
యువతిపై క్యాబ్ డ్రైవర్ అత్యాచారం
న్యూఢిల్లీ: దేశ రాజధానిలో మరో దారుణం జరిగింది. క్యాబ్ డ్రైవర్ ఓ యువతిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. వివరాలిలా ఉన్నాయి.
గురువారం రాత్రి ద్వారకా మెట్రో స్టేషన్ నుంచి ఇంటికి వెళ్లేందుకోసం బాధితురాలు క్యాబ్ను అద్దెకు మాట్లాడుకుంది. క్యాబ్ డ్రైవర్ ఆమెను నిర్జన ప్రదేశానికి తీసుకువెళ్లి, క్యాబ్లోనే ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి క్యాబ్ డ్రైవర్ను అరెస్ట్ చేశారు.