
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్ మదర్సా చట్టం రాజ్యాంగ విరుద్ధమని అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు మంగళవారం(నవంబర్ 5) కొట్టివేసింది. మదర్సా చట్టంలో రాజ్యాంగ ఉల్లంఘన ఏదీ లేదని స్పష్టం చేసింది. 17 లక్షల మంది విద్యార్థులు మరియు 10,వేల మంది మదర్సా ఉపాధ్యాయులను రాష్ట్ర విద్యా వ్యవస్థలో సర్దుబాటు చేయాలనే అలహాబాద్ హైకోర్టు ఆదేశాలను అత్యున్నత న్యాయస్థానం తోసిపుచ్చింది.
ఈ మేరకు సుప్రీంకోర్టు చీఫ్‌జస్టిస్ డీవై చంద్రచూడ్ ఆధ్వర్యంలోని త్రిసభ్య ధర్మాసనం తీర్పు వెలువరించింది. మదర్సాచట్టాన్ని పూర్తిగా కొట్టివేయనవసరం లేదని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టు ముందు వాదనలు వినిపించింది. అభ్యంతరాలున్న పలు సెక్షన్లను సమీక్షించవచ్చని తెలిపింది.
ఇదీ చదవండి: అన్ని ప్రైవేటు ఆస్పత్రులు ప్రభుత్వానివి కావు: సుప్రీంకోర్టు