రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా చీఫ్(డబ్ల్యూఎఫ్‌ఐ), బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌ని లైంగిక వేధింపుల ఆరోపణల నేపథ్యంలో అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ రెజ్లర్లు జంతమంతర్ వద్ద నిరసనలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో హర్యానాలోని మెహమ్‌లో జరిగిన ఖాప్ పంచాయతీ సమావేశం బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ నార్కో పరీక్ష చేయించుకునేలా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ తీర్మానాన్ని ఆమోదించింది.
ఈ విషయంపై బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ సానుకూలంగా స్పందించారు. నార్కో టెస్ట్, పాలిగ్రాఫ్ టెస్ట్ లేదా లై డిటెక్టర్ తదితరాలు చేయించుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. ఐతే అందుకు తనకు ఒక షరతు ఉందంటూ.. వినేష్ ఫోగట్, బజరంగ్‌పునియా కూడా ఆ పరీక్షలు చేయించుకోవాలన్నారు. రెజ్లర్లు ఇద్దరూ తమ పరీక్షను పూర్తి చేయడానికి సిద్ధంగా ఉంటే ఇప్పుడూ కాల్ చేసి ప్రకటించండని చెప్పారు. ఆ వెంటనే తాను కూడా అందుకు సిద్ధంగా ఉండటమే గాదు చేయించుకుంటానని వాగ్దానం కూడా చేస్తున్నానని ఫేస్‌బుక్ పోస్ట్‌లో తెలిపారు.
ఇదిలా ఉండగా డబ్ల్యూఎఫ్ చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ మాత్రం తాను ఎలాంటి తప్పు చేయలేదని రెజ్లర్లు కావాలనే తనను ఇరికించారని ఆరోపణలు చేస్తున్నారు. ఈ విషయమై సుప్రీం కోర్టు జోక్యంతో ఢిల్లీ పోలీసులు ఆయనపై రెండు వేర్వేరు కేసులు నమోదు చేయడం జరిగింది. అయినా తాను 2014లో రాజకీయాల నుంచి తప్పుకోవాలనుకున్నానని, కానీ కేంద్ర హోం మంత్రి అమిత్ షా పట్టుపట్టడం వల్లే కొనసాగానని శరణ్ సింగ్ చెప్పుకొచ్చారు.
కాగా, గోండాలో ఉన్న కైసర్‌గంజ్‌కు చెందిన బీజేపీ ఎంపీ శరణ్ సింగ్ తన లోక్‌సభ నియోజకవర్గంలో పలు కార్యక్రమాల్లో పాల్గొంటూ ప్రజలను కలవడమే గాక జూన్ 5న అయోధ్యలో నిర్వహించనున్న చేతన మహా ర్యాలీకి ప్రజల మద్దతును కోరడం విశేషం. రెజ్లర్ల విషయమే ఆయన్ను ప్రశ్నించగా..అబద్ధాలు చెప్పాలనుకుంటే వారు చెప్పగలరని, ఎవ్వరు వారిని ఆపలేరని బీజేపీ ఎంపీ శరణ్ సింగ్ విమర్శించారు.
(చదవండి: కేంద్రంతో వివాదంలో మా మద్దతు మీకే)
Comments
Please login to add a commentAdd a comment