సాక్షి, న్యూఢిల్లీ : ఉన్నావ్ లైంగిక దాడి ఘటనలో బాధితురాలి తండ్రి హత్య కేసులో ఢిల్లీ కోర్టు బీజేపీ బహిష్కృత ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ సెంగార్‌కు పదేళ్ల జైలు శిక్ష విధించింది. సెంగార్‌కు శిక్షను ఖరారు చేస్తూ శుక్రవారం తీర్పు వెలువరించింది. కాగా దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ఉన్నావ్ హత్యాచారం కేసులో సెంగార్‌కు ఢిల్లీ కోర్టు జీవిత ఖైదు విధించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో దోషిగా తేలిన కుల్దీప్ సెంగార్‌కు జీవిత ఖైదు విధించడంతో పాటు బాధితురాలికి రూ.25లక్షల పరిహారం ఇవ్వాలని కోర్టు గత ఏడాది డిసెంబర్‌లో ఆదేశించింది.
ఇక ఉన్నావ్ హత్యాచారం కేసు పలు మలుపులు తిరిగింది. బాధితురాలి కుటుంబంపై ఎన్నోమార్లు హత్యాయత్నం జరిగింది. బాధితురాలి తండ్రి హత్యకు గురయ్యారు. 2017లో కేసు నమోదు కాగా కుల్దీప్ సెంగార్‌కు గత ఏడాది చివర్లో శిక్ష ఖరారైంది. హత్యాచార ఉదంతంలో అప్పటి బీజేపీ ఎమ్మెల్యే కుల్దీప్ సెంగార్‌పై కిడ్నాప్, సామూహిక లైంగిక దాడి ఆరోపణలు వచ్చాయి. బాధితురాలి ఫిర్యాదు మేరకు కుల్దీప్ సెంగార్, అతనికి సహకరించిన శశిసింగ్‌పై పోక్సోతో పాటు పలు సెక్షన్ల కింద పోలీసులు కేసులు నమోదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment