ECHS clinics
-
ఈసీహెచ్ఎస్, ఇన్కాయిస్ లలో ఉద్యోగాలు
ఈసీహెచ్ఎస్, సికింద్రాబాద్‌లో 65 ఖాళీలు భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన సికింద్రాబాద్‌లోని ఎక్స్ సర్వీస్‌మెన్ కంట్రిబ్యూటరీ హెల్త్ స్కీమ్(ఈసీహెచ్ఎస్)... ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. (డిగ్రీతో ఏఓ కొలువు.. నెలకు రూ.60వేల వేతనం..) ► మొత్తం పోస్టుల సంఖ్య: 65 ► పోస్టుల వివరాలు: గైనకాలజిస్ట్, మెడికల్ ఆఫీసర్, నర్సింగ్ అసిస్టెంట్, ల్యాబ్ టెక్నీషియన్, ఫార్మసిస్ట్ తదితరాలు. ► అర్హత: పోస్టుల్ని అనుసరించి ఎనిమిదో తరగతి, జీఎన్ఎం, డీఎంఎల్టీ, గ్రాడ్యుయేషన్, బీఎస్సీ, సంబంధిత స్పెషౖలñ జేషన్లలో ఎండీ/ఎంఎస్ ఉత్తీర్ణులవ్వాలి. ► వేతనం: పోస్టుల్ని అనుసరించి నెలకు రూ.16,800 నుంచి రూ.1,00,000 వరకు చెల్లిస్తారు. ► ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు. ► ఇంటర్వ్యూ తేదీలు: 2021 అక్టోబర్ 05 నుంచి 13 వరకు ► ఇంటర్వ్యూ వేదిక: హెడ్‌క్వార్టర్స్, తెలంగాణ, ఆంధ్రా సబ్ ఏరియా, సికింద్రాబాద్. ► దరఖాస్తు విధానం: ఈమెయిల్/ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును ఈసీహెచ్ఎస్ సెల్, బైసన్ యూఆర్సీ కాంప్లెక్స్, తిరుమలగిరి, సికింద్రాబాద్ –500015 చిరునామాకు పంపించాలి. ► దరఖాస్తులకు చివరి తేది: 04.09.2021 ► వెబ్సైట్: www.echs.gov.in ఇన్కాయిస్, హైదరాబాద్‌లో 82 ప్రాజెక్ట్ సైంటిస్ట్‌లు భారత ప్రభుత్వానికి చెందిన హైదరాబాద్‌లోని ఇండియన్ నేషనల్సెంటర్ ఫర్ ఓషియన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్(ఇన్కాయిస్).. ఒప్పంద ప్రాతిపదికన ప్రాజెక్ట్ సైంటిస్ట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. (పీఎఫ్ఆర్డీఏ, ఇండియన్ కోస్ట్‌గార్డ్‌లో ఉద్యోగాలు) ► మొత్తం పోస్టుల సంఖ్య: 82 ► పోస్టుల వివరాలు: ప్రాజెక్ట్ సైంటిస్ట్‌లు(1,2,3)–62, ప్రాజెక్ట్ సైంటిఫిక్ అసిస్టెంట్ (1,2)–20. ► అర్హత: పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో బీఎస్సీ డిగ్రీ, మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవంతోపాటు టెక్నికల్ నైపుణ్యాలు ఉండాలి. ► వయసు: పోస్టుల్ని అనుసరించి 28ఏళ్ల నుంచి 45ఏళ్ల మధ్య ఉండాలి. ► వేతనం: నెలకు రూ.39,000 నుంచి రూ.78,000+హెచ్ఆర్ఏ చెల్లిస్తారు. ► ఎంపిక విధానం: ప్రాజెక్ట్ సైంటిస్ట్(1,2,3) పోస్టులకు రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా; ప్రాజెక్ట్ సైంటిఫిక్ అసిస్టెంట్(1,2) పోస్టులకు రాతపరీక్ష ఆధారంగా ఎంపిక చేస్తారు. ► దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ► ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది: 22.09.2021 ► వెబ్సైట్: www.incois.gov.in -
ఎక్స్ సర్వీస్‌మెన్ డేటాబేస్ మాయం
న్యూఢిల్లీ: 45 లక్షల మంది త్రివిధ దళాల మాజీ సిబ్బందికి సంబంధించిన వ్యక్తిగత సమాచారాన్ని తిరిగి ఇవ్వలేదంటూ ఒక ప్రైవేటు సంస్థపై ఢిల్లీలో కేసు నమోదు అయింది. రక్షణ శాఖ ఫిర్యాదు మేరకు ‘స్కోర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ లిమిటెడ్(ఎస్‌ఐటీఎల్)’ సంస్థపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. నౌకాదళ మాజీ అధికారి లోకేశ్ బత్రా ఈ వివరాలను సమాచార హక్కుచట్టం(ఆర్టీఐ) ద్వారా సంపాదించారు. ఎక్స్ సర్వీస్‌మెన్ కంట్రిబ్యూటరీ హెల్త్ స్కీమ్(ఈసీహెచ్ఎస్) అమలు కోసం స్మార్ట్ కార్డ్స్‌ను రూపొందించేందుకు ఎస్‌ఐటీఎల్‌కు 2010లో కాంట్రాక్ట్ ఇచ్చారు. ఇందులో భాగంగా, సాయుధ దళాల మాజీ సిబ్బంది వ్యక్తిగత సమాచారాన్ని వారికి ఇచ్చారు. 2015లో ఆ కాంట్రాక్ట్ ముగిసింది. ఆ తరువాత, డేటాలో మార్పుచేర్పులకు అవసరమైన సోర్స్ కోడ్, కీ సహా మొత్తం డేటాబేస్‌ను రక్షణ శాఖకు తిరిగి ఇచ్చేయాల్సి ఉంది. కానీ, ఎస్‌ఐటీఎల్ అలా చేయలేదు. కనీసం ఆ డేటా తమ వద్ద లేదన్న విషయాన్ని కూడా ఆ సంస్థ చెప్పడం లేదని పేర్కొంది. -
మాజీ సైనికుల సంక్షేమానికి కృషి
వైవీయూ, న్యూస్‌లైన్: మాజీ సైనికుల సంక్షేమానికి కృషి చేస్తామని ఈసీహెచ్ఎస్ పాలి క్లినిక్స్ ఆంధ్రా సబ్‌ఏరియా ఇన్చార్జి లెఫ్టినెంట్ కల్నల్ కుల్దీప్సింగ్ అన్నారు. మంగళవారం నగరంలోని ప్రకాష్‌నగర్‌లోని ఈసీహెచ్ఎస్ పాలిక్లినిక్‌లో రాయలసీమ, నెల్లూరు జిల్లాల మాజీ సైనికుల సౌకర్యార్థం హెల్ప్‌లైన్ సెంటర్‌ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాజీ సైనికులు, వితంతువులకు రావాల్సిన పెన్షన్లు, ఇళ్ల పట్టాలు, పెండింగ్‌లో ఉన్న బకాయిలు త్వరితగతిన వచ్చేందుకు కృషిచేస్తామని తెలిపారు. అలాగే రాయలసీమ, నెల్లూరు జిల్లాలోని మాజీ సైనికులు పాలీక్లినిక్ను సద్వినియోగం చేసుకోవాలన్నారు. జిల్లా సైనిక సంక్షేమాధికారి భాస్కర్‌రెడ్డి మాట్లాడుతూ మాజీ సైనికులకు రావాల్సిన సౌకర్యాలను సాధించడంలో కృషిచేస్తామని తెలిపారు. కడప పాలిక్లినిక్ ఇన్చార్జి మోహనరంగం మాట్లాడుతూ మాజీ సైనికులు అన్ని రకాల వైద్య సేవలు పొందవచ్చన్నారు. అవసరమైతే నగరాల్లోని పెద్ద ఆస్పత్రుల్లో ఉచిత చికిత్సలు పొందేందుకు రెఫర్ చేస్తామన్నారు. పాలిక్లినిక్ వైద్యుడు డాక్టర్ శాంత్‌కుమార్ మాట్లాడుతూ మాజీ సైనికులు వైద్యచికిత్సల కోసం ఏర్పాటు చేసిన హెల్ప్‌లైన్‌ను సద్వినియోగం చేసుకోవాలన్నారు.