అలహాబాద్: జాతీయ జెండా విషయంలో అలహాబాద్ కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. మదర్సాల్లో సైతం రిపబ్లిక్ డే, ఆగస్టు 15న త్రివర్ణ పతాకం ఎగుర వేయాల్సిందేనని స్పష్టం చేసింది. అంతకుముందు రోజు ఇదే అంశంలో అలహాబాద్ కోర్టు స్పందించింది.
ఆగస్టు 15, జనవరి 26న ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలతోపాటు విద్యా సంస్థల్లోనూ జాతీయ జెండాను ఎగరవేయాలనే నిబంధన దృష్ట్యా.. రాష్ట్రంలోని అన్ని మదర్సాల్లో జాతీయ జెండా ఎగరవేశారనే విషయాన్ని నిర్ధారించాల్సిందిగా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇదే విషయాన్ని మరోసారి స్పష్టం చేస్తూ ఖచ్చితంగా అన్ని మదర్సాల్లో జాతీయ జెండా ఎగురవేయాల్సిందేనని చెప్పింది.