పసిడి తవ్వకాలు - ఉన్నవ్ లో 'పీప్లీ లైవ్'
పసిడి తవ్వకాలు - ఉన్నవ్ లో 'పీప్లీ లైవ్'
Published Sat, Oct 19 2013 12:17 PM | Last Updated on Fri, Sep 1 2017 11:47 PM
గుప్త నిధుల కోసం వేట, తవ్వకాలు అనే అంశాలతో అంతర్జాతీయ సినిమాతోపాటు, భారతీయ తెరపైన కూడా బోలెడన్న చిత్రాలు రూపోంది.. కనక వర్షాన్ని కురిపించిన సంఘటనలు మనకు తెలిసిందే. నిధులు వేట కథా నేపథ్యంతో హాలీవుడ్ లో రూపొందిన 'మెకనాస్ గోల్డ్', చార్లీ చాప్లిన్ ను ప్రసిద్ధుడిని చేసిన 1925 మూకీ చిత్రం 'గోల్డ్ రష్' చిత్రాలు ప్రపంచవ్యాప్తంగా సంచలన విజయాలను సొంతం చేసుకున్నాయి. ఇప్పటికి 'మెకనాస్ గోల్డ్' చిత్రం చూడటానికి ఎందరో కాచుకుచుంటారనేది కాదనలేని వాస్తవం.
అలాంటి కథను మైమరిపించే రీతిలో ఉత్తర ప్రదేశ్ లోని ఉన్నవ్ గ్రామంలో పసిడి వేట దేశ ప్రజలందర్ని ఆకర్షిస్తోంది. ఈ సంఘటనలతో ఉన్నట్టుండి ఉన్నవ్ గ్రామం పరిస్థితులు, వాతావరణంలో ఒక్కసారిగా ఊహించని మార్పుల చోటు చేసుకుంటున్నాయి. ఎప్పడు టెలివిజన్ రేటింగ్ ల కోసం పాకులాడే దేశీయ, అంతర్జాతీయ మీడియా అక్కడ తిష్టవేసుకోవడం నిధుల తవ్వకానికి మరింత ప్రచారాన్ని తీసుకువచ్చింది. ఇలాంటి సంఘటనలు చోటు చేసుకోవడంతో పక్కా గ్రామీణ వాతావరణం కనిపించే అక్కడ అధునిక వాతావరణం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. సంఘటనా స్థలానికి సందర్శకులు, వీఐపీలు తాకిడి ఎక్కువ కావడంతో కొత్తగా షాపులు, హోటళ్లు వెలిసి.. సరికొత్త వాతావారణాన్ని సంతరించుకుంది.
స్వామి కల నిజమైతే గ్రామానికి, స్థానికంగా కూడా మంచి జరుగుతుందని ఆ ప్రాంత మహిళలు శివుడి ఆలయంలో పూజలు, ప్రార్ధనలు మొదలెట్టినారట. శివలింగానికి పాలతో పూజలు, అర్చనలు ప్రారంభించారట. ఇలాంటి సంఘటనలు విదేశీ మీడియాను అమితంగా ఆకర్షించడంతో వాళ్లు కూడా లైవ్ లతో పండగ చేసుకుంటున్నారని సమాచారం.
ఇదంతా చూస్తుంటే.. ఇటీవల బాలీవుడ్ లో విడుదలైన పీప్లీ లైవ్ అనే సినిమా తప్పకుండా గుర్తురాక ఉండదు. ఓ గ్రామీణ ప్రాంతంలో రైతు అప్పుల బారిన పడుతాడు. ఆత్మహత్యకు పాల్పడిన రైతులకు ప్రభుత్వం ఆర్ధిక సహాయం అందిస్తుందని తెలుసుకున్న రైతు.. ఓ టీస్టాల్ వద్ద ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నట్టు చెబుతాడు. ఆ పక్కనే ఉన్న ఓ రిపోర్టర్ కథనాన్ని ప్రచురిస్తాడు. ఆ కథనం మీడియాను ఆకర్షించడంతో దేశీయ, అంతర్జాతీ మీడియా తమ వాహనాలతో అక్కడ హంగామా చేస్తాయి. రైతు ఎప్పుడూ, ఎలా ఆత్మహత్య చేసుకుంటాడనే కోణంలో మీడియా అత్యుత్సాహాంపై 'పీప్లీ లైవ్' సెటైర్ వేసింది.
ఇదంతా జరగడం వెనుక ఓ స్వామి కల దాగి ఉంది. ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నవ్ జిల్లా దాండియాఖేరా గ్రామంలో 19వ శతాబ్దానికి చెందిన రాజా రావ్ రామ్‌బక్ష్ సింగ్ నిర్మించిన రాజకోటలో వెయ్యి టన్నుల బంగారం ఉన్నట్లు తాను కలగన్నానని స్వామి శోభన్ సర్కార్ అనే సాధువు వెల్లడించిన సంగతి తెలిసిందే. ఏం జరుగుతుందోనన్న కుతూహలంతో చుట్టుపక్కల ప్రాంతాల నుంచి జనం తండోపతండాలుగా తరలివచ్చారు. వారిని నియంత్రించేందుకు బారికేడ్లు ఏర్పాటు చేయాల్సి వచ్చింది. సాధువు కల ఆధారంగానే తవ్వకాలు చేస్తున్నారా అని ప్రశ్నించగా.. ‘ఈ ప్రాంతంలో బంగారం లేదా వెండి ఉండొచ్చని భారత భూగర్భ పరిశోధన విభాగం (జీఎస్‌ఐ) తెలిపింది. ఉత్తరప్రదేశ్‌లో ఓ సాధువు కన్న కల అటు అధికారులను ఉరుకులు పరుగులు పెట్టిస్తుండగా.. ఇటు ప్రజల్లో అమితాసక్తిని రేపుతోంది. మరోవైపు దీనిపై రాజకీయ వర్గాలూ మాటల యుద్ధానికి దిగుతున్నాయి. ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పించుకుంటున్నారు. నిధుల వేటపై ఉన్న శ్రద్ధ..విదేశీ బ్యాంకుల నుంచి నల్లధనం తెప్పించడంలో యూపీఏ ప్రభుత్వానికి చిత్తశుద్ది లేదని బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీ కేంద్ర ప్రభుత్వ తీరును ఎద్దేవా చేశారు. నిధి మాట దేవుడెరుగు.. మరో నెల రోజులపాటు జరిగే ఈ తంతు మీడియాకే కాకుండా...ఉన్నవ్ గ్రామానికి పండగ వాతావరణంతోపాటు చేతినిండ పని కల్పించింది.
Advertisement
Advertisement