Hindustan Petroleum Corporation
-
నిత్యవసర వస్తువుల అమ్మకాల్లో హిందుస్తాన్ పెట్రోలియం
న్యూఢిల్లీ: హిందుస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ (హెచ్‌పీసీఎల్) ఇంధనేతర వ్యాపారంలోకి ప్రవేశించింది. హ్యాపీ షాప్ పేరుతో తొలి ఔట్‌లెట్‌ను ముంబైలోని క్లబ్ హెచ్‌పీ పెట్రోల్ పంప్లో ప్రారంభించింది. ఆహార పదార్థాలు, సబ్బులు, ఆరోగ్య సంబంధ ఉత్పత్తులు, బేకరీ, సరుకులు, మందుల వంటివి ఇక్కడ లభిస్తాయి. రోజువారీ అవసరమయ్యే వస్తువులను కస్టమర్ల సౌకర్యార్థం 24 గంటలూ అందుబాటులోకి తేవడం కోసం స్టోర్‌ను తెరిచినట్టు కంపెనీ తెలిపింది. హెచ్‌పీ–పే యాప్ ద్వారా హోమ్ డెలివరీ సౌకర్యమూ ఉంది. ఇతర నగరాల్లోనూ ఇటువంటి కేంద్రాలను ప్రారంభిస్తామని కంపెనీ ప్రకటించింది. ఖరీదైన కార్లు, బైక్స్ కోసం 100 ఆక్టేన్ రేటింగ్‌తో అల్ట్రా ప్రీమియం గ్రేడ్ పెట్రోల్‌ను పవర్ 100 పేరుతో హెచ్‌పీసీఎల్ అందుబాటులోకి తెచ్చింది. చదవండి: స్పెషల్ ఎకనామిక్ జోన్, 2.15 లక్షల కోట్ల విలువైన ఎగుమతులు -
హెచ్‌పీసీఎల్, ఏంజెల్ బ్రోకింగ్.. భేష్
స్వల్ప ఆటుపోట్ల మధ్య ప్రారంభమైన దేశీ స్టాక్ మార్కెట్లు తదుపరి జోరందుకున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 168 పాయింట్లు పెరిగి 39,918కు చేరగా.. నిఫ్టీ 63 పాయింట్లు బలపడి 11,734 వద్ద ట్రేడవుతోంది. ఈ నేపథ్యంలో సానుకూల వార్తల కారణంగా ఓవైపు ఇంధన రంగ పీఎస్‌యూ హిందుస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్(హెచ్‌పీసీఎల్), మరోపక్క ఏంజెల్ బ్రోకింగ్ లిమిటెడ్ కౌంటర్లు వెలుగులోకి వచ్చాయి. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో ఈ రెండు కంపెనీల షేర్లూ భారీ లాభాలతో దూకుడు చూపుతున్నాయి. వివరాలు చూద్దాం.. హెచ్‌పీసీఎల్ సొంత ఈక్విటీ షేర్ల కొనుగోలు(బైబ్యాక్)కు ప్రతిపాదించినట్లు చమురు రిఫైనరీ దిగ్గజం హెచ్‌పీసీఎల్ తాజాగా పేర్కొంది. ఈ అంశంపై వచ్చే నెల 4న(బుధవారం) సమావేశంకానున్న కంపెనీ బోర్డు చర్చించనున్నట్లు తెలియజేసింది. అదేరోజు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2020-21) రెండో త్రైమాసిక ఫలితాలను సైతం విడుదల చేయనున్నట్లు వెల్లడించింది. ఈ ఏడాది క్యూ1(ఏప్రిల్- జూన్)లో హెచ్‌పీసీఎల్ నికర లాభం 157 శాతం దూసుకెళ్లి రూ. 2,253 కోట్లకు చేరగా.. నికర అమ్మకాలు మాత్రం 47 శాతం క్షీణించి రూ. 37,559 కోట్లకు పరిమితమైన విషయం విదితమే. కాగా.. ప్రస్తుతం ఎన్ఎస్ఈలో హెచ్‌పీసీఎల్ షేరు 5 శాతం జంప్‌చేసి రూ. 189 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో రూ. 190 వరకూ పెరిగింది. ఏంజెల్ బ్రోకింగ్ ఈ ఏడాది క్యూ2(జులై- సెప్టెంబర్)లో ఆకర్షణీయ ఫలితాలు సాధించడంతో ఇటీవల జోరు చూపుతున్న ఏంజెల్ బ్రోకింగ్ కౌంటర్‌కు మరోసారి డిమాండ్ నెలకొంది. కువైట్ ఇన్వెస్ట్మెంట్ అథారిటీ బల్క్‌డీల్ ద్వారా కంపెనీలో 0.53 శాతం వాటాను కొనుగోలు చేసినట్లు వెల్లడికావడం దీనికి కారణమైంది. షేరుకి రూ. 321.73 ధరలో 4.3 లక్షల ఈక్విటీ షేర్లను సొంతం చేసుకున్నట్లు ఎన్ఎస్ఈ డేటా పేర్కొంది. ప్రస్తుతం ఎన్ఎస్ఈలో ఏంజెల్ బ్రోకింగ్ షేరు 12.5 శాతం దూసుకెళ్లి రూ. 367 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో 17 జంప్‌చేసి రూ. 379ను తాకింది. గత నాలుగు రోజుల్లో ఏంజెల్ బ్రోకింగ్ షేరు 52 శాతం ర్యాలీ చేసింది. ఇందుకు క్యూ2 ఫలితాలు దోహదం చేస్తున్నట్లు నిపుణులు తెలియజేశారు. క్యూ2లో కంపెనీ చరిత్రలోనే అత్యధికంగా దాదాపు రూ. 75 కోట్ల నికర లాభం ఆర్జించిన విషయం విదితమే. -
హెచ్‌పీ ఫ్లాంట్‌లో భారీ పేలుడు
-
మూడు నెలల్లో ఆర్టీసీ బంకులు..!
తొలి విడతలో 69 చోట్ల.. ఆ తర్వాత మరో 42 చోట్ల ఏర్పాటు - తొలుత హెచ్‌పీసీఎల్.. ఆ తర్వాత ఐఓసీఎల్ ఆధ్వర్యంలో బంకులు - స్థలాల లీజు, డీలర్షిప్ కమీషన్ పొందనున్న సంస్థ - రూ.10 కోట్ల వార్షికాదాయం వస్తుందంటున్న అధికారులు సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ పెట్రోల్ బంకులు మరో మూడు నెలల్లో అందుబాటులోకి రాబోతున్నాయి. పెట్రోల్ బంకులకు సంబంధించి ఆర్టీసీ ఇటీవలే హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్‌పీసీఎల్), ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఐఓసీఎల్)తో ఒప్పందాలు కుదుర్చుకుంది. రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ సొంత స్థలాల్లో 111 చోట్ల పెట్రోల్ బంకులు ఏర్పాటు చేయాలని సంస్థ నిర్ణయించింది. తొలి దశలో 69 బంకులను.. ఆ తర్వాత మరో 42 బంకులను ఏర్పాటు చేయనుంది. తొలుత హెచ్‌పీసీఎల్ ఆధ్వర్యంలో 41, ఐఓసీఎల్ ఆధ్వర్యంలో 28 బంకులు అందుబాటులోకి రానున్నాయి. ఇప్పటికే ఆ రెండు సంస్థలు పెట్రోల్ బంకులకు అవసరమైన ఏర్పాట్లు ప్రారంభించాయి. మరో మూడు నెలల్లో హెచ్‌పీసీఎల్ బంకులు సిద్ధం కానున్నాయి. ఆ తర్వాత ఐఓసీఎల్ బంకులు అందుబాటులోకి వస్తాయి. రూ.10 కోట్లకుపైనే ఆదాయం.. ఈ బంకుల నిర్వహణ ఆర్టీసీ ఆధ్వర్యంలోనే ఉంటుంది. అయితే బంకు ఏర్పాటు చేసినందుకు ఆర్టీసీకి లీజు మొత్తం చెల్లించాలి. దీంతోపాటు అమ్మినందుకు లీటర్ పెట్రోల్‌కు రూ.2.56, డీజిల్‌కు రూ.1.66 చొప్పున హెచ్‌పీసీఎల్, ఐఓసీఎల్.. ఆర్టీసీకి డీలర్షిప్ కమీషన్ చెల్లిస్తాయి. ఔట్సోర్సింగ్ సిబ్బందితో ఆర్టీసీ ఈ బంకులను నిర్వహిస్తుంది. భవిష్యత్తులో వారిని ఆర్టీసీ ఉద్యోగులుగా పరిగణించి పర్మనెంట్ చేయాలనే డిమాండ్ వచ్చే అవకాశం ఉంటుందని ఊహిస్తున్న ఆర్టీసీ.. సొంతంగా ఔట్సోర్సింగ్ సిబ్బందిని ఏర్పాటు చేయకుండా, నిర్వహణను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించాలని భావిస్తోంది. ఇందుకోసం త్వరలో టెండర్లు పిలవబోతోంది. చమురు సంస్థలు ఆర్టీసీకి చెల్లించే డీలర్షిప్ మొత్తం నుంచే ప్రైవేటు వ్యక్తులకు ఆర్టీసీ చెల్లిస్తుంది. ఎవరు తక్కువ మొత్తం కోట్ చేస్తారో వారికి నిర్వహణ బాధ్యతను అప్పగిస్తుంది. వారు కోట్ చేసే మొత్తం పోను మిగితాది ఆర్టీసీకి ఆదాయంగా మారుతుంది. వెరసి రూ.10 కోట్ల వరకు వార్షికాదాయం సమకూరుతుందని ఆర్టీసీ అంచనా వేస్తోంది. ప్రత్యామ్నాయ ఆదాయ బాటలో.. తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ఆర్టీసీకి ప్రత్యామ్నాయ ఆదాయం కోసం అధికారులు బంకుల ఏర్పాటు నిర్ణయం తీసుకున్నారు. జైళ్ల శాఖ సొంతంగా పెట్రోల్ బంకులు నిర్వహిస్తూ లాభాలు ఆర్జిస్తున్న తరహాలోనే ఆర్టీసీ కూడా బంకుల ఏర్పాటుకు ముందుకొచ్చింది. నగరం సహా రాష్ట్రంలోని అన్ని పట్టణాల్లో ఆర్టీసీకి విలువైన స్థలాలున్నాయి. అవన్నీ దాదాపు ప్రధాన రహదారులపైనే ఉండటంతో పెట్రోల్ బంకులు లాభదాయకంగా ఉంటాయని భావిస్తోంది. మరోవైపు బస్టాండ్లలో మినీ సినిమా థియేటర్ల ఏర్పాటుకు కూడా ఆర్టీసీ చర్యలు తీసుకుంటోంది. టెండర్లు పిలవగా దాదాపు 300కుపైగా థియేటర్ల నిర్మాణం కోసం ప్రైవేటు సంస్థలు ముందుకొచ్చాయి. ఈ రెండు ప్రయత్నాలు ఆర్టీసీ నష్టాలను తగ్గించేందుకు దోహదం చేస్తాయని సంస్థ గంపెడాశతో ఉంది. -
పెట్రోలే కాదు.. పాలనూ అమ్ముతారు
పెట్రోల్ పంపుల్లో పెట్రోలు, డీజిల్‌తో పాటు పాలు, పాల ఉత్పత్తులను సైతం విక్రయించనున్నారు. ఈ నెల 26 నుంచి పూర్వపు వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల్లోని బంకుల్లో ముల్కనూర్ స్వకృషి డెయిరీ పాల అమ్మకాలను ప్రారంభించనుంది. వరంగల్ అర్బన్ జిల్లా భీమ దేవరపల్లి మండలంలోని ముల్కనూర్ స్వకృషి డెయిరీలో బుధవారం హిందు స్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ అధికారులు, డెయిరీ అధికారులతో ఈ మేరకు ఒప్పందం కుదుర్చుకున్నారు. – భీమదేవరపల్లి -
ఆర్టీసీ పెట్రోల్ బంకులొస్తున్నాయ్..!
- చమురు డీలర్‌గా ఆర్టీసీ కొత్త అవతారం - రాష్ట్రవ్యాప్తంగా 60- 70 వరకు ఏర్పాటు - త్వరలో హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్‌తో ఒప్పందం - భారీ లాభాలుంటాయని అంచనా సాక్షి, హైదరాబాద్ : త్వరలో ఆర్టీసీ పెట్రోలు బంకులు రాబోతున్నాయి. పెట్రోలియం కంపెనీల నుంచి డీలర్షిప్ తీసుకుని ఆర్టీసీ వాటిని నిర్వహించనుంది. ఇంతకాలం సొంత బస్సుల కోసం బల్క్‌గా డీజిల్ కొని బస్‌డిపోలలో సొంత బంకులు నిర్వహిస్తూ వచ్చిన రోడ్డు రవాణా సంస్థ ఇక ప్రైవేటు వాహనాలకు కూడా పెట్రోలు, డీజిల్ విక్రయించేందుకు సిద్ధమైంది. తెలంగాణ వ్యాప్తంగా 60 నుంచి 70 బంకులు ఏర్పాటు చేసేందుకు కసరత్తు చేస్తోంది. ఆదాయం కోసం కొత్త పుంతలు ప్రస్తుతం ఆర్టీసీ దాదాపు రూ.2,300 కోట్ల అప్పుల్లో కూరుకుపోయింది. ఇక ఏ నెలకానెల నష్టాలు తీవ్రమవుతుండటంతో అప్పులు తీర్చే మార్గమే కనిపించడం లేదు. గత మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో ఏకంగా రూ.701 కోట్ల రికార్డు స్థాయి నష్టాలు మూటగట్టుకున్న సంస్థకు ఈ ఆర్థిక సంవత్సరం తొలి మూడు నెలల్లోనే దాదాపు రూ.100 కోట్ల నష్టాలు వచ్చిపడ్డాయి. ఈ నేపథ్యంలో టికెట్ల ద్వారా లాభాలు వచ్చే అవకాశం లేకపోవటంతో ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి సారించింది. ఇందులో భాగంగా సొంతంగా పెట్రోలు, డీజిల్ బంకులేర్పాటు చేయాలని నిర్ణయించింది. ప్రస్తుతం తెలంగాణ ఆర్టీసీ సొంత అవసరాలకు హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్‌పై ఆధారపడింది. టెండర్లలో ఆ సంస్థ తక్కువ మొత్తం కోట్ చేయటంతో తనకవసరమైన డీజిల్‌లో 95 శాతం దాని నుంచే బల్క్‌గా కొంటోంది. దీంతో తాను సొంతంగా ఏర్పాటు చేయబోయే బంకులకు డీలర్షిప్స్ కూడా ఆ సంస్థ నుంచే తీసుకోవాలని భావిస్తోంది. ఈ మేరకు ఆ సంస్థతో చర్చలు జరుపుతోంది. త్వరలో ఒప్పందం చేసుకోనుంది. నిర్వహణ ఇలా... రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీకి భారీగా భూములున్నాయి. ప్రధాన రోడ్లపై ఉన్న స్థలాల్లో పెట్రోలు బంకులు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇలాంటివి దాదాపు 100 వరకు స్థలాలు సిద్ధంగా ఉన్నట్టు ప్రాథమికంగా తేల్చింది. ఒక బంకు ఏర్పాటు చేయాలంటే దాదాపు వేయి గజాల స్థలం అవసరం. ఉన్న భూముల్లో 60 నుంచి 70 చోట్ల బంకులేర్పాటుకు అనువుగా ఉన్నట్టు భావిస్తోంది. ఆర్టీసీ పేరుతో పెట్రోలియం కార్పొరేషన్ల నుంచి డీలర్షిప్ తీసుకుని ఆయా చోట్ల సొంతంగానే బంకులేర్పాటు చేస్తోంది. వాటి నిర్వహణను మాత్రం ఔట్సోర్సింగ్ పద్ధతిలో పర్యవేక్షిస్తుంది. భారీగా అవసరమయ్యే సిబ్బందిని ఔట్సోర్సింగ్ పద్ధతిలో నియమించుకుంటుంది. బంకు యాజమాన్య హక్కులు మాత్రం ఆయిల్ కార్పొరేషన్‌కే ఉంటాయి. ప్రతి లీటరు డీజిల్, పెట్రోలుపై దాదాపు రూ.1.25 నుంచి రూ.1.80 వరకు ఆర్టీసీకి కమీషన్ వస్తుంది. బంకు ఏర్పాటుకు స్థలాన్ని కేటాయించినందుకు చమురు సంస్థ అద్దె కూడా చెల్లిస్తుంది. వెరసి రెండు రకాలుగా ఆర్టీసీకి ఆదాయం ఉంటుంది. -
హెచ్‌పీసీఎల్ రికార్డ్..
న్యూఢిల్లీ: హిందూస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్(హెచ్‌పీసీఎల్) నికర లాభం గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో 58 శాతం వృద్ధి చెందింది. రిఫైనింగ్ మార్జిన్లు అధికంగా ఉండడమే దీనికి కారణమని హెచ్‌పీసీఎల్ పేర్కొంది. ఈ మొత్తం రూ.2,162 కోట్లకు పెరిగిందని హెచ్‌పీసీఎల్ సీఎండీ నిషి వాసుదేవ చెప్పారు. ఇక పూర్తి ఆర్థిక సంవత్సరానికి రూ.2,733 కోట్ల నికర లాభం ఆర్జించామని, కంపెనీ 40 ఏళ్ల చరిత్రలో ఇదే అత్యధిక లాభమని తెలిపారు. 2013-14 తో పోల్చితే 58 శాతం వృద్ధి సాధించామని పేర్కొన్నారు. ముడి చమురు ధరలు బాగా తగ్గడం వల్ల ఈ స్థాయి లాభాలు వచ్చాయని వివరించారు. ఒక్కో షేర్‌కు రూ.24.5 డివిడెండ్‌ను ఇవ్వనున్నామని చెప్పారు. -
ఉద్యోగాలు
హిందూస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ హిందూస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్‌పీసీఎల్) కింద పేర్కొన్న ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఎక్స్పీరియన్స్డ్ ప్రొఫెషనల్స్ ఫర్ రిఫైనరీస్ విభాగాలు: కెమికల్, ఎలక్ట్రికల్, ఇన్స్ట్రుమెంటేషన్, మెకానికల్ పోస్టులు: ►డిప్యూటీ మేనేజర్ (మెడికల్ సర్వీసెస్) ►మెడికల్ ఆఫీసర్ ►పబ్లిక్ రిలేషన్స్/ మీడియా ఆఫీసర్ ►ప్యాకేజింగ్ అండ్ క్వాలిటీ కంట్రోల్ ఆఫీసర్ ► ఇండస్ట్రియల్ ఇంజనీర్స్ సేఫ్టీ ఆఫీసర్స్ ► చార్టర్డ్ అకౌంటెంట్స్ అర్హతలు: నోటిఫికేషన్లో పేర్కొన్న అర్హతలు ఉండాలి. ఆన్లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరి తేది: సెప్టెంబరు 16 వెబ్సైట్: www.hpclcareers.com అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా హైదరాబాద్‌లోని అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా ఫ్యాకల్టీ పోస్టుల నియామకానికి దరఖాస్తులు కోరుతోంది. విభాగాలు: ఎడ్యుకేషన్ స్టడీస్; స్ట్రాటజిక్ మేనేజ్మెంట్; అర్బన్ గవర్నెన్స్; టెక్నాలజీ పాలసీ, మేనేజ్మెంట్ అండ్ ఇన్నోవేషన్; పబ్లిక్ పాలసీ, గవర్నెన్స్ అండ్ పర్ఫార్మెన్స్; పావర్టీ స్టడీస్ అండ్ రూరల్ డెవలప్మెంట్. అర్హతలు తదితర పూర్తి వివరాలకు వెబ్సైట్ చూడవచ్చు. దరఖాస్తులకు చివరి తేది: ఆగస్టు 31 వెబ్సైట్: www.asci.org.in ఎక్స్పోర్ట్ - ఇంపోర్ట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎక్స్పోర్ట్ - ఇంపోర్ట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా - ముంబై ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఇతర వెనుకబడిన కులాల బ్యాక్లాగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. పోస్టులు: మేనేజర్ అసిస్టెంట్ మేనేజర్ డిప్యూటీ జనరల్ మేనేజర్ విభాగాలు: కార్పొరేట్ లోన్స్ అండ్ అడ్వాన్సెస్, ప్రాజెక్ట్/ ట్రేడ్ ఫైనాన్స్/ లైన్స్ ఆఫ్ క్రెడిట్ మేనేజర్ (లీగల్) డిప్యూటీ మేనేజర్ విభాగాలు: రాజభాష, హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్, అడ్మినిస్ట్రేషన్, మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్. అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ అర్హతలు తదితర పూర్తి వివరాలకు వెబ్సైట్ చూడవచ్చు. దరఖాస్తులకు చివరి తేది: సెప్టెంబరు 19 వెబ్సైట్: www.eximbankindia.in -
ఆంధ్రప్రదేశ్‌కే నా ఆప్షన్: డీజీపీ
సాక్షి, హైదరాబాద్: ‘‘1979లో ఐపీఎస్‌గా చేరినప్పుడు రాష్ట్రం విడిపోతుందని అనుకోలేదు. మంచి రాష్ట్రం ఇప్పుడు విడిపోతోంది. ఉమ్మడి రాష్ట్రానికి చివరి డీజీపీని కావడం బాధాకరంగా ఉంది. ఏదేమైనా ఇది ప్రజల అభీష్టం మేరకే జరుగుతోంది’’ అని రాష్ట్ర డీజీపీ డాక్టర్ బయ్యారపు ప్రసాదరావు అన్నారు. మిగిలిన సర్వీసు ఆంధ్రప్రదేశ్‌లో పని చేయడానికి ఆప్షన్ ఇచ్చానని తెలిపారు. తదుపరి ప్రభుత్వ ఉత్తర్వులు వచ్చే వరకు ఆ రాష్ట్రానికే డీజీపీగా కొనసాగుతానని అన్నారు. గురువారం ఆయన డీజీపీ కార్యాలయంలో పలు సంక్షేమ కార్యక్రమాలు ప్రారంభించారు. జిల్లాల నుంచి హైదరాబాద్‌కు వచ్చే పోలీసుల కోసం నిర్మించిన బ్యారెక్స్‌తో పాటు హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ విరాళంగా ఇచ్చిన ఫ్రీజర్లతో కూడిన రెండు అంబులెన్స్‌లను, కంటి చికిత్సా శిబిరాన్నీ ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పోలీసు అధికారుల సంఘం అధ్యక్షులకు 59 ల్యాప్‌టాప్‌లను పంపిణీ చేశారు. పోలీసు కుటుంబాలకు వివిధ రకాలైన శిక్షణలు ఇవ్వడానికి యూనిట్‌కు రూ.25 వేల చొప్పున మంజూరు చేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ, డీజీపీగా ఈ ఎనిమిది నెలల కాలం మంచి సంతృప్తినిచ్చిందని, ఈ సమయంలోనే ఉద్యమాలతో పాటు వరుసగా వచ్చిన ఎన్నికలనూ ఎలాంటి ఇబ్బందులూ లేకుండా పూర్తి చేశామని చెప్పారు. ఇరు ప్రాంతాల్లోనూ జరిగిన ఆందోళనల్లో ఎలాంటి ప్రాణనష్టం లేకుండా వ్యవహరించామన్నారు. అభివృద్ధిలో శాంతిభద్రతలది కీలకపాత్రని, వాటిని కాపాడే పోలీసులు ప్రజలతో మంచి సంబంధాలు కలిగి ఉండాలన్నారు. ఆంధ్రప్రదేశ్ పోలీసుకి దేశంలోనే మంచి పేరుందన్నారు. రెండు రాష్ట్రాల పోలీసులూ దీన్ని నిలబెట్టేలా కృషి చేయాలని చెప్పారు. కేంద్రం ఏర్పాటు చేసిన ప్రత్యూష్ సిన్హా కమిటీ సిఫార్సుల మేరకే ఐపీఎస్ అధికారుల విభజన ఉంటుందని, అప్పటి వరకు తెలంగాణలో పరిపాలన కోసం కేంద్ర హోమ్ మంత్రిత్వ శాఖ కొందరిని తాత్కాలికంగా కేటాయిస్తుందని తెలిపారు. రాష్ట్ర క్యాడర్ పోస్టుల విభజనకు కమలనాథన్ కమిటీ సిఫార్సులు రావాలని, అప్పటి వరకు ఎస్పీలు, డీఐజీలు, ఐజీలు ఎక్కడివారక్కడే పని చేస్తారన్నారు. కీలక పోస్టులైన సీఎస్, డీజీపీ, అదనపు డీజీపీ ఇంటెలిజెన్స్ తదితర పోస్టులతో మాత్రమే పాలన ప్రారంభమవుతుందన్నారు. ప్రస్తుతం పోలీసు విభాగంలో జరుగుతున్న కేటాయింపులన్నీ తాత్కాలికమైనవేనని, హైదరాబాద్‌లో పని చేస్తున్న వాళ్లు యథాతథంగా ఉంటారని డీజీపీ పేర్కొన్నారు. -
ఆయిల్ ఇండియా లాభం 26% డౌన్
న్యూఢిల్లీ: గతేడాది(2013-14) క్యూ4(జనవరి-మార్చి)లో ప్రభుత్వ రంగ దిగ్గజం ఆయిల్ ఇండియా నికర లాభం 26% క్షీణించి రూ. 566 కోట్లకు పరిమితమైంది. అంతక్రితం ఏడాది(2012-13) ఇదే కాలంలో రూ. 765 కోట్లను ఆర్జించింది. ఉత్పత్తి మందగించడం, సబ్సిడీ చెల్లింపులు పెరగడం లాభాలను ప్రభావితం చేసినట్లు కంపెనీ తెలిపింది. సబ్సిడీ చెల్లింపులు రూ. 1,850 కోట్ల నుంచి రూ. 2,348 కోట్లకు ఎగశాయి. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలకు డీజిల్, వంటగ్యాస్ విక్రయాలవల్ల వాటిల్లే ఆదా య నష్టాలకుగాను ఆయి ల్ ఉత్పత్తి సంస్థలు 48% వరకూ సబ్సిడీలు చెల్లిస్తాయి. ముడిచమురు ఉత్పత్తికిగాను బ్యారల్‌కు 106.55 డాలర్ల చొప్పున బిల్లింగ్ చేసినప్పటికీ, 69.19 డాలర్లమేర సబ్సిడీ ఇవ్వడంతో నికరంగా 37.36 డాలర్లు మాత్రమే లభించినట్లు కంపెనీ వివరించింది. గతంలో బ్యారల్‌కు 56 డాలర్ల సబ్సిడీ ఇచ్చినప్పటికీ నికరంగా 55.44 డాలర్లు ఆర్జించినట్లు తెలిపింది.