ఇటీవల మొబైల్ ఫోన్‌లు పేలుడు గురించి తరుచుగా వింటున్నాం. ఎందుకిలా జరుగుతుందో అంతుపట్టడం లేదు. ప్రస్తుతం పరిస్థితులు ఎలా ఉన్నాయంటే కోవిడ్ మహమ్మారీ నుంచి పిల్లలకు ఆన్‌లైన్‌లో క్లాసులకు అలవాటుపడ్డారు. దీంతో పిల్లలు మనకు తెలియకుండానే సెల్‌ఫోన్‌లకు బానిసవ్వుతున్నారు. పలువురు తల్లిదండ్రులు కూడా పిల్లలు ఫోన్‌కి బాగా అతుక్కుపోతున్నారంటూ గగ్గోలు పెడుతున్నారు. అలాంటి తరుణంలో ఈ సెల్‌ఫోన్‌ల పేలుడు ఘటనలు ప్రజలను కాస్త భయబ్రాంతులకు గురిచేస్తున్నాయి. అచ్చం అలానే ఇక్కడోక చిన్నారి ఫోన్‌లో గేమ్ ఆడుతుండగా.. హఠాత్తుగా పేలుడు సంభవించింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లో మధురలోని మేవాటీలో చోటు చేసుకుంది.
వివరాల్లోకెళ్తే...మధురకు చెందిన మహ్మద్ జావేద్ అనే వ్యక్తి తన 13 ఏళ్ల కొడుకుకి మొబైల్ ఫోన్ ఇచ్చాడు. ఆ చిన్నారి తన చదువు కోసం అని తండ్రి ఫోన్‌ని తరుచుగా ఉపయోగిస్తుంటాడు. అందులో భాగంగానే ఆరోజు కూడా ఫోన్ తీసుకున్నాడు. కాసేపటికి అందులో గేమ్ ఆడుతున్నాడు. ఏమైందో ఏమో అకస్మాత్తుగా ఫోన్ పేలిపోయింది. ఆ పేలుడు శబ్దానికి వేరే గదిలో ఉన్న అతడి తల్లిదండ్రులు ఉలిక్కిపడి...హుటాహుటినా వచ్చి చూడగా...బాలుడు తీవ్రగాయాలపాలై మంచంపై పడి ఉన్నాడు.
దీంతో ఒక్కసారిగా తల్లిదండ్రులు షాక్‌కి గురయ్యారు. ఆ చిన్నారి దుస్తులు కాలిపోయి, ఛాతీపై పలు తీవ్రగాయాలయ్యాయి. తొలుత తమకు ఏం జరిగిందో కూడా అర్థం కాలేదు. ఆ తర్వాత పరిశీలించి చూడగా ఫోన్ ముక్కలై పడి ఉండటంతో..మొబైల్ బ్లాస్ట్ అయ్యిందని తెలిసిందని చిన్నారి తండ్రి చెబుతున్నాడు.
24 గంటలు పిల్లలను మానిటర్ చేస్తూ కూర్చొవడం అసాధ్యం అని అంటున్నాడు. పిల్లలు కూడా కాస్త అసహనంగా ఫీలవుతారు. ప్రస్తుతం అంతా ఆన్‌లైన్ చదువులు కాబట్టి వారు కాస్త ఒత్తిడికి గురవుతున్నారు. కాసేపు రిలాక్స్ అయ్యేందుకని మొబైల్ ఫోన్‌లు ఇస్తుంటాం. ప్రస్తుత పరిస్థితుల్లో పిల్లలు గేమ్‌లు కూడా ఆన్‌లైన్‌లో ఆడుతుంటారు. అందువల్ల ఇలాంటి ఘటనలు ఎదురైతే తాము ఏంచేయాలని చిన్నారి తండ్రి జావేద్ కన్నీటిపర్యంతమయ్యాడు.
(చదవండి: వివాహ మండపంలోకి ఎద్దు ఎంట్రీ..పరుగులు తీస్తున్న జనాలు)
Comments
Please login to add a commentAdd a comment