alahabad court
-
అయోద్యలో రామమందిర ప్రారంభానికి ముందు.. హైకోర్టులో పిటిషన్
చారిత్రక నగరం అయోధ్యలోని భవ్య రామమందిరం ప్రారంభోత్సవానికి సమయం సమీపిస్తున్న నేపథ్యంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. జనవరి 22న జరిగే రామ మందిరంలో రామ్ లల్లా విగ్రహ ప్రాణ ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమాన్ని నిలిపివేయాలంటూ అలహాబాద్ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌కు చెందిన భోలా దాస్ ఈ పిటిషన్‌ను దాఖలు చేశారు. ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి సంబంధించి శంకరాచార్యులు లేవనెత్తిన అభ్యంతరాలను తన పిటిషన్లో ప్రస్తావించారు. ప్రస్తుతం పుష్క మాసం నడుస్తుందని.. హిందూ క్యాలెండర్ ప్రకారం ఈ మాసంలో ఎలాంటి మతపరమైన కార్యక్రమాలు నిర్వహించరాదని తెలిపారు. శ్రీరాముని ఆలయం ఇంకా నిర్మాణ దశలోనే ఉందని.. నిర్మాణంలో ఉన్న ఆలయంలో రామ్ లల్లా విగ్రహ ప్రతిష్టించడం సనాతన సంప్రదాయానికి విరుద్ధమని పేర్కొన్నారు. అంతేగాక రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో రాజకీయ ప్రయోజనం కోసం అధికార బీజేపీ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోందని ఆరోపించారు. చదవండి: ఆయోధ్యలో మోదీ.. ప్రతిపక్షాల పరిస్థితి ఏంటి? ఈ పిటిషన్‌పై వెంటనే విచారణ జరపాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ నెల 22న అయోధ్యలో శ్రీ రాముడి విగ్రహ ప్రతిష్ఠాపన జరుగనుంది. ప్రధాని నరేంద్ర మోదీ విగ్రహ ప్రతిష్ఠాపన చేయనున్నారు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ సైతం పాల్గొంటున్నారు. ప్రాణ ప్రతిష్ఠపై శంకరాచార్యులు అభ్యంతరం తెలిపారు. ఆలయం ఇంకా నిర్మాణ దశలోనే ఉంది.. అసంపూర్తిగా ఉన్న ఆలయంలో ఎలాంటి దేవతా విగ్రహాన్ని ప్రతిష్ఠించకూడదు’ అని తన పిటిషన్లో పేర్కొన్నారు. ఈ పిటిషన్‌పై వెంటనే విచారణ జరపాలని ఆయన డిమాండ్ చేశారు. మరోవైపు అయోధ్య రామమందిరంలో రామ్‌లల్లా ప్రాణప్రతిష్టకు ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. ఈ నెల 22న జరిగే ఈ మహా వేడుకకు దేశ విదేశాల నుంచి వేలాది మంది విశిష్ట అతిథులు హాజరు కాబోతున్నారు. బాలరాముడి ప్రతిష్టాపనకు సంబంధించిన సంప్రదాయ క్రతువులు మంగళవారం లాంఛనంగా ప్రారంభమయ్యాయి. ప్రాణప్రతిష్ట దాకా నిరంతరాయంగా కొనసాగుతాయని అయోధ్య తీర్థ క్షేత్ర ట్రస్టు వెల్లడించింది. -
సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వానికి గట్టి ఎదురుదెబ్బ
అలహాబాద్: ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోని ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వానికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓబీసీలకు రిజర్వేషన్లు కల్పిస్తూ తీసుకొచ్చిన ముసాయిదా నోటిఫికెషన్‌ను తోసిపుచ్చింది అలహాబాద్ హైకోర్టు. రాష్ట్ర ప్రభుత్వ డ్రాఫ్ట్ నోటిఫికేషన్‌ను బుట్టదాఖలు చేస్తూ ఓబీసీలకు రిజర్వేషన్ లేకుండానే అర్బణ్ లోకల్ బాడీ ఎన్నికలను నిర్వహించాలని జస్టిస్ డీకే ఉపాధ్యాయ, జస్టిస్ సౌరవ్ లావానియాలతో కూడిన డివిజన్ బెంచ్ తీర్పు ఇచ్చింది. అర్బణ్ లోకల్ బాడీ ఎన్నికల్లో ఓబీసీలకు రిజర్వేషన్లు కల్పిస్తూ డిసెంబర్ 5న ముసాయిదా నోటిఫికేషన్‌ను జారీ చేసింది ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వం. ఉత్తర్‌ప్రదేశ్‌లోని 200 మున్సిపల్ కౌన్సిల్లో 54 ఛైర్పర్సన్ సీట్లు ఓబీసీలకు కేటాయిస్తూ డ్రాఫ్ట్ నోటిఫికేషన్ ఇచ్చింది. అందులో 18 మహిలకు కేటాయించింది. అలాగే 545 నగర పంచాయతీల్లో 147 సీట్లు ఓబీసీ అభ్యర్థులకు రిజర్వేషన్ కల్పించింది. అందులో 49 మహిళలకు కేటాయించారు. దీనిపై పిటిషనర్లు అభ్యంతరం వ్యక్తం చేశారు ఈ క్రమంలో సుప్రీం కోర్టు సూచించిన ట్రిపుల్ టెస్ట్ ఫార్ములానూ అనుసరించకుండానే ఓబీసీలకు రిజర్వేషన్ కల్పిస్తూ నోటిఫికేషన్ జారీ చేశారని హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు పిటిషనర్లు. రిజర్వేషన్లు కల్పించే ముందు రాజకీయంలో ఓబీసీలు వెనకబడి ఉన్నారనే అంశంపై ఓ కమిషన్‌ను ఏర్పాటు చేయాలన్న సుప్రీం కోర్టు సూచనలను ప్రభుత్వం అనుసరించలేదని కోరారు. అయితే, తాము రాపిడ్ సర్వే నిర్వహించామని, అది ట్రిపుల్ టెస్ట్ ఫార్ములాను అనుసరిస్తోందని ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. ఈ పిల్‌పై శనివారం విచారించిన డివిజన్ బెంచ్ ఇరువైపుల వాదనలు విని తీర్పును మంగళవారానికి వాయిదా వేసింది. తాజాగా డ్రాఫ్ట్ నోటిఫికేషన్‌ను రద్దు చేసింది. ఇదీ చదవండి: బూస్టర్ డోస్‌గా ‘నాసల్’ వ్యాక్సిన్.. ధర ఎంతంటే? -
ఆవు మాత్రమే అలా చేయగలదు: అలహాబాద్ హైకోర్టు వ్యాఖ్యలు
అలహాబాద్: ఆవును జాతీయ జంతువుగా ప్రకటించాలని వ్యాఖ్యలు చేసిన అలహాబాద్ హైకోర్టు జడ్జి జస్టిస్ శేఖర్ కుమార్ మరోమారు ఆవుపై వ్యాఖ్యలు చేశారు. అన్ని జంతువుల్లోనూ కేవలం ఆవు మాత్రమే ఆక్సిజన్ పీల్చి ఆక్సిజన్‌ను వదులుతుందని సైంటిస్టులు నమ్ముతారన్నారు. ఆవు పాలు, పెరుగు, నెయ్యి, మూత్రం, పేడ ద్వారా మందు లేని పలు జబ్బులు కూడా నమయవుతాయని చెప్పారు. ఆవును దొంగలించి చంపిన కేసును విచారిస్తున్న సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. సాంభల్ జిల్లాకు చెందిన జావెద్ గతంలోనూ పలు మార్లు ఆవులను దొంగలించి చంపాడని, బెయిల్ ఇస్తే మళ్లీ అలాంటి చర్యలకు పాల్పడతాని వ్యాఖ్యానిస్తూ బెయిల్ నిరాకరించారు. హిందూ పురాణాల ప్రకారం ఆవులో 33 కోట్ల మంది దేవుళ్లు, దేవతలు నివాసముంటారన్నారు. అందుకే గోవధకు హిందువులు వ్యతిరేకమన్నారు. -
13 మందికి సుప్రీం బెయిల్
సాక్షి, న్యూఢిల్లీ: బాల నేరస్తులుగా శిక్షా కాలం ముగిసినా సాధారణ జైళ్లలో ఉన్న 13 మందికి సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఖైదీల వయసు దరఖాస్తులను పరిష్కరించాలని అలహాబాద్ కోర్టులో న్యాయవాది రిషి మల్హోత్రా 2012లో పిటిషన్ దాఖలు చేశారు. దానికి అనుగుణంగా 13 మంది పిటిషనర్లు నేరాలకు పాల్పడిన సమయంలో బాలలేనని ప్రకటించారు. బాల నేరస్తులుగా ప్రకటించడానికి జువెనైల్ జస్టిస్ బోర్డు నుంచి ఎలాంటి అభ్యంతరాలు లేనప్పటికీ ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదని పిటిషనర్లు పేర్కొన్నారు. 13 మంది కేసులకు సంబంధించిన అప్పీళ్లు హైకోర్టులో పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. 18 ఏళ్లలోపు వారికి గరిష్టంగా మూడేళ్లు జైలు శిక్ష అని, అదీ జువెనైల్ గృహాల్లో ఉంచాలని జువెనైల్ జస్టిస్ యాక్ట్ , 2000 సెక్షన్ రెడ్‌విత్ సెక్షన్ 26 చెబుతోందని పిటిషన్లో పేర్కొన్నారు. జువెనైల్ చట్టం ప్రకారం గరిష్టకాలం శిక్షఅనుభవించారని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఈ పిటిషన్లను గురువారం జస్టిస్ ఇందిరా బెనర్జీ జస్టిస్ వి.రామసుబ్రమణియన్ల ధర్మాసనం విచారించింది. బాల్యం దాటిన వారిని గుర్తించాలని అలహాబాద్ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసిందని, వారికి మధ్యంతర బెయిల్ మంజూరు చేసిందని అలహాబాద్ అదనపు అడ్వొకేట్ జనరల్ గరీమా ధర్మాసనానికి తెలిపారు. వారికి బెయిల్ మంజూరు చేయడానికి అభ్యంతరం లేదని, వెరిఫికేషన్ చేయాలని కోరుకుంటున్నామని ధర్మాసనాన్ని కోరారు. -
భార్య కావాలన్న మైనర్ బాలుడు.. కోర్టు ఏం చెప్పిందంటే
లక్నో: ఒక్కోసారి కోర్టుకు కొన్ని వింత కేసులు వస్తుంటాయ్. తాజాగా అలాంటి ఓ కేసు ఉత్తరప్రదేశ్‌లోని అలహాబాద్ హైకోర్టు ముందుకు వచ్చింది. ఆజంగఢ్‌కు చెందిన ఓ 16 ఏళ్ల బాలుడికి ఓ మేజర్ యువతితో వివాహమైంది. కాగా బాలుడు ఎవరితో ఉండాలనే విషయంపై అతడి తల్లి, భార్య మధ్య తలెత్తిన వివాదం అలహాబాద్ హైకోర్టు వరకు వెళ్లింది. మరి ఇటువంటి వింత కేసుకు కోర్టు ఎలా స్పందించిందో చూద్దాం. వివరాల్లోకి వెళితే.. ఉత్తర ప్రదేశ్ లోని అజంగఢ్‌లో ఉంటున్న ఓ మైనర్ బాలుడు తన కన్నా వయసులో పెద్దదైన యువతిని వివాహం చేసుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న బాలుడి తల్లి తన కొడుకును తన వద్దకు పంపించాలని కోరుతూ గతేడాది అలహాబాద్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ కేసుకు సంబంధించి సెప్టెంబర్18, 2020 జరిగిన విచారణలో న్యాయమూర్తి బాలుడి అభిప్రాయాన్ని తెలపాలని అడగగా.. తాను ఇష్టపడే ఆమెను పెళ్లి చేసుకున్నట్లు అంగీకరిస్తూ తనకు పెళ్లామే కావాలని కోరాడు. అదే క్రమంలో తన తల్లితో వెళ్లేందుకు నిరాకరించాడు. కేసు తిరిగి ఈ ఏడాది మే 31న విచారణలో.. మైనర్ బాలుడు మేజర్ యువతితో వివాహం చట్ట ప్రకారం చెల్లదు. ప్రస్తుతం ఆ బాలుడికి మైనార్టీ తీరకపోవడంతో అతడిని 2022 ఫ్రిబ్రవరి 24 వరకు ప్రభుత్వ షెల్టర్ హోం నందు ఉంచాలని కోర్టు తీర్పునిచ్చింది. బాలుడికి మైనార్టీ తీరాక అతని ఇష్టం ప్రకారం ఎవరితోనైనా ఉండోచ్చని స్పష్టం చేసింది. కాగా ఆ బాలుడు ఇటీవలే తండ్రి కూడా అయ్యాడు. చదవండి: సంచలనం: గంగానదిలో కొట్టుకొచ్చిన శిశువు, సర్కార్ స్పందన -
యూపీ సర్కారుపై హైకోర్టు ఆగ్రహం
లక్నో: హత్రాస్ కేసులో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం వైఖరిపై అలహాబాద్ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. జిల్లా మేజిస్ట్రేట్ ప్రవీణ్ కూమార్ పై యూపీ సర్కారు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై ఈ ఉన్నత న్యాయస్థానం మండిపడింది. ఈ కేసుపై సోమవారం అలహాబాద్ హైకోర్టు విచారణ చేపట్టింది. హత్రాస్ దారుణోతందంపై దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని జస్టిస్ పంకజ్ మిత్తల్, జస్టిస్ రాజన్ రాయ్ నేతృత్వంలోని బెంచ్ విచారించింది. తదుపరి విచారణలోపు (నవంబర్ 25) జిల్లా మేజిస్ట్రేట్‌పై చర్య తీసుకుంటామని ఈ సందర్భంగా న్యాయస్థానానికి ప్రభుత్వం తెలిపింది. కాగా, హత్రాస్ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన దళిత యువతి మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించకుండా రాత్రికి రాత్రి దహనం చేయడంతో జిల్లా మేజిస్ట్రేట్ తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు. జిల్లా మేజిస్ట్రేట్‌పై ఎటువంటి నిర్ణయం తీసుకున్నారని కోర్టు ప్రశ్నించగా... ఆయన చర్యను ప్రభుత్వం సమర్థించింది. ఆయన ఎటువంటి తప్పు చేయలేదని పేర్కొంది. ఈ కేసు దర్యాప్తులో నిర్లక్ష్యంగా వ్యవహరించిన జిల్లా ఎస్పీని ఇప్పటికే సస్పెండ్ చేసినట్టు ప్రభుత్వం తరుపున న్యాయవాది చెప్పారు. అంతకుముందు రాష్ట్ర ప్రభుత్వం, మేజిస్ట్రేట్ ప్రవీణ్ కూమార్, సస్పెండ్ అయిన ఎస్పీ విక్రాంత్ వీర్ కోర్టులో అఫిడవిట్లు దాఖలు చేశారు. దీంతో తదుపరి విచారణను కోర్టు ఈనెల 25కు వాయిదా వేసింది. ఈ కేసులో దర్యాప్తు ఎంతవరకు వచ్చిందో తమకు తెలపాలని సీబీఐని హైకోర్టు ఆదేశించింది. అసలేం జరిగింది? ఉత్తరప్రదేశ్ హత్రాస్ లో 19 ఏళ్ల దళిత యువతిపై సెప్టెంబర్ 14న నలుగురు ఉన్నత కులస్తులు అత్యాచారం చేసి దారుణంగా చంపేశారనే ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. బాధితురాలు ఢిల్లీ సఫ్దర్‌జంగ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సెప్టెంబర్ 29న కన్నుమూసింది. దారుణ ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం రేపింది. ఈ కేసును ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం సీబీఐకి అప్పగించింది. సీబీఐ దర్యాప్తును అలహాబాద్ హైకోర్టు పర్యవేక్షిస్తుంది. -
హథ్రాస్ కేసు.. సుప్రీం కీలక నిర్ణయం
లక్నో: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన హథ్రాస్ కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించిన సంగతి తెలిసిందే. తాజాగా సీబీఐ దర్యాప్తును అలహాబాద్ కోర్టు పర్యవేక్షించనున్నట్లు సుప్రీం కోర్టు తెలిపింది. ఈ మేరకు మంగళవారం ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసులో విచారణ దర్యాప్తు పూర్తయిన తర్వాత ఉత్తర ప్రదేశ్ నుంచి దేశ రాజధానిలోని కోర్టుకు మార్చాలని బాధితురాలి కుటుంబం తరఫున హాజరైన న్యాయవాది సుప్రీం కోర్టుకు తెలిపారు. 19 ఏళ్ల దళిత యువతిపై సెప్టెంబర్ 14న హథ్రాస్‌లో నలుగురు ఉన్నత కులస్తులు అత్యాచారం చేసి దారుణంగా చంపేశారనే ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. బాధితురాలు ఢిల్లీ సఫ్దర్‌జంగ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సెప్టెంబర్ 29న కన్నుమూసింది. బాధితురాలి దహన సంస్కారాలు అర్థరాత్రి నిర్వహించడంపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. ఈ అంశం విచారణ సందర్భంగా సామాజిక కార్యకర్త, న్యాయవాది ఇందిరా జైసింగ్ ఉత్తరప్రదేశ్‌లో న్యాయమైన విచారణ జరగదనే భయాన్ని వ్యక్తం చేశారు. అలానే పలువురు కార్యకర్తలు, న్యాయవాదులు ఉత్తరప్రదేశ్‌లో న్యాయమైన విచారణ జరగదంటూ సుప్రీం కోర్టులో పిల్ దాఖలు చేశారు. ఈ క్రమంలో అక్టోబర్ 15న వెల్లడించాల్సిన తీర్పును ప్రధాన న్యాయమూర్తి ఎస్ఐ బొబ్డే, జస్టిస్ ఏఎస్ బోపన్న, జస్టిస్ వీ రామసుబ్రమణియన్‌లతో కూడిన ధర్మాసనం రిజర్వు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో బాధితురాలి కుటుంబానికి, సాక్షులకు కల్పించిన భద్రత, రక్షణకు సంబంధించి ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చిన అఫిడవిట్‌ను సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా సుప్రీం కోర్టుకు సమర్పించారు. (చదవండి: హథ్రాస్ కేసు.. డీఐజీ భార్య ఆత్మహత్య) ఇప్పటికే కేసును సీబీఐకి బదిలీ చేసి, సుప్రీం కోర్టు పర్యవేక్షణకు సమ్మతి ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం, సాక్షి రక్షణపై, బాధితుడి కుటుంబం న్యాయవాదిని ఎన్నుకున్నదా అనే దాని గురించి ఉన్నత న్యాయస్థానం కోరిన వివరాల మేరకు అఫిడవిట్ దాఖలు చేసింది. బాధితురాలి కుటుంబం న్యాయవాదిని నియమించుకున్నప్పటికి.. ప్రభుత్వం నియమించిన న్యాయవాదిని తమ తరఫున కేసును వాదించాలని కోరారు -
కోర్టు ఆదేశం ఆశాజనకంగా ఉంది
లక్నో: హత్రాస్ అత్యాచార ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ప్రతి పక్షాలు యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఈ క్రమంలో ఘటనకు సంబంధించి అలహాబాద్ హై కోర్టు ప్రభుత్వ ఉన్నతాధికారులకు సమన్లు జారీ చేసిన సంగతి తెలిసిందే. దీనిపై కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ హర్షం వ్యక్తం చేశారు. కోర్టు ఆర్డర్‌ని బలమైన, ప్రోత్సాహకరమైన పరిణామంగా ప్రశంసించారు. ఈ మేరకు ఆమె ట్వీట్ చేశారు. ‘హత్రాస్ అత్యాచార బాధితురాలికి న్యాయం చేయాలని దేశం మొత్తం కోరుతుంది. యూపీ ప్రభుత్వం తన కుటుంబానికి చేసిన అమానవీయ, దారుణ అన్యాయం నేపథ్యంలో హై కోర్టు తీర్పు కటిక చీకటిలో చిరుదివ్వెలా ఆశాజనకంగా ఉంది’ అంటూ ప్రియాంక గాంధీ ట్వీట్ చేశారు. ఈ కేసుకు సంబంధించి అలహాబాద్ హై కోర్టు లక్నో బెంచ్ యూపీ పోలీసులు, పరిపాలన ఉన్నతాధికారులకు సమన్లు జారీ చేసింది. ఈ నెల 12న వారు కోర్టుకు హాజరుకావాలని ఆదేశించింది. (చదవండి: ఇదేమి సంస్కృతి?) A strong and encouraging order from the Lucknow bench of Alld HC. The entire nation is demanding justice for the Hathras rape victim. The HC order shines a ray of hope amidst the dark, inhuman and unjust treatment meted out to her family by the UP Govt.https://t.co/kj55XGMK3B — Priyanka Gandhi Vadra (@priyankagandhi) October 2, 2020 అంతేకాక బాధితురాలి కుటుంబ సభ్యులను కూడా కోర్టుకు హాజరుకావాల్సిందిగా సూచించింది. వారు కూడా వస్తే దహన సంస్కారల విషయంలో అసలు ఏం జరగిందనేది తెలుస్తుందని కోర్టు అభిప్రాయ పడింది. అంతేకాక ‘ఈ కేసు అపారమైన ప్రజా ప్రాముఖ్యత, ప్రజాప్రయోజనంతో కూడుకున్నది. ఎందుకంటే ఈ కేసులో రాష్ట్ర అధికారులు అధికంగా ఆరోపణలు ఎదుర్కొన్నారు. మరణించిన బాధితురాలితో పాటు ఆమె కుటుంబ సభ్యుల ప్రాథమిక మానవ హక్కులు ఉల్లంఘనకు గురయ్యాయి. నేరానికి పాల్పడిన వారు అత్యంత క్రూరంగా ప్రవర్తించారు. ఈ కేసుకు సంబంధించి సంచలన ఆరోపణలు వినవస్తున్నాయి. అవన్ని నిజమైతే అధికారులు ఆ కుటుంబానికి శాశ్వత దుఃఖాన్ని మిగిల్చిన వారవుతారు. వారి ప్రవర్తన పుండు మీద ఉప్పు రుద్దిన చందంగా ఉన్నట్లు జనాలు గుర్తిస్తారు’ అంటూ కోర్టు వ్యాఖ్యానించింది. -
కఫీల్ ఖాన్ విడుదల.. సంచలన వ్యాఖ్యలు
లక్నో: పౌరసత్వం (సవరణ) చట్టానికి(సీఏఏ) వ్యతిరేకంగా ప్రసంగించినందుకు కఠినమైన జాతీయ భద్రతా చట్టం (ఎన్ఎస్ఏ) కింద జైలు శిక్ష అనుభవిస్తోన్న ఉత్తరప్రదేశ్ వైద్యుడు కఫీల్ ఖాన్ మంగళవారం అర్ధరాత్రి మథుర జైలు నుంచి విడుదలయ్యారు. అలహాబాద్ హైకోర్టు ఆయన నిర్బంధాన్ని చట్టవిరుద్ధమని పేర్కొన్నది. ఆయన ఇచ్చిన ఉపన్యాసం ఎవ్వరిని రెచ్చగొట్టే విధంగా లేదని, అతడిని వెంటనే విడుదల చేయాలని అలహాబాద్ హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. దాంతో కఫీల్ ఖాన్‌ను మంగళవారం అర్ధరాత్రి మథుర జైలు నుంచి విడుదల చేశారు. ఈ సందర్భంగా హైకోర్టుకు కఫీల్ ఖాన్ ధన్యవాదాలు తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. ‘నా విడుదల కోసం గొంతెత్తిన వారందరికీ ధన్యవాదాలు. నన్ను రిలీజ్ చేయడానికి అధికారులు ఏమాత్రం సుముఖంగా లేరు. ప్రజల ప్రార్థనల ఫలితంగా విడుదలయ్యాను. రాజధర్మాన్ని పాటించాలని వాల్మీకి మహర్షి రామాయణంలో బోధించారు. రాజు ‘రాజధర్మం’ ప్రకారమే వ్యవహరించాలి. కానీ యూపీలో అలా లేదు. రాజ ధర్మాన్ని అనుసరించాల్సింది పోయి, చిన్న పిల్లల్లా మొండిగా ప్రవర్తిస్తున్నారు’ అంటూ కఫీల్ ఖాన్ అసహనం వ్యక్తం చేశారు. (చదవండి: ఢిల్లీ అల్లర్లు: జామియా విద్యార్థినికి బెయిల్) అంతేకాక ‘కోర్టు తన తీర్పును వెలువరించి ఎంతో మేలు చేసింది. అలా కాకుండా నిర్ణయాన్ని రాష్ట్రప్రభుత్వానికే వదిలేస్తే నన్ను చంపేసేవారు. సిట్‌కు కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. నన్ను ముంబై నుంచి మథురకు తీసుకెళ్లేటప్పుడు ఎన్కౌంటర్ చేయలేదు’ అంటూ కఫీల్ ఖాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. డాక్టర్ నిర్బంధంపై జిల్లా మేజిస్ట్రేట్ జారీ చేసిన ఉత్తర్వులు చట్టవిరుద్ధమని ధర్మాసనం వ్యాఖ్యానించింది. తన కుమారుడికి ఫిబ్రవరిలోనే కోర్టు బెయిల్ మంజూరు చేసిందని, బెయిల్‌పై ఆయనను విడుదల చేయాల్సి ఉన్నా ఎన్ఎస్ఏ కింద నిర్బంధంలో ఉంచారని కఫీల్ ఖాన్ తల్లి పర్వీన్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. డాక్టర్ విడుదల పట్ల ఆయన కుటుంబీకులు హర్షం వ్యక్తం చేశారు. తన కుమారుడు ఎప్పుడూ దేశానికి వ్యతిరేకంగా మాట్లాడడని, చాలా మంచి వ్యక్తి అని కఫీల్ ఖాన్ తల్లి పేర్కొన్నారు. (చదవండి: ఆ తీర్మానం.. దేశ ద్రోహమే) అసలు కేసేంటి.. 2017లో గోరఖ్‌పూర్‌లో ఆక్సిజన్ అందక 60 మంది చిన్నపిల్లలు ప్రాణాలు కోల్పోయిన ఘటనలో డాక్టర్ కఫీల్ ఖాన్ పేరు తొలిసారి వెలుగులోకి వచ్చింది. చిన్నారులు చనిపోయిన బీఆర్డీ మెడికల్ కాలేజీలోనే పని చేసిన కఫీల్.. యోగి సర్కారుపై తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ క్రమంలో చిన్న పిల్లల మరణాలకు సంబంధించి ఆయనపై కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత ఆయనపై ఈ ఏడాది తీవ్రమైన జాతీయ భద్రతా చట్టం కింద కేసు నమోదయ్యింది. సీఏఏ వ్యతిరేక ఆందోళనల్లో రెచ్చగొట్టే ప్రసంగాలు చేశారనే ఆరోపణలు రావడంతో కఫీల్ ఖాన్‌ను ఉద్యోగం నుంచి తొలగించారు. 2020, ఫిబ్రవరి 13న అలీగఢ్ జిల్లా మేజిస్ట్రేట్ ఆదేశాల మేరకు ఆయనను జాతీయ భద్రతా చట్టం 1980 సెక్షన్ 3 (2) ప్రకారం అరెస్టు చేశారు. అయితే, ఆయన నేరం చేశారనడానికి ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో అలహాబాద్ హైకోర్టు ఎన్ఎస్ఏ ఆరోపణల్ని తోసిపుచ్చింది. అతడిని విడుదల చేయాలని ఆదేశించింది. -
యోగి సర్కార్‌కు హైకోర్టు షాక్
న్యూఢిల్లీ : ఉత్తర్ ప్రదేశ్‌లో యోగి ఆదిత్యానాథ్ సర్కార్‌కు అలహాబాద్ హైకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. సీఏఏకు వ్యతిరేకంగా హింసాత్మక నిరసనలకు పాల్పడిన వారి ఫోటోలు, చిరునామాలతో కూడిన షేమ్ హోర్డింగ్‌లను తొలగించాలని యూపీ ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించింది. మార్చి 16లోగా హైకోర్టు రిజిస్ర్టార్ జనరల్‌కు ఈ వ్యవహారంపై నివేదిక సమర్పించాలని జిల్లా మేజిస్ర్టేట్, పోలీస్ కమిషనర్లను కోర్టు ఆదేశించింది. సీఏఏకు వ్యతిరేకంగా జరిగిన నిరసనల్లో హింసకు పాల్పడ్డారనే ఆరోపణలు ఎదుర్కొన్న వారి ఫోటోలు, చిరునామాలతో యూపీ ప్రభుత్వం గత వారం లక్నోలోని పలు ప్రాంతాల్లో ఆరు హోర్డింగ్‌లను ఏర్పాటు చేయడం వివాదాస్పదమైంది. డిసెంబర్లో జరిగిన సీఏఏ వ్యతిరేక అల్లర్లలో ప్రమేయం ఉందని ఆరోపణలు ఎదుర్కొంటున్న 53 మంది ఫోటోలు, వారి వివరాలతో ఈ హోర్డింగ్‌లను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. షియా గురువు మౌలానా సైఫ్ అబ్బాస్, మాజీ ఐపీఎస్ అధికారి ఎస్ఆర్ దారాపురి, కాంగ్రెస్ నేత సదాఫ్ జాఫర్ వంటి పలువురి వివరాలను ఈ హోర్డింగ్‌ల్లో పొందుపరిచారు. ఆస్తులను ధ్వంసం చేసిన వీరంతా పరిహారం చెల్లించాలని లేకుంటే వారి ఆస్తులను అటాచ్ చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. నిందితులకు ఈ మేరకు ఆస్తుల అటాచ్‌కు సంబంధించిన నోటీసులు పంపింది. ఈ వ్యవహారంపై సుమోటోగా స్పందించిన హైకోర్టు నిరసనకారుల ఫోటోలను ప్రదర్శించడం అన్యాయమని పేర్కొంది. ప్రభుత్వ చర్య పౌరుల గోప్యత హక్కులో జోక్యం చేసుకోవడమేనని కోర్టు వ్యాఖ్యానించింది. చదవండి : ‘షేమ్’ హోర్డింగ్స్‌పై స్పందించిన కోర్టు -
‘షేమ్’ హోర్డింగ్స్‌పై స్పందించిన కోర్టు
లక్నో : సీఏఏకు వ్యతిరేకంగా జరిగిన హింసాత్మక నిరసనలపై ఆరోపణలు ఎదుర్కొంటున్న వారి పేర్లు, చిరునామాలతో కూడిన హోర్డింగ్‌లను యూపీ ప్రభుత్వం ప్రదర్శించడంపై అలహాబాద్ హైకోర్టు సుమోటోగా స్పందించింది. ఈ అంశంపై ఆదివారం ఉదయం విచారణ చేపడతామని వెల్లడించిన అలహాబాద్ హైకోర్టు ప్రభుత్వ సూచన మేరకు మధ్యాహ్నం మూడు గంటలకు వాయిదా వేసింది. పౌరుల స్వేచ్ఛను హరిస్తూ వారి వ్యక్తిగత వ్యవహారాల్లోకి ప్రభుత్వం వెళ్లడం తగదని, విచారణ ప్రారంభమయ్యేలోగా ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు చేపడుతుందని ఆశిస్తున్నామని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గోవింద్ మాధుర్ అన్నారు. సీఏఏ వ్యతిరేక నిరసనల్లో హింసకు పాల్పడిన వారి ఫోటోలు, చిరునామాలతో కూడిన హోర్డింగ్‌లను యూపీ ప్రభుత్వం లక్నో వీధుల్లో ఏర్పాటు చేయడం వివాదాస్పదమైన సం్గతి తెలిసిందే. హింసకాండ ద్వారా వాటిల్లిన నష్టాన్ని నిందితులు భర్తీ చేయని పక్షంలో వారి ఆస్తులను స్వాధీనం చేసుకుంటామని కూడా హోర్డింగ్స్‌లో ప్రభుత్వం పేర్కొంది. వ్యక్తిగత ఆస్తుల అటాచ్మెంట్ నోటీసులు కూడా ఇప్పటికే పలువురు నిందితులకు ప్రభుత్వం జారీ చేసింది. విస్త్రృత ప్రజా ప్రయోజనాల దృష్ట్యా నిబంధనలకు అనుగుణంగానే ప్రభుత్వం ఈ చర్యలు చేపట్టిందని యూపీ సీఎం కార్యాలయ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు తమ స్వేచ్ఛను హరిస్తూ జైలులో నిర్బంధించి వేధింపులకు గురిచేస్తున్నారని నిందితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాగా హోర్డింగ్‌ల్లో ప్రస్తావించిన నిందితుల పేర్లలో రాజకీయ కార్యకర్త సదాఫ్ జాఫర్, న్యాయవాది మహ్మద్ షోయబ్, నాటకరంగ ప్రముఖులు దీపక్ కబీర్, మాజీ ఐపీఎస్ అధికారి ఎస్ఆర్ దారాపురి తదితరులున్నారు. కాగా ప్రస్తుతం బెయిల్‌పై విడుదలైన వీరంతా తమ ఆస్తులను అటాచ్ చేసేలా ప్రభుత్వం వ్యవహరిస్తే కోర్టును ఆశ్రయిస్తామని చెబుతున్నారు. చదవండి : సీఏఏ అంటే రాజ్యాంగంపై దాడే -
దేశ చరిత్రలో తొలిసారి.. సిట్టింగ్ జడ్జ్‌పై
సాక్షి, న్యూఢిల్లీ: అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఎన్ శుక్లాపై సీబీఐ విచారణకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ అనుమతించారు. శుక్లాపై గతకొంత కాలంగా పెద్ద ఎత్తున అవినీతి ఆరోపణలు వినిపిస్తోన్న విషయం తెలిసిందే. జస్టిస్ శుక్లాపై 2017-2018 విద్యా సంవత్సరంలో ప్రైవేటు మెడికల్ కళాశాలల్లో అడ్మిషన్లకు సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను లెక్కచేయకుండా ఉత్తర్వులు జారీ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. అయితే సిట్టింగ్ జడ్జ్‌పై సీబీఐ విచారణ చేపట్టాలంటే దానికి సీజేఐ అనుమతి తప్పని సరి. ఈ నేపథ్యంలో ఆయనపై విచారణకు ఆదేశించాలని సీబీఐ ప్రత్యేక దర్యాప్తు అధికారి ప్రధాన న్యాయమూర్తిని కోరారు. దీనికి సానుకూలంగా స్పందించిన గొగోయ్ శుక్లాపై విచారణకు అనుమతిస్తున్నట్లు తెలిపారు. ఓ సిట్టింగ్ న్యాయమూర్తిపై సీబీఐ విచారణ చేపట్టడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. కాగా అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న శుక్లాను తొలగించాలని జస్టిస్ రంజన్ గొగోయ్ ఇదివరకే కేంద్రానికి లేఖ రాసిన విషయం తెలిసిందే. అంతర్గత విచారణలో జస్టిస్ శుక్లా దుష్ప్రవర్తన రుజువైందని లేఖలో పేర్కొన్నారు. అందువల్ల ఆయన్ను తొలగించాలని కోరుతూ ప్రధాని నరేంద్రమోదీకి లేఖ రాశారు. ప్రైవేటు మెడికల్ కళాశాల అడ్మిషన్లలో పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారని కేంద్రానికి ఫిర్యాదు చేశారు. గతంలో దీనికి సంబంధించి ఆయనపై కేసు నమోదైందయినట్లు కూడా సీజే గుర్తుచేశారు. ఇదిలావుండగా.. జస్టిస్ శుక్లాపై ఆరోపణల నేపథ్యంలో మద్రాసు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఇందిరా బెనర్జీ, సిక్కిం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎస్కే అగ్నిహోత్రి, మధ్యప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పీకే జైస్వాల్‌లతో అంతర్గత కమిటీ ఏర్పాటైంది. జస్టిస్ శుక్లాపై వచ్చిన ఆరోపణలు అత్యంత తీవ్రమైనవని కమిటీ తన విచారణ నివేదికలో స్పష్టం చేసింది. దీంతో అప్పటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా స్పందిస్తూ జస్టిస్ శుక్లా రాజీనామా చేయాలని, లేదంటే స్వచ్ఛంద పదవీవిరమణను ఎంచుకోవచ్చని సూచించారు. తాజాగా సీజే ఆదేశాలతో ఆయన సీబీఐ విచారణకు తప్పనిసరిగా హాజరుకావాల్సింది. -
ఆ ఫోటోలను చూపించొద్దు..!
లక్నో: వార్తాపత్రికలకు, టీవీ చానల్స్‌కు అలహాబాద్ హైకోర్టు కీలక ఆదేశాలు జారీచేసింది. మహిళలు స్నానం చేసే ఫోటోలను ప్రచురించకూడదని కోర్టు హెచ్చరించింది. ఉత్తరప్రదేశ్‌లో జరుగుతున్న కుంభమేళలో మహిళలు స్నానం చేసే ఫోటోలను చిత్రీకరించవద్దని ధర్మాసనం స్పష్టంచేసింది. కుంభమేళాలో స్నానఘాట్టాలకు వందమీటర్ల దూరంలో కెమెరా పాయింట్లపై నిషేధం విధించినప్పటికీ.. ఆదేశాలను ఎందుకు పాటించట్లేదని అధికారులను ప్రశ్నించింది. కాగా కుంభమేళాలో మీడియా ఫోటో గ్రాఫర్లు మహిళలు స్నానం చేసే ఫోటోలను ప్రచురించవద్దన్న ఓ న్యాయవాది అభ్యర్థన మేరకు ధర్మాసనం ఈవిధంగా స్పందించింది. కోర్టు ఆదేశాలను పాటించకపోతే చర్యలు తప్పవని ధర్మాసనం హెచ్చరించింది. -
ఒకే రోజు 13 అనుమతులిచ్చారు: సీబీఐ
లక్నో/న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్ సీఎంగా ఉన్నప్పుడు సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ) అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ మొత్తం 14 మైనింగ్ లీజులకు ఆమోదం తెలిపారని సీబీఐ సోమవారం తెలిపింది. గనుల శాఖను తనవద్దే ఉంచుకున్న అఖిలేశ్ 13 లీజులను 2013, ఫిబ్రవరి 17న ఒక్క రోజులోనే క్లియర్ చేశారని వెల్లడించింది. ఇది యూపీ ఈ–టెండరింగ్ ప్రక్రియకు విరుద్ధమంది. సీఎం ఆమోదంతో ఈ లీజులను అప్పటి హమీర్పూర్ జిల్లా కలెక్టర్ చంద్రకళ ఇతరులకు కేటాయించారని పేర్కొంది. అలహాబాద్ హైకోర్టు ఆమోదించిన ఈ– టెండర్ పాలసీ 2012కు విరుద్ధంగా ఈ కేటాయింపులు సాగాయంది. అఖిలేశ్‌కు మాయావతి ఫోన్ అక్రమ మైనింగ్ కేసులో అఖిలేశ్‌ను సీబీఐ విచారించే అవకాశముందన్న వార్తల నేపథ్యంలో వివక్షాలు ఆయనకు మద్దతుగా నిలిచాయి. బీజేపీ ప్రతిపక్షాలను వేధింపులకు గురిచేస్తోందని బీఎస్పీ కాంగ్రెస్, ఆప్ ఆరోపించాయి. ఈ సందర్భంగా అఖిలేశ్‌కు ఫోన్ చేసిన బీఎస్పీ చీఫ్ మాయావతి..‘ఇలాంటి గిమ్మిక్కులకు భయపడొద్దు. మీకు నా పూర్తి మద్దతు ఉంటుంది. రాజకీయ విభేదాల నేపథ్యంలోనే బీజేపీ ప్రభుత్వం సీబీఐని ఉసిగొల్పుతోంది. రాజకీయ ప్రత్యర్థులను తప్పుడు కేసుల్లో ఇరికించేందుకు యత్నిస్తోంది’ అని తెలిపారు. ఎస్పీ–బీఎస్పీ మధ్య పొత్తును అప్రతిష్టపాలు చేసేందుకే కేంద్రం ఇలాంటి వార్తలను వ్యాప్తిచేస్తోందని మండిపడ్డారు. సాక్షాత్తూ కేంద్ర మంత్రి సీబీఐ అధికార ప్రతినిధిగా మీడియా సమావేశం నిర్వహించడం రాజకీయ కుట్ర కాకుంటే మరేంటని ప్రశ్నించారు. కూటమిని నిలువరించేందుకే: కాంగ్రెస్ 2019 లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో విపక్ష కూటమి ఏర్పాటును నిలువరించడానికి విచారణ సంస్థను కేంద్రం దుర్వినియోగం చేస్తోందని కాంగ్రెస్ సీనియర్ నేత గులాంనబీ ఆజాద్ విమర్శించారు. అఖిలేశ్ యాదవ్‌పై కేంద్రం నిసిగ్గుగా సీబీఐని ఉసిగొల్పుతోందని ప్ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ విమర్శించారు. -
గోరఖ్‌పూర్ ఘటన: బెయిల్ పిటిషన్ తిరస్కరణ
లక్నో: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన గోరఖ్‌పూర్ 63 మంది చిన్నారుల మృతి కేసులో ప్రధాన నిందితురాలిగా ఉన్న డాక్టర్ పూర్ణిమా శుక్లా బెయిల్ పిటిషన్‌ను అలహాబాద్ హైకోర్టు కొట్టివేసింది. గోరఖ్‌పూర్‌లో గత ఏడాది ఆగస్ట్‌లో బీఆర్డీ మెడికల్ కాలేజీలో ఆక్సిజన్ కొరత కారణంగా 63 మంది చిన్నారులు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో అలహాబాద్ హైకోర్టు తొమ్మిది మందిపై అభియోగాలు మోపింది. వారిలో డాక్టర్ కఫీల్ ఖాన్‌కు ఇటివల అలహాబాద్ హైకోర్టు బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. బీఆర్డీ మెడికల్ కాలేజీలో హోమియోపతి విభాగానికి చెందిన పూర్ణిమా శుక్లా మెడికల్ కాలేజీ మాజీ ప్రిన్సిపల్ రాజీవ్ మిశ్రా భార్య. ముందస్తు విడుదల కోరుతూ పూర్ణిమా శుక్లా దాఖలు చేసిన పిటిషన్‌ను న్యాయమూర్తి యశ్వంత్ వర్మ విచారించారు. ప్రస్తుతం కేసు కీలక దశలో ఉందని, ఈ సమయంలో వారికి బెయిల్ మంజూరు చేస్తే విచారణపై ప్రభావం చూపే అవకాశం ఉందని, అందుకే పిటిషన్ తిరస్కరిస్తున్నట్లు న్యాయమూర్తి తెలిపారు. -
గోరఖ్‌పూర్ ఘటన : కఫీల్‌ఖాన్‌కు బెయిల్
లక్నో: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన గోరఖ్‌పూర్ 63 మంది చిన్నారుల మృతి కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న డాక్టర్ కఫీల్‌ఖాన్‌కు అలాహాబాద్ హైకోర్టు బుధవారం బెయిల్ మంజూరు చేసింది. ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌లో గత ఏడాది ఆగస్ట్‌లో బీఆర్డీ మెడికల్ కాలేజిలో ఆక్సిజన్ కొరత కారణంగా 63 మంది చిన్నారులు మృతి చెందిన విషయం తెలిసిందే. హాస్పిటల్లో ఆక్సిజన్ కొరత కారణంగానే పిల్లలు మృతి చెందారన్న ఆరోపణలతో మెదడు వాపు వ్యాధి నివారణ (ఏఈఎస్) విభాగానికి అధిపతిగా ఉన్న కఫీల్‌ఖాన్ జైలు పాలయ్యారు. అప్పటి నుంచి ఆయన జైల్లోనే ఉంటున్నారు. ఆయన ఆరోగ్యపరిస్థితి పూర్తిగా విషమించడంతో ఏప్రిల్ 19న కఫీల్‌ను కట్టుదిట్టమైన భద్రత మధ్య జిల్లా ఆసుపత్రికి తరలించారు. కఫీల్ ఆరోగ్య పరిస్థితి దృష్టిలో ఉంచుకుని హైకోర్టు అతనికి బెయిల్ మంజూరు చేసినట్లు అధికారులు తెలిపారు. కాగా తన భర్తకు బెయిల్ మంజూరైన సందర్భంగా కఫీల్‌ఖాన్ భార్య డాక్టర్ షబీస్తాన్ఖాన్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. తన భర్తకు జైల్లో ఉండగా గుండెపోటు వచ్చినా కూడా జైలు అధికారుల సరైన వైద్యం అందించలేకపోయారని, తన భర్త పట్ల కుట్రపూరితంగా వ్యవహరించారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. కాగా ప్రభుత్వం తగిన సమయంలో నిధులు మంజూరు చేయకపోవడం వల్లనే ఆసుపత్రిలో ఈ సంఘటన చోటు చేసుకుందని, ప్రభుత్వ తప్పిదాన్ని తనపై మోపారని డాక్టర్ కఫీల్‌ఖాన్ కూడా ఆరోపించారు. గోరఖ్‌పూర్‌లో ఘటనను ప్రధాన ఆయుధంగా చేసుకున్న ప్రతిపక్షాలు సీఎం యోగిపై తీవ్ర విమర్శల వర్షం కురిపించిన విషయం తెలిసిందే. -
యూపీలో ‘ఉన్నావ్’ వేడి!
లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావ్‌లో ఇటీవల యువతిపై జరిగిన సామూహిక అత్యాచారం కేసు అనూహ్య మలుపులు తిరుగుతోంది. ఈ కేసులో ప్రధాన నిందితుడు అయిన బీజేపీ ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ సెంగార్‌కు ఆయన భార్య మద్దతుగా నిలిచింది. నిజానిజాలు తెలియాలంటే తన భర్తకు, బాధితురాలకి నార్కో పరీక్షలు నిర్వహించడంతో పాటు కేసు విచారణను సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేసింది. అంత్యక్రియలు నిర్వహించకుంటే బాధితురాలి తండ్రి మృతదేహాన్ని భద్రపరచాలని అలహాబాద్ హైకోర్టు యూపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. మరోవైపు, చనిపోయే ముందు ఎమ్మెల్యే మనుషులు యువతి తండ్రిని కొడుతున్న వీడియో ఒకటి వెలుగుచూసింది. ఉన్నావ్‌లో యువతిపై సామూహిక అత్యాచారం, ఆ వెంటే ఆమె తండ్రి కస్టడీలోనే మృతిచెందడం అత్యంత భయానక వాతావరణాన్ని సూచిస్తున్నాయని అంతర్జాతీయ మానవ హక్కుల సంస్థ ఆమ్నెస్టీ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ ఉదంతంపై స్వతంత్ర దర్యాప్తు జరగాలని సూచించింది. -
యూపీ సీఎం యోగికి ఊరట
సాక్షి, లక్నో : యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్‌కు ఊరట లభించింది. 2007 గోరఖ్‌పూర్ అల్లర్లలో యోగి పాత్రపై తిరిగి విచారణ చేపట్టాలని దాఖలైన పిటిషన్‌ను అలహాబాద్ హైకోర్టు తిరస్కరించింది. ఈ కేసులో స్వతంత్ర సంస్థతో విచారణ చేపట్టాలని పర్వేజ్ పర్వాజ్, అసద్ హయత్లు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. 2007 జనవరిలో జరిగిన ఈ ఘర్షణల్లో పది మంది మరణించారు. దాదాపు పదేళ్ల కిందట చోటుచేసుకున్న మతఘర్షణలకు సంబంధించి సీఎం యోగి ఆదిత్యానాథ్ ప్రాసిక్యూషన్‌కు తాము అనుమతించబోమని రాష్ట్ర ప్రభుత్వం కోర్టుకు నివేదించిన కొద్ది మాసాల అనంతరం అలహాబాద్ హైకోర్టు ఈ మేరకు పిటిషన్‌ను తోసిపుచ్చింది. కేసును దర్యాప్తు చేస్తున్న సీబీసీఐడీ తుది నివేదికను ప్రత్యేక కోర్టుకు త్వరలో సమర్పిస్తుందని, ఈ దశలో సీఎం ప్రాసిక్యూషన్‌కు తాము అనుమతించబోమని హైకోర్టుకు సమర్పించిన అఫిడవిట్లో యూపీ ప్రభుత్వ ప్రదాన కార్యదర్శి రాహుల్ భట్నాగర్ పేర్కొన్నారు. -
12 ఏళ్లు..లక్ష కేసులు!
అలహాబాద్: అలహాబాద్ హైకోర్టు సీనియర్ జడ్జీగా పనిచేస్తున్న సుధీర్ అగర్వాల్ ఓ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నారు. 2005 అక్టోబర్ 5వ తేదీన అలహాబాద్ హైకోర్టులో అదనపు జడ్జీగా నియమితులైన ఈయన బుధవారం నాటికి (12 ఏళ్లలో) లక్ష కేసులను పరిష్కరించారు. హైకోర్టు లక్నో బెంచ్‌లో ఉండగానే జడ్జి సుధీర్ అగర్వాల్ 10వేల కేసులను పరిష్కరించారని ఆయన సన్నిహితవర్గాలు తెలిపాయి. -
ఆరుషి హత్య కేసులో.. సంచలన తీర్పు
-
ఆరుషి హత్యకేసు: తల్వార్ దంపతులకు ఊరట
-
అలహాబాద్ హైకోర్టు సంచలన తీర్పు
సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఆరుషి హత్యకేసులో ఆమె తల్లిదండ్రులకు ఊరట లభించింది. అలహాబాద్ హైకోర్టు గురువారం ఆరుషి తల్లిదండ్రులను నిర్దోషిలుగా తేల్చింది. ఆరుషిని ఆమె తల్లిదండ్రులే చంపారనేందుకు ఎలాంటి ఆధారాలు లేవని న్యాయస్థానం అభిప్రాయపడింది. ఆరుషిని ఆమె తల్లిదండ్రులే చంపినట్లు ఆధారాలు లేవని, ఆధారాలు సమర్పించడంలో సీబీఐ విఫలమైందని కోర్టు పేర్కొంది. బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద న్యాయస్థానం ఆరుషి తల్లిదండ్రులను నిర్దోషులుగా ప్రకటించింది. కాగా పద్నాలుగేళ్ల తమ కుమార్తె ఆరుషి, పనిమనిషి హేమరాజ్‌ల హత్య కేసులో దంతవైద్య నిపుణులు రాజేశ్, నూపుర్ తల్వార్ దంపతులను స్థానిక సీబీఐ ప్రత్యేక కోర్టు దోషులుగా నిర్ధారించిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఆరుషి తల్లిదండ్రులు ప్రస్తుతం ఘజియాబాద్‌లోని దస్నా జైలులో శిక్ష అనుభవిస్తున్నారు. మరోవైపు అలహాబాద్ హైకోర్టు తీర్పును ఆరుషి తాత స్వాగతించారు. రాజేశ్, నూపుర్ తల్వార్ ఎలాంటి తప్పు చేయలేదని తమకు తెలుసు అని ఆయన అన్నారు. -
జెండా ఎగురవేయాల్సిందే
అలహాబాద్: జాతీయ జెండా విషయంలో అలహాబాద్ కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. మదర్సాల్లో సైతం రిపబ్లిక్ డే, ఆగస్టు 15న త్రివర్ణ పతాకం ఎగుర వేయాల్సిందేనని స్పష్టం చేసింది. అంతకుముందు రోజు ఇదే అంశంలో అలహాబాద్ కోర్టు స్పందించింది. ఆగస్టు 15, జనవరి 26న ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలతోపాటు విద్యా సంస్థల్లోనూ జాతీయ జెండాను ఎగరవేయాలనే నిబంధన దృష్ట్యా.. రాష్ట్రంలోని అన్ని మదర్సాల్లో జాతీయ జెండా ఎగరవేశారనే విషయాన్ని నిర్ధారించాల్సిందిగా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇదే విషయాన్ని మరోసారి స్పష్టం చేస్తూ ఖచ్చితంగా అన్ని మదర్సాల్లో జాతీయ జెండా ఎగురవేయాల్సిందేనని చెప్పింది.