హిందుస్థాన్ పెట్రోలియం ఫ్లాంట్‌లో గురువారం పెట్రోల్ ట్యాంకర్లలో అకస్మాత్తుగా పేలుడు సంభవించింది. ఉత్తరప్రదేశ్ ఉన్నవోలో ఈ సంఘటన చోటుచేసుకుంది. ఫ్లాంట్‌లోని వాల్వ్ లీక్ అవడంతో ఈ పేలుడు జరిగినట్లు తెలుస్తోంది. అకస్మాత్తుగా ట్యాంకర్ పేలడంతో ఫ్లాంట్‌లోకి సిబ్బంది ఉలిక్కిపడ్డారు. ఒక్కసారిగా వారంతా బయటకు పరుగులు తీయడంతో తొక్కిసలాట జరిగింది. వెంటనే వారందర్ని అక్కడ నుంచి సురక్షిత ప్రాంతానికి తరలించారు.