UP College Student Dies After Raped By Boy Friend, Details Inside - Sakshi
Sakshi News home page

ఘోర కలి: యువతి హత్యాచారం కేసులో షాకింగ్‌ ట్విస్ట్‌, ప్రియుడే..

Published Mon, Nov 14 2022 12:21 PM | Last Updated on Mon, Nov 14 2022 1:06 PM

UP Crime College Student Dies After Raped By Boy Friend - Sakshi

క్రైమ్‌: ఒంటరిగా ఇంట్లో ఉన్న ఓ కాలేజ్‌ స్టూడెంట్‌పై ఓ మానవమృగం దారుణానికి తెగపడింది. ఆ దారుణంతో ఘోరం జరిగిపోయింది. యువతి అక్కడికక్కడే కన్నుమూసింది. ఈ కేసులో తొలుత పక్కింట్లో ఉండే ఓ వృద్ధుడిపై అంతా అనుమానం వ్యక్తం చేశారు. అయితే.. ఆ ఘోరానికి పాల్పడింది వృద్ధుడు కాదని.. స్థానికంగా ఉండే మరో యువకుడని పోలీసులు నిర్ధారించారు.

ఉత్తర ప్రదేశ్‌ ఉన్నావ్‌లో జరిగిన ఘోర హత్యాచార ఘటన.. స్థానికంగా అలజడి సృష్టించింది. ఇంట్లో వాళ్లంతా బయటకు వెళ్లిన సమయంలో ఆమెపై దారుణం జరిగింది. తిరిగొచ్చి చూసేసరికి యువతి రక్తపుస్రావంతో నగ్నంగా బెడ్‌పై స్పృహ లేకుండా పడి ఉంది. అది గమనించిన ఆమె సోదరి స్థానికుల సాయంతో ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే ఆమె కన్నుమూసిందని వైద్యులు ప్రకటించారు. 

యువతిపై అత్యాచారం జరిగిందని, ఆ ప్రయత్నంలోనే రక్తస్రావంతో ఆమె కన్నుమూసిందని వైద్యుల నివేదికలో తేలింది. ఈ క్రమంలో.. పొరుగింట్లో ఉండే ఓ వృద్ధుడిపై అంతా అనుమానం వ్యక్తం చేశారు. తరచూ యువతులను ఏడిపించి.. అసభ్యంగా కామెంట్లు చేసే ఆ పెద్దాయనే ఆ ఘాతుకానికి పాల్పడి ఉంటారని భావించారంతా. ఈ క్రమంలో పోలీసులు ఆయన్ని అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు కూడా. అయితే.. 

యువతి ఫోన్‌ డేటా ఆధారంగా రాజ్‌ గౌతమ్‌ అనే యువకుడిని సైతం పోలీసులు ప్రశ్నించగా.. నేరం ఒప్పుకున్నాడు. ఈ కేసులో ప్రేమ కోణం వెలుగు చూసింది. రాజ్‌ గౌతమ్‌ స్థానికంగా ఓ ప్రైవేట్‌ స్కూల్‌లో టీచర్‌. సివిల్స్‌కు ప్రిపేర్‌ అవుతున్నాడు కూడా. బాధితురాలితో రెండేళ్లుగా అతనికి పరిచయం ఉంది. ఆమె తన ఛాతీపై అతని పేరు పచ్చబొట్టు వేయించుకుంది. వీళ్ల ప్రేమ వ్యవహారం పెద్దలకు తెలియదు. అయితే.. 

గురువారం  ఇంట్లో ఆమె ఒంటరిగా ఉందని తెలుసుకుని వెళ్లాడు. ఆపై ఆమెను శారీరకంగా కలిసేందుకు యత్నించాడు. కానీ, ఆమె ప్రతిఘటించింది. దీంతో బలవంతం చేశాడు. అయితే.. నేరానికి ముందు నిందితుడు గౌతమ్‌ ఎనర్జీ పిల్స్‌(అఫ్రొడిసియాక్ మాత్రలు) తీసుకోవడం.. దారుణానికి కారణమైంది. గింజుకున్న యువతి స్పృహ కోల్పోయినా.. వదలకుండా ఘాతుకానికి పాల్పడడంతో ఆమె అధిక రక్తస్రావం అయ్యి మరణించింది. ఘటన తర్వాత భయంతో అక్కడి నుంచి నిందితుడు పారిపోయినట్లు దర్యాప్తులో తేలింది. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. కోర్టులో ప్రవేశపెట్టి, రిమాండ్‌కు తరలించారు. బాధిత కుటుంబం నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేస్తోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement