piligrim
-
ఐదేళ్ల బాలుడిపై అమానుషం.. ఎత్తి నేలకేసి కొట్టి..
లక్నో: ఉత్తర్ ప్రదేశ్లోని మథురలో ఘోర సంఘటన ఒకటి చోటు చేసుకుంది. యూపీలో తీర్ధయాత్రకు వచ్చిన ఓ యాత్రికుడు ఆదమరచి ఆడుకుంటున్న ఓ ఐదేళ్ల బాలుడిని పట్టపగలు అందరూ చూస్తుండగా అదేపనిగా ఎత్తి బలంగా నేలకేసి కొట్టాడు. దీంతో ఆ బాలుడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ఒకటిబయటకు రావడంతో నెటిజన్లు, పోలీసులు దిగ్భ్రాంతికి గురయ్యారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం తీర్ధ యాత్రికుడు ఓంప్రకాష్(54) అనేక మార్లు నేలకేసి కొట్టాడని.. వెంటనే చుట్టుపక్కల ఉన్నవారు ఆ వ్యక్తిని పట్టుకుని దేహ శుద్ధి చేసి తమకు అప్పగించినట్లు తెలిపారు. స్థానికులు ఆ వ్యక్తిని చితకొట్టడంతో ఆ వ్యక్తి స్పృహ కోల్పోయాడని అతడిని వైద్యం నిమిత్తం ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు. నిందితుడు స్పృహలోకి వస్తే తప్ప బాలుడిని ఎందుకు చంపాడన్న కారణాలు తెలియవని అన్నారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం ఆ యాత్రికుడు సప్తకోసి యాత్ర నిమిత్తం అక్కడికి వచ్చాడని బాలుడిని ఎందుకలా కొట్టి చంపాడన్న కారణాలు మాత్రం తెలియడం లేదని అన్నారు. చనిపోయిన బాలుడి తండ్రి అక్కడే ఒక జనరల్ స్టోర్స్ నడుపుతూ ఉంటాడని తెలిపారు. వీడియో కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి ఇది కూడా చదవండి: 'వండర్లా'లో అపశ్రుతి.. సాఫ్ట్వేర్ ఉద్యోగి మృతి.. -
పుణ్య స్నానానికి వచ్చి పరలోకాలకు..
కొవ్వూరు : కొవ్వూరు గోష్పాదక్షేత్రం స్నానఘట్టంలో తల్లిదండ్రులతో కలిసి స్నానానికి వచ్చిన కూచిపూడి గోపాలకృష్ణ (27) అనే వ్యక్తి ప్రమాదవశాత్తు గోదావరిలో మునిగి దుర్మరణం పాలయ్యాడు. వివరాలిలా ఉన్నాయి.. గురువారం పెదవేగి మండలం రాట్నాలకుంటకు చెందిన గోపాలకృష్ణ, అతని తల్లిదండ్రులు వెంకటేశ్వరరావు, పార్వతీతో కలిసి గోదావరి స్నానానికి మధ్యాహ్నం 2 గంటల సమయంలో వచ్చారు. స్నానాలు ముగించుకున్న తర్వాత గోదావరి జలాలు ఇంటికి తీసుకు వెళ్లేందుకు బాటిల్ నీళ్లు తీసుకురావాలని తల్లిదండ్రులు కోరడంతో నదిలోకి దిగాడు. నది లోతు తెలియకపోవడం, నీళ్ల కోసం కొంచెం లోపలికి వెళ్లడంతో గల్లంతయ్యాడు. కళ్ల ఎదుటే కన్నకొడుకు నీటిమునిగిపోవడంతో తల్లిదండ్రులు తల్లడిల్లిపోయారు. అక్కడే ఉన్న జాలర్ల సాయంతో గోపాలకృష్ణ ఆచూకీ కోసం గాలించారు. మూడు గంటల తర్వాత గోపాలకృష్ణ మృతదేహాన్ని జాలర్ల సాయంతో వెలికితీశారు. మృతుడికి ఏడాదిన్నర క్రితమే వివాహం కాగా మూడు నెలల కుమార్తె ఉంది. ఘటనాస్థలం వద్ద భార్య, తల్లిదండ్రుల రోధనలు మిన్నంటాయి. పోలీసు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు.