kuldeep singh
-
పంజాబ్‌లో ఉనికిలో లేని శాఖకు మంత్రి
చండీగఢ్: ప్రభుత్వంలో శాఖలకు మంత్రులుంటారు. అసలు ఉనికిలోనే లేని శాఖకు మంత్రులుంటారా? ఆమ్ ఆద్మీ పార్టి(ఆప్) ఏలుబడిలో ఉన్న పంజాబ్‌లో ఈ విచిత్రం చోటుచేసుకుంది. కుల్దీప్సింగ్ ధలీవాల్ పంజాబ్ పరిపాలన సంస్కరణల శాఖతోపాటు ప్రవాస భారతీయుల(ఎన్ఆర్ఐ) వ్యవహారాల శాఖ మంత్రిగా కూడా 21 నెలలు పనిచేశారు. నిజానికి పరిపాలన సంస్కరణల శాఖ అనేది లేనే లేదు. కానీ, ఆయన ఆ శాఖ మంత్రిగా చెలామణి అయ్యారు. కేబినెట్ పునర్వ్యస్థీకరణ సందర్భంగా ధలీవాల్‌కు 2023 మే నెలలో ఈ శాఖ అప్పగించారు. అయితే, పరిపాలన సంస్కరణల శాఖ మంత్రిగా ఆయనకు సిబ్బందిని కేటాయించలేదు. ఈ శాఖపై కనీసం ఒక్కసారి కూడా సమావేశం జరగలేదు. 21 నెలల తర్వాత పంజాబ్ సర్కారు అసలు విషయం గుర్తించింది. పరిపాలన సంస్కరణల శాఖ అనేది ఉనికిలో లేదని చెబుతూ ఒక గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ప్రస్తుతం కుల్దీప్సింగ్ ధలీవాల్ వద్ద ఎన్ఆర్ఐ వ్యవహారాల శాఖ ఒక్కటే మిగిలి ఉంది. ఈ మొత్తం వ్యవహారంపై ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. భగవంత్ మాన్ ప్రభుత్వ పాలన ఎలా ఉందో దీన్నిబట్టి అర్థం చేసుకోవచ్చని పేర్కొన్నాయి. భగవంత్ మాన్కు పరిపాలన రాదని బీజేపీ సీనియర్ నేత సుభాష్ శర్మ, శిరోమణి అకాలీదళ్ ఎంపీ హర్సిమ్రత్ కౌర్ బాదల్ విమర్శించారు. -
Viral Video: అబ్బో! ఇది బైకే, కాదు కాదు... కారే! అదేంటో మీరే చూడండి!
ఈ రోజుల్లో యువకులు వినూత్నంగా ఆలోచిస్తూ తమ బుర్రకు పదును పెడుతున్నారు. సరికొత్త ప్రయోగాలతో ఆకట్టుకుంటున్నారు. అంతేకాదు ఇన్స్టాగ్రాం, ఫేస్బుక్, యూట్యూబ్, ట్విట్టర్ వేదికగా తమ ఆలోచనలను షేర్ చేస్తున్నారు. ఏదో ఒకరకంగా తమ ప్రతిభను చాటుకుంటున్నారు. ఈ విధంగానే ఓ యువకుడు సరికొత్త ఆలోచనతో తనకున్న పల్సర్ బైక్రూపాన్నే మార్చేశాడు. అదేంటో మీరే చూసేయ్యండి!వాహనాలను కొత్తగా, కొద్దిగా చేర్పులతో సవరించేటువంటి వీడియోలను మీరు సోషల్ మీడియాలో ఇది వరకే చూసుంటారు. ఇది మాత్రం అందుకు భిన్నం. అది ట్రాక్టర్.. కాదు కాదు.. కారు. అసలే కాదు.. నాలుగు చక్రాల పల్సర్ బైకే! ప్రస్తుతం ఈ వీడియే సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.ఇటీవల ఈ వీడియో ఇన్స్టాగ్రామ్ ఖాతా @kuldeepsinghrawat2లో పోస్ట్ అయ్యింది. దీని ప్రకారం పల్సర్ బక్కు రెండు చక్రాలైతే, దీనికి మాత్రం నాలుగు చక్రాలను అమర్చాడు ఆ కుర్రాడు. ఆ బైక్ రోడ్డుపై కారులా మారి రయ్ రయ్‌మంటూ.. దూకినప్పుడు ఆ దృశ్యం చూసి తీరాల్సిందే. బజాజ్ కంపెనీకి చెందిన పల్సర్ బైక్‌కి.. స్పోర్ట్స్ కారు లుక్ అందించాడు. ఇందులో విశేషం ఏంటంటే? నాలుగు చక్రాలను అమర్చడంతో.. కాలు కింద పెట్టకుండా బైక్ బ్యాలెన్స్ చెదిరిపోకుండా ఉండడమే. సూపర్ కదూ!ఇవి చదవండి: క్రమంగా ఆన్లైన్ ఆటలకు అలవాటు పడ్డారో.. ప్రమాదమే! -
Unnao Case: నిందితుడికి బెయిల్ ఇవ్వొద్దని..రాష్ట్రపతికి, ప్రధానికి లేఖ
ఉన్నావ్ కేసు నిందితుడు బీజేపీ మాజీ ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ సెంగార్‌కు మధ్యంతర బెయిల్ మంజురైన సంగతి తెలిసిందే. నాటి ఉన్నావ్ అత్యాచార ఘటనలో ప్రాణాలతో బయటపడిన ఒక మహిళ దీన్ని వ్యతిరేకిస్తూ ప్రధాని నరేంద్ర మోదీకి, రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకి, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌లకు లేఖ రాసింది. వాస్తవానికి నిందితుడు, మాజీ ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ సెంగార్ తన కుమార్తె పెళ్లి కోసం తనను విడుదల చేయాలంటూ హైకోర్టుని ఆశ్రయించారు. అయితే అతను విడుదలైతే తమ ప్రాణాలకు ముప్పు ఉందని, అలాగే ఈ కేసుకు సంబంధించిన సాక్ష్యులను సైతం ప్రభావితం చేస్తాడని బాధిత మహిళ లేఖలో ఫిర్యాదు చేసింది. అతను జైలు వెలుపల ఉంటే తమకు అత్యంత ప్రమాదమని ఆ మహిళ పేర్కొంది. ఇదంతా సెంగార్ కుటుంబం పన్నిన కుట్ర అని కుమార్తె వివాహం పేరుతో బెయిల్‌పై విడుదలయ్యేందుకు ఆడుతున్న నాటకమని లేఖలో ఆరోపించింది. ఇదిలా ఉండగా, కుమార్తె వివాహానికి హాజరయ్యేలా ఢిల్లీ హైకోర్టు జనవరి 27 నుంచి ఫిబ్రవరి 10 వరకు పెరోల్‌పై సెంగార్‌ను విడుదల చేయాలని ఆదేశించడం గమనార్హం. మధ్యంతర విడుదలకు సంబంధించిన దరఖాస్తు తనకు అందలేదని ఫిర్యాదుదారు తరఫు న్యాయవాది మెహమూద్ ప్రాచా సోమవారం తెలియజేయడంతో, కోర్టు సెంగార్ తరపు న్యాయవాదిని కాపీని అందించాలని కోరింది. తదుపరి విచారణను జనవరి 19కి వాయిదా వేసింది. వాస్తవానికి కుల్దీప్ సింగ్ సెంగార్‌కి ఉన్నావ్ 2017 అత్యాచార ఘటనలో దోషిగా తేలడంతో ట్రయల్ కోర్టు జీవత ఖైదు శిక్ష విధించింది. దీన్ని సెంగార్ సవాలు చేస్తూ దాఖలు చేసిన అప్పీలు హైకోర్టులో పెండింగ్‌లో ఉంది. అదీగాక బాధితురాలి తండ్రి కస్టడీలో మరణించిన కేసులో కూడా సెంగార్‌కు, అతని సోదరుడు అతుల్ సింగ్ సెంగార్తో పాటు మరో ఐదుగురికి కూడా కోర్టు 10 ఏళ్ల జైలు శిక్ష విధించింది. (చదవండి: కాంగ్రెస్ తొలి జాబితా .. ఉన్నవ్ అత్యాచార బాధితురాలి తల్లికి టికెట్) -
మావోయిస్టుల ఇలాకాలో పోలీస్ బాస్‌లు
చర్ల: మావోయిస్టుల ఇలాకాగా పేరున్న ఛత్తీస్‌గఢ్‌కు సరిహ ద్దులోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలో తెలంగాణ డీజీపీ ఎం.మహేందర్‌రెడ్డి, సీఆర్పీఎఫ్ డీజీపీ కుల్దీప్ సింగ్ బుధవారం పర్యటించారు. ఈ సందర్భంగా చెన్నాపురం వద్ద సీఆర్పీఎఫ్ క్యాంపును వారు ప్రారంభించారు. హైదరాబాద్ నుంచి హెలీకాఫ్టర్ ద్వారా చెన్నాపురం చేరుకున్న వారు క్యాంపు పరిసరాలతో పాటు అధికారులు, సిబ్బందికి కల్పించిన వసతులను పరిశీలించారు. అదనపు డీజీపీ ఎస్.ఎస్.చతుర్వేది, సీఆర్పీఎఫ్ సౌత్ జోన్ అదనపు డీజీ నళిన్‌ప్రభాత్, సదరన్ సెక్టార్ ఐజీ మహేష్‌చంద్ర లడ్డా, కుంట డీఐజీ రాజీవ్‌కుమార్ ఠాకూర్, డీఐజీ ఎస్.ఎన్.మిశ్రా ఈ పర్యటనలో పాల్గొన్నారు. ప్రత్యేకంగా క్యాంపులు సీఆర్పీఎఫ్ క్యాంపు ప్రారంభించిన అనంతరం డీజీపీ మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ, నక్సల్స్ నిర్మూలన కోసం కేంద్ర హోం శాఖ, మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో బలగా లను పటిష్టం చేసేందుకు ప్రత్యేకంగా క్యాంపులను ఏర్పాటు చేస్తోందని తెలిపారు. ఇందులో భాగంగా చెన్నాపురం, పూసుగుప్ప, ఉంజుపల్లి, చెలిమల, తిప్పాపురం, కలివేరులో క్యాంపులు ఏర్పాటుచేయగా, జిల్లా పోలీసు యంత్రాంగం, సీఆర్పీఎఫ్ బలగాల సమన్వయంతో ఛత్తీస్‌గఢ్ – తెలంగాణ సరిహద్దుల్లో మావోయిస్టుల కదలికలపై నిఘా మరింత పటిష్టమవుతుందని వెల్లడించారు. కాగా, అమాయకపు ఆదివాసీ గిరిజనులపై దుశ్చర్యలకు పాల్పడుతున్న మావోయిస్టులు తెలంగాణలో ఆదరణ కోల్పోయారని మహేందర్‌రెడ్డి పేరొన్నారు. సీఆర్పీఎఫ్ డీజీపీ కుల్దీప్సింగ్ మాట్లాడుతూ మావోయిస్టులకు అడ్డుకట్ట వేయడంలో తెలంగాణ – ఛత్తీస్‌గఢ్ సరిహద్దు ప్రాంతాల పోలీసుల పనితీరు అభినందనీయమని తెలిపారు. -
రూ.21 వేల కోట్ల హెరాయిన్ స్మగ్లింగ్ కేసు.. సింగే కింగ్ పిన్
సాక్షి, అమరావతి: దేశంలో సంచలనం సృష్టించిన హెరాయిన్ దందా గుట్టు వీడింది! టాల్కం పౌడర్ పేరుతో అఫ్ఘనిస్తాన్ నుంచి గుజరాత్‌కు రూ.21 వేల కోట్ల హెరాయిన్ స్మగ్లింగ్ కేసులో కేంద్ర డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) కీలక పురోగతి సాధించింది. ఢిల్లీకి చెందిన కుల్దీప్సింగ్ ఈ డ్రగ్స్ రాకెట్లో కీలక సూత్రధారిగా డీఆర్ఐ దర్యాప్తు నివేదికలో పేర్కొంది. ఢిల్లీకి చెందిన మరొకరు కూడా ఇందులో కీలకపాత్ర పోషించినట్లు గుర్తించింది. కుల్దీప్సింగ్ చెన్నైకు చెందిన సుధాకర్ దంపతులకు కమీషన్ల ఎరవేసి స్మగ్లింగ్ దందాను నడిపి నట్లు నిర్ధారించింది. ఢిల్లీలో కేంద్రీకృతమైన ఈ ముఠా అంతర్జాతీయస్థాయిలో కొన్నేళ్లుగా మాదక ద్రవ్యాల స్మగ్లింగ్ దందా సాగిస్తున్నట్లు ఆధా రాలు సేకరించింది. హెరాయిన్ స్మగ్లింగ్ కేసును కేంద్ర ప్రభుత్వం జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ)కు అప్పగించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో డీఆర్ఐ ఇప్పటివరకు చేసిన దర్యాప్తు నివేదికను ఎన్ఐఏ కు సమర్పించింది. సింగే.. కింగ్ పిన్ అఫ్ఘనిస్తాన్ నుంచి భారీగా హెరాయిన్ స్మగ్లింగ్ దందాలో ఢిల్లీకి చెందిన కుల్దీప్ సింగే కింగ్ పిన్ అని డీఆర్ఐ నిర్ధారించింది. చెన్నైకు చెందిన సుధాకర్ దంపతులతోపాటు ఈ కేసులో అరెస్టు చేసిన ఆరుగురు అఫ్ఘన్ జాతీయులు, ఓ ఉజ్బెకిస్తాన్ జాతీయురాలి కాల్ డేటా, వాట్సాప్ చాటింగ్, మెయిల్స్‌ను డీఆర్ఐ అధికారులు పరిశీలించారు. కుల్దీప్ సింగ్ పేరుతో ఢిల్లీ నుంచి ఓ డాన్ స్మగ్లింగ్ దందా నడిపిస్తున్నట్లు డీఆర్ఐ గుర్తించింది. చాటింగ్‌లో కుల్దీప్సింగ్గా పేర్కొ న్నప్పటికీ మారుపేరుతో వ్యవహరించి ఉండవ చ్చని డీఆర్ఐ భావిస్తోంది. ఢిల్లీకి చెందిన ఓ వ్యాపారవేత్త కూడా డ్రగ్స్ దందాలో కీలక పాత్ర పోషించినట్లు డీఆర్ఐ అంచనాకు వచ్చింది. చదవండి: (బొగ్గు సంక్షోభంలో భారత్) వాట్సాప్ గ్రూప్ ద్వారా... డ్రగ్స్ స్మగ్లింగ్ కోసం కుల్దీప్ సింగ్ వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసుకున్నాడు. అంతా చాటింగ్ ద్వారా నడిపించాడు. అఫ్ఘనిస్తాన్ డ్రగ్స్ డీలర్ హాసన్ హుసేన్, చెన్నైకు చెందిన సుధాకర్ మధ్య జరిగిన వాట్సాప్ చాటింగ్ ఈ కేసులో కీలక అంశాలను వెల్లడించింది. తాను పంపిస్తున్న సరుకును ఢిల్లీలోని కుల్దీప్సింగ్కు చేర్చాలని సుధాకర్‌తో హాసన్ హుసేన్ పేర్కొనడం గమనార్హం. డబ్బిస్తేనే సరుకు పంపిస్తా.. ఈ ఏడాది జూన్ 6న టాల్కం పౌడర్ పేరుతో హెరాయిన్ గుజరాత్‌లోని ముంద్రా పోర్టుకు వచ్చిన విషయాన్ని హాసన్ హుసేన్ సుధాకర్‌కు చెప్పాడు. ఆ కన్సైన్మెంట్ ‘కుల్దీప్సింగ్, అలీపుర్, న్యూఢిల్లీ’ పేరున ఉంది. వాటిని ఢిల్లీ చేర్చేందుకు అషీ ట్రేడింగ్ కంపెనీకి చెందిన సుధాకర్ దిగుమతి చేసుకున్నాడు. ఈ సంద ర్భంగా వాట్సాప్ గ్రూప్‌లో సంభాషణలు డ్రగ్స్ దందాలో కీలక అంశాలను వెల్లడించాయి. తమ కంపెనీ పేరిట డ్రగ్స్ దిగుమతి చేసుకుంటు న్నందుకు సుధాకర్‌కు ఇవ్వాల్సిన కమీషన్‌ను కుల్దీప్ సింగ్ ఇంకా చెల్లించలేదు. దీంతో పోర్టులో ఆ సరుకును విడుదల చేసేందుకు సుధాకర్ సహకరించలేదు. ‘డబ్బులిస్తేనే సరుకు ఢిల్లీకి పంపించే ఏర్పాట్లు చేస్తా..’ అని సుధాకర్ చాటింగ్‌లో కుల్దీప్ సింగ్‌తో పేర్కొన్నట్లు డీఆర్ఐ గుర్తించింది. ఈ క్రమంలో కుల్దీప్సింగ్ రూ.4 లక్షలు సుధాకర్‌కు బదిలీ చేయడంతోపాటు మరో రూ.9 లక్షల నగదు హవాలా మార్గంలో చెల్లించాడు. అనంతరం ఆ హెరాయిన్ ముంద్రా పోర్టు నుంచి ఢిల్లీకి చేరింది. ఈ సమాచారం అంతా వాట్సాప్ గ్రూప్ చాటింగ్‌లో డీఆర్ఐ అధికారులు గుర్తించారు. చదవండి: (కోస్తాంధ్రకు మరో తుపాను!) స్మగ్లింగ్ ఫ్రంట్ ఆఫీస్‌గా ‘అషీ’ అఫ్ఘనిస్తాన్ నుంచి గుజరాత్ పోర్టు మీదుగా కొన్నేళ్లుగా స్మగ్లింగ్ దందా సాగుతోంది. చెన్నైకు చెందిన సుధాకర్ దంపతులు లక్షలు కమీషన్‌గా తీసుకుంటూ స్మగ్లింగ్ ఫ్రంట్ ఆఫీస్‌గా తమ అషీ ట్రేడింగ్ కంపెనీని వాడుకునేందుకు అనుమతిం చారని రూఢీ అయింది. అందుకోసమే విజయ వాడ చిరునామాతో అషీ ట్రేడింగ్ కంపెనీని రిజి స్టర్ చేశారు. హెరాయిన్ స్మగ్లింగ్ వ్యవహారంతో విజయవాడకుగానీ ఆంధ్రప్రదేశ్‌కుగానీ నేరుగా ఎలాంటి సంబంధం లేదని నిర్ధారించారు. అస లు హెరాయిన్ ఏపీకి రాలేదని వెల్లడైంది. ఢిల్లీ నుంచి దేశంలోని వివిధ ప్రాంతాలకు తరలిస్తూ భారీగా అక్రమ వ్యాపారం నిర్వహిస్తున్నారు. ఈ కేసులో సేకరించిన సమాచారంతో ముంబై, ఇతర మెట్రో నగరాల్లో డీఆర్ఐ దాడులు నిర్వహించి పెద్ద ఎత్తున హెరాయిన్‌ను స్వాధీనం చేసుకోవడం ఈ విషయాన్ని నిర్ధారి స్తోంది. డీఆర్ఐ అధికారులు ఏపీలో ఎలాంటి తనిఖీలుగానీ దాడులుగానీ నిర్వహించక పోవడం ప్రాధాన్యం సంతరించుకుంది. కొనసాగుతున్న వేట... స్మగ్లింగ్ దందాలో కింగ్ పిన్ కుల్దీప్ సింగ్ ఆచూకీ కోసం డీఆర్ఐ, ఎన్ఐఏ దర్యాప్తు ముమ్మరం చేశాయి. ఈ ఏడాది జూన్‌లో వచ్చిన హెరాయిన్ కన్సైన్మెంట్లో పేర్కొన్న కుల్దీప్ సింగ్ చిరునామా సరైంది కాదని తేలింది. ఉద్దేశపూర్వకంగానే తప్పుడు చిరునామా, ఫోన్ నంబర్లు ఇచ్చినట్లు వెల్లడైంది. వాట్సాప్ గ్రూప్‌లోని ఫోన్ నంబర్లు ఆధారంగా కేసు దర్యాప్తును వేగవంతం చేశారు. త్వరలోనే ఢిల్లీకి చెందిన కుల్దీప్ సింగ్ ఆచూకీ కనుగొంటామని డీఆర్ఐ వర్గాలు పేర్కొంటున్నాయి. -
ఉన్నావ్ కేసు : కుల్దీప్ సెంగార్‌కు పదేళ్ల జైలు
సాక్షి, న్యూఢిల్లీ : ఉన్నావ్ లైంగిక దాడి ఘటనలో బాధితురాలి తండ్రి హత్య కేసులో ఢిల్లీ కోర్టు బీజేపీ బహిష్కృత ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ సెంగార్‌కు పదేళ్ల జైలు శిక్ష విధించింది. సెంగార్‌కు శిక్షను ఖరారు చేస్తూ శుక్రవారం తీర్పు వెలువరించింది. కాగా దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ఉన్నావ్ హత్యాచారం కేసులో సెంగార్‌కు ఢిల్లీ కోర్టు జీవిత ఖైదు విధించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో దోషిగా తేలిన కుల్దీప్ సెంగార్‌కు జీవిత ఖైదు విధించడంతో పాటు బాధితురాలికి రూ.25లక్షల పరిహారం ఇవ్వాలని కోర్టు గత ఏడాది డిసెంబర్లో ఆదేశించింది. ఇక ఉన్నావ్ హత్యాచారం కేసు పలు మలుపులు తిరిగింది. బాధితురాలి కుటుంబంపై ఎన్నోమార్లు హత్యాయత్నం జరిగింది. బాధితురాలి తండ్రి హత్యకు గురయ్యారు. 2017లో కేసు నమోదు కాగా కుల్దీప్ సెంగార్‌కు గత ఏడాది చివర్లో శిక్ష ఖరారైంది. హత్యాచార ఉదంతంలో అప్పటి బీజేపీ ఎమ్మెల్యే కుల్దీప్ సెంగార్‌పై కిడ్నాప్, సామూహిక లైంగిక దాడి ఆరోపణలు వచ్చాయి. బాధితురాలి ఫిర్యాదు మేరకు కుల్దీప్ సెంగార్, అతనికి సహకరించిన శశిసింగ్పై పోక్సోతో పాటు పలు సెక్షన్ల కింద పోలీసులు కేసులు నమోదు చేశారు. చదవండి : సెంగార్‌కు జీవిత ఖైదు -
సెంగార్‌కు జీవిత ఖైదు
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించిన ఉన్నావ్ అత్యాచారం కేసులో బీజేపీ బహిష్కృత ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ సెంగార్‌కు ఢిల్లీ కోర్టు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. సెంగార్ తన తుది శ్వాస విడిచేవరకు జైలు జీవితం గడపాలని స్పష్టం చేసింది. ఢిల్లీ తీస్‌హజారీ కోర్టు జిల్లా న్యాయమూర్తి జస్టిస్ ధర్మేశ్ శర్మ శుక్రవారం తుది తీర్పు వెలువరించారు. నెల రోజుల్లోగా రూ.25 లక్షలు జరిమానా కూడా చెల్లించాలని సెంగార్‌ను ఆదేశించింది. జరిమానా చెల్లించకపోతే క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ప్రకారం యూపీ ప్రభుత్వమే ఆ మొత్తాన్ని కట్టాలని చెప్పారు. నష్ట పరిహారం కింద అదనంగా రూ.10 లక్షలు ఉన్నావ్ బాధితురాలి తల్లికి అందజేయాలని తీర్పులో పేర్కొన్నారు. నిందితుడిపై కాస్త కరుణ చూపాలన్న సెంగార్ తరఫు లాయర్ వాదనలను తోసిపుచ్చారు. ఎమ్మెల్యేగా ఉంటూ సెంగార్ ప్రజల విశ్వాసాలను దెబ్బ తీశారని, ఈ కేసు తీవ్రతను తగ్గించి చూడాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించారు. బాధితురాలికి, వారి కుటుంబ సభ్యుల ప్రాణాలకు హాని ఉందని, అందుకే వారి భద్రతపై ఎప్పటికప్పుడు సమీక్షించాలని సీబీఐని ఆదేశించారు. బాధితురాలు, ఆమె కుటుంబ సభ్యుల ప్రాణాలకు ఎలాంటి హాని కలగకుండా ఢిల్లీ మహిళా కమిషన్ పర్యవేక్షణలో ఏడాదిపాటు అద్దె ఇంట్లో ఉంచాలని న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. నెలకు రూ.15 వేల అద్దెను యూపీ సర్కారే భరించాలని స్పష్టం చేశారు. బాధితురాలి సాక్ష్యానికి మించింది లేదు: న్యాయమూర్తి సమాజంలో పలుకుబడి కలిగి, శక్తిమంతమైన ఒక వ్యక్తిపై బాధితురాలు చెప్పిన మాటలకు మించిన సాక్ష్యం మరేదీ ఉండదని న్యాయమూర్తి తీర్పు సందర్భంగా చెప్పారు. ఈ కేసులో సహ నిందితురాలు శశి సింగ్‌ను నిర్దోషిగా ప్రకటించారు. ఆమె కూడా సెంగార్ బాధితురాలేనని న్యాయమూర్తి స్పష్టం చేశారు. తీర్పు వెలువరించిన సమయంలో దోషి సెంగార్ కోర్టు హాలులోనే ఉన్నారు. న్యాయమూర్తి యావజ్జీవ కారాగార శిక్ష అనగానే ఆయన ఒక్కసారిగా భోరుమని విలపించారు. తన కుమార్తె, సోదరిని పట్టుకొని ఆయన కన్నీరు పెట్టుకున్నారు. మైనర్లపై అత్యాచార నేరానికి గాను పోక్సో చట్టం కింద మరణ శిక్ష విధించాలి కానీ, ఈ నేరం జరిగిన 2017లో ఆ చట్టానికి సవరణలు జరగలేదు. అందుకే సెంగార్‌కు కోర్టు జీవిత ఖైదు విధించింది. ఉరి శిక్ష విధించాల్సింది : బాధితురాలి సోదరి బీజేపీ బహిష్కృత ఎమ్మెల్యే కులదీప్ సెంగార్‌కు ఉరి శిక్ష విధించి ఉంటే బాగుండేదని బాధితురాలి సోదరి అన్నారు. అప్పుడే తమ జీవితాలు భద్రంగా ఉండేవని ఆమె పేర్కొన్నారు. ‘సెంగార్‌కు ఉరిశిక్ష విధిస్తే మాకు న్యాయం జరిగేది. అతను జైల్లో ఉన్నప్పటికీ అనుక్షణం భయపడ్డాం. సెంగార్ జైలు నుంచి బయటకు వస్తే మమ్మల్ని బతకనివ్వడు’ అని ఆందోళన వ్యక్తం చేశారు. నేరం జరిగిన సమాయానికి పోక్సో సవరణలు చేపట్టలేదు. దీంతో సెంగార్ మరణ శిక్ష నుంచి తప్పించుకున్నాడు. కిడ్నాప్, గ్యాంగ్‌రేప్, కస్టడీ డెత్.. ఉద్యోగం కోసం వెళ్లిన బాధితురాలిపై బీజేపీకి చెందిన ఎమ్మెల్యే సెంగార్ 2017 జూన్ 4వ తేదీన అత్యాచారానికి పాల్పడ్డాడు. సెంగార్ అనుచరులు ఆమెను కిడ్నాప్ చేసి గ్యాంగ్‌రేప్ చేశారు. ఫిర్యాదు చేసిన పోలీసులు పట్టించు కోలేదు. 2018 ఏప్రిల్‌లో బాధితురాలి తండ్రిపై దాడి జరిగింది. దీంతో బాధితురాలు ముఖ్యమంత్రి నివాసం ఎదుటే ఆత్మాహుతికి యత్నించింది. అనంతరం బాధితురాలి తండ్రి పోలీసు కస్టడీలోనే చనిపోయాడు. ప్రభుత్వం ఈ కేసును సీబీఐకి అప్పగించింది. సెంగార్‌ను సీబీఐ అరెస్ట్ చేíసినా బెదిరింపులు వస్తున్నాయంటూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి బాధితురాలు లేఖ రాసింది. ఆ తర్వాత ఆమె ప్రయాణిస్తున్న కారుని ఒక లారీ ఢీకొంది. దీంతో సుప్రీంకోర్టు ఇందుకు సంబంధించిన కేసులన్నిటి ఢిల్లీ కోర్టుకు మార్చాలని ఆదేశించింది. -
నేరానికి తగిన శిక్ష
అధికార మదంతో, తలపొగరుతో ఇష్టానుసారం చెలరేగే రాజకీయ నాయకుల వెన్నులో వణుకు పుట్టేలా ఉన్నావ్ అత్యాచార ఉదంతంలో బహిష్కృత బీజేపీ ఎమ్మెల్యే కులదీప్ సెంగార్‌కు ఢిల్లీ కోర్టు యావజ్జీవశిక్ష విధించింది. ఆయన తన శేష జీవితం మొత్తం జైల్లోనే గడపాలని, బాధితురాలికి రూ. 25 లక్షల జరిమానా చెల్లించాలని, మరో పది లక్షల రూపాయలు ఆమె తల్లికి ఇవ్వాలని శుక్రవారం తీర్పునిచ్చింది. ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావ్‌లో రెండేళ్లక్రితం జరిగిన ఈ అత్యాచార ఘటన దేశ వ్యాప్తంగా అలజడి రేపింది. చివరకు ఐక్యరాజ్యసమితి సైతం ఈ ఉదంతంపై ఆందోళన వ్యక్తం చేసి, నేరగాళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. ఉన్నావ్ బాధితురాలు పడిన వెతలు అన్నీ ఇన్నీ కాదు. ఆమెను అపహరించి పదిరోజులపాటు అత్యాచారం చేయడం మాత్రమే కాదు... అదేమని ప్రశ్నించిన పాపానికి ఆ ఇంటిల్లిపాదినీ సెంగార్, ఆయన అనుచరగణం భయభ్రాంతులకు గురిచేశారు. వారికి పనులు దొరక్కుండా చేశారు. ఆ కుటుంబంతో మాట్లాడా లంటే భయపడేలా ఊరు మొత్తాన్ని శాసించారు. అతగాడిపై కేసు పెట్టాలంటూ బాధితురాలు పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతుండగా ఎప్పటికప్పుడు ఆమె కుటుంబసభ్యులను బెదిరించడం, దౌర్జన్యం చేయడం వారికి నిత్యకృత్యంగా మారింది. తనను అపహరించారని, సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారని బాధితురాలు ఫిర్యాదు చేస్తే పోలీసులు మాత్రం అపహరించడం(ఐపీసీ సెక్షన్ 363), బలవంతంగా పెళ్లాడేందుకు ప్రయత్నించడం(ఐపీసీ 366) వంటి ఆరోపణలు మాత్రమే ఎఫ్ఐఆర్లో రాశారు. సెంగార్ సోదరుడు బాధితురాలి తండ్రిని తీవ్రంగా కొట్టి గాయపరిచినప్పుడు పోలీసులు ఆయన్ను ఆసుపత్రికి తరలించకుండా పోలీస్ లాకప్‌లో ఉంచారు. ఆలస్యంగా వైద్య చికిత్స అంద డంతో ఆయన రెండురోజులు నరకం అనుభవించి కన్నుమూశాడు. ఇక తానూ, తన కుటుంబం ఏకాకులమని, ఎవరి ఆసరా తమకు లభించే అవకాశం లేదని నిర్ధారణయ్యాక బాధితురాలు ముఖ్య మంత్రి యోగి ఆదిత్యనాథ్ నివాసగృహం సమీపంలో కిరోసిన్ పోసుకుని ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించింది. సెంగార్ సోదరుడు, మరికొందరు ఆమె తండ్రిపై దౌర్జన్యం చేయడం, నెత్తురు ముద్దలా మారిన ఆ వృద్ధుణ్ణి స్టేషన్లో కూర్చోబెట్టి పోలీసులు తాపీగా ప్రశ్నించడం వంటి దృశ్యాలు సామాజిక మాధ్యమాలకెక్కి అల్లరై జనం ఛీ కొట్టాకగానీ ఎమ్మెల్యే సోదరుణ్ణి అరెస్టు చేయలేదు. అటు తర్వాత ఈ కేసును రాష్ట్ర ప్రభుత్వం సీబీఐకి అప్పజెప్పింది. ఆ తర్వాతే కులదీప్ సెంగార్‌ను అరెస్టు చేశారు. ఈలోగా బాధితురాలి బాబాయ్‌పై తప్పుడు కేసులుపెట్టి జైలుకు పంపారు. ఉన్నావ్ ఉదంతం మన దేశంలో రాజ్యాంగమూ, చట్టమూ ఉన్నాయా అన్న సందేహాన్ని కలిగించింది. ఉన్నావ్ బాధితురాలు ఆ ఉదంతం జరిగేనాటికి మైనర్. 2012లో వచ్చిన పోక్సో చట్టం కఠినమైనది. మొన్న జూలైలో సవరణలు చేసి దాన్ని మరింత కఠినంగా మార్చి నేరగాళ్లకు ఉరిశిక్ష పడే నిబంధన తీసుకొచ్చారు. కానీ 2017లో ఆ చట్టం బాధితురాలికి ఏమాత్రం ఉపయోగపడలేదు. ఆ చట్టం ఉన్నా అది తమకు తెలియనట్టు, అసలు లేనట్టు పోలీసులు ప్రవర్తించారు. మన దగ్గరున్న సమస్య అదే. నేరగాళ్లు సాధారణ వ్యక్తులైతే ఒకలా, రాజకీయ పలుకుబడి గలవారైతే మరోలా వ్యవహరిస్తుండటం రివాజుగా మారింది. ఉన్నావ్‌లో అది పరాకాష్టకు చేరింది. మొన్న జూలైలో న్యాయస్థానంలో జరిగే విచారణలో పాల్గొనడానికి బాధితురాలి కుటుంబం కారులో వెళ్తుండగా ఒక ట్రక్కు దాన్ని ఢీకొట్టింది. ఇందులో ఆమె పిన్ని, మేనత్త మరణించారు. బాధితురాలు, న్యాయవాది గాయపడ్డారు. ఈ ఉదంతం తర్వాత బాధితురాలు నేరుగా అప్పటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయ మూర్తి రంజన్ గొగోయ్‌కి లేఖ రాశాక ఆయన జోక్యం చేసుకుని ఇందుకు సంబంధించిన కేసుల న్నిటినీ లక్నో న్యాయస్థానం నుంచి ఢిల్లీకి మార్చారు. రోజువారీ విచారించాలని, 45 రోజుల్లో పూర్తి చేయాలని నిర్దేశించారు. అటు తర్వాతే బీజేపీ సెంగార్‌ను పార్టీ నుంచి బహిష్కరించింది. నేరారోపణలొచ్చిన వ్యక్తి అధికార పక్ష నాయకుడైతే అధికార యంత్రాంగాన్ని కదిలించడం ఎంత కష్టమో, ఎంత ప్రాణాంతకమో ఉన్నావ్ బాధితురాలు, ఆమె కుటుంబం పడిన కష్టాలు గమనిస్తే బోధపడుతుంది. సెంగార్ ఆ రాష్ట్రంలోని ప్రధాన పార్టీలన్నిటిలోనూ పనిచేశాడు. ఎక్కడున్నా ఆయనపై ఆరోపణలు తరచు వస్తూనే ఉన్నాయి. బీజేపీలో చేరకముందు ఆయన బీఎస్పీ, సమాజ్ వాదీ పార్టీల్లో పనిచేశాడు. కానీ ఆయన ఓట్లు సాధించిపెట్టే బలమైన నాయకుడు గనుక ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఆయన అరాచకాలపై ఎవరూ నోరెత్తలేదు. దేశంలో, మరీ ముఖ్యంగా ఉత్తరా దిలో ఇలాంటివారే నాయకులుగా చలామణి అవుతున్నారు. ఉన్నావ్ బాధితురాలు రెండేళ్లపాటు ఒంటరి పోరు చేయాల్సి రావడం ఇందువల్లే. నేరం జరిగినప్పుడు వెంటవెంటనే వ్యవస్థలు కదలకపోయినా, ఆ నేరానికి తగిన శిక్ష పడకపోయినా సమాజంలో మరింతమంది నేరగాళ్లు పుట్టుకొస్తారు. ఏం చేసినా తమకేమీ కాదన్న ధైర్యంతో బరితెగిస్తారు. కనుక చట్టాలు కఠినంగా ఉండటం మాత్రమే సరిపోదు. అవి సత్వరం రంగంలోకి దిగాలి. అప్పుడే అందరిలోనూ చట్టాలంటే భయం ఏర్పడుతుంది. నిర్భయ ఉదంతం జరిగాక నియమించిన జస్టిస్ జేఎస్ వర్మ కమిటీ ఒక విలువైన మాట చెప్పింది. సమాజంలో నేరాలు అధికంగా అణగారిన వర్గాలు, మహిళలు, పిల్లలపైనే జరుగుతాయని, అందువల్ల వారి రక్షణకు ఉద్దేశించిన విభాగాలు ఎలా పనిచేస్తున్నాయో ఎప్పటి కప్పుడు తనిఖీలు నిర్వహిస్తుండాలని ఆ కమిటీ తెలిపింది. ఏ అధికారి అయినా, కింది స్థాయి సిబ్బంది అయినా అలసత్వం ప్రదర్శిస్తున్నట్టు తేలితే తక్షణం కఠిన చర్యలు తీసుకోవాలని సూచిం చింది. ఉన్నావ్ ఉదంతం దేశంలోని అన్ని ప్రభుత్వాలకూ గుణపాఠం కావాలి. చట్టాలు సమర్థ వంతంగా పనిచేసేలా, వ్యవస్థలు సత్వరం కదిలేలా తీర్చిదిద్దాలి. అప్పుడు మాత్రమే చట్టాలంటే భయభక్తులు ఏర్పడతాయి. -
ఉన్నావ్ కేసు: కుల్దీప్ సింగ్‌కు జీవితఖైదు
-
ఉన్నావ్ కేసు: కుల్దీప్ సింగ్‌కు జీవితఖైదు
సాక్షి, న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఉన్నావ్ అత్యాచార కేసులో ఢిల్లీ తీస్‌హజారీ కోర్టు శిక్షను ఖరారు చేసింది. ఈ కేసులో ఇప్పటికే దోషిగా తేలిన కుల్దీప్ సింగ్ సెంగార్‌కు న్యాయస్థానం జీవితఖైదు శిక్షను విధించింది. బాధిత కుటుంబానికి రూ. 25 లక్షల పరిహారం కూడా చెల్లించాలని కోర్టు ఆదేశించింది. ఈ మేరకు కేసును విచారించిన ధర్మాసనం శుక్రవారం సంచలన తీర్పును వెలువరించింది. తనను కిడ్నాప్ చేసి అత్యాచారం చేశారని కుల్దీప్ సింగ్ సెంగార్‌పై ఓ మైనర్ బాలిక పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. రెండేళ్ల క్రితం నమోదైన ఈ కేసుకు సంబంధించి రహస్య విచారణ చేపట్టారు. సీబీఐ వాదనలు పూర్తయిన తర్వాత ఘటనలో ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న కుల్దీప్సింగ్ సెంగార్‌ను ఈ నెల 16న దోషిగా తేల్చుతూ కోర్టు తీర్పును వెలువరించింది. అత్యాచారం (376) కింద ఆయనను దోషిగా కోర్టు నిర్థారించింది. బాలిక కిడ్నాప్.. అత్యాచారం.. బాధితురాలి తండ్రి లాకప్ మరణం.. ఆమె ప్రయాణిస్తున్న వాహనానికి ప్రమాదం.. వంటి మలుపులతో రెండేళ్లుగా నలుగుతున్న ఈ కేసులో ఎట్టకేలకు బాధితురాలికి న్యాయం జరిగింది. (సెంగార్‌కు ఉరే సరి) కాగా అభియోగాల నమోదుకు సుమారు పది రోజుల ముందు అత్యాచార బాధితురాలు ఓ కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడింది. ఈ ఏడాది జూలై 28న బాధితురాలు, ఆమె బంధువులు, న్యాయవాది ప్రయాణిస్తున్న కారును ఓ ట్రక్కు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బాధితురాలు గాయపడగా, ఆమె బంధువులిద్దరూ మరణించారు. న్యాయవాది కూడా తీవ్రంగా గాయపడ్డారు. ఇది సాధారణ ప్రమాదం కాదనీ, తనను అంతం చేసే ప్రయత్నంలో భాగంగానే జరిగిందని బాధితురాలు అప్పట్లో ఆరోపించింది. అప్పటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్‌కి బాధితురాలు ఈ పరిణామాలపై లేఖ రాసింది. దీంతో ఆయన స్పందించి ఇందుకు సంబంధించిన అన్ని కేసులను లక్నో నుంచి ఆగస్టు 1వ తేదీన ఢిల్లీకి బదిలీ చేశారు. రోజువారీ విచారణ జరిపి 45 రోజుల్లోగా పూర్తి చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. (‘ఉన్నావ్’ దోషి ఎమ్మెల్యేనే) సుప్రీంకోర్టు జోక్యంతో ఆగస్టు నుంచి రోజువారీ విచారణ చేపట్టింది. ఐపీసీ సెక్షన్ 120 బి (నేరపూరిత కుట్ర), 363 (కిడ్నాపింగ్), 366 (కిడ్నాప్, వివాహం చేసుకోవాలంటూ బలవంతం చేయడం), 376 (అత్యాచారం), పోక్సో చట్టంలోని ఇతర సెక్షన్ల కింద సెంగార్‌పై పోలీసులు కేసులు పెట్టారు. కాగా బీజేపీకి చెందిన కుల్దీప్ సింగ్ ఉన్నావ్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించాడు. ప్రస్తుతం ఆయన తీహార్ జైలులో ఉన్నాడు. -
సెంగార్‌కు ఉరే సరి
ఉన్నావ్/న్యూఢిల్లీ: ఉన్నావ్ అత్యాచారం కేసులో బీజేపీ బహిష్కృత ఎమ్మెల్యే కుల్దీప్ సెంగార్‌కు ఉరిశిక్ష విధించాలని బాధితురాలి తల్లి మంగళవారం డిమాండ్ చేశారు. మరో నిందితురాలు శశిసింగ్‌ను నిర్దోషిగా విడుదల చేయడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. రెండేళ్ల క్రితం యూపీలోని ఉన్నావ్‌లో ఓ మైనర్ బాలికను కిడ్నాప్ చేసి అత్యాచారం చేశారన్న కేసులో ఢిల్లీ కోర్టు సెంగార్‌ను సోమవారం దోషిగా నిర్ధారించిన విషయం తెలిసిందే. కోర్టు తీర్పుపై బాధితురాలి తల్లి మంగళవారం స్పందిస్తూ ‘‘శశిసింగ్‌ను ఎందుకు వదిలేశారు? ఉద్యోగమిస్తానని మాయమాటలు చెప్పి నా కూతురిని కుల్దీప్ సెంగార్ వద్దకు తీసుకెళ్లింది శశిసింగే’అని వాపోయారు. బాధితురాలి సమీప బంధువు ఇప్పటికీ జైల్లో ఉన్నారని, అతడు విడుదలయ్యేంత వరకూ తనకు న్యాయం దక్కనట్లేనని స్పష్టం చేశారు. దోషికి కఠినాతి కఠినమైన శిక్ష విధించాలని సీబీఐ వాదించగా ఈ అంశంపై తాను డిసెంబరు 20న తీర్పు వెలువరిస్తానని ఢిల్లీ జిల్లా న్యాయమూర్తి ధర్మేశ్ శర్మ ప్రకటించారు. (ఉన్నావ్’ దోషి ఎమ్మెల్యేనే) -
ఉన్నావ్ కేసులో ఎమ్మెల్యేనే దోషి
-
‘ఉన్నావ్’ దోషి ఎమ్మెల్యేనే
న్యూఢిల్లీ: నిర్భయ ఘటన తర్వాత అదే స్థాయిలో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఉన్నావ్ అత్యాచారం కేసులో కోర్టు తీర్పు వెలువరించింది. బాలిక కిడ్నాప్.. అత్యాచారం.. బా«ధితురాలి తండ్రి లాకప్ మరణం.. ఆమె ప్రయాణిస్తున్న వాహనానికి ప్రమాదం.. వంటి మలుపులతో రెండేళ్లుగా నలుగుతున్న ఈ కేసులో ఎట్టకేలకు బాధితురాలికి న్యాయం జరిగింది. సుప్రీంకోర్టు జోక్యంతో ఆగస్టు నుంచి రోజువారీ విచారణ చేపట్టిన తీస్‌హజారీ కోర్టు సోమవారం బీజేపీ బహిష్కృత ఎమ్మెల్యే కుల్దీప్సింగ్ సెంగార్‌ను దోషిగా తేల్చింది. ఈ కేసులో 19వ తేదీన శిక్ష ఖరారు చేయనున్నట్లు సోమవారం తెలిపింది. రెండేళ్లు.. అనూహ్య మలుపులు.. నిర్భయ ఘటనలో విచారణ జాప్యంపై వెల్లువెత్తిన ప్రజాగ్రహం ఒకవైపు, దిశ ఘటనతో దిగ్భ్రాంతికి గురైన సమాజం మరోవైపు ఉండగా ఉన్నావ్ ఘటనలో తాజా తీర్పు కొంత ఊరటనిచ్చింది. ఈ కేసులో సహ నిందితురాలు శశి సింగ్‌ను కోర్టు నిర్దోషిగా ప్రకటించింది. బాధిత బాలికను ఘటనా స్థలానికి తీసుకెళ్లింది శశి సింగే అయినప్పటికీ, అక్కడ అత్యాచారం జరుగుతుందన్న విషయం శశికి తెలియదని అభిప్రాయపడింది. సెంగార్ బాలికపై అత్యాచారానికి పాల్పడినట్టు సెల్‌ఫోన్ రికార్డు ఆధారంగా నిర్ధారించిన కోర్టు తీర్పును వెలువరించింది. బాధితురాలి ఆందోళన.. సోషల్ మీడియా.. 2017లో బాలికను కిడ్నాప్ చేసి, బీజేపీ బహిష్కృత ఎమ్మెల్యే సెంగార్ అత్యాచారానికి పాల్పడ్డాడు. దీనిపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. దీంతో ముఖ్యమంత్రి యోగి ఇంటి ఎదుట బాధితురాలు ఆందోళనకు దిగింది. ఆ తర్వాతే పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ తర్వాత బాధితురాలి తండ్రిపై ఎమ్మెల్యే సోదరుడు అతుల్ సెంగార్ దాడి చేశాడు. తీవ్రంగా గాయపడ్డ బాధితురాలి తండ్రిని పోలీసులు జైల్లో నిర్బంధించారు. రెండు రోజుల అనంతరం ఆయన కస్టడీలోనే మృతి చెందారు. తన తండ్రిపై ఎమ్మెల్యే సోదరుడు దాడి చేస్తున్న వీడియో క్లిప్పింగ్‌ని బాధితురాలు సోషల్ మీడియాలో పెట్టడంతో వైరల్ అయింది. ప్రజల్లో వ్యతిరేకత రావడంతో కేసును ప్రభుత్వం సీబీఐకి అప్పగించింది. ఆ తర్వాతే ప్రధాన నిందితుడు సెంగార్, మరో ఇద్దరిని అరెస్టు చేశారు. బీజేపీ నుంచి కుల్దీప్ సింగ్ బహిష్కరణ.. ఉత్తరప్రదేశ్‌లోని బంగేరుమావ్ నుంచి సెంగార్ నాలుగు పర్యాయాలు బీజేపీ తరఫున ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆరోపణల నేపథ్యంలో బీజేపీ ఆయన్ను ఆగస్టులో పార్టీ నుంచి బహిష్కరించింది. ఐపీసీ సెక్షన్ 120 బి (నేరపూరిత కుట్ర), 363 (కిడ్నాపింగ్), 366 (కిడ్నాప్, వివాహం చేసుకోవాలంటూ బలవంతం చేయడం), 376 (అత్యాచారం), పోక్సో చట్టంలోని ఇతర సెక్షన్ల కింద సెంగార్‌పై పోలీసులు కేసులు పెట్టారు. విచారణ ప్రక్రియ మొత్తాన్ని కెమెరాలో రికార్డు చేశారు. ఈ కేసులో ప్రధాన సాక్షులు బాధితురాలి తల్లి, మామ. కోర్టు తీర్పు అనంతరం బాధితురాలికి ప్రత్యేకంగాభద్రతను ఏర్పాటు చేశారు. బాధితురాలిని, ఆమె కుటుంబ సభ్యులను ప్రత్యేక వసతి గృహంలో ఉంచారు. కారు ప్రమాదంపై అనుమానాలు ఈ ఏడాది జూలై 28న బాధితురాలు, ఆమె బంధువులు, న్యాయవాది ప్రయాణిస్తున్న కారును ఓ ట్రక్కు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బాధితురాలు గాయపడగా, ఆమె బంధువులిద్దరూ మరణించారు. న్యాయవాది కూడా తీవ్రంగా గాయపడ్డారు. ఇది సాధారణ ప్రమాదం కాదనీ, తనను అంతం చేసే ప్రయత్నంలో భాగంగానే జరిగిందని బాధితురాలు అప్పట్లో ఆరోపించింది. లక్నో నుంచి ఢిల్లీ కోర్టుకు కేసు.. అప్పటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్‌కి బాధితురాలు ఈ పరిణామాలపై లేఖ రాసింది. దీంతో ఆయన స్పందించి ఇందుకు సంబంధించిన అన్ని కేసులను లక్నో నుంచి ఆగస్టు 1వ తేదీన ఢిల్లీకి బదిలీ చేశారు. రోజువారీ విచారణ జరిపి 45 రోజుల్లోగా పూర్తి చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. బాధితురాలి తండ్రిపై అక్రమ ఆయుధాల కేసు, ఆయన లాకప్ మరణం, బాధితురాలికి రోడ్డు ప్రమాదం, బాధితురాలిపై గ్యాంగ్ రేప్‌కి సంబంధించిన కేసుతో సహా మొత్తం నాలుగు కేసులపై విచారణ కొనసాగుతోంది. భోరుమన్న సెంగార్ ఈ కేసులో మధ్యాహ్నం మూడు గంటలకు కోర్టు తీర్పు వెలువడనుందని వెల్లడించగానే కోర్టు ఆవరణ ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారిపోయింది. కోర్టులోకి ఇరు పక్షాల న్యాయవాదులు మినహా ఎవ్వరినీ అనుమతించలేదు. సీబీఐని కొన్ని ప్రశ్నలడిగిన అనంతరం జిల్లా జడ్జి ధర్మేష్ శర్మ ఎమ్మెల్యే సెంగార్‌ను దోషిగా ప్రకటిస్తూ తీర్పునిచ్చారు. దీంతో సెంగార్, ఆయన కుమార్తెలు భోరున విలపించారు. సీబీఐకి కోర్టు అక్షింతలు ఈ ఘటనపై విచారణలో జాప్యానికి సీబీఐనే కారణమని కోర్టు పేర్కొంది. నిబంధనలకు విరుద్ధంగా పురుష అధికారులు వాంగ్మూలం తీసుకోవడం, విచారణ కోసం ఆమెను సీబీఐ కార్యాలయానికి పిలిపించు కోవడాన్ని తప్పుపట్టింది. -
ఉన్నావ్ కేసులో ఢిల్లీ కోర్టు తీర్పు
-
ఉన్నావ్ కేసులో ఢిల్లీ కోర్టు సంచలన తీర్పు
సాక్షి, న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఉన్నావ్ అత్యాచార కేసులో ఢిల్లీ తీస్‌హజారీ కోర్టు సంచలన తీర్పును వెలువరించింది. ఘటనలో ప్రధాన నిందితుడిగా ఉన్న బీజేపీ బహిష్కృత ఎమ్మెల్యే కుల్దీప్సింగ్ సెంగార్‌ను దోషిగా తేల్చింది. కేసుపై సుదీర్ఘంగా విచారించిన ధర్మాసనం సోమవారం తీర్పును వెలువరించింది. పోలీసులు నమోదు చేసిన సెక్షన్లపై కేసును విచారించిన ధర్మాసనం ఐపీసీ సెక్షన్ 376 (అత్యాచారం) కింద అతన్ని దోషిగా తేల్చింది. ఈ నెల 19న శిక్షను ఖరారు చేయనున్నట్లు న్యాయమూర్తి వెల్లడించారు. తనను కిడ్నాప్ చేసి అత్యాచారం చేశారని కుల్దీప్ సింగ్ సెంగార్‌పై ఓ మైనర్ బాలిక పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. రెండేళ్ల క్రితం నమోదైన ఈ కేసుకు సంబంధించి రహస్య విచారణ చేపట్టారు. సీబీఐ వాదనలు పూర్తయిన తర్వాత కోర్టు ఈ మేరకు తీర్పును వెలువరించింది. కాగా బీజేపీకి చెందిన కుల్దీప్ సింగ్ ఉన్నావ్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించాడు. ప్రస్తుతం ఆయన తీహార్ జైలులో ఉన్నాడు. ఈ ఏడాది ఆగస్టు 5వ తేదీ నుంచి న్యాయమూర్తి ధర్మేశ్ శర్మ ఈ కేసుపై రోజువారీ విచారణ చేపట్టిన విషయం తెలిసిందే. సుప్రీంకోర్టు చొరవతో ఈ కేసు లక్నో నుంచి ఢిల్లీ కోర్టుకు బదిలీ అయింది. 2017లో బీజేపీ ఎమ్మెల్యే కుల్దీప్ సెంగార్ ఓ బాలికను కిడ్నాప్ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఇందుకు సంబంధించి శశిసింగ్ అనే వ్యక్తిపై అభియోగాలు నమోదయ్యాయి కూడా. రెండేళ్ల తర్వాత ఈ ఏడాది ఆగస్టు 9న ఎమ్మెల్యేపై కూడా అభియోగాలు నమోదు కాగా బీజేపీ ఆయన్ను పార్టీ నుంచి బహిష్కరించింది. నేరపూరిత కుట్ర (120బీ), కిడ్నాప్ (363), పెళ్లికి బలవంత పెట్టడం (366), అత్యాచారం (376) తదితర అంశాలతోపాటు లైంగిక వేధింపుల నుంచి చిన్నారులకు రక్షణ కల్పించే చట్టం(పోక్సో) కింద ఆ ఇద్దరిపైనా కేసులు నమోదయ్యాయి. అభియోగాల నమోదుకు సుమారు పది రోజుల ముందు అత్యాచార బాధితురాలు ఓ కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడింది. ట్రాక్టర్ ఢీకొనడంతో బాధితురాలి సన్నిహిత బంధువులు ఈ ప్రమాదంలో మరణించారు. బాధితురాలి తండ్రిపై ఉత్తరప్రదేశ్‌లో ఓ హత్య కేసు, అక్రమంగా ఆయుధాలు కలిగి ఉన్నందుకు కేసు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు ఆగస్టు ఒకటిన ఈ కేసును ఢిల్లీ కోర్టుకు బదిలీ చేసింది. -
‘ఉన్నావ్’ తీర్పు నేడే?
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఉన్నావ్ అత్యాచారం కేసులో ఢిల్లీ కోర్టు సోమవారం తీర్పు వెలువరించే అవకాశముంది. ఓ బాలికను కిడ్నాప్ చేసి అత్యాచారం చేశారని బీజేపీ బహిష్కృత ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ సెంగార్ ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. రెండేళ్ల క్రితం నమోదైన ఈ కేసుకు సంబంధించి రహస్య విచారణ సందర్భంగా ఢిల్లీ కోర్టు న్యాయమూర్తి ధర్మేశ్ శర్మ 16వ తేదీన తీర్పు ఇవ్వనున్నట్లు కథనాలు వెలువడ్డాయి. సీబీఐ వాదనలు పూర్తయిన తర్వాత తీర్పు ఇచ్చే అవకాశముందని భావిస్తున్నారు. ఈ ఏడాది ఆగస్టు 5వ తేదీ నుంచి న్యాయమూర్తి ధర్మేశ్ శర్మ ఈ కేసుపై రోజువారీ విచారణ చేపట్టిన విషయం తెలిసిందే. సుప్రీంకోర్టు చొరవతో ఈ కేసు లక్నో నుంచి ఢిల్లీ కోర్టుకు బదిలీ అయింది. 2017లో బీజేపీ ఎమ్మెల్యే కుల్దీప్ సెంగార్ ఓ బాలికను కిడ్నాప్ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఇందుకు సంబంధించి శశిసింగ్ అనే వ్యక్తిపై అభియోగాలు నమోదయ్యాయి కూడా. రెండేళ్ల తర్వాత ఈ ఏడాది ఆగస్టు 9న ఎమ్మెల్యేపై కూడా అభియోగాలు నమోదు కాగా బీజేపీ ఆయన్ను పార్టీ నుంచి బహిష్కరించింది. నేరపూరిత కుట్ర (120బీ), కిడ్నాప్ (363), పెళ్లికి బలవంత పెట్టడం (366), అత్యాచారం (376) తదితర అంశాలతోపాటు లైంగిక వేధింపుల నుంచి చిన్నారులకు రక్షణ కల్పించే చట్టం(పోక్సో) కింద ఆ ఇద్దరిపైనా కేసులు నమోదయ్యాయి. అభియోగాల నమోదుకు సుమారు పది రోజుల ముందు అత్యాచార బాధితురాలు ఓ కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడింది. ట్రాక్టర్ ఢీకొనడంతో బాధితురాలి సన్నిహిత బంధువులు ఈ ప్రమాదంలో మరణించారు. బాధితురాలి తండ్రిపై ఉత్తరప్రదేశ్‌లో ఓ హత్య కేసు, అక్రమంగా ఆయుధాలు కలిగి ఉన్నందుకు కేసు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు ఆగస్టు ఒకటిన ఈ కేసును ఢిల్లీ కోర్టుకు బదిలీ చేసింది. విచారణ మొత్తం 45 రోజుల్లో పూర్తి చేయాలని అప్పటి ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ ఆదేశాలు జారీ చేశారు. నిర్భయ దోషులను నేను ఉరి తీస్తా హోంమంత్రికి షూటర్ వర్తికా సింగ్ రక్తంతో లేఖ లక్నో: నిర్భయ కేసులో దోషులను ఉరి తీసేందుకు తనకు అనుమతి ఇవ్వాలని కోరుతూ షూటర్ వర్తికా సింగ్ తన రక్తంతో రాసిన లేఖను కేంద్ర ప్రభుత్వానికి పంపారు. ఆదివారం ఆమె మాట్లాడుతూ.. ‘నా చేతిలో ఉన్న లేఖ హోంమంత్రి అమిత్‌షాకు రాశా. నా రక్తంతో రాసిన ఈ లేఖను రిజిస్టర్డ్ పోస్టులో ఆయనకు పంపా. నిర్భయ దోషులను ఉరి తీసేందుకు అనుమతి ఇవ్వాలని కోరా. భారత్‌లో మహిళలను దేవతలుగా చూసే సంస్కృతి బలోపేతానికి ఈ అంశం దోహదపడుతుంది. ఈ సందేశం ప్రపంచం మొత్తానికి వెళ్లాలి. అలాగే మహిళ కూడా ఉరి తీయగలదన్న విషయాన్ని అత్యాచార దోషులు తెలుసుకోవాలి. ట్వీట్ కూడా చేశా’అని తెలిపారు. మహిళా సైనికులు, మహిళా నటులు, ఎంపీలు, సంస్థలు తనకు మద్దతు తెలపాలన్నారు. మరోవైపు నిర్భయ దోషులను తాము ఉరి తీస్తామంటూ తీహార్ జైలు అధికారులకు దేశంలోని పలు ప్రాంతాల నుంచి విజ్ఞప్తులు వస్తున్నాయి. నిర్భయ కేసు దోషి ఒకరు దాఖలు చేసిన రివ్యూ పిటిషన్‌పై సుప్రీంకోర్టు మంగళవారం విచారించనుంది. నేర నిరూపణ 32 శాతమే! అత్యాచార ఘటనల్లో క్షేత్రస్థాయిలో లోపిస్తున్న శాస్త్రీయ విచారణ చార్జిషీటు దాఖలులోనూ అలసత్వం.. న్యూఢిల్లీ: సరిగ్గా ఏడేళ్ల క్రితం దేశ రాజధాని ఢిల్లీ నడిబొడ్డున జరిగిన అత్యంత పాశవికమైన నిర్భయ ఘటన ఇప్పటికీ దేశ ప్రజల గుండెల్లో పచ్చి పుండులాగే ఉంది. దేశంలో ఎన్నో నిర్భయ లాంటి సంఘటనలు జరుగుతున్నా.. నిందితులపై నేర నిరూపణ మాత్రం జరగట్లేదు. నిర్భయ ఘటన తర్వాత మహిళలపై అత్యాచారాలకు సంబంధించి కఠినమైన చట్టాలు తీసుకొచ్చినా నిందితులకు మాత్రం శిక్షలు అమలు కావట్లేదు. దేశవ్యాప్తంగా ఇలాంటి ఘటనల్లో 32.2 శాతం మాత్రమే నేర నిరూపణ జరుగుతోందని నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో–2017 డేటా ప్రకారం తెలుస్తోంది. 2017లో దేశవ్యాప్తంగా మొత్తం 1,46,201 కేసుల్లో విచారణ చేపట్టగా, కేవలం 5,822 కేసుల్లోనే నేర నిరూపణ జరిగింది. అత్యాచార ఘటనలు పెరుగుతున్నా.. చార్జిషీటు దాఖలు రేటు మాత్రం తగ్గుతోంది. అంతేకాకుండా కోర్టు వరకు చాలా కేసులు వెళ్లకపోవడం మరింత ఆందోళన చెందాల్సిన విషయం. చార్జిషీటు దాఖలు రేటు 2013లో 95.4 శాతం ఉండగా, 2017 వచ్చేసరికి 86.6 శాతానికి తగ్గింది. ఒడిశా మాజీ డీజీపీ బీబీ మహంతీ.. ఓ విదేశీ పర్యాటకురాలిని అత్యాచారం చేసిన కేసులో డిఫెన్స్ లాయర్ శిల్పి జైన్ మాట్లాడుతూ.. క్షేత్రస్థాయిలో విచారణ చేపడుతున్న పోలీసు అధికారుల్లో నైపుణ్యత పెరగాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ‘చార్జి షీటు దాఖలు చేసే విషయంలో సబ్ఇన్స్పెక్టర్దే కీలక పాత్ర. అంటే ఆ చార్జిషీటు విషయం ఎంత శాస్త్రీయంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు’అని పేర్కొన్నారు. జిల్లా స్థాయిలో ఈ కేసులను చేపట్టే న్యాయవాదుల పరిస్థితి ఇలాగే ఉందని చెప్పారు. విచారణ సరిగ్గా జరపకపోవడం, కోర్టులో కేసులు నిలవకపోవడం వల్లే నేర నిరూపణ శాతం చాలా తక్కువగా ఉంటోందని ఆవేదన వ్యక్తం చేశారు. -
ఉన్నావ్ తీర్పుకు సర్వం సిద్ధం..
సాక్షి, న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఉన్నావ్ అత్యాచార ఘటనపై తుది తీర్పు వెల్లడించేందుకు ఢిల్లీ హైకోర్టు సిద్ధమైంది. రేపు (సోమవారం) ఉదయం 10 గంటల తరువాత ఉన్నావ్ అత్యాచార కేసుపై తీర్పును వెల్లడించనుంది. కేసులో పూర్తి వాదనలు విన్న ధర్మాసనం తీర్పును రిజర్వ్‌లో ఉంచింది. ఈ నెల 16న తీర్పు వెలువరిస్తామని హైకోర్టు జడ్జి జస్టిస్ ధర్మేశ్ శర్మ తెలిపారు. ఈ కేసులో బీజేపీ ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ సెంగార్ ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ ఘటన దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది. దీంతో కోర్టు తీర్పుపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. కాగా 2017లో కుల్దీప్ సెంగార్ తనపై అత్యాచారం చేశాడని 2018లో ఉన్నావ్‌కు చెందిన యువతి ఆరోపించగా, పోలీసులు ఆమె తండ్రినే అరెస్టు చేసి లాకప్‌లోనే ఆయన చనిపోయేలా చేయడం తెలిసిందే. బాధిత యువతి తన ఇద్దరు సమీప బంధువులు, లాయర్‌తో కలిసి కారులో ప్రయాణిస్తుండగా, ఆ కారును ట్రక్కుతో ఢీకొట్టి వారందరినీ చంపే ప్రయత్నం జరిగింది. యువతి బంధువులైన ఇద్దరు మహిళలు మరణించగా, యువతి, ఆమె లాయర్ తీవ్ర గాయాలపాలై.. తృటిలో తప్పించుకున్నారు. ప్రమాద ఘటనపై విచారణన చేపట్టిన సీబీఐ, 10 మందిపై హత్యానేరం మోపింది. కాగా కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న వ్యక్తులు సాక్షాలను తారుమారు చేసే అవకాశం ఉందని భావించిన సుప్రీంకోర్టు ధర్మాసనం.. అత్యాచార ఘటనకు సంబంధించి ఉత్తర ప్రదేశ్‌లో ఉన్న ఐదు కేసులనూ ఢిల్లీ ట్రయల్ కోర్టుకు బదిలీ చేయాలని గత ఆగస్ట్‌లో సుప్రీం ఆదేశించిన విషయం తెలిసిందే. బాధితురాలి ఫిర్యాదు మేరకు ఐపీసీ సెక్షన్ 120 బీ (క్రిమినల్ కుట్ర), 363 కిడ్నాప్, 376 అత్యాచారం, పోక్సో చట్టం వంటి వివిధ సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న సెంగార్‌ను బీజేపీ ఇదివరకే పార్టీ నుంచి బహిష్కరించిన విషయం తెలిసిందే. -
హమ్మయ్య.. ఆమె క్షేమంగా ఉంది
న్యూఢిల్లీ: రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఉన్నావ్ అత్యాచార బాధితురాలు కోలుకుంటోందని, ప్రాణాపాయం లేదని ఎయిమ్స్ వైద్యులు వెల్లడించారు. ఆమెను ఐసీయూ నుంచి సాధారణ వార్డుకు తరలించారు. ఉన్నావ్ అత్యాచార బాధితురాలు ప్రయాణిస్తున్న కారును ఓ ట్రక్కు జూలై 28న ఢీనడంతో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు బంధువులు మరణించగా, బాధితురాలు, ఆమె లాయర్ తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. బాధితురాలికి మెరుగైన వైద్యం అందించాలన్న సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు ఆమెను ఇటీవల లక్నో ఆసుపత్రి నుంచి న్యూఢిల్లీలోని ఎయిమ్స్‌కు తరలించారు. ఈ ప్రమాదంపై దర్యాప్తు చేపట్టిన సీబీఐ సోమవారం బాధితురాలి స్టేట్మెంట్ను రికార్డు చేసింది. ఆమె లాయర్ ఇంకా కోలుకోకపోవడంతో అతడి వాంగూల్మాన్ని సీబీఐ ఇంకా తీసుకోలేదు. ఈ కేసులో నివేదికను ఈనెల 6న సుప్రీంకోర్టుకు సీబీఐ సమర్పించనుంది. బాధితురాలిని, ఆమె లాయర్‌ను రోడ్డు ప్రమాదంలో అంతం చేసేందుకు కుట్ర పన్నారన్న ఆరోపణలపై యూపీ బీజేపీ ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ సెంగార్, ఆయన అనుచరులు 30 మందిపై సీబీఐ కేసు నమోదు చేసింది. అయితే బాధితురాలు కానీ, కుల్దీప్ సెంగార్ కానీ తనకు తెలియదని ఈ కేసులో పట్టుబడిన ట్రక్కు డ్రైవర్ సీబీఐకి ఇచ్చిన వాంగ్మూలంలో పేర్కొన్నాడు. దీనికి ముందు 2017లో రెండు వేర్వేరు సందర్భాల్లో కుల్దీప్ సెంగార్, ముగ్గురు వ్యక్తులు తనపై అత్యాచారం చేసినట్టు బాధితురాలు అప్పట్లో ఫిర్యాదు చేసింది. ఈ కేసులో గత ఏడాది ఏప్రిల్ నుంచి కుల్దీప్ సింగార్ జైలులో ఉన్నారు. అత్యాచార బాధితురాలి తండ్రిని గత ఏడాది ఏప్రిల్ 3న అరెస్టు చేయగా, ఏప్రిల్ 9న జ్యుడిషియల్ కస్టడీలో అనుమానాస్పద స్థితిలో మరణించాడు. (చదవండి: 'ఉన్నావ్' నువ్వు తోడుగా) -
‘కుల్దీప్‌కిది కష్టకాలం.. తోడుగా నిలవాలి’
లక్నో: నియోజకవర్గ ప్రజలను కాపాడాల్సింది పోయి.. తానే వారి పాలిట కాలయముడిగా మారాడు. సాయం కోసం వచ్చిన బాలికపై అత్యాచారం చేశాడు. పోలీసులకు ఫిర్యాదు చేసినందుకు ఆమె తండ్రిని చంపేశాడు. చివరికి బాధితురాలిని కూడా చంపేందుకు ప్రయత్నించాడు. బాధితురాలు ప్రయాణిస్తున్న కారుకు యాక్సిడెంట్ చేయించడంతో.. ప్రసుత్తం ఆమె చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. ఉన్నావ్ అత్యాచార బాధితురాలి యాక్సిడెంట్ పట్ల దేశవ్యాప్తంగా నిరసన వ్యక్తమవుతుంటే.. నాయకులు మాత్రం ఇంకా కళ్లు తెరవడం లేదు. నిందితుల తరఫున వకాల్తా పుచ్చుకుని అడ్డగోలు వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఉత్తరప్రదేశ్‌కు చెందిన బీజేపీ నాయకుడు ఆశిష్ సింగ్ అషు.. వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఉన్నావ్‌లో నిర్వహించిన ఓ కార్యక్రమానికి హాజరైన ఆశిష్ సింగ్ మాట్లాడుతూ.. ‘మన సోదరుడు కుల్దీప్ సింగ్ నేడు మన మధ్యలో లేకపోవడం బాధాకరం. ప్రస్తుతం కుల్దీప్ క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. ఈ సమయంలో మనం అన్నకు తోడుగా ఉండాలి. త్వరలోనే కుల్దీప్ ఈ కష్టాల నుంచి బయటపడతారని ఆశిస్తున్నాను. మనం ఎక్కడ ఉన్నా కుల్దీప్ క్షేమం గురించి ఆలోచించాలి’ అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అయితే ఆశిష్ వ్యాఖ్యల పట్ల ప్రతిపక్షాలతో పాటు మహిళా సంఘాలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ‘ఆడపిల్లకు అన్యాయం చేసి చంపడానికి చూసిన వాడిని వెనకేసుకు వస్తున్నారు. మీలాంటి నాయకుల ఉండటం మా ఖర్మ’ అంటూ జనాలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉన్నావ్ అత్యాచార బాధితురాలు ప్రయాణిస్తున్న కారు రోడ్డు ప్రమాదానికి గురికావడంతో ప్రతిపక్షాలు పార్లమెంట్లో బీజేపీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడిన సంగతి తెలిసిందే. దీంతో బీజేపీ కుల్దీప్పై చర్యలకు సిద్ధపడింది. అతడిని పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్టు బీజేపీ అధిష్టానం గురువారం ప్రకటించిన సంగతి తెలిసిందే. -
ఇక ఢిల్లీలో ‘ఉన్నావ్’ విచారణ
న్యూఢిల్లీ: ఉన్నావ్ అత్యాచార ఘటనకు సంబంధించి నమోదైన మొత్తం ఐదు కేసులనూ ఉత్తరప్రదేశ్ నుంచి ఢిల్లీకి బదిలీ చేయాలని సుప్రీంకోర్టు గురువారం ఆదేశించింది. అలాగే బాధితురాలికి తక్షణమే రూ. 25 లక్షల తాత్కాలిక పరిహారం అందజేయాలని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాన్ని నిర్దేశించింది. గత ఆదివారం ఉన్నావ్ అత్యాచార బాధితురాలి కారును ట్రక్కు ఢీకొట్టిన ఘటనపై దర్యాప్తును వారం రోజుల్లోనే పూర్తి చేయాలని కూడా సీబీఐకి సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. అలాగే ఉన్నావ్ అత్యాచర ఘటన ప్రధాన కేసు విచారణను ప్రారంభించిన నాటి నుంచి 45 రోజుల్లోపే పూర్తి చేయాలని కూడా సీబీఐని సుప్రీంకోర్టు ఆదేశించింది. మరోవైపు అత్యాచారం చేసిన బీజేపీ ఎమ్మెల్యే కుల్దీప్ సెంగార్‌ను తమ పార్టీ నుంచి బీజేపీ బహిష్కరించింది. కాగా, బాధితురాలికి భద్రత కల్పించడంలో నిర్లక్ష్యం వహించినందుకు ఆమె భద్రత కోసం గతంలో కేటాయించిన ముగ్గురు పోలీస్ సిబ్బందిని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం సస్పెండ్ చేసింది. కానీ ఇది సరిపోదనీ, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, డీజీపీ ఓపీ సింగ్ రాజీనామా చేయాలని ప్రతిపక్ష సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) డిమాండ్ చేస్తోంది. 2017లో కుల్దీప్ సెంగార్ తనపై అత్యాచారం చేశాడని 2018లో ఉన్నావ్‌కు చెందిన యువతి ఆరోపించగా, పోలీసులు ఆమె తండ్రినే అరెస్టు చేసి లాకప్‌లోనే ఆయన చనిపోయేలా చేయడం తెలిసిందే. బాధిత యువతి గత ఆదివారం తన ఇద్దరు సమీప బంధువులు, లాయర్‌తో కలిసి కారులో ప్రయాణిస్తుండగా, ఆ కారును ట్రక్కుతో ఢీకొట్టి వారందరినీ చంపే ప్రయత్నం జరిగింది. యువతి బంధువులైన ఇద్దరు మహిళలు మరణించగా, యువతి, ఆమె లాయర్ తీవ్ర గాయాలపాలై ప్రస్తుతం లక్నోలోని వైద్యశాలలో చికిత్స పొందుతున్నారు. ప్రమాద ఘటనపై విచారణను ఇప్పటికే ప్రారంభించిన సీబీఐ, 10 మందిపై హత్యానేరం మోపింది. సత్వర విచారణ కోసం ఏకపక్ష ఆదేశాలు ఉన్నావ్ అత్యాచార కేసు పరిస్థితులు, అసాధారణ వాస్తవాలను దృష్టిలో పెట్టుకుని, విచారణను వేగవంతం చేసే ఉద్దేశంతో నిందితుల తరఫు వాదనలు వినకుండానే తాము ఏకపక్ష ఆదేశాలు ఇస్తున్నట్లు సుప్రీంకోర్టు వెల్లడించింది. ఒకవేళ ఏవైనా అసాధారణ పరిస్థితులు ఉంటే మాత్రమే ప్రమాద ఘటనపై దర్యాప్తును ముగించేందుకు సీబీఐకి అదనంగా మరో వారం రోజులపాటు గడువు ఇస్తామని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్, జస్టిస్ దీపక్ గుప్తా, జస్టిస్ అనిరుద్ధ బోస్‌ల ధర్మాసనం వెల్లడించింది. అన్ని కేసులనూ ఢిల్లీలోని తీస్ హజారీ కోర్ట్స్లోని జడ్జి ధర్మేశ్ శర్మ విచారిస్తారని చెప్పింది. ఓ రహస్య సమావేశం అనంతరం సుప్రీం జడ్జీలు ధర్మేశ్ శర్మ పేరును ఖరారు చేశారు. ఈ ఆదేశాలను మార్చాలని లేదా రద్దు చేయాలని వచ్చే ఏ పిటిషన్‌నూ విచారణకు స్వీకరించబోమంది. కుల్దీప్పై బీజేపీ వేటు ఉన్నావ్ ఘటనపై దేశవ్యాప్తంగా నిరసనలు, బీజేపీపై విమర్శలు వస్తుండటంతో ఈ కేసులో ప్రధాన నిందితుడు, ఎమ్మెల్యే కుల్దీప్ సెంగార్‌ను బీజేపీ తమ పార్టీ నుంచి బహిష్కరించింది. బీజేపీ యూపీ అధ్యక్షుడు స్వతంత్ర దేవ్ సింగ్ ఈ విషయాన్ని ప్రకటించారు. కుల్దీప్ను బహిష్కరించాలని బీజేపీ కేంద్ర నాయకత్వం నిర్ణయం తీసుకుందనీ, ఆ విషయాన్ని ప్రకటించాల్సిందిగా బీజేపీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జేపీ నడ్డా స్వతంత్ర సింగ్‌కు ఫోన్లో చెప్పారని పార్టీ వర్గాలు తెలిపాయి. కుల్దీప్ ఇప్పటికే జైల్లో ఉన్నారు. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ మాట్లాడుతూ బీజేపీలో ఓ నేరస్తుడికి అధికారం ఇచ్చినట్లు ఎట్టకేలకు ఆ పార్టీ ఒప్పుకుందన్నారు. -
ఉన్నావ్ ఘటన : సుప్రీం కీలక ఆదేశాలు
సాక్షి, న్యూఢిల్లీ : ఉన్నావ్ అత్యాచార ఘటనపై సుప్రీం కోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. అత్యాచార బాధితురాలికి మధ్యంతర పరిహారంగా రూ.25 లక్షలు చెల్లించాలని ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ మొత్తం శుక్రవారం వరకు అందజేయాలని స్పష్టం చేసింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాలికి, ఆమె తరపు న్యాయవాదికి, ఆమె కుటుంబానికి రాయ్‌బరేలీ సీఆర్పీఎఫ్ యూనిట్ భద్రత కల్పించాలని సీజేఐ రంజన్ గగోయ్ నేతృత్వంలోని బెంచ్ వెల్లడించింది. కాగా, బాధితురాలు ప్రయాణిస్తున్న వాహనం జూలై 28న ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. (చదవండి : ఒక్క కేసు; ఎన్నో ట్విస్ట్‌లు!) ఈ ఆక్సిడెంట్లో బాధిత యువతి బంధువులు ఇద్దరు మరణించగా, బాధితురాలితోపాటు ఆమె న్యాయవాది కూడా తీవ్రగాయాలపాలయ్యారు. వెంటిలేటర్‌పై ఉత్తరప్రదేశ్‌లోని కింగ్ జార్జి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మెరుగైన చికిత్స అవసరమైన పక్షంలో యువతిని ఢిల్లీ ఎయిమ్స్‌కు తరలించాలని కోర్టు చెప్పింది. ప్రమాదానికి గల కారణాలను 14 రోజుల్లోగా తేల్చాలని అత్యున్నత న్యాయస్థానం సీబీఐని ఆదేశించింది. అత్యాచార ఘటనకు సంబంధించి ఉత్తర ప్రదేశ్‌లో ఉన్న ఐదు కేసులనూ ఢిల్లీ ట్రయల్ కోర్టుకు బదిలీ చేయాలని సుప్రీం ఆదేశించింది. 45 రోజుల్లో కేసుల విచారణ పూర్తి చేయాలని స్పష్టం చేసింది. తదుపరి వాదనలు శుక్రవారానికి వాయిదా వేసింది. ఇక ఈ కేసులో నిందితుడు, ఎమ్మెల్యే కుల్దీప్సింగ్ సెంగార్‌ను పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్టు బీజేపీ తెలిపింది. -
సెంగార్‌పై వేటు వేసిన బీజేపీ
న్యూఢిల్లీ : ఉన్నావ్ అత్యాచార బాధితురాలు ప్రయాణిస్తున్న కారు రోడ్డు ప్రమాదానికి గురికావడంతో.. ఈ కేసు దేశవ్యాప్తంగా మరోసారి చర్చనీయాశంగా మారింది. ఈ ఘటనలో బాధిత యువతి బంధువులు ఇద్దరు మరణించగా, బాధితురాలితోపాటు ఆమె న్యాయవాది కూడా తీవ్రగాయాలపాలయ్యారు. ప్రమాదం పేరుతో బాధితురాలిని హతమార్చేందుకు బీజేపీ ఎమ్మెల్యే కుల్దీప్సింగ్ సెంగార్ ఇదంతా చేయించారన్న ఆరోపణలు రావడంతో ఆయనతో పాటు మరో 10 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై ప్రతిపక్షాలు పార్లమెంట్లో బీజేపీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నాయి. అంతేకాకుండా సెంగార్‌ను బీజేపీ నుంచి బహిష్కరించాలని పెద్ద ఎత్తున డిమాండ్లు వినిపిస్తున్నాయి. దీంతో బీజేపీ సెంగార్‌పై చర్యలకు ఉపక్రమించింది. సెంగార్‌ను పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్టు బీజేపీ అధిష్టానం గురువారం ప్రకటించింది. కొద్ది రోజుల కిందట సెంగార్‌ను పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్టు తెలిపిన బీజేపీ.. ఆ నిర్ణయం ఎప్పుడు తీసుకున్నది మాత్రం వెల్లడించలేదు. కాగా, ఈ కేసు విషయంలో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ వైఖరిని సుప్రీం కోర్టు తప్పుపట్టిన కొన్ని గంటల్లోనే బీజేపీ సెంగార్‌ను బహిష్కరిస్తున్నట్టు ప్రకటించడం గమనార్హం. మరోవైపు బాధితురాలు రోడ్డు ప్రమాదానికి గురికావడంపై సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కాగా, సెంగార్ ఇంటికి ఉద్యోగం కోసం వెళ్లిన తనపై ఆయన లైంగిక దాడికి పాల్పడ్డారని ఉన్నావ్ అత్యాచార బాధితురాలు ఆరోపించారు. ఎమ్మెల్యేపై చర్యలు చేపట్టాలని కోరుతూ ఆమె పోలీసులను ఆశ్రయించారు. అయితే పోలీసులు మాత్రం ఆమె తండ్రిని అక్రమ ఆయుధాల కేసులో అరెస్ట్ చేశారు. అక్కడ ఆయన చనిపోవడంతో బాధితురాలు యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్ ఇంటి వద్ద ఆత్మహత్యాయత్నం చేయడం అప్పట్లో కలకలం రేపింది. ఈ ఘటనపై సీఎం యోగి సిట్ ఏర్పాటు చేసినప్పటికీ ఫలితం లేకపోయింది. పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తడంతో ఆ తర్వాత ఈ కేసును సీబీఐకి అప్పగించారు. చివరికి అలహాబాద్ కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిన తర్వాత సీబీఐ అధికారులు సెంగార్ అరెస్ట్ చేసి.. పొక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. అయితే ఏడాది గడిచిన కూడా ఈ కేసులో ఎటువంటి చర్యలు లేకపోవడంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. -
ఒక్క కేసు; ఎన్నో ట్విస్ట్‌లు!
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన ఉన్నావ్ గ్యాంప్ రేప్ కేసులో బాధితురాలి న్యాయపోరాటం ఫలించే సూచనలు కనిపించడం లేదు. రెండేళ్ల నుంచి న్యాయపోరాటం చేస్తున్న బాధితురాలు ఆస్పత్రిలో చావుబతుకుల్లో ఉంది. ఈ కేసులో ఇప్పటివరకు ట్రయల్ కోర్టు విచారణ ప్రారంభం కాకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్న బీజేపీ బహిష్కృత ఎమ్మెల్యే కుల్దీప్సింగ్ సెంగార్‌ను విచారించేందుకు న్యాయమూర్తి లేకపోవడం గమనార్హం. ఆయనకు వ్యతిరేకంగా గతేడాది జూలైలో సీబీఐ చార్జిషీటు దాఖలు చేసినా ఇప్పటివరకు విచారణ ప్రారంభం కాలేదు. సీబీఐ ప్రత్యేక కోర్టుకు జడ్జి లేకపోవడంతో కేసు విచారణ ముందుకు సాగలేదు. ఈ ఏడాది ఏప్రిల్ నెల మధ్యలో సీబీఐ ప్రత్యేక కోర్టు జడ్జి బదిలీ అయ్యారు. అప్పటి నుంచి ఎవరినీ నియమించకపోవడంతో ఈ పోస్ట్ ఖాళీగా ఉంది. న్యాయం ఆలస్యమవుతుండటంతో బాధితురాలి కుటుంబం ఎన్నో కష్టాలు ఎదుర్కొవాల్సి వచ్చింది. ఎమ్మెల్యే సెంగార్ అనుచరులు జరిపిన దాడిలో తండ్రి ప్రాణాలు కోల్పోగా, ఆమె బాబాయి జైలుపాలయ్యాడు. ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో తన ఇద్దరు బంధువులను కోల్పోయింది. బాధితురాలితో పాటు ఆమె తరపు న్యాయవాది కూడా తీవ్రంగా గాయపడ్డారు. కేసు నేపథ్యం.. 2017 ఏప్రిల్ 4, 11న రెండు పర్యాయాలు తనపై లైంగిక దాడి జరిగినట్టు బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఎమ్మెల్యే కుల్దీప్సింగ్ తనపై ఆఘాయిత్యానికి పాల్పడ్డారని పేర్కొంది. తనను బలవంతంగా ఎత్తుకుపోయి కుల్దీప్ ఇంట్లో మరోసారి సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారని ఆరోపించింది. ఏప్రిల్ 11న దారుణం గురించి బాధితురాలి కుటుంబ సభ్యులు ముందుగా పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యేను కేసు నుంచి తప్పించేందుకు ఉన్నావ్ పోలీసులు ప్రయత్నించారని బాధితురాలి కుటుంబ సభ్యులు ఆరోపించారు. బాధితురాలిని పోలీసులు తమ ‘కస్టడీ’లోకి తీసుకుని 12 రోజుల పాటు ఆమె మనసు మార్చేందుకు విఫలయత్నం చేశారని వెల్లడించారు. ఏప్రిల్ 4న జరిగిన ఆఘాయిత్యం గురించి మర్చిపోవాలని, కుల్దీప్సింగ్కు వ్యతిరేకంగా ఫిర్యాదు చేయొద్దని బాధితురాలిని ఒప్పించేందుకు ప్రయాసపడ్డారని ఆమె కుటుంబ సభ్యులు వివరించారు. సెంగార్‌ను నిందితుడిగా పేర్కొంటూ రెండోసారి ఫిర్యాదు చేయగా ఎమ్మెల్యే తన రాజకీయ పలుకుబడితో ఉన్నావ్ పోలీసులను తన గుప్పిట్లో పెట్టుకున్నాడు. దీంతో బాధిత కుటుంబం తమకు న్యాయం చేయాలని కోరుతూ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌కు లేఖ రాసింది. సీఎం హామీయిచ్చినా.. న్యాయం జరిగేలా చూస్తానని గతేడాది ముఖ్యమంత్రిని కలిసినప్పుడు తమకు హామీయిచ్చారని, ఇప్పటివరకు కేసు విచారణ అడుగు కూడా ముందుకు కదల్లేదని బాధితురాలి బాబాయ్ వాపోయారు. ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన భార్యకు అంత్యక్రియలు నిర్వహిందుకు ఆయన ఈరోజు పెరోల్‌పై బయటకు వచ్చారు. ఎమ్మెల్యే సెంగార్‌పై పెట్టిన రేప్ కేసును వెనక్కు తీసుకోవాలని అతడి అనుచరులు గతేడాది ఏప్రిల్ 2న ఉన్నావ్‌లో అందరూ చూస్తుండగా బాధితురాలి తండ్రిని చావబాదారు. ఎమ్మెల్యే గుండాలను వదిలేసిన పోలీసులు.. అక్రమ ఆయుధాలు కలిగివున్నాడన్న నిందమోపి బాధితురాలి తండ్రిని అరెస్ట్ చేశారు. జైలులో తీవ్రంగా హింసించడంతో ఏప్రిల్ 9న అతడు ప్రాణాలు వదిలాడు. వరుస ఎదురుదెబ్బలతో బాధితురాలు గతేడాది ఏప్రిల్ 8న ఏముఖ్యమంత్రి నివాసం ఎదుట ఆత్మహత్యాయత్నం చేసింది. జాతీయ మీడియా, కేంద్ర సంస్థలు స్పందించడంతో దిగొచ్చిన ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కేసు విచారణకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని నియమించింది. బాధితురాలి తండ్రిపై దాడి కేసులో ఎమ్మెల్యే సోదరుడిని వెంటనే పోలీసులు అరెస్ట్ చేశారు. మైనర్ బాలికపై లైంగిక దాడి చేశారన్న ఆరోపణలతో ఏప్రిల్ 11న ఎమ్మెల్యే సెంగార్‌పై పోలీసులు పోస్కో చట్టం కింద కేసు నమోదు చేశారు. తర్వాత ఈ కేసును సీబీఐకి అప్పగించారు. రేప్, హత్య కేసుల్లో చార్జిషీటును గతేడాది జూలైలో ప్రత్యేక కోర్టుకు సీబీఐ సమర్పించింది. అంతకుమించి విచారణ ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. ఈ నేపథ్యంలో బాధితురాలు ప్రయాణిస్తున్న కారు రోడ్డు ప్రమాదానికి గురికావడం అనుమానాలకు తావిస్తోంది. ప్రమాదం పేరుతో బాధితురాలిని హతమార్చేందుకు ఎమ్మెల్యే సెంగార్ ఇదంతా చేయించారన్న ఆరోపణలు రావడంతో ఆయనతో పాటు 10 మందిపై తాజాగా పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా, ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాలి పరిస్థితి విషమంగా ఉందని, ఆమె తరపు న్యాయవాది క్రమంగా కోలుకుంటున్నారని వైద్యులు వెల్లడించారు. (చదవండి: ‘ఉన్నావ్’ రేప్ బాధితురాలికి యాక్సిడెంట్) -
పోలీసులకు చుక్కలు చూపించిన విద్యార్థిని
లక్నో: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావ్ బాధితురాలు ప్రయాణిస్తున్న కారును ఆదివారం నంబరు ప్లేటులేని ట్రక్కు ఢీకొన్న సంగతి తెలిసిందే. ఈ ఘటనలో బాధిత యువతి బంధువులు ఇద్దరు మరణించగా, బాధితురాలితోపాటు ఆమె న్యాయవాది కూడా తీవ్రగాయాలపాలయ్యారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న వీరిద్దరూ ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. ఈ ఘటన పట్ల దేశవ్యాప్తంగా నిరసన వ్యక్తమవుతోంది. ఈ క్రమంలో ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఓ విద్యార్థిని ఈ సంఘటన గురించి ప్రశ్నల వర్షం కురిపిస్తూ.. యూపీ పోలీసులకు చెమటలు పట్టించింది. వివరాలు.. పోలీసు అధికారులు బుధవారం బారాబంకిలోని పలు పాఠశాలలు, కాలేజీల్లో ‘మహిళలకు భద్రత’ అనే అంశంపై అవగాహన సదస్సు నిర్వహించారు. అనంతరం విద్యార్థులతో ముఖాముఖిలో పాల్గొన్నారు. ఈ క్రమంలో 11వ తరగతి చదువుతున్న ఓ విద్యార్థిని తన ప్రశ్నలతో పోలీసులకు చుక్కలు చూపించింది. ఆమె ప్రశ్నలకు సరిగా సమాధానం చెప్పలేక పోలీసులు నీళ్లు నమిలారు. మునిబా కిద్వాయి అనే విద్యార్థిని మాట్లాడుతూ.. ‘అన్యాయం జరిగితే ప్రశ్నించాలంటున్నారు. నిరసన తెలపాలంటున్నారు. మన రాష్ట్రంలో ఓ యువతిపై బీజేపీ ఎమ్మెల్యే అత్యాచారం జరిపాడు. ఆ విషయం అందరికి తెలుసు. బాధితురాలు తనకు జరిగిన అన్యాయం గురించి మాట్లాడింది. ఫలితంగా ఆమెకు యాక్సిడెంట్ అయ్యింది’ అన్నారు. అంతేకాక ‘ఇది ప్రమాదం కాదని ప్రతి ఒక్కరికి తెలుసు. ట్రక్కు నంబర్ కనిపించకుండా నేమ్ ప్లేట్‌కు రంగేసి ఉండడం, అనూహ్యంగా ట్రక్కు కారుపైకి దూసుకెళ్లడం వంటివి అన్ని చూస్తే ఇది ప్రమాదం అనిపించడం లేదు. ఓ సాధరణ వ్యక్తికి వ్యతిరేకంగా నిరసన తెలపవచ్చు.. అదే అధికారంలో ఉన్న వ్యక్తికి వ్యతిరేకంగా నిరసన తెలిపితే.. ఫలితం ఎలా ఉంటుందో ఈ రోజు చూశాం. అతని మీద ఎలాంటి చర్యలు తీసుకోరు.. ఒక వేళ తీసుకున్నా ఎటువంటి ఫలితం ఉండదు. ప్రశ్నించిన అమ్మాయి నేడు ప్రాణాపాయ స్థితిలో ఉంది. ఇప్పుడు మీరు తనకెలా న్యాయం చేస్తారు. నేను నిరసన తెలుపుతాను.. నా రక్షణకు హామీ ఏది. నాకేం కాదని మీరు హామీ ఇవ్వగలుగుతారా’ అంటూ ప్రశ్నల వర్షం కురిపించింది. కిద్వాయి మాట్లాడుతున్నంతసేపు.. మిగతా స్టూడెంట్స్ చప్పట్లు కొడుతూనే ఉండగా.. పోలీసులు సమాధానం చెప్పడానికి ఇబ్బంది పడ్డారు. ఇదిలా ఉండగా.. కుల్దీప్ సింగ్ వల్ల తనకు ప్రాణాపాయం ఉందని.. బాధితురాలి పోలీసు శాఖకు ఎన్నో సార్లు ఫిర్యాదు చేసింది. ఈ విషయాన్ని స్వయంగా సీనియర్ పోలీసు అధికారి ఒకరు వెల్లడించారు. ‘బాధితురాలి కుటుంబం నుంచి 25 ఫిర్యాదులు వచ్చాయి. కానీ వాటిల్లో ఒక్కదాంట్లో కూడా ఆమె తనకు రక్షణ కల్పించాలని కోరలేదు. ఏది ఏమైనా జరిగిన ప్రమాదం గురించి అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తామ’ని తెలిపారు. -
‘ఉన్నావో రేప్’ ఎటుపోతుంది?
సాక్షి, న్యూఢిల్లీ : ‘దేశంలో మహిళలపై ఎలాంటి అత్యాచారాలను సహించం. మహిళలకు ఎక్కువ భద్రతను కల్పిస్తాం. అందుకు ఇప్పటికే హోం శాఖలో ప్రత్యేక భద్రతా విభాగాన్ని ఏర్పాటు చేశాం. మహిళలపై రేప్‌లు జరిగితే వాటిని నిర్దిష్ట కాలపరిమితిలో విచారించేలా చూస్తాం. అందుకు ఫాస్ట్‌ట్రాక్ కోర్టులను మరింతగా విస్తరింపచేస్తాం. ఫోరెన్సిక్ సౌకర్యాలను పెంచుతాం’ 2019 సార్వత్రిక ఎన్నికల సందర్భంగా భారతీయ జనతా పార్టీ విడుదల చేసిన 45 పేజీల మానిఫెస్టోలో మహిళల గురించి పేర్కొన్న పేరా. ఈ మానిఫెస్టోలో మహిళల భద్రత గురించి 37 సార్లు ప్రస్తావించారు. మరి, దేశవ్యాప్తంగా సంచలం సృష్టించిన ఉన్నావో రేప్ కేసులో ఏం జరిగిందీ ? ఏం జరుగుతోంది ? ఉత్తరప్రదేశ్‌లో భారతీయ జనతా పార్టీకి చెందిన ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ సెంగార్ తనను కిడ్నాప్ చేసి తనపై అత్యాచారం జరిపినట్లు ఓ టీనేజ్ అమ్మాయి 2017లో ఆరోపించారు. రకరకాల ఒత్తిళ్ల వల్ల ఈ విషయాన్ని బయటకు రాకుండా అధికార యంత్రాంగం తొక్కిపెట్టింది. చివరకు 2018లో ఈ విషయమై ఫిర్యాదు చేయాలని కుటుంబ సభ్యులతో కలిసి బాధితురాలు నిర్ణయించుకున్నారు. వారంతా పోలీసు స్టేషన్‌కు వెళితే ఫిర్యాదు తీసుకోవడానికి పోలీసులు తిరస్కరించారు. దీంతో వారు లక్నోలోని యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నివాసం ముందు ఆత్మాహుతికి ప్రయత్నించారు. అప్పడు అక్కడి సిబ్బంది వారి ప్రయత్నాన్ని అడ్డుకున్నారు. ఆ మరుసటి రోజే ఆ అమ్మాయి తండ్రి పోలీసు స్టేషన్ లాకప్‌లో మరణించారు. పోలీసులే కాకుండా, సెంగార్ సోదరుడు కూడా పోలీసు స్టేషన్‌కు వచ్చి కొట్టడం వల్ల అమ్మాయి తండ్రి మరణించినట్లు నాడు వార్తలు వచ్చాయి. అమ్మాయి తండ్రిని కొట్టారనడానికి ప్రత్యక్ష సాక్షిగా ఉన్న వ్యక్తి కూడా ఆ తర్వాత పది రోజుల్లో అనుమానాస్పద పరిస్థితుల్లో మరణించారు. జబ్బు వల్ల అతను చనిపోయినట్లు అధికార యంత్రాంగం పేర్కొంది. అటాప్సీ చేయించాల్సిందిగా సాక్షి బంధువులు డిమాండ్ చేశారు. నేటి వరకు అది జరగలేదు. కుల్దీప్ సింగ్ సెంగార్‌పై అత్యాచార ఆరోపణలను నాడు బీజేపీ ఎమ్మెల్యే సురేంద్ర సింగ్ తీవ్రంగా ఖండించారు. ముగ్గురు పిల్లల తల్లిని ఏ మగాడు రేప్ చేయరంటూ బుకాయించారు. బాధితురాలికి అసలు పిల్లలే లేరు. ఆ తర్వాత ఓ ఎన్నికల ప్రచార సభలో రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌తోపాటు నిందితుడు కుల్దీప్ సింగ్ సెంగార్ భార్య పాల్గొన్నారు. మీడియాలో ఈ ఫొటోలను చూసిన బాధితురాలి కుటుంబం ఇక తమకు న్యాయం జరిగే అవకాశం లేదని భావించి నేరుగా కోర్టును ఆశ్రయించారు. ఈ కారణంగా కుల్దీప్ సింగ్ జైలుకు వెళ్లాల్సి వచ్చింది. ఆయన జైల్లో ఉండగానే 2019 లోక్‌సభ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. బీజేపీ ఎంపీ సాక్షి మహరాజ్ జైలుకు వెళ్లి సెంగార్‌ను కలుసుకుని పరామర్శించారు. తన విజయం వెనక కుల్దీప్ సింగ్ సెంగార్ పాత్ర ఎంతో ఉందని ఆయన ప్రజల సమక్షంలో సెంగార్‌కు కతజ్ఞతలు తెలిపారు. ఉన్నావో రేప్ సంఘటనకు సంబంధించిన ఈ పరిణామాలన్నింటినీ ప్రజలు దాదాపు మరచిపోయారు. రేప్ బాధితురాలు, తన న్యాయవాది, ఇద్దరు తన ఆంటీలతో కలిసి కారులో వెళుతుండగా ఆదివారం నాడు ఓ ట్రక్కు వచ్చి ఢీకొనడం, ఆ సంఘటనలో బాధితురాలు, లాయర్ తీవ్రంగా గాయపడడం, బాధితురాలి ఇద్దరి సమీప బంధువులు మరణించడంతో ఉన్నావో రేప్ మరోసారి సంచలనం అయింది. ట్రక్కు నెంబర్ కనిపించకుండా నేమ్ ప్లేట్‌కు రంగేసి ఉండడం, అనూహ్యంగా ట్రక్కు కారుపైకి దూసుకెళ్లడం, ఈ విషయమై మీడియా పెద్ద ఎత్తున గోల చేయడంతో ఈ యాక్సిడెంట్ వెనక కుల్దీప్ సింగ్ హస్తం ఉండవచ్చంటూ పోలీసులు కేసు నమోదు చేశారు. -
‘ఉన్నావ్’ కేసులో ట్విస్ట్; బీజేపీ ఎమ్మెల్యేపై కేసు
లక్నో : ఉత్తరప్రదేశ్ ఉన్నావ్ అత్యాచార ఘటన బాధితురాలి ప్రమాద ఘటనలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బీజేపీ ఎమ్మెల్యే కులదీప్ సింగ్‌పై కేసు నమోదైంది. మరో పదిమంది పేర్లను కూడా ఎఫ్ఐఆర్లో చేర్చారు. హత్య, హత్యాయత్నం, కుట్ర తదితర సెక్షన్ల కింద ఎమ్మెల్యేతోపాటు మరో పదిమందిపై కేసు నమోదు చేశామని పోలీసు అధికారి తెలిపారు. ఈ ప్రమాదంలో ప్రాణాలతో బయటపడిన మామ ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదైందని పోలీసులు తెలిపారు. మరోవైపు ఈ ఘటనపై పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మండిపడ్డారు. బాధితురాలికి రక్షణ కల్పించడంలో రాష్ట్రం ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. తాజా ప్రమాద ఘనటపై జోక్యం చేసుకోవాల్సిందిగా ప్రధానమంత్రి నరేంద్రమోదీని మమత కోరారు. దేశంలో ఫాసిస్ట్ పాలన కొనసాగుతోంది. ప్రతీరోజు మూకహత్య ఉదంతాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ పరిస్థితిపై ప్రధాని దృష్టిపెట్టాలన్నారు.ఈ ప్రమాదంపై అత్యున్నతస్థాయి కమిటీతో విచారణ జరిపించాల్సిందిగా ఆమె ప్రధానిని కోరారు. అటు బాధితురాల్ని హతమార్చేందుకే ప్రమాదం పన్నాగం పన్నారని ఎస్పీ, కాంగ్రెస్ పార్టీలు ఆరోపించాయి. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావ్ బాధితురాలు ప్రయాణిస్తున్న కారును ఆదివారం నంబరు ప్లేటులేని ట్రక్కు ఢీకొనడంతో బాధిత యువతి బంధువులు ఇద్దరు మరణించగా, బాధితురాలితోపాటు ఆమె న్యాయవాది కూడా తీవ్రగాయాలపాలయ్యారు. ప్రాణాపాయ స్థితిలో వీరిద్దరూ చికిత్స పొందుతున్నారు. కాగా అధికార బీజేపీ ఎమ్మెల్యే కుల్దీప్ సెంగార్ తనపై అత్యాచారం చేశాడని బాధితురాలు 2017లో ఫిర్యాదు చేసింది. అయితే ఈ కేసులో పోలీసుల కస్టడీలోనే ఆమె తండ్రి మరణించడం, దీనిపై నిష్పక్షపాత విచారణ జరగడంలేదంటూ బాధితురాలు యూపీ ముఖ్యమంత్రి యోగి ఇంటి ముందే ఆత్మాహుతికి యత్నించడం కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ కేసులోఅరెస్టు అయిన కులదీప్ సింగ్ ప్రస్తుతం జైల్లో ఉన్నాడు. చదవండి: ‘ఉన్నావ్’ రేప్ బాధితురాలికి యాక్సిడెంట్ -
‘ఉన్నావ్’ రేప్ బాధితురాలికి యాక్సిడెంట్
లక్నో: గతేడాది దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావ్ అత్యాచార ఘటన బాధితురాలు ప్రయాణిస్తున్న కారును ఆదివారం ట్రక్కు ఢీకొనడంతో బాధిత యువతి బంధువులు ఇద్దరు మరణించారు. బాధితురాలితోపాటు ఆమె న్యాయవాది కూడా తీవ్రగాయాలపాలయ్యారు. అధికార బీజేపీ ఎమ్మెల్యే కుల్దీప్ సెంగార్ తనపై అత్యాచారం చేశాడని బాధితురాలు గతేడాది ఫిర్యాదు చేయగా, పోలీసులు ఆమె తండ్రినే అరెస్టు చేసి హింసించడంతో ఆయన పోలీస్ కస్టడీలోనే మరణించారు. బాధితురాలు కూడా ముఖ్యమంత్రి యోగి ఇంటి ముందే ఆత్మాహుతికి యత్నించింది. ఎమ్మెల్యేను పోలీసులు అరెస్టు చేసినా అతను బెయిలుపై బయటకొచ్చాడు. దేశవ్యాప్తంగా తీవ్ర నిరసనలు వ్యక్తం కావడంతో కేసును సీబీఐ విచారణకు అప్పగించారు. తాజాగా బాధితురాలు, ఇద్దరు మహిళలు, లాయర్‌తో కలిసి రాయ్‌బరేలీకి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఘటనలో ఇద్దరు మహిళలు మరణించగా, బాధితురాలు, లాయర్ తీవ్రగాయాలతో బయటపడ్డారు. ఆమెను చంపేందుకే ఈ ప్రమాదం చేయించారని ఎస్పీ, కాంగ్రెస్ పార్టీలు ఆరోపించాయి. ట్రక్కు డ్రైవర్‌తోపాటు యజమానిని కూడా పోలీసులు ఇప్పటికే అరెస్టు చేశారు. బాధితురాలి వెంట ఉండాల్సిన భద్రతా సిబ్బంది ఎందుకు లేరనే విషయంపై కూడా విచారణ జరుపుతామన్నారు. -
జైలులో ఉన్న ఎమ్మెల్యేను కలిసిన బీజేపీ ఎంపీ
లక్నో : ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఉన్నావ్ నుంచి ఎంపీగా గెలుపొందిన సాక్షి మహరాజ్.. జైలులో ఉన్న బీజేపీ ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ సెంగార్‌ను పరామర్శించారు. దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఉన్నావ్ అత్యాచార ఘటన కేసులో సెంగార్ ప్రధాన నిందితుడిగా ఉన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం సీతాపూర్ జైలులో ఉన్న సెంగార్‌ను కలిసిన సాక్షి మహరాజు కాసేపు అక్కడే గడిపారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘చాలా కాలం నుంచి సెంగార్ జైల్లో ఉంటున్నారు. ఎన్నికల్లో విజయం సాధించినందుకు సెంగార్‌కు ధన్యవాదాలు తెలిపేందుకు ఇక్కడికి వచ్చాన’ని తెలిపారు. అయితే లోక్‌సభ ఎన్నికల ప్రచార సమయంలో కూడా సాక్షి మహరాజు ఉన్నావ్‌లోని సెంగార్ ఇంటికి వెళ్లినట్టుగా తెలుస్తోంది. కాగా, సెంగార్ ఇంటికి ఉద్యోగం కోసం వెళ్లిన తనపై ఆయన లైంగిక దాడికి పాల్పడ్డారని ఉన్నావ్ అత్యాచార బాధితురాలు ఆరోపించారు. ఎమ్మెల్యేపై చర్యలు చేపట్టాలని కోరుతూ ఆమె పోలీసులను ఆశ్రయించారు. అయితే పోలీసులు మాత్రం ఆమె తండ్రిని అక్రమ ఆయుధాల కేసులో అరెస్ట్ చేశారు. అక్కడ ఆయన చనిపోవడంతో బాధితురాలు యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్ ఇంటి వద్ద ఆత్మహత్యాయత్నం చేయడం అప్పట్లో కలకలం రేపింది. ఈ ఘటనపై సీఎం యోగి సిట్ ఏర్పాటు చేసినప్పటికీ ఫలితం లేకపోయింది. పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తడంతో ఆ తర్వాత ఈ కేసును సీబీఐకి అప్పగించారు. చివరికి అలహాబాద్ కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిన తర్వాత సీబీఐ అధికారులు సెంగార్ అరెస్ట్ చేసి.. పొక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. -
‘వార్ హీరో’ కుల్దీప్సింగ్ కన్నుమూత
చండీగఢ్: 1971 భారత్–పాక్ యుద్ధం సందర్భంగా కేవలం 120 మందితో పాకిస్తాన్ సైనిక పటాలాన్ని నిలువరించిన బ్రిగేడియర్ కుల్దీప్ సింగ్ చంద్‌పురి(78) కన్నుమూశారు. కొంతకాలంగా కేన్సర్‌తో బాధపడుతున్న కుల్దీప్ మొహాలీలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం తుదిశ్వాస విడిచారు. కుల్దీప్ నేతృత్వంలో భారత సైన్యం రాజస్తాన్‌లోని లాంగేవాలా ఆర్మీ పోస్ట్వద్ద ప్రదర్శించిన ధైర్య సాహసాలపై 1997లో ‘బోర్డర్’ అనే సినిమా విడుదలై ఘనవిజయం సాధించింది. ‘బ్యాటిల్ ఆఫ్ లాంగేవాలా’గా పేరుగాంచిన ఈ ఘటన 1971, డిసెంబర్ 4న చోటుచేసుకుంది. బంగ్లాదేశ్ స్వతంత్ర పోరాటం నేపథ్యంలో భారత్‌పై మెరుపుదాడి చేయాలని పాక్ ఆర్మీ ప్రణాళిక రచించింది. 2,000 మంది జవాన్లతో పాటు భారీగా యుద్ధ ట్యాంకులు, సాయుధ వాహనాలతో పాక్ ఆర్మీ భారత సరిహద్దువైపు కదలడం ప్రారంభించింది. అప్పటి లాంగేవాలా పోస్ట్ ఇన్చార్జ్గా ఉన్న మేజర్ కుల్దీప్ సింగ్ చంద్‌పురి ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు చేరవేశారు. అయితే మరో 6 గంటలవరకూ అదనపు బలగాలు అక్కడకు చేరుకోలేవని ఉన్నతాధికారులు స్పష్టం చేశారు. అక్కడే ఉండి ఆరు గంటలపాటు పాక్ సైన్యాన్ని నిలువరించడమా? లేక వ్యూహాత్మ కంగా వెనక్కితగ్గడమా? అన్న విషయాన్ని కుల్దీప్కు విడిచిపెట్టారు. దీంతో పాక్ బలగాలను నిలువరించేందుకే ఆయన నిర్ణయించుకున్నారు. కేవలం 120 మంది సైనికులు, మెషీన్ గన్లు, చిన్నస్థాయి శతఘ్నులతో పాక్ సైన్యానికి ఉచ్చుపన్నారు. అర్ధరాత్రి 12.30 గంటల సమయంలో భారత భూభాగంలోకి అడుగుపెట్టిన పాక్ ఆర్మీపై గుళ్ల వర్షం కురిపించారు. భారత ఆర్మీ మోహరింపుపై సరైన నిఘా సమాచారం లేకపోవడంతో ఈ మెరుపుదాడిలో పాక్ సైన్యం కకావికలమైంది. ఈ పోస్ట్‌ను గస్తీకాస్తున్న పంజాబ్ రెజిమెంట్‌లోని 23వ బెటాలియన్ వ్యూహాత్మకంగా అమర్చిన ల్యాండ్మైన్లు పేలడంతో పలు యుద్ధ ట్యాంకర్లు, వాహనాలు ధ్వంసం అయ్యాయి. కేవలం 120 మంది భారత సైనికులు ఏకంగా 2 వేల మంది పాక్ ఆర్మీని, యుద్ధ ట్యాంకులను ఎదుర్కొన్నారు. మరుసటిరోజు ఉదయం అదనపు బలగాలతో పాటు భారత వాయుసేన రంగంలోకి దిగడంతో పాక్ తోకముడిచింది. ‘బ్యాటిల్ ఆఫ్ లాంగేవాలా’గా పిలిచే ఈ ఘటనలో ఇద్దరు భారత జవాన్లు అమరులయ్యారు. పాక్ మాత్రం 200 మంది సైనికులను, 36 యుద్ధ ట్యాంకులు, 500కుపైగా వాహనాలను నష్టపోయింది. ఈ యుద్ధంలో కుల్దీప్ చూపిన ధైర్యసాహసాలకుగానూ రెండో అత్యున్నత సైనిక పురస్కారమైన మహావీర్ చక్ర ఆయనకు లభించింది. కుల్దీప్కు భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. కుల్దీప్సింగ్ అంత్యక్రియలను సోమవారం సైనిక లాంఛనాలతో నిర్వహించనున్నారు. పంజాబ్‌లో పుట్టి... అవిభక్త భారత్‌లోని పంజాబ్ రాష్ట్రంలో 1940, నవంబర్ 22న కుల్దీప్సింగ్ చంద్‌పురి జన్మించారు. చెన్నైలోని ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ నుంచి 1963లో ఉత్తీర్ణులయ్యారు. అనంతరం పంజాబ్ రెజిమెంట్‌లోని 23వ బెటాలియన్‌లో చేరారు. ఆయన 1965 భారత్–పాక్ యుద్ధంలో పాల్గొన్నారు. ఆ తర్వాత ఐక్యరాజ్యసమితి అత్యవసర దళం (యూఎన్ఈఎఫ్)లో ఏడాదిపాటు పనిచేశారు. మధ్యప్రదేశ్‌లోని ఇన్ఫాంట్రీ స్కూల్లో శిక్షకుడిగా రెండుసార్లు పనిచేశారు. ఆర్మీ నుంచి రిటైర్ అయ్యాక 2006–11 మధ్యకాలంలో చండీగఢ్ మున్సిపల్ కార్పొరేషన్ సభ్యుడిగానూ పనిచేశారు. యువత డ్రగ్స్ మత్తు నుంచి బయటపడేందుకు ఆటలపై దృష్టి సారించాలనీ, ఇందుకోసం మైదానాలు నిర్మించాలని గట్టిగా వాదించారు. కాగా, కుల్దీప్ మృతిపై పంజాబ్ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కుల్దీప్ వీరోచిత పోరాటం ఆర్మీలో చేరే యువ అధికారులకు స్ఫూర్తిగా నిలుస్తుందని వ్యాఖ్యానించారు. -
ఉన్నావ్ కేసు : బీజేపీ ఎమ్మెల్యేపై చార్జిషీట్
సాక్షి, న్యూఢిల్లీ : ఉన్నావ్ లైంగిక దాడి కేసులో నిందితుడు, బీజేపీ ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ సెంగార్‌పై సీబీఐ బుధవారం చార్జిషీట్ దాఖలు చేసింది. లైంగిక దాడి కేసులో ప్రధాన నిందితుడైన కుల్దీప్ సెంగార్ ప్రస్తుతం విచారణ ఖైదీగా జైలులో ఉన్నారు. గతంలో బాధితురాలి తండ్రి హత్యకు సంబంధించి బీజేపీ ఎమ్మెల్యే సోదరుడుతో పాటు మరో నలుగురిపై సీబీఐ తొలి చార్జిషీట్‌ను దాఖలు చేసింది. సెంగార్ సోదరుడు జై దీప్ సింగ్, ఆయన అనుచరులు వినీత్ మిశ్రా, వీరేంద్ర సింగ్, రామ్ శరణ్ సింగ్ అలియాస్ సోను సింగ్, శశి ప్రతాప్ సింగ్ అలియాస్ సుమన్ సింగ్‌లపై చార్జిషీట్ నమోదైంది. వీరంతా ఉన్నావ్ జిల్లాలోని మాఖి గ్రామానికి చెందిన వారని అధికారులు తెలిపారు. కాగా నిందితులపై హత్య, సంబంధిత నేరాభియోగాలు నమోదు చేశామని సీబీఐ ప్రతినిధి తెలిపారు. ఉన్నావ్ లైంగిక దాడి కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. -
ఉన్నావ్ కేసులో మరో ఇద్దరి అరెస్ట్
లక్నో : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఉన్నావ్ అత్యాచార ఘటన కేసులో ఇద్దరు పోలీసులను సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. ఇప్పటికే ఈ కేసులో ప్రధాన నిందితుడైన బీజేపీ ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ సెంగార్‌తోపాటు, ఇతర నిందితులను సీబీఐ అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టిన సంగతి తెలిసిందే. అత్యాచారానికి గురైన బాలిక తండ్రిని అక్రమంగా అరెస్ట్ చేయడంతోపాటు.. అతని మృతికి కారణమనే ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎస్ఐలు అశోక్ సింగ్, ప్రసాద్ సింగ్‌లను సీబీఐ బుధవారం అరెస్ట్ చేసింది. ప్రస్తుతం వారిద్దరు సస్పెన్షన్ ఎదుర్కొంటున్నారు. దీనిపై సీబీఐ అధికారులు మాట్లాడుతూ.. అరెస్ట్ అయిన ఇద్దరు ఎస్ఐలను గురువారం కోర్టులో హాజరుపరుస్తామని తెలిపారు. ఈ కేసులో సాక్ష్యాధారాలను తారుమారు చేయడానికి ప్రయత్నించడంతో పాటు, బాధితురాలి కుటుంబం పట్ల కుట్ర పూరితంగా వ్యవహరించారనే ఆరోపణలపై వీరిని అదుపులోకి తీసుకున్నట్టు వివరించారు. కాగా ఈ కేసులో స్థానిక పోలీసుల నిర్లక్ష్యంపై అలహాబాద్ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. చదవండి : కస్టడీలో ఎమ్మెల్యే బాధిత యువతి తండ్రి మృతి -
ఆ బీజేపీ ఎమ్మెల్యే మళ్లీ జైలుకు!
లక్నో : ఉత్తరప్రదేశ్‌కు చెందిన సీనియర్ బీజేపీ ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ సెంగార్‌ను మళ్లీ జైలుకు తరలించారు. ఉనావ్‌లో 17 ఏళ్ల అమ్మాయిపై అత్యాచారం జరిపిన కేసులో పోలీసుల రిమాండ్ ముగియడంతో అతన్ని ఉనావ్ జైలుకు తరలించారు. అతనితోపాటు ఈ కేసులో సహ నిందితుడైన శశిసింగ్‌ను ఉనావ్ జైలుకు పంపారు. సెంగార్‌పై పోక్సోస స(బాలలపై లైంగిక నేరాల నిరోధక చట్టం)తోపాటు ఐపీసీ సెక్షన్లు 363 (కిడ్నాప్), 366 (మహిళ అపహరణ), 376 (అత్యాచారం), 506 (నేరపూరిత బెదిరింపులు) తదితర సెక్షన్ల కింద పోలీసులు అభియోగాలు నమోదుచేశారు. గత ఏడాది జూన్ 4న ఎమ్మెల్యే సెంగార్ తనపై అత్యాచారం జరిపాడని, ఆ తర్వాత తనను అపహరించి.. ఎమ్మెల్యే ఇంటికి తీసుకెళ్లారని, అక్కడ తనపై ఆయన అనుచరులు గ్యాంగ్‌రేప్ జరిపారని బాధితురాలు ఫిర్యాదులో తెలిపారు. నిందితుడు ఎమ్మెల్యే, స్థానికంగా పరపతి కలిగిన వ్యక్తి కావడంతో అతన్ని ఉనావ్ జైలు నుంచి వేరే జైలుకు తరలించాలని, తమ కుటుంబానికి ఇప్పటికీ బెదిరింపులు వస్తున్నాయని బాధితురాలి కుటుంబం పేర్కొంటున్నది. -
బీజేపీ ఎమ్మెల్యేకు పటుత్వ పరీక్ష..!
లక్నో : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఉన్నావ్ అత్యాచార కేసును దర్యాప్తు చేస్తున్న సీబీఐ అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రధాన నిందితుడు బీజేపీ ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ సెంగార్‌కు పటుత్వ పరీక్ష నిర్వహించాలని భావిస్తున్నారు. ఇందుకోసం కోర్టు అనుమతి పొందడానికి కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. సెంగార్‌కు కోర్టు విధించిన 12 రోజుల కస్టడీ నేటితో ముగియడంతో సీబీఐ అధికారులు అతన్ని నేడు(శుక్రవారం) కోర్టు ముందు ప్రవేశపెట్టనున్నారు. అయితే సెంగార్‌కు పటుత్వ పరీక్ష నిర్వహించేందుకు అనుమతి ఇవ్వాలని ముందుగానే సీబీఐ అధికారులు కోర్టుకి దరఖాస్తు చేయనున్నారు. విచారణలో సెంగార్ ఒకే ప్రశ్నకు రకరకాల సమాధానాలు చెప్పడంతో సీబీఐ అధికారులు ఈ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. ఉన్నావ్ అత్యాచార ఘటనలో సెంగార్ సోదరులను అరెస్ట్ చేసినప్పటికీ, అధికార పార్టీ ఎమ్మెల్యే కావడంతో ఆయనను అరెస్ట్ చేసేందుకు స్థానిక పోలీసులు సాహసించలేకపోయారు. సీఎం యోగి అదిత్యనాథ్ సిట్ ఏర్పాటు చేసినప్పటికీ ఫలితం లేకపోయింది. ఆ తర్వాత కేసును సీబీఐకి అప్పగించారు. చివరికి అలహాబాద్ కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిన తర్వాత సీబీఐ అధికారులు సెంగార్ని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. గత ఏడాది జూన్‌లో ఎమ్మెల్యేగా గెలిచిన సెంగార్, ఆయన అనుచరులు తనపై లైంగిక దాడికి పాల్పడ్డారని బాధిత యువతి ఆరోపిస్తోంది. ఎమ్మెల్యేపై చర్యలు చేపట్టాలని కోరుతూ ఆమె యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్ ఇంటి వద్ద ఆత్మహత్యాయత్నం చేయడం కలకలం రేపింది. మరోవైపు తనపై ఆరోపణలు నిరాధారమైనవని, రాజకీయ కుట్రతోనే ఇదంతా చేస్తున్నారని సెంగార్ పేర్కొన్నారు. -
‘ఉనావో’ కేసు: శశి కొడుకు అరెస్ట్
లక్నో: ఉనావో అత్యాచార ఘటనకు సంబంధించి సీబీఐ మంగళవారం మరో వ్యక్తిపై కేసు నమోదు చేసింది. తన ఎఫ్ఐఆర్లో శశి సింగ్ కుమారుడు శుభం సింగ్‌ను నిందితునిగా చేర్చింది. శశి సింగ్ బాధిత యువతిని ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ సెంగర్ నివాసానికి తీసుకెళ్లిందనే ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. తాజాగా ఆమె కుమారుడు శుభం సింగ్‌కు ఈ ఘటనతో సంబంధం ఉందని సీబీఐ అభియోగాలు మోపింది. అత్యాచార బాధితురాలిని ఘటనా స్థలానికి చేర్చడంలో శుభం సింగ్ ప్రమేయం కూడా ఉందని ఎఫ్ఐఆర్లో పేర్కొంది. విచారణ నిమిత్తం మంగళవారం శుభం సింగ్‌ను అరెస్టు చేసింది. ‘ప్రలోభాలకు గురిచేసి ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ సెంగర్ ఇంటికి శశి సింగ్ నా కూతురుని తీసుకెళ్లింది. ఎమ్మెల్యే అఘాయిత్యం చేస్తున్న సమయంలో శశి గేటు కాపలాగా ఉంద’ని అత్యాచార బాధిత యువతి తల్లి సీబీఐకి ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. కాగా, సీబీఐ ఆదివారం శశి సింగ్‌కు 4 రోజుల కస్టడీ విధించిన సంగతి తెలిసిందే. బాధిత యువతి మైనర్ కాదనే గందరగోళం తలెత్తడంతో మరోసారి ఆమె వయసు నిర్ధారణకు యువతిని శనివారం లక్నోలోని రామ్ మనోహర్ లోహియా ఆస్పత్రికి తరలించారు. ఘటన చోటుచేసుకునే నాటికి ఆమె మైనర్ కాదని తేలితే.. పోక్సో చట్టం (ప్రొటెక్షన్ ఆఫ్ చిల్ర్డన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్సెస్) కింద ఎమ్మెల్యేపై మోపిన కేసుల్లో మార్పులు చోటుచేసుకోనున్నాయి. -
బీజేపీ ఎమ్మెల్యేకి వారం రోజుల సీబీఐ కస్టడీ
సాక్షి, న్యూఢిల్లీ : బీజేపీ ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్‌ను ఏడు రోజుల సీబీఐ కస్టడీకి తరలించారు. ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావ్‌లో ఓ యువతి(17)పై అత్యాచారానికి పాల్పడ్డ కేసులో ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్‌ను సీబీఐ అధికారులు శుక్రవారం అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అలాహాబాద్ హైకోర్టు ఉత్తర్వులతో సీబీఐ అధికారులు ఎమ్మెల్యేను అదుపులోకి తీసుకుని కొన్ని గంటలపాటు విచారన జరిపారు. గతేడాది జూన్ 4వ తేదీన బాధితురాలు ఉద్యోగం కోసం ఎమ్మెల్యే ఇంటికి వెళ్లింది. కానీ నిందితుడు కుల్దీప్ సింగ్ యువతిపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఫిబ్రవరిలో బాధితురాలి కుటుంబసభ్యులు ఎమ్మెల్యేపై రేప్ కేసు పెట్టగా, యువతి తండ్రిని అక్రమంగా ఆయుధాలు ఇంట్లో ఉంచుకున్నాడని ఆరోపిస్తూ అరెస్ట్ చేశారు. చివరికి జైళ్లోనే లాకప్ డెత్ అయ్యాడు. దీంతో వివాదం పెద్దది కావడంతో ఎట్టకేలకు నిందితుడు కుల్దీప్ సింగ్‌ను అరెస్ట్ చేశారు. కాగా, ఉన్నావ్ ఘటనలో దోషులు ఎంతవారైనా వదిలిపెట్టబోమని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ తెలిపారు. ఈ ఘటనపై ఇప్పటికే సిట్‌ను ఏర్పాటుచేశామన్న విషయం విదితమే. -
ఉన్నావ్ కేసులో ఎమ్మెల్యే అరెస్ట్
న్యూఢిల్లీ / అలహాబాద్ / చెన్నై: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కఠువా, ఉన్నావ్ గ్యాంగ్‌రేప్ కేసుల్లో కదలిక వచ్చింది. ఉత్తరప్రదేశ్‌లో ఓ యువతి(17)పై అత్యాచారానికి పాల్పడ్డ కేసులో బీజేపీ ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్‌ను సీబీఐ అధికారులు శుక్ర వారం అరెస్టు చేశారు. అలాగే పోలీసులు నమోదుచేసిన మూడు ఎఫ్ఐఆర్లను సీబీఐ అధికారులు రీరిజిస్టర్ చేశారు. మరోవైపు జమ్మూకశ్మీర్‌లోని కఠువా జిల్లాలో మైనర్ బాలిక అసిఫా(8) హత్యాచారం కేసును సుప్రీంకోర్టు శుక్రవారం సుమోటోగా విచారణకు స్వీకరించింది. చార్జ్‌షీట్‌ను దాఖలుచేయడానికి యత్నించిన పోలీసుల్ని న్యాయవాదులు అడ్డుకోవడంపై బార్ కౌన్సిళ్లకు నోటీసులు జారీచేసింది. అసిఫా కుటుంబం తరఫున వాదిస్తున్న న్యాయవాదికి బెదిరింపులు రావడాన్ని ఈ సందర్భంగా కొందరు లాయర్లు ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. ఇదిలాఉండగా కఠువా నిందితులకు మద్దతుగా ర్యాలీలో పాల్గొన్న బీజేపీ మంత్రులు చందర్ ప్రకాశ్, లాల్ సింగ్ తమ పదవులకు రాజీనామా చేశారు. ఎమ్మెల్యేను అరెస్ట్ చేసిన సీబీఐ ఉన్నావ్‌లో యువతిపై అత్యాచారానికి పాల్పడ్డ బీజేపీ ఎమ్మెల్యే కుల్దీప్సింగ్ను తొలుత విచారణ నిమిత్తం శుక్రవారం అదుపులోకి తీసుకున్న సీబీఐ అధికారులు సాయంత్రానికి అరెస్ట్ చేశారు. కుల్దీప్ను ప్రస్తుతం సీబీఐ అధికారులు విచారిస్తున్నారు. ఉన్నావ్ ఘటనలో దోషులు ఎంతవారైనా వదిలిపెట్టబోమని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ తెలిపారు. ఈ ఘటనపై ఇప్పటికే సిట్‌ను ఏర్పాటుచేశామన్నారు. ‘కుల్దీప్ను వెంటనే అరెస్ట్ చేయండి’ ఉన్నావ్ ఘటనలో ప్రధాన నిందితుడు కుల్దీప్ సింగ్‌ను వెంటనే అరెస్ట్ చేయాలని అంతకుముందు అలహాబాద్ హైకోర్టు సీబీఐని ఆదేశించింది. కుల్దీప్ను సీబీఐ ప్రస్తుతం విచారిస్తోందని న్యాయవాది కోర్టుకు తెలిపిన నేపథ్యంలో ప్రధాన న్యాయమూర్తి డీబీ భోసలే, జస్టిస్ సునీత్‌ల ధర్మాసనం ఈ మేరకు ఉత్తర్వులు జారీచేసింది. నిందితుడు బాధితులతో పాటు విచారణను ప్రభావితం చేయొచ్చనీ, సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశముందని వ్యాఖ్యానించింది. విచారణపై నివేదికను మే2 లోగా సమర్పించాలని ఆదేశించింది. బార్ కౌన్సిళ్ల తీరుపై సుప్రీం ఆగ్రహం: కఠువా కేసులో పోలీసులు చార్జ్‌షీట్ దాఖలుచేయకుండా న్యాయవాదులే అడ్డుకోవడంపై సీజేఐ జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ ఏఎంఖన్విల్కర్, జస్టిస్ డీవై చంద్రచూడ్‌ల ధర్మాసనం తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. విచారణ ప్రక్రియలో జోక్యం వల్ల బాధితులకు న్యాయం అందడం ఆలస్యమవుతుందని వ్యాఖ్యానించింది. బాధితులు, నిందితుల తరఫున వాదిస్తున్న న్యాయవాదుల్ని అడ్డుకునే అధికారం ఏ ఒక్కరికీ లేదని ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ విషయంలో లాయర్ల ప్రవర్తనపై తమ స్పందనల్ని ఏప్రిల్ 19లోగా తెలియజేయాలని కఠువా జిల్లా బార్ అసోసియేషన్, జమ్మూకశ్మీర్ బార్ కౌన్సిల్, జమ్మూహైకోర్టు బార్ అసోసియేషన్, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలకు సుప్రీంకోర్టు నోటీసులు జారీచేసింది. ఈ సందర్భంగా జమ్మూకశ్మీర్ ప్రభుత్వం తరఫున న్యాయవాది షోయబ్ ఆలమ్ వాదనలు వినిపిస్తూ.. పోలీసుల్ని అడ్డుకున్న న్యాయవాదులపై ఎఫ్ఐఆర్ నమోదుచేసినట్లు వెల్లడించారు. కఠువా ఘటనలో మృతురాలి వివరాలు వెల్లడించిన మీడియా సంస్థలకు ఢిల్లీ హైకోర్టు శుక్రవారం నోటీసులు జారీచేసింది. -
యూపీలో ‘ఉన్నావ్’ వేడి!
లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావ్‌లో ఇటీవల యువతిపై జరిగిన సామూహిక అత్యాచారం కేసు అనూహ్య మలుపులు తిరుగుతోంది. ఈ కేసులో ప్రధాన నిందితుడు అయిన బీజేపీ ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ సెంగార్‌కు ఆయన భార్య మద్దతుగా నిలిచింది. నిజానిజాలు తెలియాలంటే తన భర్తకు, బాధితురాలకి నార్కో పరీక్షలు నిర్వహించడంతో పాటు కేసు విచారణను సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేసింది. అంత్యక్రియలు నిర్వహించకుంటే బాధితురాలి తండ్రి మృతదేహాన్ని భద్రపరచాలని అలహాబాద్ హైకోర్టు యూపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. మరోవైపు, చనిపోయే ముందు ఎమ్మెల్యే మనుషులు యువతి తండ్రిని కొడుతున్న వీడియో ఒకటి వెలుగుచూసింది. ఉన్నావ్‌లో యువతిపై సామూహిక అత్యాచారం, ఆ వెంటే ఆమె తండ్రి కస్టడీలోనే మృతిచెందడం అత్యంత భయానక వాతావరణాన్ని సూచిస్తున్నాయని అంతర్జాతీయ మానవ హక్కుల సంస్థ ఆమ్నెస్టీ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ ఉదంతంపై స్వతంత్ర దర్యాప్తు జరగాలని సూచించింది. -
‘ఆత్మహత్య చేసుకునేందుకు సిద్ధం’
లక్నో : ఉత్తరప్రదేశ్ ఉనావో ప్రాంతంలోని యువతిపై అత్యాచారం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బీజేపీ ఎమెల్యే కుల్దీప్ సింగ్ సెంగర్ మెడకు ఉచ్చు బిగుసుకుంటోంది. ఈ నేపథ్యంలో ఆయన భార్య సంగీత మీడియా ముందుకు వచ్చారు. రాజకీయ కుట్రలో భాగంగా తన భర్తను అత్యాచార కేసులో ఇరికించారని సంగీత ఆరోపించారు. తన భర్త అమాయకుడని, బీఎస్పీ, ఎస్పీ పార్టీలు ఆయనపై నిందలు వేసి కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రిని కలిసి తన భర్తకు న్యాయం చేయాల్సిందిగా కోరతానని ఏఎన్ఐ వార్తా సంస్థతో చెప్పారు. కుల్దీప్ విషయంలో మీడియా అత్యుత్సాహం చూపుతోందని, ఆయనపై కేవలం ఆరోపణలు మాత్రమే వచ్చాయని.. కానీ మీడియా కుల్దీప్ను దోషిగా నిర్దారించేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కారణంగా తమ కుటుంబమంతా ఎంతో ఆవేదన చెందుతోందన్నారు. మీడియాలో తండ్రి గురించి వచ్చిన వార్తలు చూసి తమ ఇద్దరు కుమార్తెలు గది నుంచి బయటకు రావడంలేదని, అన్నం కూడా తినడం లేదని వెల్లడించారు. ఒకవేళ తన భర్త దోషి అని తేలితే కుటుంబమంతా కలిసి ఆత్మహత్య చేసుకునేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. తన భర్తపై అసత్యపు ఆరోపణలు చేసిన అమ్మాయికి, ఆమె మావయ్యకు నార్కో అనాలసిస్ పరీక్షలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఇదిలావుంటే.. ఉనావో అత్యాచార బాధితురాలికి న్యాయం చేయాలని కోరుతూ సుప్రీం కోర్టులో బుధవారం ప్రజా ప్రయోజన వ్యాజ్యం(పిల్) దాఖలైంది. అధికార పార్టీ అండదండలతోనే యువతి తండ్రిని జైల్లో కొట్టి చంపారని న్యాయవాది మనోహర్ లాల్ శర్మ తన పిల్లో పేర్కొన్నారు. ఈ కేసులో కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ)తో సమగ్ర విచారణ జరిపించాలని ఆయన సుప్రీం కోర్టును అభ్యర్థించారు. -
ఇంకా ఎన్ని హత్యలు జరుగుతాయో!
సాక్షి, న్యూఢిల్లీ : ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావ్ పోలీసు స్టేషన్లో పోలీసుల చిత్రహింసలకు 50 ఏళ్లు వద్ధుడు మరణించడంతో ఎన్నో విషాదాంతాలు వెలుగులోకి వచ్చాయి. ఏడాది క్రితమే ఆ వృద్ధుడి 17 ఏళ్ల కూతురును భారతీయ జనతా పార్టీకి చెందిన శాసనసభ్యుడు కుల్దీప్ సింగ్ సెంగర్ అత్యాచారం చేశారన్న ఆరోపణలు వెలుగు చూశాయి. సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఇంటి ముందే ఆ అమ్మాయి కుటుంబం సామూహికంగా ఆత్మాహుతికి ప్రయత్నిస్తే ఆ కుటుంబ సభ్యులను పోలీసులు స్టేషన్‌కు తరలించారు. వారి ఆత్మాహుతి ప్రయత్నానికి కారణమైన కుల్దీప్ సింగ్‌పై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. పైగా పాత ఆయుధాల కేసును తవ్వితీసి ఆ అమ్మాయి తండ్రిని ఉన్నావ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయన హత్యతో భయపడి పోయిన ఆయన కుటుంబ సభ్యులు మరోసారి రోడ్డు మీదకు వచ్చారు. కుల్దీప్ సింగ్ తనపై చేసిన అత్యాచారం గురించి ఆ అమ్మాయి మళ్లీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ సంఘటనలపై దర్యాప్తునకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా జాతీయ మానవ హక్కుల కమిషన్ యూపీ ప్రభుత్వాన్ని, రాష్ట్ర పోలీసు చీఫ్‌ను ఆదేశించింది. మరోపక్క మొత్తం వ్యవహారంపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలంటూ సుప్రీం కోర్టులో పిల్ దాఖలయింది. అయినప్పటికీ బీజేపీ ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్‌పై రాష్ట్ర పోలీసులు ఇప్పటి వరకు కనీసం ఎఫ్ఐఆర్ కూడా దాఖలు చేయలేరు. అమ్మాయి తండ్రిని పోలీసు స్టేషన్లో హత్య చేయడంలో హస్తం ఉందన్న ఆరోపణలపై కుల్దీప్ సింగ్ సోదరుడిని మాత్రం పోలీసులు అరెస్ట్ చేశారు. అత్యాచార ఆరోపణల నేపథ్యంలో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలన్న డిమాండ్‌కు కూడా కుల్దీప్ సింగ్ స్పందించడం లేదు. ఈ సంఘటనలకు ముందే రాష్ట్రంలో మరో దారుణ హత్య జరిగింది. అదే న్యాయ వ్యవస్థ హత్య. బూటకపు ఎన్కౌంటర్లలో 40 మందిని పోలీసులు చంపేశారు. సంఘ వ్యతిరేక శక్తులను ఏరివేయడంలో ఇదే తమ పాలసీ అంటూ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్ యోగి గర్వంగా ప్రకటించుకున్నారు. సంఘ వ్యతిరేక శక్తులంటే యోగి దృష్టిలో ఎవరో? నిమ్న వర్గానికి చెందిన 17 ఏళ్ల అమ్మాయిని అత్యాచారం చేశారని ఆరోపణలను ఎదుర్కొంటున్న శాసన సభ్యుడు నేరం రుజువైతే సంఘ వ్యతిరేక శక్తి కాదా ? మహిళకు రక్షణ కల్పించడమే తన ప్రభుత్వం ప్రాధాన్యత అని యోగి సీఎంగా బాధ్యతలు స్వీకరించిన మొదట్లో ప్రకటించారు. యాంటీ రోమియో స్కాడ్లను ఏర్పాటు చేశారు. అవి నిజమైన ప్రేమికులను, భార్యాభర్తలను వేధిస్తుండడంతో వాటిని రద్దు చేశారు. ఈ ఏడాది కాలంలో మహిళలపై అత్యాచారాలు రెండింతలు పెరిగాయి. బూటకపు ఎన్కౌంటర్లలో మరణించిన వారిలో ఎక్కువ మంది మైనారిటీ, దళిత, ఓబీసీలే ఉన్నారు. వారే ఆయన దష్టిలో సంఘ వ్యతిరేక శక్తులా ? బూటకపు ఎన్కౌంటర్లకు రాష్ట్ర ప్రభుత్వమే లైసెన్స్ ఇస్తే లాకప్ డెత్‌లు జరగవా? నకిలీ ఎన్కౌంటర్లు పెరగవా? అధికారంలో ఉన్న పార్టీ తన రాజకీయ కక్ష సాధింపు చర్యలకు ఈ నకిలీ ఎన్కౌంటర్లను ఉపయోగించుకోవా? యోగి హయాంలో ఇలాంటి హత్యలు, అత్యాచారాలు ఎన్ని వినాల్సి వస్తుందో! -
ఆడియోతో అడ్డంగా దొరికిన బీజేపీ ఎమ్మెల్యే..
లక్నో, ఉత్తరప్రదేశ్ : ఉనావో ప్రాంతంలోని యువతిపై అత్యాచారం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బీజేపీ ఎమెల్యే కుల్దీప్ సింగ్ సెంగర్ మెడకు ఉచ్చు బిగుసుకుంటోంది. కేసును వెనక్కు తీసుకోవాలని కుల్దీప్ యువతి మావయ్య మహేష్ సింగ్‌ను బెదిరిస్తున్న ఆడియో రికార్డులు వెలుగులోకి వచ్చాయి. దీంతో కుల్దీప్ మరిన్ని చిక్కుల్లో పడ్డారు. ‘మనమంతా ఒక్కటే. మన మధ్య గొడవలు పెట్టాలని కొంత మంది కావాలనే కుట్రపూరితంగా మిమ్మల్ని రెచ్చగొడుతున్నారు. అలాంటి కుట్రకు మీరు లొంగొద్దు. నాకు వ్యతిరేకంగా ఎటువంటి పనులు చేయొద్దు. కేసును వెనక్కి తీసుకుంటే మంచిది.’ అని కుల్దీప్సింగ్ యువతి మావయ్యను ఆడియో టేపులో హెచ్చరించారు. యువతి తండ్రి సురేంద్ర సింగ్‌పై చేయి చేసుకున్న అతుల్(ఎమ్మెల్యే తమ్ముడు)ని తాను శిక్షిస్తానని ఈ సందర్భంగా కుల్దీప్సింగ్ యువతి మావయ్యకు హామీ ఇవ్వడం గమనార్హం. జైలులో అనారోగ్యానికి గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతూ యువతి తండ్రి సురేంద్ర సింగ్ సోమవారం మృతి చెందిన విషయం తెలిసిందే. కాగా, ఈ ఘటనలో నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న అతుల్‌ని మంగళవారం పోలీసులు అరెస్టు చేశారు. ఐపీసీ సెక్షన్ 302(మర్డర్) కింద కేసు నమోదైంది. ఉనావో ఆస్పత్రి చీఫ్ మెడికల్ ఆఫీసర్ ఎస్పీ చౌదరీ మాట్లాడుతూ.. యువతి తండ్రి సురేంద్ర సింగ్ షాక్‌కు గురయ్యాడనీ, పొత్తి కడుపులో గాయాల కారణంగా చనిపోయి ఉండొచ్చని తెలిపారు. సిట్ ఏర్పాటు.. గత ఆదివారం నుంచి జరుగుతున్న ఈ మొత్తం వ్యవహారాన్ని దర్యాప్తు చేసేందుకు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం (సిట్)ను ఏర్పాటు చేయాలని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆదేశించారు. ఘటనపై బుధవారం సాయంత్రానికల్లా ప్రాథమిక నివేదిక సమర్పించాలని చెప్పారు. ఈ మేరకు అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్(లక్నో జోన్) నేతృత్వంలో ఏర్పాటైన సిట్‌లో క్రైం బ్రాంచ్ ఎస్పీ, మహిళా డీఎస్పీ సభ్యులుగా ఉంటారని లా అండ్ ఆర్డర్ ఏడీజీ ఆనంద్ కుమార్ తెలిపారు. సీబీఐతో దర్యాప్తుకై సుప్రీంలో పిల్.. కాగా, ఉనావో అత్యాచార బాధితురాలికి న్యాయం చేయాలని కోరుతూ సుప్రీం కోర్టులో బుధవారం ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. అధికార పార్టీ అండ దండలతోనే యువతి తండ్రిని కొట్టి చంపారని అడ్వకేట్ మనోహర్ లాల్ శర్మ తన పిల్లో పేర్కొన్నారు. యువతిపై ఎమ్మెల్యే, అతని సోదరుడి అత్యాచారం, ఆమె తండ్రి మృతిపై కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) తో సమగ్ర విచారణ జరిపించాలని ఆయన సుప్రీం కోర్టును అభ్యర్థించారు. -
యోగి ప్రభుత్వానికి నోటీసులు
లక్నో : ఉత్తరప్రదేశ్‌లో కలకలం రేపిన ఉనావో లైంగిక దాడి కేసులో యోగి ప్రభుత్వానికి, పోలీసు ఉన్నతాధికారులకు జాతీయ మానవ హక్కుల సంఘం జారీ నోటీసులు చేసింది. అత్యాచార బాధితురాలి తండ్రి మరణానికి సంబంధించి నివేదికను అందజేయాలని నోటీసులో పేర్కొంది. అంతేకాకుండా బాధితురాలి కుటుంబానికి ఎటువంటి ప్రమాదం జరగకుండా చర్యలు తీసుకునేలా హామీ ఇవ్వాలని కోరింది. బీజేపీ ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ సెంగర్, ఆయన సోదరుడు తనపై లైంగిక దాడికి పాల్పడ్డారని ఉనావో ప్రాంతానికి చెందిన 18 ఏళ్ల అమ్మాయి ఆరోపణలు చేసిన నేపథ్యంలో.. మానవ హక్కుల ఉల్లంఘనకు కారణమైన వారిపై తీవ్రమైన చర్యలు తీసుకుంటామని ఎన్‌హెచ్చార్సీ హెచ్చరించింది. బాధితురాలి తండ్రి మరణానికి సంబంధించిన నివేదికను సమర్పించాల్సిందిగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, డీజీపీకి నోటీసులు జారీచేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు ఎఫ్ఐఆర్ నమోదు చేసేందుకు నిరాకరించిన పోలీసులపై ఎటువంటి చర్యలు తీసుకున్నారో తెలియజేయాలని ఆదేశించింది. నాలుగు వారాల గడువు ఇస్తున్నాం... ‘పోలీసు కస్టడీలో వ్యక్తి మరణం, అందుకు దారితీసిన పరిస్థితుల గురించి సమాచారం ఇవ్వాల్సిన బాధ్యత డీజీపీకి ఉంటుంది. 24 గంటలు గడిచినా మాకు ఎటువంటి సమాచారం అందలేదు. బాధితురాలి తండ్రిని అదుపులోకి తీసుకున్నప్పటి నుంచి ఆస్పత్రిలో చేరడం, మరణించడం వరకు జరిగిన ప్రతీ అంశం గురించి పూర్తి సమాచారం అందజేయాలని, ఇందుకు నాలుగు వారాల గడువు ఇస్తున్నామని’ ఎన్‌హెచ్చార్సీ తెలిపింది. బాధితురాలు తన కుటుంబంతో కలిసి ఆదివారం సీఎం యోగి ఆదిత్యనాథ్ నివాసం ఎదుట ఆత్మహత్యాయత్నం చేసింది. ఈ నేపథ్యంలో జైలులో ఉన్న బాధితురాలి తండ్రిని పోలీసులు అదేరోజు రాత్రి స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఆయన చికిత్స పొందుతూ మరణించారు. పోలీసులు లాఠీలతో తన తండ్రిని కొట్టి చంపారని బాధితురాలు ఆరోపించింది. ఈ వ్యవహారంపై రాష్ట్రవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తడంతో ఉన్నతస్ధాయి విచారణకు ముఖ్యమంత్రి ఆదేశించారు. -
మాజీ సైనికుల సంక్షేమానికి కృషి
వైవీయూ, న్యూస్‌లైన్: మాజీ సైనికుల సంక్షేమానికి కృషి చేస్తామని ఈసీహెచ్ఎస్ పాలి క్లినిక్స్ ఆంధ్రా సబ్‌ఏరియా ఇన్చార్జి లెఫ్టినెంట్ కల్నల్ కుల్దీప్సింగ్ అన్నారు. మంగళవారం నగరంలోని ప్రకాష్‌నగర్‌లోని ఈసీహెచ్ఎస్ పాలిక్లినిక్‌లో రాయలసీమ, నెల్లూరు జిల్లాల మాజీ సైనికుల సౌకర్యార్థం హెల్ప్‌లైన్ సెంటర్‌ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాజీ సైనికులు, వితంతువులకు రావాల్సిన పెన్షన్లు, ఇళ్ల పట్టాలు, పెండింగ్‌లో ఉన్న బకాయిలు త్వరితగతిన వచ్చేందుకు కృషిచేస్తామని తెలిపారు. అలాగే రాయలసీమ, నెల్లూరు జిల్లాలోని మాజీ సైనికులు పాలీక్లినిక్ను సద్వినియోగం చేసుకోవాలన్నారు. జిల్లా సైనిక సంక్షేమాధికారి భాస్కర్‌రెడ్డి మాట్లాడుతూ మాజీ సైనికులకు రావాల్సిన సౌకర్యాలను సాధించడంలో కృషిచేస్తామని తెలిపారు. కడప పాలిక్లినిక్ ఇన్చార్జి మోహనరంగం మాట్లాడుతూ మాజీ సైనికులు అన్ని రకాల వైద్య సేవలు పొందవచ్చన్నారు. అవసరమైతే నగరాల్లోని పెద్ద ఆస్పత్రుల్లో ఉచిత చికిత్సలు పొందేందుకు రెఫర్ చేస్తామన్నారు. పాలిక్లినిక్ వైద్యుడు డాక్టర్ శాంత్‌కుమార్ మాట్లాడుతూ మాజీ సైనికులు వైద్యచికిత్సల కోసం ఏర్పాటు చేసిన హెల్ప్‌లైన్‌ను సద్వినియోగం చేసుకోవాలన్నారు.