లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావ్‌లో ఇటీవల యువతిపై జరిగిన సామూహిక అత్యాచారం కేసు అనూహ్య మలుపులు తిరుగుతోంది. ఈ కేసులో ప్రధాన నిందితుడు అయిన బీజేపీ ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ సెంగార్‌కు ఆయన భార్య మద్దతుగా నిలిచింది. నిజానిజాలు తెలియాలంటే తన భర్తకు, బాధితురాలకి నార్కో పరీక్షలు నిర్వహించడంతో పాటు కేసు విచారణను సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేసింది.
అంత్యక్రియలు నిర్వహించకుంటే బాధితురాలి తండ్రి మృతదేహాన్ని భద్రపరచాలని అలహాబాద్ హైకోర్టు యూపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. మరోవైపు, చనిపోయే ముందు ఎమ్మెల్యే మనుషులు యువతి తండ్రిని కొడుతున్న వీడియో ఒకటి వెలుగుచూసింది. ఉన్నావ్‌లో యువతిపై సామూహిక అత్యాచారం, ఆ వెంటే ఆమె తండ్రి కస్టడీలోనే మృతిచెందడం అత్యంత భయానక వాతావరణాన్ని సూచిస్తున్నాయని అంతర్జాతీయ మానవ హక్కుల సంస్థ ఆమ్నెస్టీ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ ఉదంతంపై స్వతంత్ర దర్యాప్తు జరగాలని సూచించింది.
Comments
Please login to add a commentAdd a comment