
సాక్షి, విశాఖ: విశాఖ జిల్లా పద్మనాభం మండలం పాండ్రంగిలో చోటుచేసుకున్న మరో ఘటనలో రేవిడి గ్రామానికి చెందిన మరగడ యశ్వంత్‌కుమార్‌రెడ్డి (9) అనే బాలుడు గోస్తనీ నది వద్ద కాజ్‌వే గట్టున స్నానం చేస్తూ నదిలో కొట్టుకుపోయాడు. యశ్వంత్‌కుమార్‌రెడ్డి తల్లి వెంకటలక్ష్మితో కలిసి సోమవారం ఉదయం 5.15 గంటల సమయంలో నదీ స్నానానికి వెళ్లాడు.
తల్లి వెంకటలక్ష్మి తోటి మహిళలతో కలిసి నదిలో కాజ్‌వేపై స్నానం చేస్తుండగా.. యశ్వంత్ మరో బాలుడితో కలిసి కాజ్‌వే ఒడ్డున స్నానానికి ఉపక్రమించాడు. అక్కడ నాచు పట్టి ఉండటంతో యశ్వంత్ కాలు జారి నదిలో పడిపోయాడు. జాలర్లు, గజ ఈతగాళ్లు నదిలో గాలించినప్పటికీ ఫలితం లేకపోయింది. దీంతో అధికారులు 18 మందితో కూడిన ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాన్ని రంగంలోకి దించారు.
సాయంత్రం 5.30 గంటల వరకు గాలించినా బాలుడి ఆచూకీ లభించలేదు. చీకటి పడటంతో గాలింపు చర్యలు నిలిపివేసి మళ్లీ మంగళవారం కొనసాగించనున్నారు. బాలుడు కృష్ణాపురంలోని ప్రైవేట్ పాఠశాలలో మూడో తరగతి చదువుతుండగా.. తండ్రి గౌరిరెడ్డి ఆటో నడుపుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment