
పెట్రోలే కాదు.. పాలనూ అమ్ముతారు
పెట్రోల్ పంపుల్లో పెట్రోలు, డీజిల్‌తో పాటు పాలు, పాల ఉత్పత్తులను సైతం విక్రయించనున్నారు. ఈ నెల 26 నుంచి పూర్వపు వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల్లోని బంకుల్లో ముల్కనూర్ స్వకృషి డెయిరీ పాల అమ్మకాలను ప్రారంభించనుంది.
వరంగల్ అర్బన్ జిల్లా భీమ దేవరపల్లి మండలంలోని ముల్కనూర్ స్వకృషి డెయిరీలో బుధవారం హిందు స్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ అధికారులు, డెయిరీ అధికారులతో ఈ మేరకు ఒప్పందం కుదుర్చుకున్నారు.
– భీమదేవరపల్లి