వింతలు విశేషాలు
వానరాలు(కోతులు) చెట్లపైనుంచి దూకడం, గంతులేయడం, కీచుమంటూ అరవడంలాంటివి మనం ఎన్నో చూసుంటాం. అవి చేసే తమాషా చేష్టలకి మనం ఆశ్చర్యపోతుంటాం. కానీ వానరాలు ఎప్పుడైనా ఈత కొట్టడం చూశారా! చెరువులో కాదు, బావిలో కాదు, ఏకంగా సముద‍్రంలో.. నమ్మలేకున్నారు కదూ..! అయితే ఈ దృశ్యం చూడండి..
వానరాలు ఈతకొడుతూ కనిపించడం చాలా అరుదు. మకాక్ జాతికి చెందిన ఈ మగ వానరం సముద్రంలో హాయిగా మునకీత కొడుతున్న అరుదైన దృశ్యం కెమెరాకు చిక్కింది. థాయ్‌లాండ్‌లోని ఫై ఫై దీవి తీరం వద్ద కనిపించిన ఈ దృశ్యాన్ని కువైట్‌కు చెందిన ఫొటోగ్రాఫర్ సులేమాన్ అలాతికి తన కెమెరాలో బంధించాడు. ఈ ఫొటో ఇటీవల ‘అండర్ వాటర్ ఫొటోగ్రఫీ–2024’ పోటీలో బహుమతి దక్కించుకుంది.
Comments
Please login to add a commentAdd a comment