పుణ్య స్నానానికి వచ్చి పరలోకాలకు..
పుణ్య స్నానానికి వచ్చి పరలోకాలకు..
Published Fri, Jan 6 2017 2:27 AM | Last Updated on Tue, Sep 5 2017 12:30 AM
కొవ్వూరు : కొవ్వూరు గోష్పాదక్షేత్రం స్నానఘట్టంలో తల్లిదండ్రులతో కలిసి స్నానానికి వచ్చిన కూచిపూడి గోపాలకృష్ణ (27) అనే వ్యక్తి ప్రమాదవశాత్తు గోదావరిలో మునిగి దుర్మరణం పాలయ్యాడు. వివరాలిలా ఉన్నాయి.. గురువారం పెదవేగి మండలం రాట్నాలకుంటకు చెందిన గోపాలకృష్ణ, అతని తల్లిదండ్రులు వెంకటేశ్వరరావు, పార్వతీతో కలిసి గోదావరి స్నానానికి మధ్యాహ్నం 2 గంటల సమయంలో వచ్చారు. స్నానాలు ముగించుకున్న తర్వాత గోదావరి జలాలు ఇంటికి తీసుకు వెళ్లేందుకు బాటిల్ నీళ్లు తీసుకురావాలని తల్లిదండ్రులు కోరడంతో నదిలోకి దిగాడు. నది లోతు తెలియకపోవడం, నీళ్ల కోసం కొంచెం లోపలికి వెళ్లడంతో గల్లంతయ్యాడు. కళ్ల ఎదుటే కన్నకొడుకు నీటిమునిగిపోవడంతో తల్లిదండ్రులు తల్లడిల్లిపోయారు. అక్కడే ఉన్న జాలర్ల సాయంతో గోపాలకృష్ణ ఆచూకీ కోసం గాలించారు. మూడు గంటల తర్వాత గోపాలకృష్ణ మృతదేహాన్ని జాలర్ల సాయంతో వెలికితీశారు. మృతుడికి ఏడాదిన్నర క్రితమే వివాహం కాగా మూడు నెలల కుమార్తె ఉంది. ఘటనాస్థలం వద్ద భార్య, తల్లిదండ్రుల రోధనలు మిన్నంటాయి. పోలీసు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు.
Advertisement
Advertisement