మోదీజీ.. చేతల్లో చూపించండి | Congress Reaction on Modi Response on Kathua Unnao Cases | Sakshi
Sakshi News home page

Published Sat, Apr 14 2018 10:16 AM | Last Updated on Wed, Aug 15 2018 2:40 PM

Congress Reaction on Modi Response on Kathua Unnao Cases - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : దేశాన్ని కుదిపేస్తున్న అత్యాచార ఘటనలపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించిన నేపథ్యంలో కాంగ్రెస్‌ పార్టీ కౌంటర్‌కు దిగింది. హామీలు ఇవ్వటం కాదని.. తీవ్ర చర్యలు తీసుకున్నప్పుడే ఏదైనా ఫలితం ఉంటుందని చెబుతోంది. ఈ మేరకు కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ తన ట్వీటర్‌లో ఈ ఉదయం ట్వీటేశారు. (సమాజానికి సిగ్గుచేటు)

‘ప్రియమైన ప్రధానిగారూ.. ఇప్పటికైనా మీరు స్పందించినందుకు కృతజ్ఞతలు. మన దేశంలో ఆడకూతుళ్లకి న్యాయం జరిగేలా చూస్తానని మీరు హామీ ఇచ్చారు. కానీ, అది ఎప్పటికీ నెరవేరుతుంది? ఇది యావత్‌ దేశం తెలుసుకోవాలనుకుంటోంది’ అంటూ రాహుల్‌ ఓ సందేశం ఉంచారు. మరోవైపు ప్రధాని స్పందనపై కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి అభిషేక్‌ మను శనివారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. ‘ప్రధానిగారు ఇప్పటికైనా పెదవి విప్పినందుకు సంతోషం. కాంగ్రెస్‌తోసహా పలు పార్టీలు చేసిన పోరాటం ఫలించి.. ఆ డిమాండ్‌ మేరకే ఆయన స్పందించారు. కానీ, ఆ మాటలు కార్యరూపం దాలిస్తే దేశం మొత్తం ఇంకా సంతోషిస్తుంది. ఘటనలకు బాధ్యులైనవారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందే’ అని అభిషేక్‌ కోరారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement