
లక్నో: ఉత్తర్ ప్రదేశ్‌లోని మథురలో ఘోర సంఘటన ఒకటి చోటు చేసుకుంది. యూపీలో తీర్ధయాత్రకు వచ్చిన ఓ యాత్రికుడు ఆదమరచి ఆడుకుంటున్న ఓ ఐదేళ్ల బాలుడిని పట్టపగలు అందరూ చూస్తుండగా అదేపనిగా ఎత్తి బలంగా నేలకేసి కొట్టాడు. దీంతో ఆ బాలుడు అక్కడికక్కడే మృతి చెందాడు.
ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ఒకటిబయటకు రావడంతో నెటిజన్లు, పోలీసులు దిగ్భ్రాంతికి గురయ్యారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం తీర్ధ యాత్రికుడు ఓంప్రకాష్(54) అనేక మార్లు నేలకేసి కొట్టాడని.. వెంటనే చుట్టుపక్కల ఉన్నవారు ఆ వ్యక్తిని పట్టుకుని దేహ శుద్ధి చేసి తమకు అప్పగించినట్లు తెలిపారు. స్థానికులు ఆ వ్యక్తిని చితకొట్టడంతో ఆ వ్యక్తి స్పృహ కోల్పోయాడని అతడిని వైద్యం నిమిత్తం ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు. నిందితుడు స్పృహలోకి వస్తే తప్ప బాలుడిని ఎందుకు చంపాడన్న కారణాలు తెలియవని అన్నారు.
స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం ఆ యాత్రికుడు సప్తకోసి యాత్ర నిమిత్తం అక్కడికి వచ్చాడని బాలుడిని ఎందుకలా కొట్టి చంపాడన్న కారణాలు మాత్రం తెలియడం లేదని అన్నారు. చనిపోయిన బాలుడి తండ్రి అక్కడే ఒక జనరల్ స్టోర్స్ నడుపుతూ ఉంటాడని తెలిపారు.
వీడియో కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
ఇది కూడా చదవండి: 'వండర్‌లా'లో అపశ్రుతి.. సాఫ్ట్‌వేర్ ఉద్యోగి మృతి..
Comments
Please login to add a commentAdd a comment