న్యూఢిల్లీ: జాతీయ జంతువుగా రాయల్ బెంగాల్ టైగర్ స్థానే ఆవును ప్రకటించేలా కేంద్రాన్ని ఆదేశించాలంటూ దాఖలైన ఓ పిటిషన్‌ను సుప్రీం కోర్టు తోసిపుచ్చింది. జస్టిస్ ఎస్‌కే కౌల్, జస్టిస్ అభయ్ ఎస్ ఓకా నేతృత్వంలోని ధర్మాసనం.. సోమవారం పిటిషనర్‌పై ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘‘అసలు ఎలాంటి ప్రాథమిక హక్కులు ప్రభావితం అవుతాయి. ఆవును జాతీయ జంతువుగా ప్రకటించడం కోర్టు పనా?..
మేము ఖర్చులు విధించవలసి వచ్చినప్పుడు మీరు అలాంటి పిటిషన్లను ఎందుకు దాఖలు చేస్తారు?.. అసలు ఇప్పుడు ఏ ప్రాథమిక హక్కు ఉల్లంఘించబడింది? మీరు కోర్టుకు వచ్చినందునా మేము చట్టాన్ని గాలికి విసిరేస్తామా?’’ పిటిషనర్ తరపు న్యాయవాదిని మందలించింది బెంచ్.
పిటిషన్ దాఖలు చేసినందుకుగానూ ఖర్చులు విధించాల్సి వస్తుందని పిటిషనర్ తరపున న్యాయవాదిని బెంచ్ హెచ్చరించింది. దీంతో సదరు న్యాయవాది అభ్యర్థన పిటిషన్‌ను ఉపసంహరించుకోగా, పిటిషన్‌ను తిరస్కరిస్తున్నట్లు ధర్మాసనం ప్రకటించింది. ఎన్జీవో గోవాన్ష్ సేవా సదన్, ఇతరులు కలిసి ఆవును జాతీయ జంతువుగా ప్రకటించేలా కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలంటూ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్(పిల్)ను దాఖలు చేసింది.
ఇదీ చదవండి: ‘నా కళ్లు చిన్నగా ఉండొచ్చు! కానీ..’
Comments
Please login to add a commentAdd a comment