వైవీయూ, న్యూస్‌లైన్: మాజీ సైనికుల సంక్షేమానికి కృషి చేస్తామని ఈసీహెచ్‌ఎస్ పాలి క్లినిక్స్ ఆంధ్రా సబ్‌ఏరియా ఇన్‌చార్జి లెఫ్టినెంట్ కల్నల్ కుల్‌దీప్‌సింగ్ అన్నారు. మంగళవారం నగరంలోని ప్రకాష్‌నగర్‌లోని ఈసీహెచ్‌ఎస్ పాలిక్లినిక్‌లో రాయలసీమ, నెల్లూరు జిల్లాల మాజీ సైనికుల సౌకర్యార్థం హెల్ప్‌లైన్ సెంటర్‌ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాజీ సైనికులు, వితంతువులకు రావాల్సిన పెన్షన్లు, ఇళ్ల పట్టాలు, పెండింగ్‌లో ఉన్న బకాయిలు త్వరితగతిన వచ్చేందుకు కృషిచేస్తామని తెలిపారు. అలాగే రాయలసీమ, నెల్లూరు జిల్లాలోని మాజీ సైనికులు పాలీక్లినిక్‌ను సద్వినియోగం చేసుకోవాలన్నారు.
జిల్లా సైనిక సంక్షేమాధికారి భాస్కర్‌రెడ్డి మాట్లాడుతూ మాజీ సైనికులకు రావాల్సిన సౌకర్యాలను సాధించడంలో కృషిచేస్తామని తెలిపారు. కడప పాలిక్లినిక్ ఇన్‌చార్జి మోహనరంగం మాట్లాడుతూ మాజీ సైనికులు అన్ని రకాల వైద్య సేవలు పొందవచ్చన్నారు. అవసరమైతే నగరాల్లోని పెద్ద ఆస్పత్రుల్లో ఉచిత చికిత్సలు పొందేందుకు రెఫర్ చేస్తామన్నారు. పాలిక్లినిక్ వైద్యుడు డాక్టర్ శాంత్‌కుమార్ మాట్లాడుతూ మాజీ సైనికులు వైద్యచికిత్సల కోసం ఏర్పాటు చేసిన హెల్ప్‌లైన్‌ను సద్వినియోగం చేసుకోవాలన్నారు.
మాజీ సైనికుల సంక్షేమానికి కృషి
Published Wed, Apr 2 2014 3:07 AM | Last Updated on Sat, Sep 2 2017 5:27 AM
Advertisement
Advertisement