
ఉన్నవో: హిందుస్థాన్ పెట్రోలియం ఫ్లాంట్‌లో గురువారం పెట్రోల్ ట్యాంకర్లలో అకస్మాత్తుగా పేలుడు సంభవించింది. ఉత్తరప్రదేశ్ ఉన్నవోలో ఈ సంఘటన చోటుచేసుకుంది. ఫ్లాంట్‌లోని వాల్వ్ లీక్ అవడంతో ఈ పేలుడు జరిగినట్లు తెలుస్తోంది. అకస్మాత్తుగా ట్యాంకర్ పేలడంతో ఫ్లాంట్‌లోకి సిబ్బంది ఉలిక్కిపడ్డారు. ఒక్కసారిగా వారంతా బయటకు పరుగులు తీయడంతో తొక్కిసలాట జరిగింది. వెంటనే వారందర్ని అక్కడ నుంచి సురక్షిత ప్రాంతానికి తరలించారు. మరోవైపు సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.
ఇక ముందు జాగ్రత‍్త చర్యగా లక్నో-కాన్పూరు మార్గమధ్యంలో నడిచే రైళ్లను నిలిపివేశారు. అలాగే ఫ్లాంట్ సమీపంలోని నాలుగైదు కిలోమీటర్ల పరిధిలో అధికారులు హెచ‍్చరికలు జారీ చేశారు. అంతేకాకుండా ప్రమాద తీవ్రత నేపథ్యంలో చుట్టుపక్కలున్న గ్రామాల్లోని వారిని అక్కడ నుంచి తరలించారు. హెచ్‌పీ పెట్రోలియం యాజమాన్యం కూడా ఫ్లాంట్‌లోని లీకేజీని అదుపు చేసేందుకు ప్రయత్నిస్తోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment