
నేపాల్ జాతీయ జంతువుగా ఆవు
కఠ్మాండు: గోమాతను పవి త్రంగా భావించే నేపాల్‌లో ఆవును జాతీయ జంతువుగా ప్రకటించారు. ఆదివారం నుంచి అమల్లోకొచ్చిన కొత్త రాజ్యాంగంలో ఈ విషయాన్ని పొందుపరిచారు. ఖడ్గమృగాన్ని జాతీయ జంతువుగా పరిగణించాలని ప్రతిపాదనలు వచ్చినప్పటికీ చివరికి ఆవును ఎంపికచేశారు. దీంతో దానికి రాజ్యాంగ రక్షణ కల్పించినట్లయింది. దేశంలో గోవధను నిషేధించారు. ఈ అంశం రాజ్యాంగంలో లేనప్పటికీ చివరగా చేర్చారు.