అలహాబాద్: అలహాబాద్ హైకోర్టు సీనియర్ జడ్జీగా పనిచేస్తున్న సుధీర్ అగర్వాల్ ఓ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నారు. 2005 అక్టోబర్ 5వ తేదీన అలహాబాద్ హైకోర్టులో అదనపు జడ్జీగా నియమితులైన ఈయన బుధవారం నాటికి (12 ఏళ్లలో) లక్ష కేసులను పరిష్కరించారు. హైకోర్టు లక్నో బెంచ్‌లో ఉండగానే జడ్జి సుధీర్ అగర్వాల్ 10వేల కేసులను పరిష్కరించారని ఆయన సన్నిహితవర్గాలు తెలిపాయి.
Comments
Please login to add a commentAdd a comment