అంతర్జాతీయ ద్రవ్యనిధి చీఫ్ క్రిస్టీన్ లగార్డ్
వాషింగ్టన్: కశ్మీర్‌లోని కఠువాలో బాలికపై హత్యాచార ఘటనను అంతర్జాతీయ ద్రవ్యనిధి చీఫ్ క్రిస్టీన్ లగార్డ్ దురదృష్టకరంగా అభివర్ణించారు. దీన్ని నిరసిస్తూ భారత్‌లో జరుగుతున్న నిరసనలపై స్పందిస్తూ ‘భారత్‌తో జరుగుతున్న ఆందోళనలు ప్రతిఘటనకు సూచన. భారత అధికారులు, ప్రధాని మోదీ దీనిపై దృష్టి సారిస్తారని భావిస్తున్నాను. భారత మహిళకు భద్రత చాలా అవసరం’ అని ఆమె అన్నారు.
భారత్‌లో కొనసాగుతున్న సంస్కరణ జోరు వచ్చే ఎన్నికల సంవత్సరంలో కొనసాగటం కష్టమేనని తెలిపారు. ‘భారత్‌లో ప్రస్తుతం జరుగుతున్న ఆర్థిక సంస్కరణ వేగం వచ్చే కొద్ది నెలల్లో ఇలాగే కొనసాగుతుం దని చెప్పలేం. ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ సంస్కరణలు తగ్గుతాయి’ అని గురువారం అంతర్జాతీయ ఆర్థిక సంస్థలతో జరిగిన సమావేశంలో ఆమె తెలిపారు. జీఎస్టీ, దివాళా చట్టం వంటివి చాలా గొప్ప సంస్కరణలని ఆమె ప్రశంసించారు.
Comments
Please login to add a commentAdd a comment