బీజేపీ ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్
సాక్షి, న్యూఢిల్లీ : బీజేపీ ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్‌ను ఏడు రోజుల సీబీఐ కస్టడీకి తరలించారు. ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావ్లో ఓ యువతి(17)పై అత్యాచారానికి పాల్పడ్డ కేసులో ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్‌ను సీబీఐ అధికారులు శుక్రవారం అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అలాహాబాద్ హైకోర్టు ఉత్తర్వులతో సీబీఐ అధికారులు ఎమ్మెల్యేను అదుపులోకి తీసుకుని కొన్ని గంటలపాటు విచారన జరిపారు.
గతేడాది జూన్ 4వ తేదీన బాధితురాలు ఉద్యోగం కోసం ఎమ్మెల్యే ఇంటికి వెళ్లింది. కానీ నిందితుడు కుల్దీప్ సింగ్ యువతిపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఫిబ్రవరిలో బాధితురాలి కుటుంబసభ్యులు ఎమ్మెల్యేపై రేప్ కేసు పెట్టగా, యువతి తండ్రిని అక్రమంగా ఆయుధాలు ఇంట్లో ఉంచుకున్నాడని ఆరోపిస్తూ అరెస్ట్ చేశారు. చివరికి జైళ్లోనే లాకప్ డెత్ అయ్యాడు. దీంతో వివాదం పెద్దది కావడంతో ఎట్టకేలకు నిందితుడు కుల్దీప్ సింగ్‌ను అరెస్ట్ చేశారు.
కాగా, ఉన్నావ్ ఘటనలో దోషులు ఎంతవారైనా వదిలిపెట్టబోమని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ తెలిపారు. ఈ ఘటనపై ఇప్పటికే సిట్‌ను ఏర్పాటుచేశామన్న విషయం విదితమే.
Comments
Please login to add a commentAdd a comment