narco test
-
కోల్‌కతా అభయ కేసులో బిగ్ ట్విస్ట్.. సీబీఐకి ఎదురుదెబ్బ
కోల్‌కతా: బెంగాల్‌లోని ఆర్జీకార్ ఆసుపత్రిలో చోటుచేసుకున్న అభయ హత్యాచార ఘటన దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ కేసును సీబీఐ దర్యాప్తు చేస్తోంది. ఈ క్రమంలో నిందితుడి విషయంలో సీబీఐ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్‌కి నార్కో అనాలసిస్ పరీక్ష చేయడానికి సీబీఐ సిద్ధమైంది ఈ క్రమంలో కోర్టును ఆశ్రయించగా సీబీఐకి ధర్మాసనం షాకిచ్చింది. కోల్‌కతా హత్యాచార ఘటనలో నిందితుడు సంజయ్ రాయ్‌కు నార్కో పరీక్షలు నిర్వహించేందుకు న్యాయస్థానం అనుమతి నిరాకరించింది. నిందితుడికి నార్కో పరీక్షకు అనుమతివ్వాలన్న సీబీఐ పిటిషన్‌ను ధర్మాసనం కొట్టివేసింది. దీంతో, సీబీఐ ప్లాన్ ఫెయిల్ అయ్యింది. RG Kar Medical College and Hospital rape-murder case | Arrested accused Sanjay Roy refuses to give consent for Narco analysis test. The Sealdah Court in Kolkata rejected the CBI's prayer for Sanjay Roy's narco-analysis test.— ANI (@ANI) September 13, 2024 అయితే, అభయ హత్యాచార ఘటన కేసులో నిందితుడు సంజయ్ రాయ్‌కు సీబీఐ ఇప్పటికే పాలీగ్రాఫ్ పరీక్ష నిర్వహించింది. ఈ పరీక్షకు సంబంధించిన వివరాలను సీబీఐ బయటకు వెల్లడించలేదు. ఇక, పాలీగ్రాఫ్ పరీక్షలో నిందితుడులు చెప్పిన విషయాలను అధికారులు గోప్యంగా ఉంచారు. మరోవైపు.. పాలీగ్రాఫ్ టెస్టులో సంజయ్ మాత్రం తాను ఏ తప్పు చేయలేదని సీబీఐ అధికారులకు చెప్పాడనే లీకులు బయటకు రావడం గమనార్హం. తాను వెళ్లేసరికే ఆ వైద్యురాలు చనిపోయి ఉందని, తాను భయంతో పారిపోయానని అతడు చెప్పినట్లు జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే అభయ కేసుకు సంబంధించి అసలు నిజాలను రాబట్టేందుకే నిందితుడు సంజయ్ రాయ్‌కు నార్కో పరీక్షలు నిర్వహించాలని సీబీఐ భావించింది. #WATCH | RG Kar Medical College and Hospital rape-murder case | West Bengal: Arrested accused Sanjay Roy being brought out of Sealdah Court in Kolkata.He was brought to the Court from Presidency Correctional Home for a hearing related to his Narco test. CBI filed a petition to… pic.twitter.com/XhReY58vdb— ANI (@ANI) September 13, 2024 నార్కో టెస్ట్ ఇలా.. ఈ పరీక్షకి ముందు కొన్ని మందులు లేదంటే ఇంజెక్షన్లు(సోడియం పెంటోథాల్, స్కోపలామైన్, సోడియం అమైథాల్) ఇస్తారు. తద్వారా నిందితుడు/అనుమానితుడు అపస్మార స్థితిలోకి జారుకుంటాడు. మనస్సుపై నియంత్రణ కోల్పోతాడు. అప్పుడు అతని ద్వారా నిజాలు రాబట్టే ప్రయత్నాలు చేస్తారు. అయితే.. కొన్ని సందర్భాల్లో, సదరు వ్యక్తి అపస్మారక స్థితికి చేరుకోవచ్చు. డోస్ ఎక్కువగా ఇస్తే కోమాలోకి వెళ్లిపోవడం లేదంటే చనిపోవచ్చూ కూడా. కాబట్టి, నార్కో టెస్ట్‌కు కోర్టు లేదంటే దర్యాప్తు సంస్థల అనుమతి తప్పనిసరి. అంతేకాదు.. అతను నార్కో టెస్ట్‌కు అర్హుడేనా? అనేది కూడా బాడీ టెస్ట్ ద్వారా ధృవీకరించుకుంటారు. ఫోరెన్సిక్ నిపుణులు, దర్యాప్తు అధికారులు, వైద్యులు, మనస్తత్వవేత్తల సమక్షంలో ఈ పరీక్ష జరుగుతుంది. పరీక్ష జరిగే టైంలో వీళ్లలో ఎవరు అభ్యంతరం వ్యక్తం చేసినా.. ఆ టెస్ట్ ఆపేయాల్సిందే!.. ఇక కొందరు ఈ పరీక్షలో కూడా దర్యాప్తు బృందం నుంచి తప్పించుకుంటున్నారు. అందుకే ఈ పరీక్షపైనా తరచూ విమర్శలు వినిపిస్తుంటాయి. కానీ, మన దేశంలో నార్కో టెస్ట్, పాలీగ్రాఫ్ టెస్ట్‌ల ద్వారా కేసుల దర్యాప్తులో పురోగతి సాధించిన సందర్భాలు, కేసుల చిక్కుముడులు విప్పిన దాఖలాలే ఎక్కువగా నమోదు అయ్యాయి.గతంలో చాలా కీలకమైన కేసులను ఛేదించడంలో ఈ పద్ధతులను ఉపయోగించారు. 2002లో జరిగిన గుజరాత్ అల్లర్ల కేసు, అబ్దుల్ కరీం తెల్గీ స్టాంపు పేపర్ల కుంభకోణం, 2006లో నోయిడా సీరియల్ మర్డర్స్, 26/11 ముంబయి ఉగ్రదాడి కేసులో కసబ్ విచారణ సమయంలో నార్కో పరీక్షలు నిర్వహించారు.పాలీగ్రాఫ్ టెస్ట్ ఎలా ఉంటుందంటే.. పాలీగ్రాఫ్ టెస్ట్.. నేర పరిశోధనలో ప్రయోగాత్మకమైన పద్ధతి. దీన్ని లైడిటెక్టర్ పరీక్ష అని కూడా వ్యవహరిస్తుంటారు. నిజాలను రాబట్టడం అనడం కంటే.. అబద్ధాలను గుర్తించడం అనే ట్యాగ్‌తో ఈ పరీక్షగా ఎక్కువగా పాపులర్ అయ్యింది. 1921లో కాలిఫోర్నియా యూనివర్సిటీ మెడికో జాన్ అగస్టస్ లార్సన్ ఈ విధానాన్ని కనిపెట్టారు. ఎలక్ట్రానిక్ యంత్రాల సాయంతో ఈ పరీక్ష నిర్వహిస్తారు. వైర్లు, ట్యూబుల్లాంటి వాటితో శరీరానికి సెన్సార్ల వంటి నిర్దిష్ట పరికరాలను జోడించి.. బీపీ, పల్స్, వివిధ భావోద్వేగాలు, శరీర కదలికలను జాగ్రత్తగా పర్యవేక్షించడం ద్వారా ఈ టెస్ట్ నిర్వహిస్తుంటారు.శరీరం ఎలా స్పందిస్తుందో నిశితంగా గమనించి ఆ వ్యక్తి చెప్పేది నిజమో అబద్ధమో అనే నిర్ధారణకు అధ్యయనం చేపట్టడం ద్వారా వస్తారు. క్రిమినల్ కేసుల దర్యాప్తుల్లో కీలకంగా వ్యహరిస్తుంటుంది ఈ పరీక్ష. కానీ, ఇదే ఫైనల్ రిజల్ట్ అనుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే.. నేరస్థులు ప్రాక్టీస్ ద్వారా ఈ పరీక్ష నుంచి తప్పించుకున్న దాఖలాలు బోలెడు ఉన్నాయి. అందుకే ఈ పరీక్ష కచ్చితత్వంపై తరచూ విమర్శలు వినిపిస్తుంటాయి.ఇది కూడా చదవండి: ట్రెయినీ ఆర్మీ అధికారులపై దాడి -
నార్కో టెస్ట్ చేయాలంటూ రెజ్లర్లు డిమాండ్.. బీజేపీ ఎంపీ స్పందన ఇదే
రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా చీఫ్(డబ్ల్యూఎఫ్ఐ), బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌ని లైంగిక వేధింపుల ఆరోపణల నేపథ్యంలో అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ రెజ్లర్లు జంతమంతర్ వద్ద నిరసనలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో హర్యానాలోని మెహమ్‌లో జరిగిన ఖాప్ పంచాయతీ సమావేశం బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ నార్కో పరీక్ష చేయించుకునేలా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ తీర్మానాన్ని ఆమోదించింది. ఈ విషయంపై బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ సానుకూలంగా స్పందించారు. నార్కో టెస్ట్, పాలిగ్రాఫ్ టెస్ట్ లేదా లై డిటెక్టర్ తదితరాలు చేయించుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. ఐతే అందుకు తనకు ఒక షరతు ఉందంటూ.. వినేష్ ఫోగట్, బజరంగ్పునియా కూడా ఆ పరీక్షలు చేయించుకోవాలన్నారు. రెజ్లర్లు ఇద్దరూ తమ పరీక్షను పూర్తి చేయడానికి సిద్ధంగా ఉంటే ఇప్పుడూ కాల్ చేసి ప్రకటించండని చెప్పారు. ఆ వెంటనే తాను కూడా అందుకు సిద్ధంగా ఉండటమే గాదు చేయించుకుంటానని వాగ్దానం కూడా చేస్తున్నానని ఫేస్బుక్ పోస్ట్‌లో తెలిపారు. ఇదిలా ఉండగా డబ్ల్యూఎఫ్ చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ మాత్రం తాను ఎలాంటి తప్పు చేయలేదని రెజ్లర్లు కావాలనే తనను ఇరికించారని ఆరోపణలు చేస్తున్నారు. ఈ విషయమై సుప్రీం కోర్టు జోక్యంతో ఢిల్లీ పోలీసులు ఆయనపై రెండు వేర్వేరు కేసులు నమోదు చేయడం జరిగింది. అయినా తాను 2014లో రాజకీయాల నుంచి తప్పుకోవాలనుకున్నానని, కానీ కేంద్ర హోం మంత్రి అమిత్ షా పట్టుపట్టడం వల్లే కొనసాగానని శరణ్ సింగ్ చెప్పుకొచ్చారు. కాగా, గోండాలో ఉన్న కైసర్‌గంజ్‌కు చెందిన బీజేపీ ఎంపీ శరణ్ సింగ్ తన లోక్‌సభ నియోజకవర్గంలో పలు కార్యక్రమాల్లో పాల్గొంటూ ప్రజలను కలవడమే గాక జూన్ 5న అయోధ్యలో నిర్వహించనున్న చేతన మహా ర్యాలీకి ప్రజల మద్దతును కోరడం విశేషం. రెజ్లర్ల విషయమే ఆయన్ను ప్రశ్నించగా..అబద్ధాలు చెప్పాలనుకుంటే వారు చెప్పగలరని, ఎవ్వరు వారిని ఆపలేరని బీజేపీ ఎంపీ శరణ్ సింగ్ విమర్శించారు. (చదవండి: కేంద్రంతో వివాదంలో మా మద్దతు మీకే) -
శ్రద్ధ హత్య కేసు.. నేరం అంగీకరించని అఫ్తాబ్.. పోలీస్ కస్టడీ పొడిగింపు
న్యూఢిల్లీ: శ్రద్ధ వాకర్ హత్య కేసు నిందితుడు అఫ్తాబ్ అమీన్ పూనావాలా పోలీస్ కస్టడీని మరో నాలుగు రోజులు పొడిగించింది ఢిల్లీ కోర్టు. ఈ కేసులో ఇంకా కీలక ఆధారాలు సేకరించాల్సి ఉందని పోలీసులు కోరడంతో అంగీకరించింది. సాకెత్ కోర్టులో మంగళవారం విచారణ సందర్భంగా ఈ ఘటన క్షణికావేశంలోనే జరిగిందని అఫ్తాబ్ కోర్టుకు చెప్పాడు. విచారణ అనంతరం అఫ్తాబ్ తరఫు న్యాయవాది అవినాశ్ మాట్లాడుతూ.. అతడు ఇంకా కోర్టులో నేరాన్ని అంగీకరించలేదని పేర్కొన్నాడు. ఘటన సమయంలో డ్రగ్స్ మత్తులో ఉన్నట్లు కూడా న్యాయస్థానం ఎదుట ఒప్పుకోలేదని వివరించాడు. అఫ్తాబ్ కుటుంబ సభ్యులు అతడ్ని కలిసేందుకు అనుమతి ఇవ్వాలని కోరగా.. కోర్టు అనుమతి ఇచ్చినట్లు చెప్పారు. మరోవైపు అఫ్తాబ్‌కు ఐదు రోజుల్లో నార్కో టెస్టు నిర్వహించాలని గత సెషన్లో కోర్టు ఆదేశాలిచ్చింది. అయితే అతను విచారణకు సహకరించడం లేదని, తప్పుడు సమాచారం ఇస్తున్నాడని పోలీసులు కోర్టుకు తెలిపారు. అందుకే నార్కో టెస్టుకు ముందు పాలీగ్రాఫ్ టెస్టు నిర్వహించేందుకు అనుమతించాలని కోర్టును కోరారు. శ్రద్ధ హత్య కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఆరు నెలల క్రితం జరిగిన ఈ దారుణ ఘటన ఇటీవలే వెలుగులోకి వచ్చింది. శ్రద్ధ బాయ్ ఫ్రెండ్ అఫ్తాబే ఆమెను హత్య చేశాడు. అనంతరం మృతదేహాన్ని 35 ముక్కలు చేసి అడవిలో పడేశాడు. అయితే ఈ కేసులో అఫ్తాబ్ ఉపయోగించిన కత్తి, శ్రద్ధ దుస్తులు, మొబైల్ ఫోన్, ఇంకా కొన్ని శరీర భాగాలను పోలీసులు స్వాధీనం చేసుకోవాల్సి ఉంది. చదవండి: అత్యాచార బాధితురాలి నుంచి లంచం తీసుకున్న మహిళా పోలీస్.. -
Shraddha murder case: నార్కో పరీక్షలకు కోర్టు అనుమతి
ఢిల్లీ: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన శ్రద్ధా వాకర్ హత్య కేసులో నిందితుడైన అఫ్తాబ్ అమీన్ పూనావాలాకు నార్కో పరీక్షలు నిర్వహించడానికి గురువారం ఢిల్లీ కోర్టు అనుమతిచ్చింది. ఇందుకోసం మరో అయిదు రోజులు పోలీసు కస్టడీని పొడిగించింది. మెట్రోపాలిటిన్ మేజిస్ట్రేట్ శుక్లా నార్కో పరీక్షలకు నిర్వహించడానికి అనుమతినిస్తూ ఆదేశాలు జారీ చేశారు. అఫ్తాబ్ విచారణ జరిగినప్పుడు కోర్టు వెలుపల భారీ సంఖ్యలో నిరసనకారులు చేరుకొని వెంటనే అతనిని ఉరి తీయాలని డిమాండ్ చేశారు. దీంతో అఫ్తాబ్‌ను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. పెళ్లి చేసుకొమ్మని ఒత్తిడి తెచ్చినందుకు తనతో సహజీవనం చేస్తున్న శ్రద్ధా వాకర్‌ను గొంతు నులిపి హత్య చేసి, ఆమె శరీరాన్ని 35 ముక్కలుగా కోసి, ఫ్రిజ్‌లో ఉంచి కొన్ని రోజుల పాటు దాచి తర్వాత అఫ్తాబ్ ఆ ముక్కలను పారేయడం తెలిసిందే. హత్యాయుధం దొరక్కపోవడంతో పోలీసులు నార్కో పరీక్షలకు అనుమతి కోరారు. ముఖాన్ని కాల్చేసి.. పోలీసుల విచారణలో అఫ్తాబ్ అమీన్ ఒళ్లు జలదరించే విషయాలు బయటపెడుతున్నాడు. సాక్ష్యాధారాలు లేకుండా చేయడానికి ఎన్నో హేయమైన చర్యలకు దిగాడు. ఆమె ముఖం ఎవరూ గుర్తు పట్టకుండా కాల్చినట్టుగా పోలీసుల ఎదుట అంగీకరించాడు. కట్టెలా బిగుసుకుపోయిన మృతదేహం కొయ్యడానికి వీలుగా వేడినీళ్లలో బ్లీచింగ్ పౌడర్ కలిపి వేశానని, అప్పుడే శవాన్ని కొయ్యగలిగానని పోలీసులు దగ్గర చెప్పినట్టుగా తెలుస్తోంది. ఢిల్లీలో నెలకి 20వేల లీటర్ల వరకు నీళ్లు ఉచితమైనా అతని ఫ్లాట్‌కి నీటి బిల్లు రూ.300 పైగా రావడానికి కారణాలను కనుగొన్నారు. మృతదేహాన్ని కోస్తున్నప్పుడు చప్పుడు బయటకు వినిపించకుండా నీళ్ల పైపులు తిప్పి ఉంచాడని, ఇంట్లో మరకలు కనిపించకుండా తరచూ ఫ్లాట్‌ని కడిగేవాడని పోలీసులు విచారణలో తేలింది. వారిద్దరి మధ్య తరచూ ఆర్థిక లావాదేవీలకు సంబంధించి గొడవలు అవుతూ ఉండేవని తెలుస్తోంది. -
శ్రద్ధ హత్యకేసు.. అఫ్తాబ్‌కు ఐదు రోజుల కస్టడీ.. ఉరితీయాలని డిమాండ్
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన శ్రద్ధ వాకర్ హత్య కేసు నిందితుడు అఫ్తాబ్ పూనావాలాకు ఢిల్లీ సాకెత్ కోర్టు ఐదు రోజుల పోలీసు కస్టడీ విధించింది. అలాగే నార్కో టెస్టు నిర్వహించేందుకు కూడా అనుమతించింది. దీంతో ఢిల్లీ పోలీసులు అతడికి కీలకమైన నార్కో టెస్టు నిర్వహించనున్నారు. అఫ్తాబ్‌ను గురువారం సాయంత్రం 4 గంటలకు కోర్టు ఎదుట వర్చువల్‌గా హాజరుపరిచారు ఢిల్లీ పోలీసులు. అతనిపా దాడి జరిగే అవకాశం ఉన్నందున భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నారు. న్యాయస్థానం కూడా ఈ కేసు సున్నితత్వాన్ని పరిగణననలోకి తీసుకుని వర్చువల్‌గా విచారించింది. ఉరితీయాలని డిమాండ్.. అయితే విచారణ సమయంలో కోర్టు రూం బయట న్యాయవాదులు పదుల సంఖ్యలో గుమికూడటంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అఫ్తాబ్‌కు ఉరిశిక్ష విధించాలని వారంతా డిమాండ్ చేశారు. డిల్లీ మెహ్రౌలీలో జరిగిన శ్రద్ధ వాకర్ హత్య కేసు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ప్రియుడు అఫ్తాబ్ ఆమెను దారుణంగా హత్య చేశాడు. అనంతరం శరీరాన్ని 35 ముక్కలు చేసి ఫ్రిజ్‌లో దాచాడు. ఆ తర్వాత కొన్ని రోజులపాటు ఒక్కో భాగాన్ని వేర్వేరుగా అడవిలో, ఇతర ప్రదేశాల్లో పడేశాడు. పోలీసులు కొన్ని శరీర భాగాలను స్వాధీనం చేసుకున్నారు. అవి శ్రద్ధవో కాదో ఇంకా అధికారికంగా ధ్రువీకరించాల్సి ఉంది. అలాగే మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా చేసిన కత్తిని, శ్రద్ధ మొబైల్ ఫోన్‌ను కూడా పోలీసులు స్వాధీనం చేసుకోవాల్సి ఉంది. ఈ నేపథ్యంలోనే మరో ఐదు రోజులు అఫ్తాబ్‌ను కస్టడీలో ఉంచాలని పోలీసులు కోరగా.. న్యాయస్థానం అందుకు అంగీకరించింది. చదవండి: మూడు నెలల క్రితం తండ్రి మృతి.. తల్లి కాల్ రికార్డు విని కూతురు షాక్ -
హథ్రాస్ ఘటన: ‘నార్కొ టెస్టు వారికే చేయండి’
లక్నో: నిందితులతో సహా బాధితురాలి కుటుంబ సభ్యులకు కూడా నార్కో ఎనాలసిస్ పరీక్షలు చేయాలన్న ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) సూచనల్ని హథ్రాస్ బాధిత కుటుంబం ఖండించింది. ఆ సూచనలు చేసినవారే టెస్టులు చేయించుకోవాలని మండిపడింది. కాగా, దారుణం వెలుగుచూసిన ఐదు రోజుల తర్వాత తొలిసారి మీడియాను గ్రామంలోకి అనుమతించారు. గ్రామంలో సిట్ దర్యాప్తు పూర్తి కావడంతో.. మీడియాపై నిషేదాన్ని ఎత్తివేశామని పోలీసులు తెలిపారు. దీంతో గ్రామంలోకి వెళ్లిన జాతీయ మీడియా ప్రతినిధులు బాధితురాలి ఇంటిని పరిశీలించారు. ప్రస్తుతానికి మీడియాను అనుమతించామని, పైనుంచి ఆదేశాలు వస్తే ఎవరినైనా అనుమతిస్తామని పోలీసులు చెప్పారు. బాధిత కుంటుంబ సభ్యుల ఫోన్లను స్వాధీనం చేసుకున్నామని, వారిని గృహ నిర్బంధం చేశామని వస్తున్న ఆరోపణలు నిజం కాదని అన్నారు. (చదవండి: ప్రియాంక డ్రైవింగ్.. పక్కనే రాహుల్ గాంధీ) కాగా, హథ్రాస్ గ్రామంలో పొలం పనులు చేసుకుంటున్న 20 ఏళ్ల యువతిపై సెప్టెంబర్ 14న నలుగురు వ్యక్తులు దారుణానికి ఒడిగట్టారు. ఆమెపై అత్యాచారానికి పాల్పడి పాశవికంగా హతమార్చారు. ఢిల్లీలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గత మంగళవారం ఆమె మరణించింది. ఇక బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు న్యాయం చేయాలని రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ గత గురువారం హథ్రాస్ పర్యటనకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్న సంగతి తెలిసిందే. దీంతో కాంగ్రెస్, కేంద్ర సర్కారు మధ్య పరస్పర విమర్శల దాడి కొనసాగుతోంది. ఈక్రమంలోనే నేడు (శనివారం) రాహుల్, ప్రియాంక మరోసారి హథ్రాస్ పర్యటనకు బయల్దేరి వెళ్లారు. (చదవండి: రాజకీయాలు కాకుంటే.. మళ్లీ ఎందుకు?) -
ఆయేషా కేసు : నార్కో పరీక్షల తీర్పు వాయిదా
సాక్షి, హైదరాబాద్: బి.ఫార్మసీ విద్యార్థిని ఆయేషా మీరా హత్యాచార కేసులో ఏడుగురు అనుమానితులకు నార్కో పరీక్షలపై తీర్పు వాయిదా పడింది. ఈ కేసులో ప్రధాని నిందితులకు నార్కో ఎనాలసిస్ నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) హైదరాబాద్ హైకోర్టును ఆశ్రయించింది. ఈ కేసు పునర్విచారణలో భాగంగా ప్రధాన నిందితులకు నార్కో ఎనాలిసిస్ పరీక్షకు అనుమతిని విజయవాడలోని ట్రయిల్ కోర్టు నిరాకరించడంతో హైకోర్టును ఆశ్రయించింది. నిందితుల అంగీకారం లేకుండా నార్కో టెస్టులను నిర్వహించరాదన్న సుప్రీంకోర్టు ఉత్తర్వులను ఉదహరిస్తూ స్థానిక కోర్టు సిట్ అభ్యర్థనను తోసిపుచ్చింది. దీనిపై వాదనల అనంతరం హైదరాబాద్ హైకోర్టు న్యాయమూర్తి ఎన్. బాలయోగి తన తీర్పును వాయిదా వేశారు. అయితే హాస్టల్ వార్డెన్, ఆమె భర్త మాత్రమే ఈ పరీక్షలకు అంగీకరించగా, మిగిలిన వారు నిరాకరించారు. ఆయేషా మీరా హత్య కేసులోప్రధాన నిందితులు కోనేరు సతీష్ బాబు(కాంగ్రెస్ మాజీమంత్రి కోనేరు రంగారావు మనవడు) అబ్బురి గణేష్, చింతా పవన్‌కుమార్‌తోపాటు, హాస్టల్ వార్డెన్ ఐనంపూడి పద్మ, ఆమె భర్త శివ రామకృష్ణ, ఆయేషా రూం మేట్స్, సౌమ్య, కవితకు ఈ పరీక్షలు నిర్వహించాలని ఎస్ఐటీ పేర్కొంది. నార్కో ఎనాలలిసిస్, బ్రెయిన్ ఎలక్ట్రికల్ ఆసిలేటింగ్ సిగ్నేచర్ ప్రొఫైలింగ్ టెస్ట్ (BEOSP) నిర్వహించాలని కోరింది. అలాగే ఈ ఫలితాలను గుజరాత్‌లోని ఫోరెన్సిక్ సైన్స్ లాబోరేటరీ (FSL) కు పంపించాలని కోరింది. మరోవైపు ఆయేషా హత్య కేసులో సాక్ష్యాలను మాయం చేశారని ఆరోపిస్తూ ఆయేషా తల్లిదండ్రులు గత నెలలో మరోసారి ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయ పలుకుబడితో నేరస్తులను కాపాడేందుకు తమ కూతురి బట్టలు, ఇతర సాక్ష్యాలను నాశనం చేశారని ఆరోపించారు. కాగా 2007, డిసెంబరు 27న ఆయేషా మీరా (17) విజయవాడ ఇబ్రహీంపట్నంలోని లేడీస్ హాస్టల్లో దారుణ హత్యకు గురైంది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఆరోపణల ఎదుర్కొన్న సత్యం బాబుకు 2010లో విజయవాడలోని మహిళా సెషన్స్ కోర్టు జీవిత ఖైదు విధించింది. అయితే 2017, ఏప్రిల్‌లో సత్యంబాబును హైదరాబాద్ హైకోర్టు నిర్దోషిగా విడుదల చేయడంతోపాటు, కేసు దర్యాప్తు చేసిన పోలీసు అధికారులపై చర్య తీసుకోవాలని ఆదేశించింది. దీంతో కేసును తిరిగి దర్యాప్తు చేయాలని ప్రభుత్వం సిట్‌ను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. -
కోర్టులో మాట మార్చాడు
సాక్షి, బెంగళూరు: ప్రముఖ పాత్రికేయురాలు గౌరీలంకేశ్ హత్య కేసులో ప్రధాన నిందితుడు, షూటర్ పరశురామ్ వాగ్మారే గురువారం మెజిస్ట్రేట్ కోర్టు ముందు మాట మార్చాడు. ఇంతవరకు గౌరీలంకేశ్‌ను తుపాకీతో కాల్చి చంపింది తానే అని ప్రత్యేక విచారణ బృందం(సిట్) ముందు తెలిపిన వాగ్మారే.. కాల్పులు జరిపింది తాను కాదని జడ్జి ముందు చెప్పడంతో సిట్ అధికారులు కంగుతిన్నారు. సుమారు 9 నెలల పాటు గాలించి సిట్ అధికారులు ఆరుగురు నిందితులను అరెస్టు చేశారు. వీరిలో వాగ్మారేనే సిట్‌కు హత్యాక్రమాన్ని వివరించాడు. తానే కాల్పులు జరిపానని కూడా తెలిపాడు. ఈ నేపథ్యంలో అతన్ని జ్యుడిషియల్ కస్టడీపై బెంగళూరు పరప్పన అగ్రహార సెంట్రల్ జైలుకు పంపారు. గురువారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా 19వ అదనపు మెట్రోపాలిటన్ కోర్టు మెజిస్ట్రేట్ విచారణ జరిపారు. వాగ్మారే వాంగ్మూలమిస్తూ గౌరి హత్య కేసుతో తనకు సంబంధం లేదని ఒక్కసారిగా తిరగబడ్డాడు. విచారణ అనంతరం వాగ్మారేకు కోర్టు జూలై 11 వరకు జ్యుడీషియల్ కస్టడీని పొడిగించింది. మరో నిందితునికి నార్కో పరీక్షలు ఈ కేసులో మరో నిందితుడు కేటీ.నవీన్‌కుమార్‌కు నార్కో అనాలసిస్ పరీక్షలు జరపడానికి సిట్ న్యాయవాదులు కోర్టు నుంచి అనుమతి తీసుకున్నారు. గౌరి హత్యకు ఉపయోగించిన తూటాలు, నిందితుడు చెబుతున్న పిస్టల్‌కు సరిపోలడం లేదని సిట్ చెబుతోంది. దీంతో నార్కో పరీక్షల ద్వారా అతని నుంచి సమాచారం రాబట్టాలని సిట్ నిర్ణయించింది. -
అసిఫా కుటుంబానికి రక్షణ ఇవ్వండి
న్యూఢిల్లీ/కఠువా: కఠువాలో సామూహిక అత్యాచారం, హత్యకు గురైన చిన్నారి అసిఫా కుటుంబానికి, ఈ కేసులో బాధితులకు సాయపడుతున్న న్యాయవాదితో పాటు వారి కుటుంబ స్నేహితుడికి రక్షణ కల్పించాలని జమ్మూ కశ్మీర్ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. అలాగే కేసు విచారణను కఠువా నుంచి చండీగఢ్ మార్చాలన్న బాధితురాలి తండ్రి పిటిషన్‌ను కూడా సుప్రీం సోమవారం పరిగణనలోకి తీసుకుంది. ఈ అంశంపై స్పందన తెలియజేయాలని కశ్మీర్ ప్రభుత్వానికి సూచించింది. ఈ కేసులో జమ్మూ కశ్మీర్ పోలీసుల దర్యాప్తు పట్ల తాను సంతృప్తిగా ఉన్నానని బాధితురాలి తండ్రి సుప్రీంకు వెల్లడించడంతో పాటు, సీబీఐ విచారణను వ్యతిరేకిస్తున్నట్లు తెలిపాడు. ఈ సందర్భంగా కోర్టు స్పందిస్తూ.. ‘ఈ స్థితిలో కేసును సీబీఐకి బదిలీ చేసే అంశంపై జోక్యం చేసుకునే ఉద్దేశ్యం మాకు లేదు’ అని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ ఏఎం ఖన్విల్కర్, జస్టిస్ డీవై చంద్రచూడ్‌ల ధర్మాసనం పేర్కొంది. ‘బాధితురాలి కుటుంబానికి, న్యాయవాది దీపక్ సింగ్ రజావత్, కుటుంబ స్నేహితుడు తలిద్ హుస్సేన్‌కు భద్రతను పెంచాలని జమ్మూ కశ్మీర్ పోలీసులను ఆదేశిస్తున్నాం. జమ్మూలో మతపరమైన ఉద్రిక్త పరిస్థితులు నెలకొనే అవకాశమున్న నేపథ్యంలో కేసు విచారణను బదిలీ చేసే అంశంపై ఏప్రిల్ 27లోగా రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలి’ అని ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ కేసుతో సంబంధమున్న మైనర్‌కు తగిన భద్రత కల్పించాలనీ ఆదేశించింది. కేసుతో సంబంధమున్న వారి పిటిషన్లను మాత్రమే విచారిస్తామంది. సీనియర్ న్యాయవాది ఇందిరా జైసింగ్ ప్రస్తావించిన పిటిషన్లను విచారించేందుకు అంగీకరించింది. విధులకు హాజరైన జమ్మూ న్యాయవాదులు కఠువా కేసును సీబీఐకి అప్పగించాలని కోరడంతో పాటు పలు డిమాండ్లతో 12 రోజులుగా విధులు బహిష్కరించిన జమ్మూ హైకోర్టు బార్ అసోసియేషన్ న్యాయవాదులు సోమవారం విధుల్లో చేరారు. బార్ అసోషియేషన్ సమావేశంలో నిర్ణయం అనంతరం వారు కోర్టుకు హాజరయ్యారు. సీబీఐకి అప్పగించండి: నిందితులు తాము ఎలాంటి తప్పు చేయలే దని, తమకు నార్కో ఎనాలిసిస్ పరీక్షలు నిర్వహించాలని కఠువా కేసులోని 8మంది నిందితులు కఠువా డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ కోర్టు జడ్జికి విజ్ఞప్తి చేశారు. విచారణ నిమిత్తం సోమవారం వారిని పోలీసులు కోర్టులో హాజరుపర్చారు. నిందితుల తరఫు న్యాయవాదుల విజ్ఞప్తి మేరకు.. చార్జిషీట్ కాపీలు సమర్పిం చాలని పోలీసుల్ని జడ్జి ఆదేశించారు. అనంతరం విచారణను ఏప్రిల్ 28కు వాయిదావేశారు. మరోవైపు విచారణ జరుగుతుండగా.. ప్రధాన నిందితుడు సంజీరామ్ కుమార్తె మధు శర్మ సీబీఐ దర్యాప్తు కోరుతూ కోర్టు బయట ఆందోళన నిర్వహించింది. -
యూపీలో ‘ఉన్నావ్’ వేడి!
లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావ్‌లో ఇటీవల యువతిపై జరిగిన సామూహిక అత్యాచారం కేసు అనూహ్య మలుపులు తిరుగుతోంది. ఈ కేసులో ప్రధాన నిందితుడు అయిన బీజేపీ ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ సెంగార్‌కు ఆయన భార్య మద్దతుగా నిలిచింది. నిజానిజాలు తెలియాలంటే తన భర్తకు, బాధితురాలకి నార్కో పరీక్షలు నిర్వహించడంతో పాటు కేసు విచారణను సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేసింది. అంత్యక్రియలు నిర్వహించకుంటే బాధితురాలి తండ్రి మృతదేహాన్ని భద్రపరచాలని అలహాబాద్ హైకోర్టు యూపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. మరోవైపు, చనిపోయే ముందు ఎమ్మెల్యే మనుషులు యువతి తండ్రిని కొడుతున్న వీడియో ఒకటి వెలుగుచూసింది. ఉన్నావ్‌లో యువతిపై సామూహిక అత్యాచారం, ఆ వెంటే ఆమె తండ్రి కస్టడీలోనే మృతిచెందడం అత్యంత భయానక వాతావరణాన్ని సూచిస్తున్నాయని అంతర్జాతీయ మానవ హక్కుల సంస్థ ఆమ్నెస్టీ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ ఉదంతంపై స్వతంత్ర దర్యాప్తు జరగాలని సూచించింది. -
నార్కో పరీక్షకు సిద్ధం: హరీశ్
డెహ్రాడూన్: ఎమ్మెల్యేలకు డబ్బులు పంచారన్న ఆరోపణలపై పదవీచ్యుత ముఖ్యమంత్రి హరీశ్ రావత్ స్పందించారు. ఎలాంటి విచారణకైనా తాను సిద్ధమేనని,నార్కో అనాలసిస్ పరీక్షలకు కూడా సిద్ధమని ఆయన స్పష్టం చేశారు. తనపై చేసిన స్టింగ్ ఆపరేషన్ లో సీబీఐ ప్రమేయం ఉందని హరీశ్ ఆరోపించారు.రాజకీయ నాయకునిగా తాను పలుమార్లు సీబీఐ ముందు హాజరయ్యానని హరీశ్ రావత్ అన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు మంగళవారం తాను అసెంబ్లీలో బలపరీక్ష నిరూపించుకోవాల్సి ఉందన్నారు. దానికి సంబంధించిన పనులు ఉన్నందువల్లే... సీబీఐ విచారణకు ఇవాళ హాజరు కావడం లేదని ఆయన తెలిపారు. అలాగే తనతో పాటు బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా, ఆ పార్టీ నేతలు కైలాశ్ విజయ్ వర్గియా, భగత్ సింగ్ కొశారి, అజయ్ భట్ లకు సైతం నార్కో పరీక్ష చేయాల్సిందిగా హరీశ్ డిమాండ్ చేశారు. ఎట్టిపరిస్థితుల్లోనూ విశ్వాస పరీక్షలో నెగ్గుతామన్న రావత్.. తాజా వీడియో గురించి తనకేమీ తెలియదన్నారు.