లక్నో: వార్తాపత్రికలకు, టీవీ చానల్స్‌కు అలహాబాద్ హైకోర్టు కీలక ఆదేశాలు జారీచేసింది. మహిళలు స్నానం చేసే ఫోటోలను ప్రచురించకూడదని కోర్టు హెచ్చరించింది. ఉత్తరప్రదేశ్‌లో జరుగుతున్న కుంభమేళలో మహిళలు స్నానం చేసే ఫోటోలను చిత్రీకరించవద్దని ధర్మాసనం స్పష్టంచేసింది. కుంభమేళాలో స్నానఘాట్టాలకు వందమీటర్ల దూరంలో కెమెరా పాయింట్లపై నిషేధం విధించినప్పటికీ.. ఆదేశాలను ఎందుకు పాటించట్లేదని అధికారులను ప్రశ్నించింది.
కాగా కుంభమేళాలో మీడియా ఫోటో గ్రాఫర్లు మహిళలు స్నానం చేసే ఫోటోలను ప్రచురించవద్దన్న ఓ న్యాయవాది అభ్యర్థన మేరకు ధర్మాసనం ఈవిధంగా స్పందించింది. కోర్టు ఆదేశాలను పాటించకపోతే చర్యలు తప్పవని ధర్మాసనం హెచ్చరించింది.
Comments
Please login to add a commentAdd a comment