
అలహాబాద్: ఆవును జాతీయ జంతువుగా ప్రకటించాలని వ్యాఖ్యలు చేసిన అలహాబాద్ హైకోర్టు జడ్జి జస్టిస్ శేఖర్ కుమార్ మరోమారు ఆవుపై వ్యాఖ్యలు చేశారు. అన్ని జంతువుల్లోనూ కేవలం ఆవు మాత్రమే ఆక్సిజన్ పీల్చి ఆక్సిజన్‌ను వదులుతుందని సైంటిస్టులు నమ్ముతారన్నారు.
ఆవు పాలు, పెరుగు, నెయ్యి, మూత్రం, పేడ ద్వారా మందు లేని పలు జబ్బులు కూడా నమయవుతాయని చెప్పారు. ఆవును దొంగలించి చంపిన కేసును విచారిస్తున్న సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. సాంభల్ జిల్లాకు చెందిన జావెద్ గతంలోనూ పలు మార్లు ఆవులను దొంగలించి చంపాడని, బెయిల్ ఇస్తే మళ్లీ అలాంటి చర్యలకు పాల్పడతాని వ్యాఖ్యానిస్తూ బెయిల్ నిరాకరించారు. హిందూ పురాణాల ప్రకారం ఆవులో 33 కోట్ల మంది దేవుళ్లు, దేవతలు నివాసముంటారన్నారు. అందుకే గోవధకు హిందువులు వ్యతిరేకమన్నారు.
Comments
Please login to add a commentAdd a comment