యాప్తు చేపట్టి 45 రోజుల్లో పూర్తి చేయవలసిందిగా సుప్రీం కోర్టు సీబీఐని ఆదేశించింది. సుప్రీం కోర్టు ఆదేశాలను పాటించి కేసును సమర్థంగా దర్యాప్తు చేయగలిగిన అధికారి కోసం దృష్టి సారించిన సీబీఐకి సంపత్ మీనా అయితేనే కేసుకు న్యాయం జరుగుతుందనే భరోసా కలిగింది. ఫలితంగా ఉన్నావ్ కేçసును ఆమె చేతుల్లో పెట్టింది. సంపత్ మీనా కేసు దర్యాప్తు బాధ్యత చేపట్టడంతో న్యాయపోరాటం చేస్తున్న బాధిత యువతికి అధికారం, సమర్థత కలిగిన మహిళ ఆసరాగా వచ్చినట్లైంది. ఉన్నావ్ ఘటనతో ఏడాదికి పైగా నిరసనలు, ర్యాలీలతో అట్టుడిగిన దేశం ఇప్పుడు ‘హమ్మయ్య... బాధితురాలికి న్యాయం జరగబోతోంది’ అని ఊపిరి పీల్చుకుంటోంది. దేశ ప్రజలు ఆమెను సినిమాలో సీబీఐ ఆఫీసర్‌ను తెర మీద చూసినట్లు చూస్తున్నారు. కొన్ని సాహసోపేతమైన సంఘటనలు, మరికొన్ని సవాళ్లతో చట్టాన్ని పరిరక్షిస్తుందనే దృఢ నమ్మకం వారిది. సంపత్ మీనా మీద అంత నమ్మకాన్ని పెట్టుకోవడానికి కారణం గతంలో ఆమె సాధించిన విజయాలే. కుల్దీప్ సింగ్ సెంగార్ దిష్టిబొమ్మను తగల బెడుతున్న యువత ఆపరేషన్ ముస్కాన్ సంపత్ మీనా ఢిల్లీ యూనివర్సిటీ స్టూడెంట్. హిస్టరీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశారు. జార్ఖండ్ కేడర్‌కు చెందిన 1994 బ్యాచ్ ఆఫీసర్. జార్ఖండ్ రాజధాని రాంచితోపాటు ధన్‌బాద్, జమ్తారా, ధమ్కా, దేవ్‌ఘర్, పాకుర్ జిల్లాల్లో ఎస్పీగా తన మార్కు చూపించారామె. చోటా నాగ్‌పూర్‌లో డీఐజీగా క్రియాశీలకంగా పనిచేశారు. చైల్డ్ ఫ్రెండ్లీ పోలీస్ స్టేషన్ అనే కాన్సెప్ట్ ఆమె మానస పుత్రిక. జార్ఖండ్‌లోనే ఆమె ఈ ప్రయోగాన్ని చేపట్టారు. కేంద్ర హోమ్ మంత్రిత్వ శాఖ చేపట్టిన ‘ఆపరేషన్ ముస్కాన్’ కార్యక్రమాన్ని కూడా విజయవంతంగా నిర్వహించారు సంపత్ మీనా. తప్పిపోయిన పిల్లలు, ఇంటి నుంచి పారిపోయిన పిల్లలు, అక్రమ రవాణా కారణంగా తల్లిదండ్రులకు దూరమైన పిల్లలను వెతికి పట్టుకుని, వాళ్లను తల్లిదండ్రుల దగ్గరకు చేర్చే కార్యక్రమం అది. ముస్కాన్ అంటే చిరునవ్వు. తల్లిదండ్రులకు దూరమయ్యి, నవ్వును మర్చిపోయిన బాల్యంలో తిరిగి నవ్వులు పూయించే కార్యక్రమం. ఈ ఆపరేషన్ ముస్కాన్‌లో ఒక్క జార్ఖండ్‌లోనే ఏడు వందల మందికి పైగా పిల్లలను తల్లిదండ్రుల దగ్గరకు చేర్చారు సంపత్మీనా. తల్లిదండ్రుల వివరాలు చెప్పలేని పిల్లలకు ప్రభుత్వ సంరక్షణ గృహాల్లో వసతి కల్పిస్తారు. ఆర్గనైజ్డ్ క్రైమ్ ఐజీగా సంపత్మీనా పర్యవేక్షణలో ఆపరేషన్ ముస్కాన్ దేశవ్యాప్తంగా ఆశించిన ఫలితాలనిచ్చింది. లక్నోలో సీబీఐ జాయింట్ డైరెక్టర్కంటే ముందు ఆమె న్యూఢిల్లీలో పోలీస్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ బ్యూరోలో ఐజీ(ఇన్స్పెక్టర్ జనరల్). అప్పుడు కూడా పిల్లల అక్రమ రవాణా కేసులను ఛేదించడంలో క్రియాశీలకమైన పాత్ర పోషించారు. ఆమెకు మహిళల సమస్యలు, మానవ హక్కుల కోసం ఆమె ప్రత్యేకంగా పనిచేసిన అనుభవం కూడా ఉంది. జార్ఖండ్ రాజధాని రాంచిలో ‘సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్’ అయిన తొలి మహిళ సంపత్ మీనా. సీఐడీ ఐజీగా, రైల్వేస్ ఐజీగా కూడా మంచి సేవలందించారు. నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లో సమర్థంగా పని చేశారు. ఉన్నావ్ కేసు దర్యాప్తు న్యాయరక్షణే లక్ష్యంగా సాగాలంటే సంపత్ మీనా వల్లనే సాధ్యమవుతుందని నమ్మకం కలగడానికి ఇవన్నీ కారణాలే. ఉన్నావ్ బాధితురాలికి న్యాయం కోసం గళమెత్తిన మహిళలు బెస్ట్ పోలీస్ సంపత్ మీనా విశిష్ట సేవలకు గాను ‘2008 చీఫ్ మినిస్టర్ మెడల్’, 2013 రాష్ట్రపతి మెడల్ అందుకున్నారు. పోలీస్ ట్రైనింగ్‌లో కూడా పై అధికారులకు సంపత్ మీనా ప్రత్యేకమైన పోలీస్ అధికారి అవుతుందనే నమ్మకం కలిగేది. ముస్సోరీలోని లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడెమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్, హైదరాబాద్ నేషనల్ పోలీస్ అకాడమీలో శిక్షణ సమయంలో బెస్ట్ అథ్లెట్స్ ట్రోఫీ అందుకున్నారు. ఇటలీలో పోలీస్ కోర్సులో గ్రాడ్యుయేషన్ చేశారామె. సీనియర్ లెవెల్ ప్రోగ్రామ్‌లో అమెరికాలో శిక్షణ పొందారు. రాజకీయ ప్రభావాలకు లోనుకాకుండా, పక్షపాతరహితంగా దర్యాప్తు జరగాలంటే సంపత్ మీనా ఒక్కరే బెస్ట్ అని ఇప్పుడు దేశమంతా నమ్ముతోంది. ‘ఉన్నావ్’ బాధితురాలికి న్యాయం జరగాలంటే సంపత్ మీనా లాంటి ఆఫీసరే అండగా నిలవాలని న్యాయం కోరుకునే ప్రతి ఒక్కరూ అనుకుంటున్నారు. కరడు గట్టిన మృగాహంకారి కుల్దీప్ సింగ్ సెంగార్‌కు, అతడి బృందానికి గుణపాఠం చెప్పగలిగిన పోలీస్ ఆఫీసర్ సంపత్ మీనా. కుల్దీప్ సింగ్ సెంగార్ ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావ్ పట్టణంలో నివసిస్తుండేవాడు. ఉన్నావ్ పట్టణం జిల్లా కేంద్రం కూడా. అతడు మొదట 2002లో ఉన్నావ్ నియోజకవర్గం నుంచి బిఎస్పీ అభ్యర్థిగా గెలిచాడు. తర్వాత 2007, 2014 లలో సమాజ్‌వాది పార్టీ తరఫున బంగేర్‌మావ్, భగవంత్ నగర్ల నుంచి గెలిచాడు. ఆ తర్వాత 2017 నాటికి బిజెపిలో చేరి బంగేర్‌మావ్ నుంచి గెలిచాడు. ఉద్యోగం కోసం వెళ్లిన పదిహేడేళ్ల అమ్మాయి మీద లైంగిక అఘాయిత్యానికి పాల్పడి ఇప్పుడు సీతాపూర్ జైల్లో ఉన్నాడు. మౌనసాక్షి... ఉన్నావ్ ఈ ఏడాది జూలై నెల 28వ తేదీ. ఉత్తర ప్రదేశ్‌లోని ఉన్నావ్ నుంచి ఒక కారు రాయ్‌బరేలీ వైపు వెళ్తోంది. రాయ్‌బరేలీకి చేరేలోపే ఒక ట్రక్కు భూతంగా వచ్చి కారుకు గుద్దింది. చూడడానికది ఊహించని ప్రమాదంగానే కనిపిస్తోంది, కానీ నిజానికి అది వ్యూహాత్మక ప్రమాదం. కారులో ఉన్న వాళ్లలో ఒక్కరు కూడా బతికి బట్టకట్టకూడదనేటంత క్రౌర్యంతో పన్నిన పన్నాగం. కారులో ప్రయాణిస్తున్న నలుగురిలో ఇద్దరు మహిళల ప్రాణాలు పోయాయి. ఓ పంతొమ్మిదేళ్ల అమ్మాయి, ఓ మగ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. ప్రాణాపాయం నుంచి బతికి బయటపడ్డారు. అంతకంటే ముందు... గత ఏడాది ఏప్రిల్ 13వ తేదీ. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం, ఉన్నావ్‌కు చెందిన రాజకీయ నాయకుడు, బంగేర్‌మావ్ నియోజకవర్గ శాసనసభ్యుడు కుల్దీప్ సింగ్ సెంగార్‌కు సిబిఐ నుంచి పిలుపు వచ్చింది. ప్రశ్నించిన తర్వాత అతడి మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి వారం రోజులు జుడీషియల్కస్టడీని విధించింది అలహాబాద్ హైకోర్టు.అంతకు ముందు కూతురికి జరిగిన అన్యాయం మీద న్యాయపోరాటం చేస్తున్న ఓ తండ్రిని అరెస్ట్ చేసి జుడీషియల్ కస్టడీ విధించడమైంది. తండ్రికి జరుగుతున్న అన్యాయాన్ని చూసి భరించలేని అతడి కూతురు రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్ ఇంటి ముందు ఆత్మత్యాగానికి సిద్ధమైంది. ఇంత భావోద్వేగాలతో అట్టుడిగిపోతున్న ఉత్తరప్రదేశ్‌లో ఆ తండ్రిని చనిపోయేవరకు చిత్రహింసలకు గురిచేశారు పోలీసులు. కూతురి కోసం తండ్రి న్యాయ పోరాటం ఒకవైపు, తండ్రి ప్రాణాలు కాపాడ్డం కోసం కూతురి ఆవేదన పోరాటం మరో వైపు. ఇంత హృదయవిదారకమైన పరిస్థితికి దారి తీసిన దురాగతం 2017, జూన్ నాలుగవ తేదీన చోటుచేసుకుంది. ఆ రోజు ఉన్నావ్‌లోని కుల్దీప్ సింగ్ సెంగార్ ఇంటికి ఉద్యోగం ఇప్పించమని వెళ్లింది ఓ పదిహేడేళ్ల అమ్మాయి. ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ మృగాహంకారానికి బలయింది. మైనారిటీ తీరని అమ్మాయి మీద లైంగిక దాడికి పాల్పడిన కుల్దీప్ సింగ్‌ను పోక్సో (ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ హెరాస్మెంట్) చట్టం కింద అరెస్ట్ చేశారు. ఇప్పుడతడు సీతాపూర్ జైల్లో ఉన్నాడు. అతడి కేసు విచారణకు వస్తే శిక్ష పడడం ఖాయమని తెలిసిన కుల్దీప్... అత్యాచార బాధితురాలి కుటుంబాన్ని భయబ్రాంతులను చేయడానికి తెగపడ్డాడు. బాధితురాలి తండ్రిని జైల్లో చిత్రహింసలకు గురి చేసి చంపించాడు. తండ్రి పోయిన తర్వాత కూడా బాధితురాలు న్యాయపోరాటాన్ని కొనసాగించడంతో ఆమె ప్రయాణిస్తున్న కారును ట్రక్కుతో గుద్దించి హత్యాప్రయత్నం చేశాడు కుల్దీప్. ఆ ప్రమాదంలో గాయపడిన పంతొమ్మిదేళ్ల అమ్మాయి, ఆమె లాయరు (జూలై 31వ తేదీన) తమకు రక్షణ కల్పించి, కేసును విచారించి తగు న్యాయం చేయవలసిందిగా సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్‌కు ఉత్తరం రాశారు. తక్షణమే స్పందించిన అత్యున్నత న్యాయవ్యవస్థ ఈ కేసును సత్వరమే విచారించి నివేదిక ఇవ్వవలసిందిగా సీబీఐ జాయింట్ డైరెక్టర్ సంపత్ మీనాకు బాధ్యతలకు అప్పగించింది.– వాకా మంజులారెడ్డి -
ఉన్నావ్ కేసు: 17 ప్రాంతాల్లో సీబీఐ సోదాలు
లక్నో: ఉత్తరప్రదేశ్‌లో ఉన్నావ్ యాక్సిడెంట్ కేసుపై సీబీఐ విచారణ ముమ్మరం చేసింది. విచారణలో భాగంగా ఆదివారం రాష్ట్రంలోని 17 ప్రాంతాల్లో ఏకకాలంలో సీబీఐ సోదాలు నిర్వహిస్తోంది. అలాగే ఉన్నావ్ అత్యాచార నిందితుడు కుల్దీవ్ సెగార్ ఉంటున్న సితాపూర్ జైలులో కూడా అధికారుల సోదాలు నిర్వహించారు. జైలు రికార్డులను పరిశీలించి.. ఇటీవల కాలంలో ఆయన్ను కలవడానికి ఎవరెవరు వచ్చారని జైలు అధికారులను ప్రశ్నిస్తున్నారు. ఆయన అనుచరుల ఇళ్లల్లో కూడాసోదాలు చేపట్టారు. ఈ కేసులో 45 రోజుల్లో విచారణ పూర్తి చేసి నివేదిక సమర్పించాలని సుప్రీం కోర్టు సీబీఐని ఆదేశించిన విషయం తెలిసిందే. దీంతో కేసు విచారణలో సీబీఐ మరింత వేగం పెంచింది. ఘటనతో సంబంధమున్న ప్రతి ఒక్కరినీ విచారిస్తోంది. ట్రక్ డ్రైవరు ఆశిష్ కుమార్ పాల్, క్లీనర్ మోహన్‌లకు కోర్టు మూడు రోజుల పోలీస్ కస్టడీని విధించిన విషయం తెలిసిందే. ట్రక్ యజమానిని కూడా పోలీసులు ప్రశ్నిస్తున్నారు. అయితే శనివారం ఉదయం ఈ కేసులో కీలక విషయాలు బయటపడ్డాయి. ప్రమాదం జరిగినప్పుడు వాహనం నెంబర్ కనబడకుండా గ్రీస్ పూసారని తెలిసింది. ప్రమాదం జరిగిన రోజు ఉదయం గం. 05.20లకు ఘటనా స్థలం నుంచి 20 కిలోమీటర్ల దూరంలోని టోల్‌ప్లాజా వద్ద ఉన్న సీసీ కెమెరాలో ట్రక్కు నంబర్ ప్లేట్‌పై ఎలాంటి మచ్చలు, మరకలు గానీ లేని విషయం బహిర్గతమైంది. దీంతో ఈ ప్రమాదం కావాలనే చేశారనే వాదనకు బలం చేకూరినట్టైంది. ఈ విషయం వాహన యజమానిని ప్రశ్నించగా, ఈఎమ్ఐలు కట్టకుండా తప్పించుకోవడానికి తరచూ అలా చేస్తుంటామని చెప్పడం గమనార్హం. కాగా కారు ప్రమాదంలో గాయపడిన అత్యాచార బాధితురాలు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. ఆమెతో పాటు తన వ్యక్తిగత న్యాయవాది కూడా ప్రస్తుతం ఆసుపత్రిలోనే ఉన్నారు. -
‘కుల్దీప్‌కిది కష్టకాలం.. తోడుగా నిలవాలి’
లక్నో: నియోజకవర్గ ప్రజలను కాపాడాల్సింది పోయి.. తానే వారి పాలిట కాలయముడిగా మారాడు. సాయం కోసం వచ్చిన బాలికపై అత్యాచారం చేశాడు. పోలీసులకు ఫిర్యాదు చేసినందుకు ఆమె తండ్రిని చంపేశాడు. చివరికి బాధితురాలిని కూడా చంపేందుకు ప్రయత్నించాడు. బాధితురాలు ప్రయాణిస్తున్న కారుకు యాక్సిడెంట్ చేయించడంతో.. ప్రసుత్తం ఆమె చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. ఉన్నావ్ అత్యాచార బాధితురాలి యాక్సిడెంట్ పట్ల దేశవ్యాప్తంగా నిరసన వ్యక్తమవుతుంటే.. నాయకులు మాత్రం ఇంకా కళ్లు తెరవడం లేదు. నిందితుల తరఫున వకాల్తా పుచ్చుకుని అడ్డగోలు వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఉత్తరప్రదేశ్‌కు చెందిన బీజేపీ నాయకుడు ఆశిష్ సింగ్ అషు.. వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఉన్నావ్‌లో నిర్వహించిన ఓ కార్యక్రమానికి హాజరైన ఆశిష్ సింగ్ మాట్లాడుతూ.. ‘మన సోదరుడు కుల్దీప్ సింగ్ నేడు మన మధ్యలో లేకపోవడం బాధాకరం. ప్రస్తుతం కుల్దీప్ క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. ఈ సమయంలో మనం అన్నకు తోడుగా ఉండాలి. త్వరలోనే కుల్దీప్ ఈ కష్టాల నుంచి బయటపడతారని ఆశిస్తున్నాను. మనం ఎక్కడ ఉన్నా కుల్దీప్ క్షేమం గురించి ఆలోచించాలి’ అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అయితే ఆశిష్ వ్యాఖ్యల పట్ల ప్రతిపక్షాలతో పాటు మహిళా సంఘాలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ‘ఆడపిల్లకు అన్యాయం చేసి చంపడానికి చూసిన వాడిని వెనకేసుకు వస్తున్నారు. మీలాంటి నాయకుల ఉండటం మా ఖర్మ’ అంటూ జనాలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉన్నావ్ అత్యాచార బాధితురాలు ప్రయాణిస్తున్న కారు రోడ్డు ప్రమాదానికి గురికావడంతో ప్రతిపక్షాలు పార్లమెంట్లో బీజేపీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడిన సంగతి తెలిసిందే. దీంతో బీజేపీ కుల్దీప్పై చర్యలకు సిద్ధపడింది. అతడిని పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్టు బీజేపీ అధిష్టానం గురువారం ప్రకటించిన సంగతి తెలిసిందే. -
ఉన్నావ్ రోడ్డు ప్రమాదం కేసులో పురోగతి
సాక్షి: ఉన్నావ్ రేప్ బాధితురాలు ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైన కేసులో ట్రక్ డ్రైవరు ఆశిష్ కుమార్ పాల్, క్లీనర్ మోహన్‌లకు కోర్టు మూడు రోజుల పోలీస్ కస్టడీని విధించింది. ట్రక్ యజమానిని కూడా పోలీసులు ప్రశ్నిస్తున్నారు. అయితే శనివారం ఉదయం ఈ కేసులో కీలక విషయం తెలిసింది. ప్రమాదం జరిగినప్పుడు వాహనం నెంబర్ కనబడకుండా గ్రీస్ పూసారని తెలిసింది. ప్రమాదం జరిగిన రోజు ఉదయం గం. 05.20లకు ఘటనా స్థలం నుంచి 20 కిలోమీటర్ల దూరంలోని టోల్‌ప్లాజా వద్ద ఉన్న సీసీ కెమెరాలో ట్రక్కు నంబర్ ప్లేట్‌పై ఎలాంటి మచ్చలు, మరకలు గానీ లేని విషయం బయటపడింది. దీంతో ఈ ప్రమాదం కావాలనే చేశారనే వాదనకు బలం చేకూరినట్టైంది. ఈ విషయం వాహన యజమానిని ప్రశ్నించగా, ఈఎమ్ఐలు కట్టకుండా తప్పించుకోవడానికి తరచూ అలా చేస్తుంటామని చెప్పడం గమనార్హం. ఈ కేసులో 45 రోజుల్లో విచారణ పూర్తి చేసి నివేదిక సమర్పించాలని సుప్రీం కోర్టు సీబీఐని ఆదేశించిన విషయం తెలిసిందే. -
ప్రతిఘటన
-
ఇక ఢిల్లీలో ‘ఉన్నావ్’ విచారణ
న్యూఢిల్లీ: ఉన్నావ్ అత్యాచార ఘటనకు సంబంధించి నమోదైన మొత్తం ఐదు కేసులనూ ఉత్తరప్రదేశ్ నుంచి ఢిల్లీకి బదిలీ చేయాలని సుప్రీంకోర్టు గురువారం ఆదేశించింది. అలాగే బాధితురాలికి తక్షణమే రూ. 25 లక్షల తాత్కాలిక పరిహారం అందజేయాలని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాన్ని నిర్దేశించింది. గత ఆదివారం ఉన్నావ్ అత్యాచార బాధితురాలి కారును ట్రక్కు ఢీకొట్టిన ఘటనపై దర్యాప్తును వారం రోజుల్లోనే పూర్తి చేయాలని కూడా సీబీఐకి సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. అలాగే ఉన్నావ్ అత్యాచర ఘటన ప్రధాన కేసు విచారణను ప్రారంభించిన నాటి నుంచి 45 రోజుల్లోపే పూర్తి చేయాలని కూడా సీబీఐని సుప్రీంకోర్టు ఆదేశించింది. మరోవైపు అత్యాచారం చేసిన బీజేపీ ఎమ్మెల్యే కుల్దీప్ సెంగార్‌ను తమ పార్టీ నుంచి బీజేపీ బహిష్కరించింది. కాగా, బాధితురాలికి భద్రత కల్పించడంలో నిర్లక్ష్యం వహించినందుకు ఆమె భద్రత కోసం గతంలో కేటాయించిన ముగ్గురు పోలీస్ సిబ్బందిని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం సస్పెండ్ చేసింది. కానీ ఇది సరిపోదనీ, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, డీజీపీ ఓపీ సింగ్ రాజీనామా చేయాలని ప్రతిపక్ష సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) డిమాండ్ చేస్తోంది. 2017లో కుల్దీప్ సెంగార్ తనపై అత్యాచారం చేశాడని 2018లో ఉన్నావ్‌కు చెందిన యువతి ఆరోపించగా, పోలీసులు ఆమె తండ్రినే అరెస్టు చేసి లాకప్‌లోనే ఆయన చనిపోయేలా చేయడం తెలిసిందే. బాధిత యువతి గత ఆదివారం తన ఇద్దరు సమీప బంధువులు, లాయర్‌తో కలిసి కారులో ప్రయాణిస్తుండగా, ఆ కారును ట్రక్కుతో ఢీకొట్టి వారందరినీ చంపే ప్రయత్నం జరిగింది. యువతి బంధువులైన ఇద్దరు మహిళలు మరణించగా, యువతి, ఆమె లాయర్ తీవ్ర గాయాలపాలై ప్రస్తుతం లక్నోలోని వైద్యశాలలో చికిత్స పొందుతున్నారు. ప్రమాద ఘటనపై విచారణను ఇప్పటికే ప్రారంభించిన సీబీఐ, 10 మందిపై హత్యానేరం మోపింది. సత్వర విచారణ కోసం ఏకపక్ష ఆదేశాలు ఉన్నావ్ అత్యాచార కేసు పరిస్థితులు, అసాధారణ వాస్తవాలను దృష్టిలో పెట్టుకుని, విచారణను వేగవంతం చేసే ఉద్దేశంతో నిందితుల తరఫు వాదనలు వినకుండానే తాము ఏకపక్ష ఆదేశాలు ఇస్తున్నట్లు సుప్రీంకోర్టు వెల్లడించింది. ఒకవేళ ఏవైనా అసాధారణ పరిస్థితులు ఉంటే మాత్రమే ప్రమాద ఘటనపై దర్యాప్తును ముగించేందుకు సీబీఐకి అదనంగా మరో వారం రోజులపాటు గడువు ఇస్తామని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్, జస్టిస్ దీపక్ గుప్తా, జస్టిస్ అనిరుద్ధ బోస్‌ల ధర్మాసనం వెల్లడించింది. అన్ని కేసులనూ ఢిల్లీలోని తీస్ హజారీ కోర్ట్స్లోని జడ్జి ధర్మేశ్ శర్మ విచారిస్తారని చెప్పింది. ఓ రహస్య సమావేశం అనంతరం సుప్రీం జడ్జీలు ధర్మేశ్ శర్మ పేరును ఖరారు చేశారు. ఈ ఆదేశాలను మార్చాలని లేదా రద్దు చేయాలని వచ్చే ఏ పిటిషన్‌నూ విచారణకు స్వీకరించబోమంది. కుల్దీప్పై బీజేపీ వేటు ఉన్నావ్ ఘటనపై దేశవ్యాప్తంగా నిరసనలు, బీజేపీపై విమర్శలు వస్తుండటంతో ఈ కేసులో ప్రధాన నిందితుడు, ఎమ్మెల్యే కుల్దీప్ సెంగార్‌ను బీజేపీ తమ పార్టీ నుంచి బహిష్కరించింది. బీజేపీ యూపీ అధ్యక్షుడు స్వతంత్ర దేవ్ సింగ్ ఈ విషయాన్ని ప్రకటించారు. కుల్దీప్ను బహిష్కరించాలని బీజేపీ కేంద్ర నాయకత్వం నిర్ణయం తీసుకుందనీ, ఆ విషయాన్ని ప్రకటించాల్సిందిగా బీజేపీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జేపీ నడ్డా స్వతంత్ర సింగ్‌కు ఫోన్లో చెప్పారని పార్టీ వర్గాలు తెలిపాయి. కుల్దీప్ ఇప్పటికే జైల్లో ఉన్నారు. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ మాట్లాడుతూ బీజేపీలో ఓ నేరస్తుడికి అధికారం ఇచ్చినట్లు ఎట్టకేలకు ఆ పార్టీ ఒప్పుకుందన్నారు. -
రాజ్యాంగమా... ఉన్నావా?
యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం ఏర్పడిన రెండునెలల తరువాత 2017 జూలై 11న ఒక అమ్మాయి అదృశ్యమైంది. జూలై 17న ఉన్నావ్ బాలికకు ఉద్యోగం ఆశ చూపి గ్యాంగ్ రేప్ చేశారని తేలింది. ఎమ్మెల్యే కుల్ దీప్ సింగ్ సెంగార్, సోదరుడు అతుల్ సింగ్, మరికొందరు ఈ దారుణానికి పాల్పడ్డారని ఆరోపణ. జూలై 20, 2017న ఆ అమ్మాయి కనిపించింది. ఉన్నావ్ తీసుకువచ్చారు. ఎంతో అల్లరి తరువాత ఫిబ్రవరి 24, 2018న ఎఫ్ఐ ఆర్ నమోదు చేశారు. బాధితురాలి కుటుంబ సభ్యు లను బెదిరించే కార్యక్రమం జరుగుతూనే ఉంది. ఆమె తండ్రి సురేంద్రను ఇంటివాళ్లు చూస్తుండగా చెట్టుకు కట్టివేసి కర్రలు, బెల్ట్, రాడ్లతో అతుల్ సింగ్, అనుచరులు దారుణంగా కొట్టారు. గాయపడిన సురేంద్రను ఏ దవాఖానా చేర్చుకోలేదు. అక్రమంగా ఆయుధాలు కలిగి ఉన్నాడంటూ సురేంద్రను ఏప్రిల్ 4, 2018న అరెస్టు చేశారు. నన్నురేప్ చేశారని ఎంత మొత్తుకున్నా ఒక్కడూ వినడం లేదు. పైగా నన్ను బెదిరిస్తున్నారు, వాళ్లను అరెస్టు చేయండి, లేకపోతే మీ కళ్లముందే చస్తానని బాధితురాలు ఏప్రిల్ 8, 2018న ముఖ్యమంత్రి ఇంటిముందు ఆత్మహత్యాప్రయత్నం చేసింది. అప్పుడు దేశం మొత్తానికి ఈ ఘోరం గురించి తెలిసింది. ఏప్రిల్ 10న అతుల్ సింగ్ సహా నలుగురిని సురేంద్రను కొట్టిన కేసులో అరెస్టు చేశారు. మూడు రోజుల తరువాత ఏప్రిల్ 12న సురేంద్ర గాయాలతో చనిపోయాడు. యూపీ ప్రభుత్వం కేసును సీబీఐకి ఇచ్చింది. సెంగార్ ను ఎందుకు ఇంకా అరెస్టుచేయలే దని అలహాబాద్ హైకోర్టు ప్రశ్నించింది. ఎఫ్ ఐ ఆర్ లో ఆయన పేరుంది. సీబీఐ దర్యాప్తు చేస్తున్నది. మేం ఎందుకు అరెస్టు చేయాలి అని పోలీసు ఉన్నతాధికారి ఓ.పి. సింగ్ అమాయకంగా ప్రశ్నించారు. ఏప్రిల్ 13న సెంగార్‌ను ప్రశ్నించడానికి తీసుకువెళ్లి మరు నాడు అరెస్టు చేశారు. స్వయంగా బాలికను సెంగార్ దగ్గరకు తీసుకువెళ్లి, లోపల రేప్ చేస్తుంటే తలుపు దగ్గర కాపలా కాసిన ఆరోపణపై శశిసింగ్ అనే మహిళామణిని సీబీఐ ఏప్రిల్ 15న అరెస్టు చేసింది. ఈలోగా ఎమ్మెల్యేగారి భక్త బృందం మా ఎమ్మెల్యే నిర్దోషి అని ఏప్రిల్ 23న ఒక ర్యాలీ తీసారు. 2018 జూలై 7న సురేంద్ర హత్యకేసులో అయిదుగురిపైన సీబీఐ నేరాలు మోపింది. 11న సెంగార్, శశిసింగ్ల పైన సీబీఐ అత్యాచార ఆరోపణలను నమోదు చేసింది. తండ్రిపైన దొంగ కేసుల కుట్ర చేసినందుకు ముగ్గురు పోలీసు అధికారుల మీద మరో ఇద్దరి మీద 13న కేసులు పెట్టారు. జూలై 31, 2018న రేపిస్టులకు మరణశిక్ష విధించే బిల్లును లోక్‌సభ ఆమోదించింది. ఆగస్టు 18న సురేంద్ర హత్యకేసులో కీలకమైన సాక్షి యూనుస్ అనుమానాస్పదంగా మరణించాడు. డిసెంబర్ 17న రేప్ బాధితురాలి బంధువులపైన దొంగ పత్రాలు ఇచ్చారనే ఆరోపణపై శశిసింగ్ భర్త కేసు పెట్టారు. జూన్ 6, 2019న ఉన్నావ్ ఎంపీ సాక్షి మహారాజ్ సెంగార్ ను సీతాపూర్ జైల్లో కలిసి తనను జైలు నుంచే గెలిపించినందుకు కృతజ్ఞతలు చెప్పుకున్నారు. 20 ఏళ్ల కిందట హత్యా ప్రయత్నం చేసాడన్న పాత కేసు తవ్వి జూలై 4న బాధితురాలి బాబాయికి పదేళ్ల జైలు శిక్షవేసారు. జూలై 28న బాధితురాలి బంధువులు లాయర్ మహేంద్ర సింగ్ కలిసి ప్రయాణిస్తున్న వాహనానికి యాదృచ్ఛికంగా ప్రమాదం జరిగి ఇద్దరు మహిళలు చనిపోయారు. జూలై 29న రాజ్యసభలో సెంగార్ నేరచరిత్రపైన గందరగోళం జరిగింది. 30న ఇండియాగేట్ దగ్గర నిరసనలు చేశారు. బీజేపీ అతన్ని పార్టీనుంచి బహిష్కరించినట్టు తాజా వార్త. బాధితురాలు, ఆమెలో ధైర్యం బతకాలి. లాయర్ల క్రాస్ ఎగ్జామినేషన్‌ను తట్టుకుని తనను బలాత్కరించాడని నమ్మించేట్టు చెప్పగలిగితేనే ఈ ఎమ్మెల్యేగారు అసెంబ్లీకి కాకుండా జైలుకు వెళ్లగలుగుతాడు. నిర్దోషిగా విడుదలైతే, మంత్రులంతా వెళ్లి పూల మాలలతో స్వాగతం చెప్పి వీలైతే మంత్రిని చేసి రాజ్యాంగాన్ని రక్షిస్తామని ఆయనచే ప్రమాణం కూడా చేయిస్తారేమో, ఎవరికి తెలుసు? యూపీలో శాంతిభద్రతలు దేశానికే ఆదర్శం అని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సగర్వంగా ప్రకటించుకున్నారు. ఎంత యోగి అయితే అంత ఆత్మవిశ్వాసం అన్నమాట. యోగులు కాని మనవంటి వారికి అది అర్థం కాదు. ఆయనకు మించిన ఆత్మవిశ్వాసం కలిగిన యోధుడు సెంగార్. ఎందుకంటే ఆయన గత సంవత్సరం ఏప్రిల్ నుంచి సీబీఐ పోలీసు కస్టడీలోనే ఉన్నా, అత్యంత యాదృచ్ఛికంగా ఇక్కడ ప్రమాదం జరిగిపోయింది. రాయ్‌బరేలీ దగ్గర జరిగిన ప్రమాదంలో బాధితురాలు, ఆమె లాయర్ తీవ్రంగా గాయపడ్డారు. ఇద్దరు కుటుంబ సభ్యులు చనిపోయారు. బాధితురాలు తమపై ఇది హత్యాకుట్ర అని ఫిర్యాదు చేసిన తరువాత జూలై 29న యూపీ పోలీసులు సెంగార్ మరో తొమ్మిది మంది పైన హత్యకేసు నమోదు చేశారు. తెలుగు సినిమా కథ కాదిది. యోగి, మహా రాజ్ అని పేర్లుపెట్టుకుని రాజకీయాలు చేస్తున్న ఉత్తరప్రదేశ్‌లో ఎంఎల్యేలు, ఎంపీలు మంత్రులు సాగి స్తున్న దురన్యాయాలు. కీచక రాజకీయ వేదిక ఉన్నావ్ రాజ్యాంగాన్ని ఉన్నావా అని అడుగుతున్నది. వ్యాసకర్త :మాడభూషి శ్రీధర్, బెన్నెట్ యూనివర్సిటీ ప్రొఫెసర్, కేంద్ర సమాచార మాజీ కమిషనర్ -
అక్కడ నవ్వడమా? సిగ్గుచేటు!
న్యూఢిల్లీ: బాలీవుడ్ నటి, సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ జయాబచ్చన్పై సోషల్ మీడియాలో ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఉనావ్ రేప్ బాధితురాలికి న్యాయం చేయాలంటూ పార్లమెంటు ఆవరణలో మంగళవారం జరిగిన నిరసన ప్రదర్శనలో జయా బచ్చన్ కూడా పాల్గొన్న సంగతి తెలిసిందే. అయితే, ఈ నిరసన ప్రదర్శనలో ఆమె నవ్వులు చిందిస్తూ.. సరదాగా తోటి ఎంపీలతో మాట్లాడుతూ ఉన్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. రోడ్డు ప్రమాదంలో గాయపడి.. చావుబతుకుల మధ్య ఉన్న ఉనావ్ అత్యాచార బాధితురాలికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ మంగళవారం పార్లమెంటు ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద సమాజ్‌వాదీ, తృణమూల్ కాంగ్రెస్ పార్టీల ఎంపీలు నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ నిరసనలో జయాబచ్చన్‌తోపాటు, ఎస్పీ సీనియర్ ఎంపీ రాంగోపాల్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జయా బచ్చన్ తోటి ఎంపీలతో సరదాగా ముచ్చటిస్తూ..నవ్వులు చిందిస్తున్న ఫొటోలు సోషల్ మీడియాలో దర్శనమివ్వడంతో నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒక బాధితురాలికి న్యాయం చేయాలంటూ నిర్వహించిన నిరసన ప్రదర్శనలో జయా బచ్చన్ ఇలా వ్యవహరించడం సముచితం కాదని నెటిజన్లు అంటున్నారు. ఎంపీల నవ్వుల్లోనే వారి నిబద్ధత, చిత్తశుద్ధి ఏమిటో స్పష్టమవుతుందని తప్పుబడుతున్నారు. నెలకు జీతం, ప్రభుత్వ సౌకర్యాలు అందితే చాలు.. ప్రజలు ఏమైతే ఏంటి అన్నట్టుగా ఎంపీల తీరు ఉందని, ఇది సిగ్గుచేటు అని నెటిజన్లు మండిపడుతున్నారు. -
ముప్పు ఉందని ముందే పసిగట్టాడు
న్యూఢిల్లీ: ఉన్నావ్ అత్యాచార బాధితురాలి తరపున వాదిస్తున్న న్యాయవాది మహేంద్ర సింగ్ తన ప్రాణాలకు ముప్పు ఉందని ముందుగానే ఊహించారు. రోడ్డు ప్రమాదం జరగడానికి వారం రోజుల ముందే తుపాకీ లైసెన్స్ కోసం ఉన్నావ్ జిల్లా కలెక్టర్‌కు ఆయన లేఖ రాసిన తాజాగా వెలుగులోకి వచ్చింది. భవిష్యత్తులో తన ప్రాణాలకు ముప్పు వాటిల్లే అవకాశం ఉన్నందున తనకు తక్షణమే తుపాకీ లైసెన్స్ మంజూరు చేయాలని జూలై 15న కలెక్టర్‌కు రాసిన లేఖలో పేర్కొన్నారు. గతేడాది సెప్టెంబర్‌లో తుపాకీ లైసెన్స్ కోసం తాను దరఖాస్తు చేసుకున్నానని వెల్లడించారు. పోలీసులు, జిల్లా యంత్రాంగంపై రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి తెచ్చి తన దరఖాస్తును తిరస్కరించేలా చేసిందని ఆరోపించారు. ఉన్నావ్ అత్యాచార ఘటన బాధితురాలు ప్రయాణిస్తున్న కారును ఆదివారం ట్రక్కు ఢీకొనడంతో బాధిత యువతి బంధువులు ఇద్దరు మరణించారు. బాధితురాలితోపాటు మహేంద్ర సింగ్ కూడా తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుత్తం లక్నోలోని కింగ్‌జార్జ్ మెడికల్ యూనివర్సిటీ ఆస్పత్రిలో ఆయన కోలుకుంటున్నారు. బాధితురాలి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. మరోవైపు బాధితురాలి లేఖపై సుప్రీంకోర్టు స్పందించింది. కేసు విచారణను 45 రోజుల్లో పూర్తి చేయాలని సీబీఐని ఆదేశించింది. బాధితురాలికి రూ.25 లక్షల మధ్యంతర పరిహారం చెల్లించాలని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి ఆదేశాలిచ్చింది. (చదవండి: ఒక్క కేసు; ఎన్నో ట్విస్ట్‌లు!) -
ఉన్నావ్ ఘటన : సుప్రీం కీలక ఆదేశాలు
సాక్షి, న్యూఢిల్లీ : ఉన్నావ్ అత్యాచార ఘటనపై సుప్రీం కోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. అత్యాచార బాధితురాలికి మధ్యంతర పరిహారంగా రూ.25 లక్షలు చెల్లించాలని ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ మొత్తం శుక్రవారం వరకు అందజేయాలని స్పష్టం చేసింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాలికి, ఆమె తరపు న్యాయవాదికి, ఆమె కుటుంబానికి రాయ్‌బరేలీ సీఆర్పీఎఫ్ యూనిట్ భద్రత కల్పించాలని సీజేఐ రంజన్ గగోయ్ నేతృత్వంలోని బెంచ్ వెల్లడించింది. కాగా, బాధితురాలు ప్రయాణిస్తున్న వాహనం జూలై 28న ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. (చదవండి : ఒక్క కేసు; ఎన్నో ట్విస్ట్‌లు!) ఈ ఆక్సిడెంట్లో బాధిత యువతి బంధువులు ఇద్దరు మరణించగా, బాధితురాలితోపాటు ఆమె న్యాయవాది కూడా తీవ్రగాయాలపాలయ్యారు. వెంటిలేటర్‌పై ఉత్తరప్రదేశ్‌లోని కింగ్ జార్జి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మెరుగైన చికిత్స అవసరమైన పక్షంలో యువతిని ఢిల్లీ ఎయిమ్స్‌కు తరలించాలని కోర్టు చెప్పింది. ప్రమాదానికి గల కారణాలను 14 రోజుల్లోగా తేల్చాలని అత్యున్నత న్యాయస్థానం సీబీఐని ఆదేశించింది. అత్యాచార ఘటనకు సంబంధించి ఉత్తర ప్రదేశ్‌లో ఉన్న ఐదు కేసులనూ ఢిల్లీ ట్రయల్ కోర్టుకు బదిలీ చేయాలని సుప్రీం ఆదేశించింది. 45 రోజుల్లో కేసుల విచారణ పూర్తి చేయాలని స్పష్టం చేసింది. తదుపరి వాదనలు శుక్రవారానికి వాయిదా వేసింది. ఇక ఈ కేసులో నిందితుడు, ఎమ్మెల్యే కుల్దీప్సింగ్ సెంగార్‌ను పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్టు బీజేపీ తెలిపింది. -
సెంగార్‌పై వేటు వేసిన బీజేపీ
న్యూఢిల్లీ : ఉన్నావ్ అత్యాచార బాధితురాలు ప్రయాణిస్తున్న కారు రోడ్డు ప్రమాదానికి గురికావడంతో.. ఈ కేసు దేశవ్యాప్తంగా మరోసారి చర్చనీయాశంగా మారింది. ఈ ఘటనలో బాధిత యువతి బంధువులు ఇద్దరు మరణించగా, బాధితురాలితోపాటు ఆమె న్యాయవాది కూడా తీవ్రగాయాలపాలయ్యారు. ప్రమాదం పేరుతో బాధితురాలిని హతమార్చేందుకు బీజేపీ ఎమ్మెల్యే కుల్దీప్సింగ్ సెంగార్ ఇదంతా చేయించారన్న ఆరోపణలు రావడంతో ఆయనతో పాటు మరో 10 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై ప్రతిపక్షాలు పార్లమెంట్లో బీజేపీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నాయి. అంతేకాకుండా సెంగార్‌ను బీజేపీ నుంచి బహిష్కరించాలని పెద్ద ఎత్తున డిమాండ్లు వినిపిస్తున్నాయి. దీంతో బీజేపీ సెంగార్‌పై చర్యలకు ఉపక్రమించింది. సెంగార్‌ను పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్టు బీజేపీ అధిష్టానం గురువారం ప్రకటించింది. కొద్ది రోజుల కిందట సెంగార్‌ను పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్టు తెలిపిన బీజేపీ.. ఆ నిర్ణయం ఎప్పుడు తీసుకున్నది మాత్రం వెల్లడించలేదు. కాగా, ఈ కేసు విషయంలో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ వైఖరిని సుప్రీం కోర్టు తప్పుపట్టిన కొన్ని గంటల్లోనే బీజేపీ సెంగార్‌ను బహిష్కరిస్తున్నట్టు ప్రకటించడం గమనార్హం. మరోవైపు బాధితురాలు రోడ్డు ప్రమాదానికి గురికావడంపై సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కాగా, సెంగార్ ఇంటికి ఉద్యోగం కోసం వెళ్లిన తనపై ఆయన లైంగిక దాడికి పాల్పడ్డారని ఉన్నావ్ అత్యాచార బాధితురాలు ఆరోపించారు. ఎమ్మెల్యేపై చర్యలు చేపట్టాలని కోరుతూ ఆమె పోలీసులను ఆశ్రయించారు. అయితే పోలీసులు మాత్రం ఆమె తండ్రిని అక్రమ ఆయుధాల కేసులో అరెస్ట్ చేశారు. అక్కడ ఆయన చనిపోవడంతో బాధితురాలు యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్ ఇంటి వద్ద ఆత్మహత్యాయత్నం చేయడం అప్పట్లో కలకలం రేపింది. ఈ ఘటనపై సీఎం యోగి సిట్ ఏర్పాటు చేసినప్పటికీ ఫలితం లేకపోయింది. పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తడంతో ఆ తర్వాత ఈ కేసును సీబీఐకి అప్పగించారు. చివరికి అలహాబాద్ కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిన తర్వాత సీబీఐ అధికారులు సెంగార్ అరెస్ట్ చేసి.. పొక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. అయితే ఏడాది గడిచిన కూడా ఈ కేసులో ఎటువంటి చర్యలు లేకపోవడంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. -
ఒక్క కేసు; ఎన్నో ట్విస్ట్‌లు!
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన ఉన్నావ్ గ్యాంప్ రేప్ కేసులో బాధితురాలి న్యాయపోరాటం ఫలించే సూచనలు కనిపించడం లేదు. రెండేళ్ల నుంచి న్యాయపోరాటం చేస్తున్న బాధితురాలు ఆస్పత్రిలో చావుబతుకుల్లో ఉంది. ఈ కేసులో ఇప్పటివరకు ట్రయల్ కోర్టు విచారణ ప్రారంభం కాకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్న బీజేపీ బహిష్కృత ఎమ్మెల్యే కుల్దీప్సింగ్ సెంగార్‌ను విచారించేందుకు న్యాయమూర్తి లేకపోవడం గమనార్హం. ఆయనకు వ్యతిరేకంగా గతేడాది జూలైలో సీబీఐ చార్జిషీటు దాఖలు చేసినా ఇప్పటివరకు విచారణ ప్రారంభం కాలేదు. సీబీఐ ప్రత్యేక కోర్టుకు జడ్జి లేకపోవడంతో కేసు విచారణ ముందుకు సాగలేదు. ఈ ఏడాది ఏప్రిల్ నెల మధ్యలో సీబీఐ ప్రత్యేక కోర్టు జడ్జి బదిలీ అయ్యారు. అప్పటి నుంచి ఎవరినీ నియమించకపోవడంతో ఈ పోస్ట్ ఖాళీగా ఉంది. న్యాయం ఆలస్యమవుతుండటంతో బాధితురాలి కుటుంబం ఎన్నో కష్టాలు ఎదుర్కొవాల్సి వచ్చింది. ఎమ్మెల్యే సెంగార్ అనుచరులు జరిపిన దాడిలో తండ్రి ప్రాణాలు కోల్పోగా, ఆమె బాబాయి జైలుపాలయ్యాడు. ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో తన ఇద్దరు బంధువులను కోల్పోయింది. బాధితురాలితో పాటు ఆమె తరపు న్యాయవాది కూడా తీవ్రంగా గాయపడ్డారు. కేసు నేపథ్యం.. 2017 ఏప్రిల్ 4, 11న రెండు పర్యాయాలు తనపై లైంగిక దాడి జరిగినట్టు బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఎమ్మెల్యే కుల్దీప్సింగ్ తనపై ఆఘాయిత్యానికి పాల్పడ్డారని పేర్కొంది. తనను బలవంతంగా ఎత్తుకుపోయి కుల్దీప్ ఇంట్లో మరోసారి సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారని ఆరోపించింది. ఏప్రిల్ 11న దారుణం గురించి బాధితురాలి కుటుంబ సభ్యులు ముందుగా పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యేను కేసు నుంచి తప్పించేందుకు ఉన్నావ్ పోలీసులు ప్రయత్నించారని బాధితురాలి కుటుంబ సభ్యులు ఆరోపించారు. బాధితురాలిని పోలీసులు తమ ‘కస్టడీ’లోకి తీసుకుని 12 రోజుల పాటు ఆమె మనసు మార్చేందుకు విఫలయత్నం చేశారని వెల్లడించారు. ఏప్రిల్ 4న జరిగిన ఆఘాయిత్యం గురించి మర్చిపోవాలని, కుల్దీప్సింగ్కు వ్యతిరేకంగా ఫిర్యాదు చేయొద్దని బాధితురాలిని ఒప్పించేందుకు ప్రయాసపడ్డారని ఆమె కుటుంబ సభ్యులు వివరించారు. సెంగార్‌ను నిందితుడిగా పేర్కొంటూ రెండోసారి ఫిర్యాదు చేయగా ఎమ్మెల్యే తన రాజకీయ పలుకుబడితో ఉన్నావ్ పోలీసులను తన గుప్పిట్లో పెట్టుకున్నాడు. దీంతో బాధిత కుటుంబం తమకు న్యాయం చేయాలని కోరుతూ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌కు లేఖ రాసింది. సీఎం హామీయిచ్చినా.. న్యాయం జరిగేలా చూస్తానని గతేడాది ముఖ్యమంత్రిని కలిసినప్పుడు తమకు హామీయిచ్చారని, ఇప్పటివరకు కేసు విచారణ అడుగు కూడా ముందుకు కదల్లేదని బాధితురాలి బాబాయ్ వాపోయారు. ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన భార్యకు అంత్యక్రియలు నిర్వహిందుకు ఆయన ఈరోజు పెరోల్‌పై బయటకు వచ్చారు. ఎమ్మెల్యే సెంగార్‌పై పెట్టిన రేప్ కేసును వెనక్కు తీసుకోవాలని అతడి అనుచరులు గతేడాది ఏప్రిల్ 2న ఉన్నావ్‌లో అందరూ చూస్తుండగా బాధితురాలి తండ్రిని చావబాదారు. ఎమ్మెల్యే గుండాలను వదిలేసిన పోలీసులు.. అక్రమ ఆయుధాలు కలిగివున్నాడన్న నిందమోపి బాధితురాలి తండ్రిని అరెస్ట్ చేశారు. జైలులో తీవ్రంగా హింసించడంతో ఏప్రిల్ 9న అతడు ప్రాణాలు వదిలాడు. వరుస ఎదురుదెబ్బలతో బాధితురాలు గతేడాది ఏప్రిల్ 8న ఏముఖ్యమంత్రి నివాసం ఎదుట ఆత్మహత్యాయత్నం చేసింది. జాతీయ మీడియా, కేంద్ర సంస్థలు స్పందించడంతో దిగొచ్చిన ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కేసు విచారణకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని నియమించింది. బాధితురాలి తండ్రిపై దాడి కేసులో ఎమ్మెల్యే సోదరుడిని వెంటనే పోలీసులు అరెస్ట్ చేశారు. మైనర్ బాలికపై లైంగిక దాడి చేశారన్న ఆరోపణలతో ఏప్రిల్ 11న ఎమ్మెల్యే సెంగార్‌పై పోలీసులు పోస్కో చట్టం కింద కేసు నమోదు చేశారు. తర్వాత ఈ కేసును సీబీఐకి అప్పగించారు. రేప్, హత్య కేసుల్లో చార్జిషీటును గతేడాది జూలైలో ప్రత్యేక కోర్టుకు సీబీఐ సమర్పించింది. అంతకుమించి విచారణ ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. ఈ నేపథ్యంలో బాధితురాలు ప్రయాణిస్తున్న కారు రోడ్డు ప్రమాదానికి గురికావడం అనుమానాలకు తావిస్తోంది. ప్రమాదం పేరుతో బాధితురాలిని హతమార్చేందుకు ఎమ్మెల్యే సెంగార్ ఇదంతా చేయించారన్న ఆరోపణలు రావడంతో ఆయనతో పాటు 10 మందిపై తాజాగా పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా, ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాలి పరిస్థితి విషమంగా ఉందని, ఆమె తరపు న్యాయవాది క్రమంగా కోలుకుంటున్నారని వైద్యులు వెల్లడించారు. (చదవండి: ‘ఉన్నావ్’ రేప్ బాధితురాలికి యాక్సిడెంట్) -
రాయ్‌బరేలీ ప్రమాదంలో 25 మందిపై కేసు
ఉన్నావ్ రేప్ బాధితురాలు ప్రయాణీస్తున్న వాహనం ప్రమాదానికి గురై ఇద్దరు చనిపోగా, బాధితురాలు, ఆమె లాయరు తీవ్ర గాయాల పాలయిన సంగతి తెలిసిందే. ఆ ఘటనపై వివిధ వర్గాల నుంచి వచ్చిన ఒత్తిడితో ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం సిబిఐ విచారణకు ఆదేశించింది. ఈ నేపథ్యంలో సిబిఐ దాదాపు 25 మందిని నిందితులుగా పేర్కొంటూ కేసును దర్యాప్తు చేస్తోంది. ఇందులో గతంలో అత్యాచారానికి పాల్పడిన ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ సెంగార్,అతని సోదరునితో పాటు అతని లాయరు, అతనికి సన్నిహితంగా ఉన్న జర్నలిస్టులతో పాటు అరుణ్ సింగ్ అనే వ్యక్తిని చేర్చింది. ఈ అరుణ్ కుమార్ అనే వ్యక్తి ఆ రాష్ట్ర క్యాబినెట్ మినిస్టర్ అయిన రణ్వేంద్ర సింగ్‌కు అల్లుడు కావడం గమనార్హం. రణ్వేంద్ర సింగ్ ఫతేపూర్ అసెంబ్లీ స్థానం నుంచి ఎన్నికయ్యారు. అలాగే ప్రమాదానికి కారణమైన వాహనం ఫతేపూర్‌లోనే రిజిస్టర్ అవ్వడం, వాహన డ్రయివరు కూడా ఫతేపూర్‌కు చెందిన వాడు కావడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఈ విషయంపై మినిస్టర్ రణ్వేంద్ర సింగ్‌ను ప్రశ్నించగా.. అరుణ్ సింగ్ నా బంధువన్నది నిజమే. ఈ విషయం అందరికీ తెలుసు. అయినా ఈ ప్రమాదం కావాలని చేసినట్టు కనపడటం లేదు. ఏదేమైనా సిబిఐ విచారణలో అన్ని విషయాలు తెలుస్తాయని వ్యాఖ్యానించారు. కాగా, బుధవారం సిబిఐకి చెందిన 12 మంది అధికారుల బృందం ఘటన జరిగిన ప్రదేశాన్ని పరిశీలించింది. -
పోలీసులకు చుక్కలు చూపించిన విద్యార్థిని
లక్నో: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావ్ బాధితురాలు ప్రయాణిస్తున్న కారును ఆదివారం నంబరు ప్లేటులేని ట్రక్కు ఢీకొన్న సంగతి తెలిసిందే. ఈ ఘటనలో బాధిత యువతి బంధువులు ఇద్దరు మరణించగా, బాధితురాలితోపాటు ఆమె న్యాయవాది కూడా తీవ్రగాయాలపాలయ్యారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న వీరిద్దరూ ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. ఈ ఘటన పట్ల దేశవ్యాప్తంగా నిరసన వ్యక్తమవుతోంది. ఈ క్రమంలో ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఓ విద్యార్థిని ఈ సంఘటన గురించి ప్రశ్నల వర్షం కురిపిస్తూ.. యూపీ పోలీసులకు చెమటలు పట్టించింది. వివరాలు.. పోలీసు అధికారులు బుధవారం బారాబంకిలోని పలు పాఠశాలలు, కాలేజీల్లో ‘మహిళలకు భద్రత’ అనే అంశంపై అవగాహన సదస్సు నిర్వహించారు. అనంతరం విద్యార్థులతో ముఖాముఖిలో పాల్గొన్నారు. ఈ క్రమంలో 11వ తరగతి చదువుతున్న ఓ విద్యార్థిని తన ప్రశ్నలతో పోలీసులకు చుక్కలు చూపించింది. ఆమె ప్రశ్నలకు సరిగా సమాధానం చెప్పలేక పోలీసులు నీళ్లు నమిలారు. మునిబా కిద్వాయి అనే విద్యార్థిని మాట్లాడుతూ.. ‘అన్యాయం జరిగితే ప్రశ్నించాలంటున్నారు. నిరసన తెలపాలంటున్నారు. మన రాష్ట్రంలో ఓ యువతిపై బీజేపీ ఎమ్మెల్యే అత్యాచారం జరిపాడు. ఆ విషయం అందరికి తెలుసు. బాధితురాలు తనకు జరిగిన అన్యాయం గురించి మాట్లాడింది. ఫలితంగా ఆమెకు యాక్సిడెంట్ అయ్యింది’ అన్నారు. అంతేకాక ‘ఇది ప్రమాదం కాదని ప్రతి ఒక్కరికి తెలుసు. ట్రక్కు నంబర్ కనిపించకుండా నేమ్ ప్లేట్‌కు రంగేసి ఉండడం, అనూహ్యంగా ట్రక్కు కారుపైకి దూసుకెళ్లడం వంటివి అన్ని చూస్తే ఇది ప్రమాదం అనిపించడం లేదు. ఓ సాధరణ వ్యక్తికి వ్యతిరేకంగా నిరసన తెలపవచ్చు.. అదే అధికారంలో ఉన్న వ్యక్తికి వ్యతిరేకంగా నిరసన తెలిపితే.. ఫలితం ఎలా ఉంటుందో ఈ రోజు చూశాం. అతని మీద ఎలాంటి చర్యలు తీసుకోరు.. ఒక వేళ తీసుకున్నా ఎటువంటి ఫలితం ఉండదు. ప్రశ్నించిన అమ్మాయి నేడు ప్రాణాపాయ స్థితిలో ఉంది. ఇప్పుడు మీరు తనకెలా న్యాయం చేస్తారు. నేను నిరసన తెలుపుతాను.. నా రక్షణకు హామీ ఏది. నాకేం కాదని మీరు హామీ ఇవ్వగలుగుతారా’ అంటూ ప్రశ్నల వర్షం కురిపించింది. కిద్వాయి మాట్లాడుతున్నంతసేపు.. మిగతా స్టూడెంట్స్ చప్పట్లు కొడుతూనే ఉండగా.. పోలీసులు సమాధానం చెప్పడానికి ఇబ్బంది పడ్డారు. ఇదిలా ఉండగా.. కుల్దీప్ సింగ్ వల్ల తనకు ప్రాణాపాయం ఉందని.. బాధితురాలి పోలీసు శాఖకు ఎన్నో సార్లు ఫిర్యాదు చేసింది. ఈ విషయాన్ని స్వయంగా సీనియర్ పోలీసు అధికారి ఒకరు వెల్లడించారు. ‘బాధితురాలి కుటుంబం నుంచి 25 ఫిర్యాదులు వచ్చాయి. కానీ వాటిల్లో ఒక్కదాంట్లో కూడా ఆమె తనకు రక్షణ కల్పించాలని కోరలేదు. ఏది ఏమైనా జరిగిన ప్రమాదం గురించి అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తామ’ని తెలిపారు. -
‘ఉన్నావో రేప్’ ఎటుపోతుంది?
సాక్షి, న్యూఢిల్లీ : ‘దేశంలో మహిళలపై ఎలాంటి అత్యాచారాలను సహించం. మహిళలకు ఎక్కువ భద్రతను కల్పిస్తాం. అందుకు ఇప్పటికే హోం శాఖలో ప్రత్యేక భద్రతా విభాగాన్ని ఏర్పాటు చేశాం. మహిళలపై రేప్‌లు జరిగితే వాటిని నిర్దిష్ట కాలపరిమితిలో విచారించేలా చూస్తాం. అందుకు ఫాస్ట్‌ట్రాక్ కోర్టులను మరింతగా విస్తరింపచేస్తాం. ఫోరెన్సిక్ సౌకర్యాలను పెంచుతాం’ 2019 సార్వత్రిక ఎన్నికల సందర్భంగా భారతీయ జనతా పార్టీ విడుదల చేసిన 45 పేజీల మానిఫెస్టోలో మహిళల గురించి పేర్కొన్న పేరా. ఈ మానిఫెస్టోలో మహిళల భద్రత గురించి 37 సార్లు ప్రస్తావించారు. మరి, దేశవ్యాప్తంగా సంచలం సృష్టించిన ఉన్నావో రేప్ కేసులో ఏం జరిగిందీ ? ఏం జరుగుతోంది ? ఉత్తరప్రదేశ్‌లో భారతీయ జనతా పార్టీకి చెందిన ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ సెంగార్ తనను కిడ్నాప్ చేసి తనపై అత్యాచారం జరిపినట్లు ఓ టీనేజ్ అమ్మాయి 2017లో ఆరోపించారు. రకరకాల ఒత్తిళ్ల వల్ల ఈ విషయాన్ని బయటకు రాకుండా అధికార యంత్రాంగం తొక్కిపెట్టింది. చివరకు 2018లో ఈ విషయమై ఫిర్యాదు చేయాలని కుటుంబ సభ్యులతో కలిసి బాధితురాలు నిర్ణయించుకున్నారు. వారంతా పోలీసు స్టేషన్‌కు వెళితే ఫిర్యాదు తీసుకోవడానికి పోలీసులు తిరస్కరించారు. దీంతో వారు లక్నోలోని యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నివాసం ముందు ఆత్మాహుతికి ప్రయత్నించారు. అప్పడు అక్కడి సిబ్బంది వారి ప్రయత్నాన్ని అడ్డుకున్నారు. ఆ మరుసటి రోజే ఆ అమ్మాయి తండ్రి పోలీసు స్టేషన్ లాకప్‌లో మరణించారు. పోలీసులే కాకుండా, సెంగార్ సోదరుడు కూడా పోలీసు స్టేషన్‌కు వచ్చి కొట్టడం వల్ల అమ్మాయి తండ్రి మరణించినట్లు నాడు వార్తలు వచ్చాయి. అమ్మాయి తండ్రిని కొట్టారనడానికి ప్రత్యక్ష సాక్షిగా ఉన్న వ్యక్తి కూడా ఆ తర్వాత పది రోజుల్లో అనుమానాస్పద పరిస్థితుల్లో మరణించారు. జబ్బు వల్ల అతను చనిపోయినట్లు అధికార యంత్రాంగం పేర్కొంది. అటాప్సీ చేయించాల్సిందిగా సాక్షి బంధువులు డిమాండ్ చేశారు. నేటి వరకు అది జరగలేదు. కుల్దీప్ సింగ్ సెంగార్‌పై అత్యాచార ఆరోపణలను నాడు బీజేపీ ఎమ్మెల్యే సురేంద్ర సింగ్ తీవ్రంగా ఖండించారు. ముగ్గురు పిల్లల తల్లిని ఏ మగాడు రేప్ చేయరంటూ బుకాయించారు. బాధితురాలికి అసలు పిల్లలే లేరు. ఆ తర్వాత ఓ ఎన్నికల ప్రచార సభలో రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌తోపాటు నిందితుడు కుల్దీప్ సింగ్ సెంగార్ భార్య పాల్గొన్నారు. మీడియాలో ఈ ఫొటోలను చూసిన బాధితురాలి కుటుంబం ఇక తమకు న్యాయం జరిగే అవకాశం లేదని భావించి నేరుగా కోర్టును ఆశ్రయించారు. ఈ కారణంగా కుల్దీప్ సింగ్ జైలుకు వెళ్లాల్సి వచ్చింది. ఆయన జైల్లో ఉండగానే 2019 లోక్‌సభ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. బీజేపీ ఎంపీ సాక్షి మహరాజ్ జైలుకు వెళ్లి సెంగార్‌ను కలుసుకుని పరామర్శించారు. తన విజయం వెనక కుల్దీప్ సింగ్ సెంగార్ పాత్ర ఎంతో ఉందని ఆయన ప్రజల సమక్షంలో సెంగార్‌కు కతజ్ఞతలు తెలిపారు. ఉన్నావో రేప్ సంఘటనకు సంబంధించిన ఈ పరిణామాలన్నింటినీ ప్రజలు దాదాపు మరచిపోయారు. రేప్ బాధితురాలు, తన న్యాయవాది, ఇద్దరు తన ఆంటీలతో కలిసి కారులో వెళుతుండగా ఆదివారం నాడు ఓ ట్రక్కు వచ్చి ఢీకొనడం, ఆ సంఘటనలో బాధితురాలు, లాయర్ తీవ్రంగా గాయపడడం, బాధితురాలి ఇద్దరి సమీప బంధువులు మరణించడంతో ఉన్నావో రేప్ మరోసారి సంచలనం అయింది. ట్రక్కు నెంబర్ కనిపించకుండా నేమ్ ప్లేట్‌కు రంగేసి ఉండడం, అనూహ్యంగా ట్రక్కు కారుపైకి దూసుకెళ్లడం, ఈ విషయమై మీడియా పెద్ద ఎత్తున గోల చేయడంతో ఈ యాక్సిడెంట్ వెనక కుల్దీప్ సింగ్ హస్తం ఉండవచ్చంటూ పోలీసులు కేసు నమోదు చేశారు. -
ఆ లేఖ ఆలస్యంగా అందింది: సీజేఐ
న్యూఢిల్లీ : ఉన్నావ్ అత్యాచార బాధితురాలి లేఖ తనకు చేరడంలో జాప్యం కావడంపై భారత ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగొయ్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. బాధితురాలి కుటుంబం తనకి రాసిన లేఖ గురించి మీడియాలో ప్రచారం అయిన తర్వాతే తెలుసుకున్నానని పేర్కొన్నారు. ఈ విషయం మంగళవారమే తన దృష్టికి వచ్చిందన్నారు. ట్రక్కు ప్రమాదానికి ముందే..తనకు ప్రాణహాని ఉందంటూ ఉన్నావ్ బాధితురాలు సీజేఐకి రాసిన లేఖ వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో సీజేఐ రంజన్ గొగోయ్ బుధవారం మాట్లాడుతూ.. జూలై 12న హిందీలో బాధితురాలు రాసిన ఈ లేఖ..తన దృష్టికి రాలేదని తెలిపారు. తాను ఇంతవరకు లేఖను చదవలేదన్నారు. ఈ విషయం గురించి కోర్టు రిజిస్ట్రీని వివరణ కోరినట్లు వెల్లడించారు. ఈ నేపథ్యంలో న్యాయ వ్యవస్థను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని, అప్పుడే బాధితులు నేరుగా కోర్టును ఆశ్రయించే స్నేహ పూరిత వాతావరణం నెలకొంటుందని అభిప్రాయపడ్డారు. ఈ క్రమంలో ఉన్నావ్ బాధితురాలి లేఖపై గురువారం సుప్రీంకోర్టులో విచారణ జరుగనున్నట్లు తెలుస్తోంది. కాగా యూపీ బీజేపీ ఎమ్మెల్యే ఎమ్మెల్యే కుల్దీప్ సెంగార్ తనపై అత్యాచారం చేశాడని బాధితురాలు గతేడాది ఫిర్యాదు చేసిన విషయం విదితమే. ఈ క్రమంలో బాధితురాలు ప్రయాణిస్తున్న కారును ఆదివారం ట్రక్కు ఢీకొనడం పలు అనుమానాలకు తావిచ్చింది. ఈ ఘటనపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తడంతో ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బీజేపీ ఎమ్మెల్యే కులదీప్ సింగ్‌పై కేసు నమోదైంది. మరో పదిమంది పేర్లను కూడా ఎఫ్ఐఆర్లో చేర్చారు. ఇక గతేడాది దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ కేసులో పోలీసులు బాధితురాలి తండ్రినే అరెస్టు చేసి హింసించడంతో ఆయన పోలీస్ కస్టడీలోనే మరణించారు. బాధితురాలు కూడా ముఖ్యమంత్రి యోగి ఇంటి ముందే ఆత్మాహుతికి యత్నించింది. ఈ క్రమంలో ఎమ్మెల్యేను పోలీసులు అరెస్టు చేసినా అతను బెయిలుపై బయటకొచ్చాడు. దేశవ్యాప్తంగా తీవ్ర నిరసనలు వ్యక్తం కావడంతో కేసును సీబీఐ విచారణకు అప్పగించారు. తాజాగా బాధితురాలు, ఇద్దరు మహిళలు, లాయర్‌తో కలిసి రాయ్‌బరేలీకి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం జరిగింది. ఘటనలో ఇద్దరు మహిళలు మరణించగా, బాధితురాలు, లాయర్ తీవ్రగాయాలతో బయటపడ్డారు. ఈ నేపథ్యంలో ఆమెను చంపేందుకే ఈ ప్రమాదం చేయించారని ఎస్పీ, కాంగ్రెస్ పార్టీలు ఆరోపించాయి. ట్రక్కు డ్రైవర్‌తోపాటు యజమానిని కూడా పోలీసులు ఇప్పటికే అరెస్టు చేశారు. బాధితురాలి వెంట ఉండాల్సిన భద్రతా సిబ్బంది ఎందుకు లేరనే విషయంపై కూడా విచారణ జరుపుతామన్నారు. కాగా కుల్దీప్ సింగార్‌ను ఇప్పటికే పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్లు యూపీ బీజేపీ అధ్యక్షుడు స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. -
కలియుగాన్ని చూడాలంటే..
ముంబై: కలియుగాన్ని చూడాలంటే ఉత్తరప్రదేశ్‌కు వెళ్లాలని బాలీవుడ్ నటి రిచా చద్దా వ్యాఖ్యానించారు. యూపీలో చట్టం అన్నదే లేదని ఆమె అభిప్రాయపడ్డారు. ఉన్నావ్ అత్యాచార బాధితురాలు, ఆమె తరపు న్యాయవాది ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురికావడం వెనుక కుట్ర ఉందని అనుమానం వ్యక్తం చేశారు. ‘ఉత్తరప్రదేశ్‌లో చట్టప్రకారం నడిచే పాలన సాగడం లేదని మరోసారి రుజువైంది. మీరు కలియుగంలో ఉన్నామన్న భావన కలగాలంటే యూపీకి వెళ్లండి. ఆక్సిజన్ లేక ఆస్పత్రుల్లో తనువు చాలిస్తున్న పసిపిల్లలు కనబడతారక్కడ. ట్రకుల కింద నలిగిపోయే అత్యాచార బాధితులు కూడా కనిపిస్తార’ని రిచా ట్వీట్ చేశారు. బీజేపీ ఎమ్మెల్యే కుల్దీప్ సెంగార్ తనపై అత్యాచారం చేశాడని బాధితురాలు గతేడాది ఫిర్యాదు చేసినప్పటి నుంచి చోటుచేసుకున్న పరిణామాలను దర్శకుడు అనురాగ్ కశ్యప్ తన ట్విటర్ పేజీలో షేర్ చేశారు. నటి స్వర భాస్కర్ కూడా బాధితురాలికి మద్దతుగా ట్వీట్ చేశారు. మోదీ-యోగి పాలనలో అత్యాచార బాధితురాలికి ఎటువంటి న్యాయం జరిగిందో చెప్పడానికి ఉన్నావ్ రేప్ బాధితురాలి కారు ప్రమాదం అద్దం పడుతోందని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యురాలు కవిత కృష్ణన్ ట్వీట్ చేశారు. నంబరు ప్లేటుపై నల్లరంగు పులుముకుని రాంగ్ రూటులో వచ్చిన ట్రక్కు బాధితురాలి కారుని ఢీకొట్టి న్యాయాన్ని సమాధి చేసిందని వ్యాఖ్యానించారు. ఇంతకన్నా అవమానం ఉంటుందా అని ప్రశ్నించారు. (చదవండి: ‘ఉన్నావ్’ రేప్ బాధితురాలికి యాక్సిడెంట్) -
‘ఉన్నావ్’ కేసులో ట్విస్ట్; బీజేపీ ఎమ్మెల్యేపై కేసు
లక్నో : ఉత్తరప్రదేశ్ ఉన్నావ్ అత్యాచార ఘటన బాధితురాలి ప్రమాద ఘటనలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బీజేపీ ఎమ్మెల్యే కులదీప్ సింగ్‌పై కేసు నమోదైంది. మరో పదిమంది పేర్లను కూడా ఎఫ్ఐఆర్లో చేర్చారు. హత్య, హత్యాయత్నం, కుట్ర తదితర సెక్షన్ల కింద ఎమ్మెల్యేతోపాటు మరో పదిమందిపై కేసు నమోదు చేశామని పోలీసు అధికారి తెలిపారు. ఈ ప్రమాదంలో ప్రాణాలతో బయటపడిన మామ ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదైందని పోలీసులు తెలిపారు. మరోవైపు ఈ ఘటనపై పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మండిపడ్డారు. బాధితురాలికి రక్షణ కల్పించడంలో రాష్ట్రం ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. తాజా ప్రమాద ఘనటపై జోక్యం చేసుకోవాల్సిందిగా ప్రధానమంత్రి నరేంద్రమోదీని మమత కోరారు. దేశంలో ఫాసిస్ట్ పాలన కొనసాగుతోంది. ప్రతీరోజు మూకహత్య ఉదంతాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ పరిస్థితిపై ప్రధాని దృష్టిపెట్టాలన్నారు.ఈ ప్రమాదంపై అత్యున్నతస్థాయి కమిటీతో విచారణ జరిపించాల్సిందిగా ఆమె ప్రధానిని కోరారు. అటు బాధితురాల్ని హతమార్చేందుకే ప్రమాదం పన్నాగం పన్నారని ఎస్పీ, కాంగ్రెస్ పార్టీలు ఆరోపించాయి. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావ్ బాధితురాలు ప్రయాణిస్తున్న కారును ఆదివారం నంబరు ప్లేటులేని ట్రక్కు ఢీకొనడంతో బాధిత యువతి బంధువులు ఇద్దరు మరణించగా, బాధితురాలితోపాటు ఆమె న్యాయవాది కూడా తీవ్రగాయాలపాలయ్యారు. ప్రాణాపాయ స్థితిలో వీరిద్దరూ చికిత్స పొందుతున్నారు. కాగా అధికార బీజేపీ ఎమ్మెల్యే కుల్దీప్ సెంగార్ తనపై అత్యాచారం చేశాడని బాధితురాలు 2017లో ఫిర్యాదు చేసింది. అయితే ఈ కేసులో పోలీసుల కస్టడీలోనే ఆమె తండ్రి మరణించడం, దీనిపై నిష్పక్షపాత విచారణ జరగడంలేదంటూ బాధితురాలు యూపీ ముఖ్యమంత్రి యోగి ఇంటి ముందే ఆత్మాహుతికి యత్నించడం కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ కేసులోఅరెస్టు అయిన కులదీప్ సింగ్ ప్రస్తుతం జైల్లో ఉన్నాడు. చదవండి: ‘ఉన్నావ్’ రేప్ బాధితురాలికి యాక్సిడెంట్ -
ఉన్నావ్ ప్రమాదం: ప్రియాంక ప్రశ్నల వర్షం
లక్నో: సంచలనం సృష్టించిన ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావ్ అత్యాచార ఘటన బాధితురాలు ప్రయాణిస్తున్న కారు ప్రమాదంపై అనేక ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఈ ప్రమాదం వెనుక బీజేపీ హస్తముందంటూ యూపీ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ ఇదివరకే ఆరోపించిన విషయం తెలిసిందే. తాజాగా కాంగ్రెస్ పార్టీ జాతీయ కార్యదర్శి, యూపీ ఇన్ఛార్జ్ ప్రియాంక గాంధీ ఘటనపై అనుమానం వ్యక్తం చేశారు. సోమవారం ఈ ప్రమాదంపై స్పందించిన ఆమె.. ప్రభుత్వంపై, పోలీస్ శాఖపై ప్రశ్నల వర్షం కురిపించారు. ‘‘బాధితురాలి కారు ప్రమాదానికి గురికావడం నన్ను షాకింగ్‌కు గురిచేసింది. పోలీసులు ఇప్పటి వరకు ఎలాంటి విచారణ చేశారు. దానిని వెంటనే బహిర్గతం చేయాలి. అసలు అత్యాచార ఘటనపై సీబీఐ కేసు విచారణ ఎంత వరకు వచ్చింది. ఇలాంటి ఘటనకు పాల్పడిన వ్యక్తులను ప్రభుత్వం ఎందుకు వెనకేసుకొస్తోంది. ఇంకా ఆయన బీజేపీలో ఎందుకు కొనసాగుతున్నారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం నుంచి ఏమైనా న్యాయం చేకూరుతుందని నమ్ముతున్నారా?. అంటూ తన ట్విటర్ ఖాతాలో ప్రశ్నలు సంధించారు. ప్రమాదానికి కారకులయిన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని ప్రియాంక డిమాండ్ చేశారు. కాగా ఉన్నావ్ అత్యాచార ఘటన బాధితురాలు ప్రయాణిస్తున్న కారును ఆదివారం ట్రక్కు ఢీకొనడంతో బాధిత యువతి బంధువులు ఇద్దరు మరణించడం సంచలనంగా మారింది. బాధితురాలితోపాటు ఆమె న్యాయవాది కూడా తీవ్రగాయాలపాలయ్యారు. అధికార బీజేపీ ఎమ్మెల్యే కుల్దీప్ సెంగార్ తనపై అత్యాచారం చేశాడని బాధితురాలు గతేడాది ఫిర్యాదు చేయగా, పోలీసులు ఆమె తండ్రినే అరెస్టు చేసి హింసించడంతో ఆయన పోలీస్ కస్టడీలోనే మరణించారు. దీంతో ఎమ్మెల్యేను పోలీసులు అరెస్టు చేసినా అతను బెయిలుపై బయటకొచ్చాడు. దేశవ్యాప్తంగా తీవ్ర నిరసనలు వ్యక్తం కావడంతో కేసును సీబీఐ విచారణకు అప్పగించారు. తాజాగా బాధితురాలు, ఇద్దరు మహిళలు, లాయర్‌తో కలిసి రాయ్‌బరేలీకి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఘటనలో ఇద్దరు మహిళలు మరణించగా, బాధితురాలు, లాయర్ తీవ్రగాయాలతో బయటపడ్డారు. ఆమెను చంపేందుకే ఈ ప్రమాదం చేయించారని ఎస్పీ, కాంగ్రెస్ పార్టీలు ఆరోపించాయి. బాధితురాలి వెంట ఉండాల్సిన భద్రతా సిబ్బంది ఎందుకు లేరనే విషయం కూడా పలు అనుమానాలను రేకెత్తిస్తోంది. -
ఉన్నావ్ ప్రమాదానికి కారణం అదే..
లక్నో: గతేడాది దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావ్ అత్యాచార ఘటన బాధితురాలు ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురికావడంపై యూపీ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ తీవ్ర అనుమానం వ్యక్తం చేశారు. ఈ ప్రమాదాన్ని కుట్రపూరితంగా చేశారని ఆయన ఆరోపించారు. ఆమెను చంపేందుకు కావాలనే ట్రక్కుతో ఢీకొట్టారని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. ఈ ఘటన యూపీలో తీవ్ర చర్చనీయాంశమయింది. అయితే వీటన్నింటికి సమాధానం ఇస్తూ.. రాష్ట్ర డీజీపీ ఓపీ సింగ్ సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ట్రక్కు అతివేగం కారణంగానే ఈ ప్రమాదం చోటుచేసుకుందని, దీనిలో ఎలాంటి కుట్ర లేదని ఆయన స్పష్టం చేశారు. ట్రక్కు డ్రైవర్, యజమానిని అరెస్ట్ చేశామని తెలిపారు. అయితే బాధితురాలి వెంట ఉండాల్సిన భద్రతా సిబ్బంది ఎందుకు లేరనే విషయంపై కూడా విచారణ జరుపుతామన్నారు. దీనిపై ఆమె కుటుంబ సభ్యులు సీబీఐ విచారణకు పట్టుబడితే.. దానికి కూడా తాము సిద్ధంగా ఉన్నామని డీజీపీ స్పష్టం చేశారు. కాగా ఈ ఘటనలో బాధిత యువతి బంధువులు ఇద్దరు మరణించిన విషయం తెలిసిందే. బాధితురాలితో పాటు ఆమె న్యాయవాది కూడా తీవ్రగాయాలపాలయ్యారు. ‘ఉన్నావ్’ రేప్ బాధితురాలికి యాక్సిడెంట్ -
‘ఉన్నావ్’ రేప్ బాధితురాలికి యాక్సిడెంట్
లక్నో: గతేడాది దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావ్ అత్యాచార ఘటన బాధితురాలు ప్రయాణిస్తున్న కారును ఆదివారం ట్రక్కు ఢీకొనడంతో బాధిత యువతి బంధువులు ఇద్దరు మరణించారు. బాధితురాలితోపాటు ఆమె న్యాయవాది కూడా తీవ్రగాయాలపాలయ్యారు. అధికార బీజేపీ ఎమ్మెల్యే కుల్దీప్ సెంగార్ తనపై అత్యాచారం చేశాడని బాధితురాలు గతేడాది ఫిర్యాదు చేయగా, పోలీసులు ఆమె తండ్రినే అరెస్టు చేసి హింసించడంతో ఆయన పోలీస్ కస్టడీలోనే మరణించారు. బాధితురాలు కూడా ముఖ్యమంత్రి యోగి ఇంటి ముందే ఆత్మాహుతికి యత్నించింది. ఎమ్మెల్యేను పోలీసులు అరెస్టు చేసినా అతను బెయిలుపై బయటకొచ్చాడు. దేశవ్యాప్తంగా తీవ్ర నిరసనలు వ్యక్తం కావడంతో కేసును సీబీఐ విచారణకు అప్పగించారు. తాజాగా బాధితురాలు, ఇద్దరు మహిళలు, లాయర్‌తో కలిసి రాయ్‌బరేలీకి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఘటనలో ఇద్దరు మహిళలు మరణించగా, బాధితురాలు, లాయర్ తీవ్రగాయాలతో బయటపడ్డారు. ఆమెను చంపేందుకే ఈ ప్రమాదం చేయించారని ఎస్పీ, కాంగ్రెస్ పార్టీలు ఆరోపించాయి. ట్రక్కు డ్రైవర్‌తోపాటు యజమానిని కూడా పోలీసులు ఇప్పటికే అరెస్టు చేశారు. బాధితురాలి వెంట ఉండాల్సిన భద్రతా సిబ్బంది ఎందుకు లేరనే విషయంపై కూడా విచారణ జరుపుతామన్నారు. -
అమానుషం; బాలిక తలను ఛిద్రం చేసి..
లక్నో : దేశ వ్యాప్తంగా అమ్మాయిలపై అత్యాచార పర్వాలు కొనసాగుతున్నాయి. యువతులు, మహిళలపైనే కాకుండా చిన్నారులపై అఘాయిత్యాలకు పాల్పడుతున్న కామాంధులు వారిని హతమార్చి మానవత్వానికి మచ్చతెస్తున్నారు. తాజాగా ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావ్‌లో పదకొండేళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాలో మృగాడు. అనంతరం ఇటుకలతో ఆమె తల పగులగొట్టి పాశవికంగా హతమార్చాడు. శుక్రవారం సఫీపూర్‌లో జరిగిన ఈ ఘటన బాధితురాలి తండ్రి ఫిర్యాదుతో వెలుగులోకి వచ్చింది. ఈ విషయం గురించి బాధితురాలి తండ్రి మాట్లాడుతూ..‘ మేమంతా ఆరు బయటపడుకున్నాం. కాసేపటి తర్వాత నా కూతురు కనిపించలేదు. వాష్రూంకి వెళ్లిందేమో అనుకున్నాం. కానీ ఎంతసేపటికి తిరిగి రాకపోవడంతో అనుమానం వచ్చి వెదికాం. ఇంటికి కొద్ది దూరంలో నగ్నంగా పడి ఉన్న తనను చూసి ఒక్కసారిగా నా గుండె పగిలిపోయింది. తన శరీరంపై తీవ్రమైన గాయాలు ఉన్నాయి. తలను ఛిద్రం చేశారు’ అని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా ఆయన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఉన్నావ్ ఎస్పీ తెలిపారు. బాధితురాలి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్లు పేర్కొన్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని.. పోస్కో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. -
జైలులో ఉన్న ఎమ్మెల్యేను కలిసిన బీజేపీ ఎంపీ
లక్నో : ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఉన్నావ్ నుంచి ఎంపీగా గెలుపొందిన సాక్షి మహరాజ్.. జైలులో ఉన్న బీజేపీ ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ సెంగార్‌ను పరామర్శించారు. దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఉన్నావ్ అత్యాచార ఘటన కేసులో సెంగార్ ప్రధాన నిందితుడిగా ఉన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం సీతాపూర్ జైలులో ఉన్న సెంగార్‌ను కలిసిన సాక్షి మహరాజు కాసేపు అక్కడే గడిపారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘చాలా కాలం నుంచి సెంగార్ జైల్లో ఉంటున్నారు. ఎన్నికల్లో విజయం సాధించినందుకు సెంగార్‌కు ధన్యవాదాలు తెలిపేందుకు ఇక్కడికి వచ్చాన’ని తెలిపారు. అయితే లోక్‌సభ ఎన్నికల ప్రచార సమయంలో కూడా సాక్షి మహరాజు ఉన్నావ్‌లోని సెంగార్ ఇంటికి వెళ్లినట్టుగా తెలుస్తోంది. కాగా, సెంగార్ ఇంటికి ఉద్యోగం కోసం వెళ్లిన తనపై ఆయన లైంగిక దాడికి పాల్పడ్డారని ఉన్నావ్ అత్యాచార బాధితురాలు ఆరోపించారు. ఎమ్మెల్యేపై చర్యలు చేపట్టాలని కోరుతూ ఆమె పోలీసులను ఆశ్రయించారు. అయితే పోలీసులు మాత్రం ఆమె తండ్రిని అక్రమ ఆయుధాల కేసులో అరెస్ట్ చేశారు. అక్కడ ఆయన చనిపోవడంతో బాధితురాలు యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్ ఇంటి వద్ద ఆత్మహత్యాయత్నం చేయడం అప్పట్లో కలకలం రేపింది. ఈ ఘటనపై సీఎం యోగి సిట్ ఏర్పాటు చేసినప్పటికీ ఫలితం లేకపోయింది. పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తడంతో ఆ తర్వాత ఈ కేసును సీబీఐకి అప్పగించారు. చివరికి అలహాబాద్ కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిన తర్వాత సీబీఐ అధికారులు సెంగార్ అరెస్ట్ చేసి.. పొక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. -
యూపీలో ఘోర రోడ్డు ప్రమాదం
ఉన్నవో : ఉత్తరప్రదేశ్‌లో శనివారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ దుర్ఘటనలో అయిదుగురు దుర్మరణం చెందగా, మరో 30మంది గాయపడ్డారు. ఇవాళ ఉదయం లక్నో- ఆగ్రా ఎక్స్‌ప్రెస్ వేపై ఈ ప్రమాదం జరిగింది. ట్రాక్టర్ ట్రాలీపై బస్సు దూసుకెళ్లడంతో అయిదుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. గాయపడినవారిని చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
ఉన్నావ్ కేసు : కుమార్తెలకు న్యాయం ఇలాగేనా..?
న్యూఢిల్లీ : బీజేపీ ఎమ్మెల్యే కుల్దీప్ సెంగార్ ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉన్నావ్ హత్యాచారం కేసులో కీలక సాక్షి మృతి, పోస్ట్‌మార్టం లేకుండానే మృతదేహాన్ని హడావిడిగా పాతిపెట్టడంపై కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ మోదీ సర్కార్‌పై విమర్శలు గుప్పించారు. ఉన్నావ్ కేసును నీరుగార్చే కుట్ర ఇదంటూ రాహుల్ మండిపడ్డారు. మన కుమార్తెలకు న్యాయం చేసే ఈ ఐడియా మీదేనా..మిస్టర్ 56 ? అంటూ మోదీని ఉద్దేశించి వ్యంగ్యోక్తులతో ఆయన ట్వీట్ చేశారు. బాధితురాలి తండ్రిని బీజేపీ ఎమ్మెల్యే సోదురుడు అతుల్ సింగ్ సెంగార్ మరో నలుగురు దారుణంగా కొట్టిన ఘటన అనంతరం పోలీస్ కస్టడీలో మరణానికి దారితీసిన ఘటనలో యూనస్ కీలక ప్రత్యక్ష సాక్షిగా సీబీఐ పేర్కొంది. ఉన్నావ్‌కు సమీపంలోని మాఖి గ్రామంలో చిరువ్యాపారి అయిన యూనస్ బాధితురాలి తండ్రిపై జరిగిన దాడికి ప్రత్యక్ష సాక్షి కావడం గమనార్హం. యూనస్ శనివారం ఉన్నట్టుండి అస్వస్ధతకు లోనయ్యాడని, ఆస్పత్రికి తీసుకువెళుతుండగానే మరణించాడని గ్రామస్తులు చెబుతున్నారు. అయితే కుటుంబసభ్యులు సీబీఐకి, పోలీసులకు సమాచారం అందించకుండానే కుటుంబ సభ్యులు అంత్యక్రియలు నిర్వహించారు. యూనస్ మృతిపై బాధితురాలి బంధువులు సందేహం వ్యక్తం చేస్తున్నారు. బీజేపీ ఎమ్మెల్యే అనుచరులు అతడిపై విషప్రయోగం చేసి ఉంటారని అనుమానిస్తున్నారు. యూనస్ మృతదేహాన్ని వెలికితీసి పోస్ట్‌మార్టం నిర్వహించాలని బాధితురాలి మామ డిమాండ్ చేశారు. కుల్దీప్ సెంగార్ ఆయన సోదరుడు అతుల్ సింగ్ సెంగార్‌లకు వ్యతిరేకంగా సీబీఐకి ఎలాంటి సమాచారం ఇవ్వరాదని, స్టేట్మెంట్ నమోదు చేయరాదని బీజేపీ ఎమ్మెల్యే మనుషులు గ్రామస్తులు, సాక్షులను బెదిరిస్తున్నారని బాధితురాలి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. -
ఉన్నావ్ కేసు : బీజేపీ ఎమ్మెల్యేపై చార్జిషీట్
సాక్షి, న్యూఢిల్లీ : ఉన్నావ్ లైంగిక దాడి కేసులో నిందితుడు, బీజేపీ ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ సెంగార్‌పై సీబీఐ బుధవారం చార్జిషీట్ దాఖలు చేసింది. లైంగిక దాడి కేసులో ప్రధాన నిందితుడైన కుల్దీప్ సెంగార్ ప్రస్తుతం విచారణ ఖైదీగా జైలులో ఉన్నారు. గతంలో బాధితురాలి తండ్రి హత్యకు సంబంధించి బీజేపీ ఎమ్మెల్యే సోదరుడుతో పాటు మరో నలుగురిపై సీబీఐ తొలి చార్జిషీట్‌ను దాఖలు చేసింది. సెంగార్ సోదరుడు జై దీప్ సింగ్, ఆయన అనుచరులు వినీత్ మిశ్రా, వీరేంద్ర సింగ్, రామ్ శరణ్ సింగ్ అలియాస్ సోను సింగ్, శశి ప్రతాప్ సింగ్ అలియాస్ సుమన్ సింగ్‌లపై చార్జిషీట్ నమోదైంది. వీరంతా ఉన్నావ్ జిల్లాలోని మాఖి గ్రామానికి చెందిన వారని అధికారులు తెలిపారు. కాగా నిందితులపై హత్య, సంబంధిత నేరాభియోగాలు నమోదు చేశామని సీబీఐ ప్రతినిధి తెలిపారు. ఉన్నావ్ లైంగిక దాడి కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. -
ఉన్నావ్‌లో మరో దారుణ ఘటన
-
‘అన్నా.. నన్ను వదిలేయండి’
సాక్షి, లక్నో : దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ఉన్నావ్ కేసు మరువక ముందే ఉత్తరప్రదేశ్‌లో మరో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఓ మహిళపై గుర్తుతెలియని యువకులు అఘాయిత్యానికి పాల్పడ్డారు. ముగ్గురు యువకులు ఓ మహిళను అటవీ ప్రాంతంలోకి తీసుకెళ్లి అత్యాచారయత్నం చేయగా, మరో యువకుడు ఆ దారుణాన్ని వీడియో తీశాడు. సహకరించకపోతే వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేస్తామని ఆమెను బెదిరించారు. ‘గట్టిగా అరిస్తే చెప్పుతో కొడతామని బెదిరించటం...’ దానికి ఆ మహిళ ‘అన్నా.. వదిలేయండని ఆర్తనాదాలు చేస్తూ వేడుకున్న’ దృశ్యాలు ఉన్నాయి. అయినా కామాంధులు కనికరించకపోవటంతో చివరికి ఆ మహిళ ఎలాగోలా తప్పించుకుంది. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియో ఆధారంగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులకోసం గాలింపు చేపట్టారు. -
ఉన్నావ్ కేసులో మరో ఇద్దరి అరెస్ట్
లక్నో : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఉన్నావ్ అత్యాచార ఘటన కేసులో ఇద్దరు పోలీసులను సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. ఇప్పటికే ఈ కేసులో ప్రధాన నిందితుడైన బీజేపీ ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ సెంగార్‌తోపాటు, ఇతర నిందితులను సీబీఐ అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టిన సంగతి తెలిసిందే. అత్యాచారానికి గురైన బాలిక తండ్రిని అక్రమంగా అరెస్ట్ చేయడంతోపాటు.. అతని మృతికి కారణమనే ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎస్ఐలు అశోక్ సింగ్, ప్రసాద్ సింగ్‌లను సీబీఐ బుధవారం అరెస్ట్ చేసింది. ప్రస్తుతం వారిద్దరు సస్పెన్షన్ ఎదుర్కొంటున్నారు. దీనిపై సీబీఐ అధికారులు మాట్లాడుతూ.. అరెస్ట్ అయిన ఇద్దరు ఎస్ఐలను గురువారం కోర్టులో హాజరుపరుస్తామని తెలిపారు. ఈ కేసులో సాక్ష్యాధారాలను తారుమారు చేయడానికి ప్రయత్నించడంతో పాటు, బాధితురాలి కుటుంబం పట్ల కుట్ర పూరితంగా వ్యవహరించారనే ఆరోపణలపై వీరిని అదుపులోకి తీసుకున్నట్టు వివరించారు. కాగా ఈ కేసులో స్థానిక పోలీసుల నిర్లక్ష్యంపై అలహాబాద్ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. చదవండి : కస్టడీలో ఎమ్మెల్యే బాధిత యువతి తండ్రి మృతి -
కోటి ఇస్తే నీ భర్తను విడిపిస్తాం!
లక్నో: సంచలనం సృష్టించిన ‘ఉన్నావ్’ అత్యాచారం కేసులో నిందితుడు బీజేపీ ఎంపీ కుల్దీప్ సింగ్ సెంగర్ భార్య సంగీతను మోసం చేయడానికి ప్రయత్నించిన ముగ్గురినియ పోలీసులు అరెస్టు చేశారు. బీజేపీ నాయకులం, సీబీఐ అధికారులమంటూ బోల్తా కొట్టించేందుకు ప్రయత్నించి వీరు పోలీసులకు దొరికిపోయారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. లక్నోకు చెందిన అలోక్, విజయ్ అనే ఇద్దరు వ్యక్తులు కుల్దీప్ సింగ్ భార్య సంగీతకు ఫోన్ చేసి తమను తాము బీజేపీ నాయకులుగా పరిచయం చేసుకున్నారు. తమకు కోటి రూపాయలు ఇస్తే సీబీఐ కస్టడీలో ఉన్న కుల్దీప్ను బయటకు తీసుకువస్తామని తెలిపారు. ఆ కోటి రూపాయలను కూడా సీబీఐ అధికారికి లంచం ఇవ్వడం కోసమే అడుగుతున్నామని అన్నారు. అందుకు సంగీత తన దగ్గర అంత డబ్బు లేదని తెలపడంతో, కనీసం 50 లక్షల రూపాయలైన ఏర్పాటు చేయమని చెప్పారు. తరువాతి రోజు మరో వ్యక్తి ఫోన్ చేసి తనను తాను సీబీఐ అధికారి రాజీవ్ మిశ్రాగా పరిచయం చేసుకున్నాడు. అతను కూడా తనకు కోటి రూపాయలు ఇస్తే కుల్దీప్ను బయటకు తీసుకువస్తానని చెప్పాడు. అంతేకాక తమ మాటల మీద ఆమెకు నమ్మకం లేకపోతే మే 7న లక్నో సీబీఐ కార్యలయం దగ్గరకు వచ్చి పరీక్షించిన తర్వాతే డబ్బులు ఇవ్వాలని తెలిపాడు. ఈ ఫోన్ కాల్ గురించి సంగీత తన బంధువులకు తెలపడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేయమని చెప్పారు. ఈ విషయం గురించి సంగీత ఘాజీపూర్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ‘మేము ఆమెకు వచ్చిన ఫోన్ కాల్స్‌ను ట్రాక్ చేసి నిందితులను లక్నోకు చెందిన అలోక్, విజయ్‌లుగా గుర్తించాం. గురువారం నాడు వీరిద్దరిని అరెస్టు చేశామ’ని లక్నో ఎస్ఎస్పీ దీపక్ కుమార్ తెలిపారు. -
ముగ్గురు పిల్లల తల్లిని రేప్ చేస్తారా?
లక్నో : దేశంలో సంచలనం సృష్టించిన కథువా, ఉన్నావ్ అత్యాచార ఘటనలపై బీజేపీ నేతలు విచిత్రమైన రీతిలో స్పందిస్తున్నారు. నిన్న అత్యాచారాలు సంస్కృతిలో భాగం అని ఒకరంటే, నేడు అసలు ఆడపిల్లలను బయటికి పంపకుండా ఇంట్లోనే ఉంచి కాపల కాయలంటూ ఉత్తర్‌ప్రదేశ్‌లోని బైరియా నియోజకవర్గ ఎమ్మెల్యే సురేంద్ర సింగ్ వ్యాఖ్యానించారు. ఉన్నావ్ ఘటనపై స్పందించిన ఆయన తన పార్టీ ఎమ్మెల్యే ఉన్నావ్ అత్యాచార కేసులో నిందితుడు (కుల్దీప్ సింగ్ సెంగర్)ను వెనకేసుకోస్తూ.. అది ఒక కుట్ర అని, అసలు ఎవరైన ముగ్గురు పిల్లల తల్లిని అత్యాచారం చేస్తారా అని వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. మహిళలపై జరుగుతున్న లైంగిక దాడులకు వారి తల్లిదండ్రులే బాధ్యత వహించాలని, అసలు ఆడపిల్లలను స్వేచ్ఛగా తిరగకుండా వారిని కట్టడి చేయాలని అన్నారు. పదిహేనేళ్ల పిల్లలను వారి తల్లిదండ్రులు ఇంట్లోనే ఉంచి కాపలా కాయాలని, అలా కాకుండా వారిని ఇష్టం వచ్చినట్టు గాలికి వదిలేస్తున్నారని ఆరోపించారు. ఆడపిల్లలపై ఆత్యచారాలు జరగడానికి ఇదే ప్రధాన కారణం అని అన్నారు. అలాగే పిల్లలకు ఫోన్లు కొనివ్వకూడదని సూచించారు. -
ఆ బీజేపీ ఎమ్మెల్యే మళ్లీ జైలుకు!
లక్నో : ఉత్తరప్రదేశ్‌కు చెందిన సీనియర్ బీజేపీ ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ సెంగార్‌ను మళ్లీ జైలుకు తరలించారు. ఉనావ్‌లో 17 ఏళ్ల అమ్మాయిపై అత్యాచారం జరిపిన కేసులో పోలీసుల రిమాండ్ ముగియడంతో అతన్ని ఉనావ్ జైలుకు తరలించారు. అతనితోపాటు ఈ కేసులో సహ నిందితుడైన శశిసింగ్‌ను ఉనావ్ జైలుకు పంపారు. సెంగార్‌పై పోక్సోస స(బాలలపై లైంగిక నేరాల నిరోధక చట్టం)తోపాటు ఐపీసీ సెక్షన్లు 363 (కిడ్నాప్), 366 (మహిళ అపహరణ), 376 (అత్యాచారం), 506 (నేరపూరిత బెదిరింపులు) తదితర సెక్షన్ల కింద పోలీసులు అభియోగాలు నమోదుచేశారు. గత ఏడాది జూన్ 4న ఎమ్మెల్యే సెంగార్ తనపై అత్యాచారం జరిపాడని, ఆ తర్వాత తనను అపహరించి.. ఎమ్మెల్యే ఇంటికి తీసుకెళ్లారని, అక్కడ తనపై ఆయన అనుచరులు గ్యాంగ్‌రేప్ జరిపారని బాధితురాలు ఫిర్యాదులో తెలిపారు. నిందితుడు ఎమ్మెల్యే, స్థానికంగా పరపతి కలిగిన వ్యక్తి కావడంతో అతన్ని ఉనావ్ జైలు నుంచి వేరే జైలుకు తరలించాలని, తమ కుటుంబానికి ఇప్పటికీ బెదిరింపులు వస్తున్నాయని బాధితురాలి కుటుంబం పేర్కొంటున్నది. -
బీజేపీ ఎమ్మెల్యేకు పటుత్వ పరీక్ష..!
లక్నో : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఉన్నావ్ అత్యాచార కేసును దర్యాప్తు చేస్తున్న సీబీఐ అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రధాన నిందితుడు బీజేపీ ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ సెంగార్‌కు పటుత్వ పరీక్ష నిర్వహించాలని భావిస్తున్నారు. ఇందుకోసం కోర్టు అనుమతి పొందడానికి కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. సెంగార్‌కు కోర్టు విధించిన 12 రోజుల కస్టడీ నేటితో ముగియడంతో సీబీఐ అధికారులు అతన్ని నేడు(శుక్రవారం) కోర్టు ముందు ప్రవేశపెట్టనున్నారు. అయితే సెంగార్‌కు పటుత్వ పరీక్ష నిర్వహించేందుకు అనుమతి ఇవ్వాలని ముందుగానే సీబీఐ అధికారులు కోర్టుకి దరఖాస్తు చేయనున్నారు. విచారణలో సెంగార్ ఒకే ప్రశ్నకు రకరకాల సమాధానాలు చెప్పడంతో సీబీఐ అధికారులు ఈ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. ఉన్నావ్ అత్యాచార ఘటనలో సెంగార్ సోదరులను అరెస్ట్ చేసినప్పటికీ, అధికార పార్టీ ఎమ్మెల్యే కావడంతో ఆయనను అరెస్ట్ చేసేందుకు స్థానిక పోలీసులు సాహసించలేకపోయారు. సీఎం యోగి అదిత్యనాథ్ సిట్ ఏర్పాటు చేసినప్పటికీ ఫలితం లేకపోయింది. ఆ తర్వాత కేసును సీబీఐకి అప్పగించారు. చివరికి అలహాబాద్ కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిన తర్వాత సీబీఐ అధికారులు సెంగార్ని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. గత ఏడాది జూన్‌లో ఎమ్మెల్యేగా గెలిచిన సెంగార్, ఆయన అనుచరులు తనపై లైంగిక దాడికి పాల్పడ్డారని బాధిత యువతి ఆరోపిస్తోంది. ఎమ్మెల్యేపై చర్యలు చేపట్టాలని కోరుతూ ఆమె యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్ ఇంటి వద్ద ఆత్మహత్యాయత్నం చేయడం కలకలం రేపింది. మరోవైపు తనపై ఆరోపణలు నిరాధారమైనవని, రాజకీయ కుట్రతోనే ఇదంతా చేస్తున్నారని సెంగార్ పేర్కొన్నారు. -
భారత మహిళకు భద్రత చాలా అవసరం
వాషింగ్టన్: కశ్మీర్‌లోని కఠువాలో బాలికపై హత్యాచార ఘటనను అంతర్జాతీయ ద్రవ్యనిధి చీఫ్ క్రిస్టీన్ లగార్డ్ దురదృష్టకరంగా అభివర్ణించారు. దీన్ని నిరసిస్తూ భారత్‌లో జరుగుతున్న నిరసనలపై స్పందిస్తూ ‘భారత్‌తో జరుగుతున్న ఆందోళనలు ప్రతిఘటనకు సూచన. భారత అధికారులు, ప్రధాని మోదీ దీనిపై దృష్టి సారిస్తారని భావిస్తున్నాను. భారత మహిళకు భద్రత చాలా అవసరం’ అని ఆమె అన్నారు. భారత్‌లో కొనసాగుతున్న సంస్కరణ జోరు వచ్చే ఎన్నికల సంవత్సరంలో కొనసాగటం కష్టమేనని తెలిపారు. ‘భారత్‌లో ప్రస్తుతం జరుగుతున్న ఆర్థిక సంస్కరణ వేగం వచ్చే కొద్ది నెలల్లో ఇలాగే కొనసాగుతుం దని చెప్పలేం. ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ సంస్కరణలు తగ్గుతాయి’ అని గురువారం అంతర్జాతీయ ఆర్థిక సంస్థలతో జరిగిన సమావేశంలో ఆమె తెలిపారు. జీఎస్టీ, దివాళా చట్టం వంటివి చాలా గొప్ప సంస్కరణలని ఆమె ప్రశంసించారు. -
‘కథువా’ నిరసన; మోదీకి చేదు అనుభవం
లండన్: కామన్వెల్త్ ప్రభుత్వాధినేతల సమావేశంలో పాల్గొనేందుకు లండన్ వచ్చిన భారత ప్రధాని నరేంద్ర మోదీకి చేదు అనుభవం ఎదురైంది. ఆయన విదేశీ పర్యటనల్లో ఇదివరకెప్పుడూ లేని విధంగా నిరసనలు చవిచూడాల్సివచ్చింది. భారత్‌ను కుదిపేసిన కథువా హత్యాచార ఘటనను నిరసిస్తూ, ఆ చిన్నారి కుటుంబానికి న్యాయం చేయాలంటూ పలు హక్కుల సంఘాలు ఆందోళనలు చేశాయి. సౌత్ ఏసియా సాలిడారిటీ గ్రూప్ ఆధ్వర్యంలో వాహనాలపై పెద్దపెద్ద ఎల్ఈడీ స్క్రీన్లను ఏర్పాటుచేశారు. వాటిపై ‘మోదీ నాట్ వెల్కమ్..’, ‘జస్టిస్ ఫర్ ఆసిఫా’ రాతలను ప్రదర్శించారు. థేమ్స్ తీరంలోని బ్రిటన్ పార్లమెంట్ ఎదుట, చుట్టుపక్కల వీధుల్లో ఆ వాహనాలను తిప్పారు. బ్రిటన్‌లో భారతీయ మహిళా సంఘాలు పార్లమెంట్ స్క్వేర్ వద్ద మౌన ప్రదర్శనలకు పిలుపునిచ్చాయి. ఆందోళనల నేపథ్యంలో భారత ప్రధాని పర్యటించే ప్రాంతాల్లో లండన్ అధికారులు భద్రతను కట్టుదిట్టం చేశారు. ఇదిలా ఉంటే మరొకొన్ని చోట్ల మోదీ.. భారతీయు సమూహాలతో కరచాలనం చేస్తూ సందడి చేశారు. జమ్మూకశ్మీరులోని కథువా జిల్లా రసానలో గుర్రాలు మేపుతోన్న ఎనిమిదేళ్ల బాలికను అపహరించి, రోజులపాటు సామూహిక అత్యాచారం జరిపి, చివరికు కొట్టి చంపిన ఘటనను ప్రపంచమంతా ఖండించింది. ఈ కేసులో నిందితులను కఠినంగా శిక్షించాలని ఐక్యరాజ్యసమితి సైతం భారత ప్రభుత్వానికి సూచించింది. చిన్నారి హత్యాచారం కేసులో దర్యాప్తు చేసిన సిట్ ఇప్పటికే ఎనిమిది మందిని అరెస్టు చేయగా, సోమవారం కోర్టు విచారణ ప్రారంభమైంది. అటు ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావ్‌లో అత్యాచారం, బాధితురాలి తండ్రి హత్య ఘటనపై పెద్ద ఎత్తున నిరసనలు జరిగాయి. కథువా, ఉన్నావ్ ఘటనలపై గత శుక్రవారం స్పందించిన ప్రధాని మోదీ.. ఇటువంటి సంఘటనలు మన దేశానికి సిగ్గు చేటని, నేరస్థులను ఉపేక్షించేది లేదని అన్నారు.