Woman RAPE
-
అత్యాచారం జరిగిన ఆరు రోజులకు! ‘అద్భుతం’ అనుకులోపే..
మృగాడి చేతిలో ఛిద్రమైన ఆ సోదరి.. ఆరు రోజులపాటు కారడవిలో అలాగే ఉండిపోయింది. ఆకలి, దప్పికలు లేక అల్లలాడిపోయింది. ప్రాణం పోయేలోపు తాను పడ్డ నరకం గురించి ఎవరికైనా చెప్పాలన్న తాపత్రయమే ఆమెకు కొన ఊపిరితో ఉంచింది. ఆమె సంకల్పానికి వైద్యులు సైతం ‘అద్భుతం’ అంటూ ఆశ్చర్యపోయారు. కానీ, ఈ లోపే నష్టం జరిగిపోయింది. రాజస్థాన్‌లో తాజాగా సంచలనం సృష్టించిన మహిళ అత్యాచార ఘటన విషాదాంతంగా ముగిసింది. 35 ఏళ్ల బాధితురాలు వారం రోజుల నరకయాతన తర్వాత తుది శ్వాస విడిచింది. ఆమెను కాపాడి ఆస్పత్రిలో చేర్చినప్పటి నుంచి వెంటిలేటర్ మీదే చికిత్స పొందుతోందని, నిందితుల దాడిలో తీవ్రంగా గాయపడడంతో ఆమె బ్రెయిన్ ఆక్సిజన్‌ను తీసుకోవడం కష్టంగా మారిందని, చికిత్స పొందుతూ గురువారం సాయంత్రం బాధితురాలు కన్నుమూసిందని నాగౌర్ ఎస్పీ రామ్ మూర్తి శుక్రవారం మీడియాకు వెల్లడించారు. మిస్సింగ్.. దర్యాప్తుపై నిరసనలు ఫిబ్రవరి 4వ తేదీన ఇంటి నుంచి బయటకు వెళ్లిన బాధితురాలు.. తిరిగి రాలేదు. దీంతో అంతా వెతికిన కుటుంబ సభ్యులు చివరకు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. మిస్సింగ్ కేసు నమోదు అయ్యింది. అయితే రోజులు గడుస్తున్నా కేసులో పురోగతి లేకుండా పోయింది. ఈ కేసును దర్యాప్తు చేయడంలో అలసత్వం ప్రదర్శిస్తూ వచ్చారు నాగౌర్ పోలీసులు. దీంతో గ్రామస్తులు రోడ్డెక్కి రహదారిని మూసేయడంతో ఈ కేసు మీడియా దృష్టిని ఆకర్షించింది. విమర్శలు వెల్లువెత్తడంతో ఎట్టకేలకు పోలీస్ యంత్రాగం కదిలింది. ఈలోపు.. ఫిబ్రవరి 10వ తేదీన అదే గ్రామం శివారులోని అడవిలో ఆమె ఒంటిపై దుస్తులు లేకుండా గాయాలతో.. అచేతనంగా పడి ఉండడం కొందరు గుర్తించారు. అయితే ఆమె కొన ఊపిరితో ఉందని ఆస్పత్రికి తరలించారు. మైనర్ సాయంతో మృగాడు.. అది దట్టమైన అడవి ఏరియా.. అలా ఆమె అన్నేసి రోజులు స్పృహ లేకుండా ఉండడం పోలీసులను, డాక్టర్లను సైతం ఆశ్చర్యానికి గురి చేసింది. వెంటనే ఆమెను మంచి చికిత్స కోసం జైపూర్‌కు తరలించారు. ఆస్పత్రిలో చేర్చిన తర్వాత కొన ఊపిరితో ఉన్న ఆమె ఇచ్చిన వాంగ్మూలంతో.. నిందితుడిని, అతనికి సహకరించిన ఓ మైనర్‌ను ఎట్టకేలకు పోలీసులు ట్రేస్ చేయగలిగారు. ఫిబ్రవరి 4వ తేదీన ఇంటికి బయలుదేరిన ఆమెను.. ఓ మైనర్ పిలగాడి సాయంతో ఆటోలో కిడ్నాప్ చేశాడు దుండగుడు. నిర్మానుష్య ప్రాంతంలోకి తీసుకెళ్లి ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఆపై బండరాయితో ఆమెపై దాడి చేసి.. చనిపోయిందనుకుని దూరంగా అడవిలో ఆమె శరీరాన్ని విసిరేసి వెళ్లిపోయాడు. ఎట్టకేలకు ఆమె వాంగ్మూలం సాయంతోనే పోలీసులు నిందితుడిని, సహకరించిన మైనర్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఇక ఈ కేసులో నిర్లక్ష్యం వహించిన ఇద్దరు అధికారులను సస్పెండ్ చేశారు నాగౌర్ ఎస్పీ. -
యూపీలో ‘ఉన్నావ్’ వేడి!
లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావ్‌లో ఇటీవల యువతిపై జరిగిన సామూహిక అత్యాచారం కేసు అనూహ్య మలుపులు తిరుగుతోంది. ఈ కేసులో ప్రధాన నిందితుడు అయిన బీజేపీ ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ సెంగార్‌కు ఆయన భార్య మద్దతుగా నిలిచింది. నిజానిజాలు తెలియాలంటే తన భర్తకు, బాధితురాలకి నార్కో పరీక్షలు నిర్వహించడంతో పాటు కేసు విచారణను సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేసింది. అంత్యక్రియలు నిర్వహించకుంటే బాధితురాలి తండ్రి మృతదేహాన్ని భద్రపరచాలని అలహాబాద్ హైకోర్టు యూపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. మరోవైపు, చనిపోయే ముందు ఎమ్మెల్యే మనుషులు యువతి తండ్రిని కొడుతున్న వీడియో ఒకటి వెలుగుచూసింది. ఉన్నావ్‌లో యువతిపై సామూహిక అత్యాచారం, ఆ వెంటే ఆమె తండ్రి కస్టడీలోనే మృతిచెందడం అత్యంత భయానక వాతావరణాన్ని సూచిస్తున్నాయని అంతర్జాతీయ మానవ హక్కుల సంస్థ ఆమ్నెస్టీ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ ఉదంతంపై స్వతంత్ర దర్యాప్తు జరగాలని సూచించింది. -
కదులుతున్న రైల్లో మహిళపై దారుణం
గువహటి: బెంగళూరు-టిన్సుకియా ఎక్స్‌ప్రెస్ రైల్లో ఓ యువకుడు అసోం యువతిపై లైంగికదాడికి పాల్పడ్డాడు. టిన్సుకియా జిల్లా పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేయగా, అతనికి సహకరించిన మరో ఇద్దరి కోసం గాలిస్తున్నారు. బెంగళూరులో పనిమనిషిగా పనిచేస్తున్న బాధితురాలు (20) దుర్గా పూజ కోసం సొంతూరు అసోంలోని టిన్సుకియా వెళ్లేందుకు రైల్లో బయల్దేరింది. ఆమెతో పాటు అదే కంపార్టుమెంట్లో ప్రయాణిస్తున్న చాలామంది ప్రయాణికులు డిబ్రుగఢ్ స్టేషన్లో దిగిపోయారు. గురువారం రాత్రి ఆ కంపార్టుమెంట్లో ఉన్న ముగ్గురు యువకులు.. ఆ యువతిని టాయ్లెట్లోకి లాక్కెళ్లగా, వీరిలో ఒకడు దారుణానికి పాల్పడ్డాడు. శుక్రవారం ఉదయం రైలు టిన్సుకియా స్టేషన్‌కు చేరుకున్న తర్వాత తనను తీసుకెళ్లేందుకు వచ్చిన సోదరుడికి బాధితురాలు జరిగిన విషయం చెప్పింది. అతను రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకుని విచారిస్తున్నారు. ప్రధాన నిందితుడు ప్రహ్లాద్ ఛెత్రిని పోలీసులు అరెస్ట్ చేశారు. మరో ఇద్దరు నిందితులు ఆమెపై అఘాయిత్యానికి పాల్పడలేదని, నిందితుడికి సహకరించారని పోలీసులు చెప్పారు. -
క్యాబ్‌లో మహిళపై అత్యాచారం.. డ్రైవర్ అరెస్ట్
భోపాల్: మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో క్యాబ్ డ్రైవర్.. ఓ మహిళపై అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో పనిచేస్తున్న మహిళ.. ఈ నెల 29న ఇంటికి వెళ్లేందుకు క్యాబ్‌ను తీసుకుంది. డ్రైవర్ దీపక్ బమానె కొంతదూరం వెళ్లాక క్యాబ్‌ను ఆపి ఆమెపై లైంగికదాడికి పాల్పడ్డాడు. ఈ విషయం బయటకు చెబితే చంపేస్తానని ఆమెను హెచ్చరించి వెళ్లిపోయాడు. ఇంటికి వెళ్లాక బాధితురాలు జరిగిన విషయాన్ని తన భర్తకు చెప్పింది. జనవరి 1న బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిందితుడు బాధితురాలి ఇంటి సమీపంలోనే నివస్తున్నాడని, అతనికి ఆమె తెలుసని పోలీసులు దర్యాప్తులో తెలుసుకున్నారు. పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. -
యువతిపై క్యాబ్ డ్రైవర్ అత్యాచారం
న్యూఢిల్లీ: దేశ రాజధానిలో మరో దారుణం జరిగింది. క్యాబ్ డ్రైవర్ ఓ యువతిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. వివరాలిలా ఉన్నాయి. గురువారం రాత్రి ద్వారకా మెట్రో స్టేషన్ నుంచి ఇంటికి వెళ్లేందుకోసం బాధితురాలు క్యాబ్‌ను అద్దెకు మాట్లాడుకుంది. క్యాబ్ డ్రైవర్ ఆమెను నిర్జన ప్రదేశానికి తీసుకువెళ్లి, క్యాబ్‌లోనే ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి క్యాబ్ డ్రైవర్‌ను అరెస్ట్ చేశారు. -
యువతిపై జిమ్ ట్రైనర్ అత్యాచారం
యువతికి మత్తుమందు కలిపిన కూల్ డ్రింక్ ఇచ్చి అపై అత్యాచారం చేశాడు ఓ జిమ్ ట్రైనర్. ఆ ఘటన దక్షిణ ఢిల్లీలోని సరోజిని నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. దాంతో సదరు యువతి పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అందులోభాగంగా జిమ్ ట్రైనర్ తరుణ్‌ను అరెస్ట్ చేసినట్లు పోలీసులు సరోజిని నగర్ పోలీసులు వెల్లడించారు. బాధితురాలు (30) స్థానికంగా వ్యాపారం చేసుకుంటు జీవనం సాగిస్తుంది. అయితే కొద్ది నెలల క్రితం ఆమె జిమ్‌లో చేరటంతో.... ఆమెకు జిమ్ ట్రైనర్ తరుణ్ శిక్షణ ఇస్తున్నాడు. ఆ క్రమంలో ఆమెకు కూల్ డ్రింక్ ఇచ్చిడు. ఆమె ఆ డ్రింక్ తాగి అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో ఆమెపై అత్యాచారం చేశాడు. అనంతరం ఆ విషయం ఎక్కడైన చెబితే చంపెస్తానని బెదిరించాడు. దాంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు నిందితుడిని అతడి నివాసంలో అరెస్ట్ చేశారు.